world happiness report
-
'అనందంలో'.. ఫిన్‌ల్యాండ్ మొదటి స్థానం! మరి ఇండియా..??
"అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.." అని ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం సముద్రాల రామానుజాచార్య ఓ పాట రాశారు. ఆ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచి, ఆలపించారు ఘంటసాల. ఇది 1973లో వచ్చిన 'బతుకుతెరువు' సినిమాలోనిది. పాట చివర్లో "జీవితమే ఒక నాటకరంగం" అంటారు. నాటకం వంటి జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒకరోజు తెరపడుతుంది. అది తప్పదు. పుట్టినప్పటి నుంచి పోయేంత వరకూ సాగే బతుకు నడుమ ఆనందాన్ని పోగుచేసుకొని అనుభవిస్తేనే ఆనందం. లేకపోతే, అంతా అయోమయం, విషాదం. ఈ జీవనసారాన్ని మన మహర్షులు, మహర్షుల వంటి మహాకవులు, మహనీయులు, మాననీయ మూర్తులు తెలుసుకున్నారు, మనసారా అనుభవించారు, ఆచరించండని మనకు అనేక రూపాల్లో, మార్గాల్లో చెప్పారు. మార్చి, 20 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'. మనుషులంతా సంతోషంగా ఉండండి, అది అందరికీ పంచండి, అది ఎక్కుడుందో వెతికి పట్టుకోండి, పట్టుకొని వదలకండి.. అంటూ ఐక్యరాజ్య సమితి అంటోంది. సుమారు ఓ పుష్కరం క్రితం (2013) తొలిసారిగా, సమితిలోని సభ్యదేశాలన్నీ ఈ వేడుకను జరుపుకున్నాయి. అప్పటి నుంచి ప్రతి ఏడూ జరుపుకుంటున్నాయి. బుధవారం నాడు అందరం జరుపుకున్నాం. కానీ, అందరికీ ఈ ఉత్సవం గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ స్థాయిలో ప్రచారం జరుగలేదు. మనదేశంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో.. మనం ఈ ఆనంద సంబరాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోయాం. ఈ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడూ కొన్ని నివేదికలు అందుతూ వుంటాయి. ఏ ఏ దేశాలలో సంతోష, ఆనందాల స్థాయి ఎట్లా వుందని కొలుస్తారు. ఆ కొలతలకు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఈ నియమాల ప్రకారం నివేదిక ద్వారా మనకు అర్థమవుతున్నదేంటంటే? అనందంలో మనదేశం 126 వ స్థానంలో వుంది. మనకంటే ఎంతో పేద దేశాలు ముందు వరుసలో వున్నాయి. మన పొరుగు దేశాలైన చైనా, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ మనకంటే ఆనందంగా వున్నాయి. మొత్తం దేశాలలో ఫిన్ ల్యాండ్ అందరికంటే ఆనందమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు ఏడేళ్ల నుంచి ఫిన్ ల్యాండ్ తన అగ్రతను కాపాడుకుంటూ వస్తోంది. 60 వ ర్యాంక్ తో మనకంటే చైనా చాలా ఆనందంగా ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. క్షేత్రస్థాయిలో, నిజజీవితంలో వాస్తవాలు మనకు పూర్తిగా తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపిన సంస్థ చెప్పే నివేదికలో మాత్రం విషయాలు అలాగే వున్నాయి. ప్రపంచ మానవాళికి శాంతిని, ఆనందమయ జీవితాన్ని చాటి చెప్పామని చెప్పుకుంటున్న మన దేశం ఈ సూచీలో వెనుకబడి పోవడం వివిధ ఆలోచనలను రేకెత్తిస్తోంది. అంతర్ముఖంగా మళ్ళీ అలోచించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఏది ఆలోచిస్తే, ఏది చేస్తే, ఏది చూస్తే ఆనందం కలుగుతుందో? అవన్నీ మన మహర్షులు మనకు ఎన్నడో చెప్పేశారు. భగవద్గీత నుంచి సంగీతం వరకూ, ధ్యానం నుంచి యోగాభ్యాసం వరకూ, మౌనం నుంచి ఆధ్యాత్మిక సాధన వరకూ, శాంతి నుంచి స్థితప్రజ్ఞత వరకూ మనకు బోధించారు. వాటిని కొందరు ఆచరించారు, కొందరు ఆచరించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. కొందరు ఇవ్వేమీ తెలియకుండానే సహజంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎక్కువమంది ఆనందంగా లేరు. అసంతృప్తితో అలమటిస్తున్నారు, అయోమయంలో వున్నారు. ఐక్యరాజ్య సమితి పెట్టిన నియమాలను ఒకసారి వీక్షిద్దాం. ఆత్మతృప్తి, జీవనకాలం (లైఫ్ స్పాన్), సామాజిక మద్దతు, తలసరి ఆదాయం, దాతృత్వం, స్వేచ్ఛ, అవినీతి మొదలైన వాటిల్లో ఆయా దేశాలు, ఆయా దేశ ప్రజలు ఎలా వున్నారన్నది ప్రాతిపదికగా దేశాలకు ర్యాంకులను కేటాయించారు. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ వంటి దేశాలలో కూడా సంతోషం సన్నగిల్లుతోందని ఈ నివేదిక చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న దేశాలే ఎక్కువ ఆనందంగా వున్నాయి. "చిన్న కుటుంబం - చింతలులేని కుటుంబం " అన్న పాత సామెత గుర్తుకువస్తోంది. అనందాన్ని అనుభవించేవారి వయసుల్లోనూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరు నడుస్తోంది. పెద్ద వయస్సు వారికంటే చిన్నవాళ్లే ఆనందంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నా, అన్నిచోట్లా అట్లా లేదు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాల్లో యువత కంటే పెద్దలే ఎక్కువ ఆనందంగా వున్నారు. ఐరోపా వాసుల్లో ఆనందం కాస్త పెరుగుతున్నట్లు, పశ్చిమ యూరప్ లో అందరూ సమానమైన సంతోషకర వాతావరణంలో వున్నారని తెలుస్తోంది. ఒక్క ఐరోపా దేశాల్లో తప్ప మిగిలిన అన్ని దేశాలలోనూ ఆనందంలో అసమానతలు పెరిగిపోతూ ఉండడం బాధాకరం. అందులో మనదేశం కూడా వుండడం ఇంకా బాధాకరం. అందరి కంటే అత్యంత ఆనందంగా వున్న ఫిన్ ల్యాండ్ ప్రజలను గమనిస్తే వారి లక్షణాలు, ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రకృతితో ఎక్కువ మమేకమై ఉండడం, వృత్తిని - జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ, సమతుల్యత పాటిస్తూ సాగడం, విజయంపై స్పష్టమైన అవగాహన కలిగివుండడం, అవినీతి తక్కువగా ఉండడం, ప్రభుత్వాల పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి వుండడం, ఆరోగ్యం, విద్య, సంరక్షణలో ప్రభుత్వం సక్రమంగా పరిపాలన, సేవలు అందించడం మొదలైనవి ఫిన్ ల్యాండ్ వారి ఆనందమయ జీవితానికి కారకాలుగా, ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి. 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎజెండా పెట్టుకుంటున్నాం. "అనందానికి తిరిగి దగ్గర కావడం - స్థితప్రజ్ఞత కలిగే, పెరిగే సమాజాలు నిర్మించుకోవడం" ఈ 2024 సంవత్సరానికి పెట్టుకున్నాం. ఇది సాధించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే వుంది. మన ఆలోచనలలో వుంది, మన ఆచరణలో, నడవడికలో వుంది. రమణమహర్షి నుంచి రామానుజాచార్యులు (సముద్రాల) వరకూ, మహాత్మాగాంధీ నుంచి మార్క్ ట్వైన్ వరకూ, ఆదిశంకరాచార్యుల నుంచి అబ్రహం లింకన్ వరకూ, లియో టాల్ స్టాయ్ నుంచి జాన్ కీట్స్ వరకూ చెప్పింది ఒక్కటే! "ఆనందంగా ఉండండి, తోటివారిని అనందంగా ఉంచండి ". ఈ క్రమంలో, మనకు బోలెడు సారస్వతం వుంది, కళలు వున్నాయి, భగవద్గీత, మహాభారత రామాయణాది కావ్యాలు, ఇతిహాసాలు, వేదవేదాంగాలు అందించిన జ్ఞానభాండాగారం మన దేశానికి మెండుగా అండగా వుంది. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి జారుకొనేంత వరకూ ఏమేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యకూడదో ఆచార్యులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతూనే వున్నారు. ఆహారం, నిద్ర, వ్యాయామ నియమాలు, శాంతి, విశ్రాంతిని ఆచరించడం మన చేతుల్లోనే వుంది. ప్రతి మనిషి కోరుకొనేది ఒక్కటే.. ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. అదే జీవిత మకరందం. ఈ ఆనంద సూచీలో మనం ఫిన్ ల్యాండ్ ను దాటి మొదటి స్థాయిని అందుకోవాలి. అందరూ అనందంగా ఉండాలని అనుకుందాం. — మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే!
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి తొలి స్థానంలో నిలిచింది. ఏడు సార్లుగా అదే స్థానంలో నిలవడం విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన బుధవారం (మార్చి 20)న యూఎన్ ఆధారిత వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్(1), డెన్మార్క్(2), ఐస్లాండ్(3) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో నిలిచాయి. ఈ జాబితాలో భారత్ గతేడాదిలానే 126వ స్థానంలో ఉంది. ఇక చైనా (60), నేపాల్ (95), పాకిస్థాన్ (108), మయన్మార్(118) దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2020లో తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లినప్పటి నుంచి మానవతా విపత్తుతో బాధపడుతోంది అఫ్ఘనిస్తాన్. దీంతో ఈ హ్యపీనెస్ ఇండెక్స్ 143 దేశాలలో అఫ్ఘనిస్తాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికను ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు. దాదాపు దశాబ్దకాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి కిందకు దిగజారాయి. అవి వరుసగా 23, 23 స్థానాల్లో నిలిచాయి. అయితే టాప్ 20లో కోస్టారికా(12), కువైట్(13) స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడడా టాప్ 10లో పెద్ద దేశమేది లేదని నివేదిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో తొలి టాప్ 10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇక టాప్ 20లో మాత్రం మూడు కోట్ల కంటే అధిక జనాభా ఉన్న కెనడా, యూకేలు ఉన్నాయి. అలాగే ఈ నివేదికలో పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు వెల్లడయ్యింది. కానీ ఇదంతా ప్రపంచవ్యాప్తంగా ఒకేవిధంగా లేదని పేర్కొంది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసులవారిలో సంతోషం పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకేరకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది. అగ్రస్థానంలో ఫిన్లాండ్ దేశమే ఎందుకంటే.. మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెల్లా ప్రకారం, ఫిన్లాండ్ దేశం సంతోషంగా ఉండటానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలు దీనిని అనుసరిస్తే, అవి కూడా జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. మొదటిది ఐక్యతా భావం అది ఇక్కడ ఎక్కువ. ఎలాంటి చెడు పరిస్థితులతోనైనా పోరాడే శక్తిని కలిగి ఉంటారు. అలాగే అందరితో సామరస్యంగా జీవించడం వంటివి ఉంటాయి. ప్రధానంగా చుట్టుపక్కల వారి పట్ల శ్రద్ధ వహించాలని ఫిన్లాండ్ దేశ ప్రజలకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు. ఇది వారి అభివృద్ధిలో ముఖ్యమైన భాగం. అంతేగాదు ఫిన్లాండ్లో నిర్వహించిన అనేక అధ్యయనాల్లో ప్రతి కుటుంబం తమ పొరుగువారితో సంతోషంగా గడుపుతాయని తేలింది. సమస్యలన్నీ మాట్లాడుకోవడం వల్ల భారం తగ్గుతుంది. ఇక్కడ అందరిలోనూ దయ కూడా ఎక్కువే. రెండవది, ఇక్కడి ప్రభుత్వ సంస్థలు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మూడవది సమానత్వం. ఇక్కడ ఎక్కువ సంపాదించేవారు, తక్కువ సంపాదించేవారు అనే తేడా ఉండదు. అందువల్ల ఇక్కడ పేదరికం ఉండదు. అవినీతికి తావుండదు. అదీగాక ఫిన్లాండ్ సంపన్న దేశం. జనాభా తక్కువ. డబ్బు కొరత లేని దేశం. ఈ కారణాల రీత్యా ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా ఏడోసారి తొలి స్థానంలో కొనసాగుతోంది. (చదవండి: అమెరికా ఆపద్బంధువు 911 హడావిడి! ) -
నేడు వరల్డ్ హాపీనెస్ డే...లక్ష్యం ఉన్నచోట ఉత్సాహం... ఉత్సాహం ఉన్నచోట సంతోషం ఉంటాయి
సంతోషం సగం బలం అన్నారుగానీ నిజానికి అది సంపూర్ణ బలం. ఆ బలం ఉన్నచోటే ఆరోగ్యం ఉంటుంది. విజయం ఉంటుంది.డబ్బుతో కొనలేని ‘సంతోషం’ ఎవరూ చేరుకోలేని కీకారణ్యం కాదు. ‘నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను’ అని మనసులో గట్టిగా అనుకొని ఒక అడుగు వేస్తే ఎన్నో దారులు కనిపిస్తాయి. సంతోష సామ్రాజ్యానికి దగ్గర చేస్తాయి.‘సక్సెస్‌తో సంతోషం రాదు. సంతోషంతో సక్సెస్ వస్తుంది’ అనే పాతతరం మాటకు కొత్త తరం విలువ ఇస్తోందిప్పుడు. నిరంతరం సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. సంతోషంగా ఉండడానికి సంబంధించిన టెక్నిక్స్ గురించి ఆసక్తిగా తెలుసుకుంటోంది... భోపాల్‌కు చెందిన అనీష ప్రతి రెండు రోజులకు ఒక సంస్కృత శ్లోకాన్ని కంఠస్థం చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకొని ఈ ఏడాది జనవరి మొదటి తేదీ నుంచి ప్రారంభించింది. ఫిబ్రవరి నెల పూర్తయ్యే సరికి తాను అలవోకగా చెప్పగలిగే శ్లోకాల గురించి లెక్క వేసుకుంటే చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ సంతోషం ఇంకా కొనసాగుతూనే ఉంది.తమిళనాడులోని వెల్లూరుకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ ఐశ్వర్య మోహన్‌కు డ్రైవింగ్ అంటే చెప్పలేనంత భయం. ఆ భయాన్ని వదిలి ఈమధ్యే స్కూటీ నడపడం నేర్చుకుంది. తనకు ఇప్పుడు విమానం నడుపుతున్నంత సంతోషంగా ఉంది. ముంబైకి చెందిన సజన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్ కొనడంలో అతడికి అంతులేనంత సంతోషం దొరుకుతుంది. ఇవి మాత్రమే కాదు...మనం చేసే పనికి ఇతరుల నుంచి లభించే ప్రశంస, అభిమాన హీరో సినిమాకు వెళ్లడం, ‘చాలా హ్యాండ్సమ్’గా ఉన్నావు’లాంటి కామెంట్... ఇలాంటివి అప్పటికప్పుడు లభించే తాత్కాలిక సంతోషాలే అయినా తక్కువ చేసి చూసేవి మాత్రం కాదు. చిన్న చిన్న చినుకులు కలిస్తేనే కదా వర్షం.చిరు సంతోషాల కలయికే కదా ఆనందమయ జీవితం! ‘హాబీల నుంచి వచ్చే హ్యాపీనెస్ అంతా ఇంతా కాదయా’ అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.జెన్ జెడ్‌కు సుపరిచితమైన పేరు... విష్ణు కౌశల్. ఇన్‌స్టాగ్రామ్‌లో కామిక్ కంటెంట్ జెనరేట్ చేయడం అతడి హాబీ. ఈ హాబీ కాస్త అతడిని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణు కౌశల్‌కు 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ‘పెద్ద లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నా ప్రయాణాన్ని ప్రారంభించలేదు. నేను కామిక్ కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి కారణం అది నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతుంది’ అంటాడు 25 సంవత్సరాల విష్ణు కౌశల్. ‘లేదు అనుకుంటే ఏమీ లేదు. ఉంది అనుకుంటే ఎంతో ఉంది’ అనే ధోరణిని అనుసరించే యువతరం సూర్యోదయం నుంచి వెండి వెన్నెల వెలుగు వరకు ప్రతి ప్రకృతి అద్భుతాన్ని ఎంజాయ్ చేస్తోంది.‘హ్యాపీనెస్ అనేది ఎమోషన్, ఫీలింగ్ కాదు. అదొక స్కిల్’ అంటున్న యువతరం రకరకాల టెక్నిక్‌లపై కూడా దృష్టి సారిస్తోంది. స్థూలంగా చె΄్పాలంటే ‘సంతోషం’ అనే పునాదిని సిద్ధం చేసుకొని ‘లక్ష్యాలు’ అనే భవనాలపై దృష్టి పెడుతోంది. ట్రై చేసి చూద్దాం వ్యాయామాలతో సంతోషాన్ని సొంతం చేసుకునేవారు కొందరైతే, సంతోషం కోసం ప్రత్యేక వ్యాయామాలు చేసేవారు కొందరు. ‘హ్యాపీనెస్’ను సొంతం చేసుకోవడం కోసం చిన్నపాటి ఎక్సర్సైజ్ల మీద దృష్టి పెట్టే ధోరణి యువతరంలో పెరగుతుంది. వాటిలో కొన్ని... ► టాప్ ఔట్ స్ట్రెస్ ►న్యూ బెహ్ జెన్ ►యాంకర్ హ్యాపీ అండ్ కామ్ ఫీలింగ్స్ ►బ్రీత్ టెక్నిక్ ∙యాంగర్ రిలీజ్ సీక్రెట్. నచ్చిన పనిలోనే సంతోషం చెన్నైలో పుట్టి బెంగళూరులో పెరిగిన నిహారిక ఎన్ఎం ఇంజినీరింగ్ చదివే రోజుల్లో హాబీగా యూట్యూబ్ వీడియోలు చేసింది. ఈ ప్రక్రియ తనను ఒత్తిడికి దూరంగా ఉంచడంతో పాటు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేసింది. ‘నచ్చిన పని చేయడంలో అపారమైన ఆనందం సొంతం అవుతుంది’ అంటున్న నిహారిక ఎన్ఎం ‘డిజిటల్ కంటెంట్ క్రియేటర్’గా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. హ్యాపీనెస్ ఫార్ములా ‘హ్యాపీనెస్’ అనే మాట వినిపించగానే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి సైకాలజిస్ట్ మార్టిన్ సెలిగ్మాన్. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన సెలిగ్మాన్ సంతోషం అంటే ఏమిటి? మనిషిని సంతోషంగా ఉంచే అంశాలు ఏమిటి? ఫెయిల్యూర్స్‌ను అధిగమించి విజయాలు సొంతం చేసుకున్న వ్యక్తుల గురించి లోతుగా అధ్యయనం చేశాడు. ‘అథెంటిక్ హ్యాపీనెస్’ పేరుతో పుస్తకం రాశాడు. ‘హ్యాపీనెస్’కు సంబంధించి హెచ్=ఎస్ +సి+వి అనే ఫార్ములాను రూపొందించాడు. హెచ్–హ్యాపీనెస్ ఎస్–సెట్ రేంజ్ : మన సంతోషంలో 50 శాతం పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. జెనెటిక్ కెపాసిటీ ప్రభావం ఉంటుంది. సి–సర్కమస్టాన్సెస్: దీర్ఘకాలిక సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి పరిస్థితులను సరిదిద్దుకుంటూ, స్ట్రాటిజిక్ వర్క్‌తో ప్రయాణించాలి. ఉదా: నెగెటివ్ ఈవెంట్స్, నెగిటివ్ ఎమోషన్స్‌కు దూరంగా ఉండడం. వి–వాలెంటరీ వేరియబుల్స్: హ్యాపీనెస్ ఫార్ములాలో బెస్ట్ అండ్ మోస్ట్ కంట్రోలబుల్ పార్ట్ ఇది. గత, వర్తమాన, భవిష్యత్తుకు సంబంధించిన పాజిటివ్ ఎమోషన్స్ ద్వారా సంతోషంగా ఉండడం.హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ్ర΄÷ఫెసర్, సోషల్ సైంటిస్ట్, రచయిత డా.అర్థర్ బూక్స్ర్ ‘హ్యాపీనెస్’కు సంబంధించి హెచ్=ఇ+ఎస్+ఎం అనే ఈక్వేషన్‌ను ప్రచారంలోకి తీసుకువచ్చాడు.హాపీనెస్ (హెచ్) = ఎంజాయ్మెంట్ (ఇ)+శాటిస్ఫాక్షన్ (ఎస్)+మీనింగ్ (ఎం) హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఆర్థర్ రూపొందించిన ‘మేనేజింగ్ హ్యాపీనెస్’ అనే కోర్సు అందుబాటులో ఉంది. -
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం అదే..వరుసగా ఆరోసారి టాప్
ఫిన్లాండ్ ప్రంపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా వరుసగా ఆరోసారి ఈ ఘనత సొంతం చేసుకుంది. అత్యంత సంతోషంగా ఉండే దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. వాస్తవానికి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్స్ ప్రచురిస్తుంది. దీన్ని150కి పైగా దేశాలలో ప్రజల నుంచి వచ్చిన ప్రపంచ సర్వే ఆధారంగా రూపొందిస్తుంది. మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. ఐక్యరాజ్యసమితి వార్షిక హ్యాపినెస్ సూచీ ప్రకారం..డెన్మార్క్ అత్యంత సంతోషకరమైన దేశంగా రెండో స్థానంలో ఉండగా, ఐస్లాండ్ మూడో స్థానంలో ఉంది. ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ నివేదికలో నేపాల్, చైనా, శ్రీలంకల కంటే దిగువున 126వ స్థానంలో ఉంది. ఐతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా హ్యాపినెస్ నివేదికలో వాటి ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. రష్యా 72వ స్థానంలో ఉండగా, ఉక్రెయిన్ 92వ స్థానంలో ఉంది. కాగా, ఒక దేశ హ్యాపినెస్‌ని దాని తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి తదితరాల ఆధారంగా కొలిచి హ్యాపినెస్ సూచీలో స్థానం కల్పిస్తారు. ఐతే అనుహ్యంగా 2021లో ఇతరుల పట్ల దయ చూపడం, ముఖ్యంగా అపరిచితుల సహాయం చేయడం వంటివి పెరిగాయి. ఇది 2022లో మరింత ఎక్కువ పెరిగినట్లు యూఎన్ సస్టైనబుల్ సొల్యూషన్స్ నెట్వర్క్ పేర్కొంది. (చదవండి: కొడుకు కళ్లఎదుటే కన్న తల్లిపై కుక్కల దాడి..సాయం కోసం వెళ్లేలోపే..) -
సంతోషమే ‘పూర్తి’ బలం!
సాక్షి, హైదరాబాద్: ‘సంతోషమే సగం బలం’ అన్న సామెత ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ ప్రస్తుత జీవన పరిస్థితులు, కొత్త అలవాట్లు, కెరీర్ సమస్యల నేపథ్యంలో మనిషికి ‘సంతోషమే పూర్తి బలం’ అన్నట్టుగా మారిపోయింది. సంతోషమనేది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన సానుకూల భావన అని.. ఆనందంగా ఉండేవారు మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంతోషంగా ఉండేవారు తక్కువగా ఒత్తిళ్లకు గురవుతారని.. ఇతరుల కంటే అధిక సృజనాత్మకత కలిగి ఉండటంతోపాటు ఇతరుల పట్ల దాతృత్వాన్ని, ఉదారతను ప్రదర్శిస్తారని వివరిస్తున్నారు. ఇలాంటి వారు తోటివారి నుంచి సామాజికంగా తోడు పొందుతూ.. మంచి ఆరోగ్యంతో ఎక్కువకాలం జీవిస్తారని చెప్తున్నారు. అసలు తాము సంతోషంగా ఉన్నామనే భావనే.. చాలా మందిని తమ జీవితంలో అనేక ప్రయత్నాలు, చొరవ వైపు నెట్టి, విజయం దిశగా నడిపిస్తుందని విశ్లేషిస్తున్నారు. సమాజంలో లేదా కుటుంబంలో పెద్దల అంచనాలను చేరుకోలేకపోతే అసంతృప్తికి దారితీస్తుందని.. పెద్దగా సమస్యలు లేకపోయినా ఇంకేదో కావాలని కోరుకుంటూ నిరాశ, నిస్పృహలకు గురవుతున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హ్యాపీనెస్‌కు ఓ ఇండెక్స్.. మన పరిస్థితి భిన్నం.. గ్లోబల్ హ్యాపీనెస్ కౌన్సిల్ మొదటగా ప్రపంచ దేశాలకు సంబంధించి హ్యాపీనెస్ ఇండెక్స్‌ను రూపొందించింది. 2012 నుంచి దాదాపు 150 దేశాలకు సంబంధించి పలు అంశాల ప్రాతిపదికన ఏటా ‘వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్’ నివేదికను వెలువరిస్తోంది. తలసరి జీడీపీ, సాంఘిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్ధాయిలు, సేవాభావం, దాతృత్వం, ఆరోగ్యకర జీవన అంచనాలు, ఆనందానికి సంబంధించి ఆ దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశాలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో భారత స్కోర్, ర్యాంక్ ఏమంత గొప్పగా ఉండటం లేదు. హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్–2022లో మొత్తం 146 దేశాలకుగాను భారత్ 136 ర్యాంకు సాధించింది. ఆయా దేశాలకు, ఇండియాకు వర్తించే విషయాల్లో తేడాలు, సారూప్యతలు భిన్నంగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెప్తున్నారు. అంతేగాకుండా మనదేశంలో సంతోషం–సంపద మధ్య బలహీనమైన సహ సంబంధం (కోరిలేషన్) కొరవడటమూ కారణమని ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత్రి జయశ్రీ సేన్‌గుప్తా అభిప్రాయపడ్డారు. దేశంలో అసమానతల పెరుగుదల, ధనికులు తమ ఇళ్లలో ఆర్భాటంగా చేసే పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి సామాన్య ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతాయని చెప్పారు. మితిమీరిన పట్టణీకరణ, నగరాలు ఇరుకుగా మారడం, ఆహారభద్రత, ధరల పెరుగుదల వంటివి కూడా దీనిని ప్రభావితం చేస్తాయన్నారు. సమష్టి ఆనందంతోనే ఉన్నత స్థాయికి.. ప్రపంచంలో ఎవరినైనా జీవితంలో ఏది ముఖ్యమని ప్రశ్నిస్తే.. సంతోషంగా ఉండటమేననే సమాధానం వస్తుంది. అందరూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ సంతోషమైనా, ఆనందమైనా ఎలా వస్తుందనేది ముఖ్యం. వ్యక్తిగత స్థాయి కంటే కూడా సమూహ, సమష్టి ఆనందం ఉన్నతస్థాయిలో నిలుపుతుంది. సంతోషం, సంతృప్తి, ఆనందం అనేవాటిని మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా విశాల సమాజానికి, వర్గానికి కలిగేలా చేయడం ద్వారా ఒక సార్థకత ఏర్పడుతుంది. అయితే అపరిమితమైన ఆశలు, ఆశయాలు, నెరవేర్చుకోలేని కోరికలు సరికాదు. జీవితం–చేస్తున్న పని మధ్య తగిన సమతూకం సాధించడమూ ముఖ్యమే. మనకు నచ్చిన ఆహారం తినడం నుంచి నిర్దేశించుకున్న లక్ష్యాలు, అంచనాలు చేరుకోవడం వరకు సంతోషానికి మార్గాలు ఎన్నో. ఒక్కొక్కరి అలవాట్లు, పద్ధతులు, ఆలోచనా ధోరణులు, పెరిగిన వాతావరణం వంటివాటి ఆధారంగా ఈ మార్గాలు మారుతూ ఉంటాయి. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, డైరెక్టర్, ఆశా హాస్పిటల్స్ శారీరక, సామాజిక అవసరాల నుంచి.. అమెరికాకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ అబ్రహం మాస్లో 1970 దశకంలో చేసిన సిద్ధాంతీకరణల ప్రకారం.. ►మనషి జీవితం ప్రధానంగా ఆహారం, నీరు, శృంగారం, నిద్ర వంటి ప్రాథమిక శారీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి సంతోషాన్ని ప్రభావితం చేస్తాయి. ►శారీరక భద్రత, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం, ఆస్తుల భద్రత, ప్రేమ, తమదనే భావన, లైంగికపరమైన దగ్గరితనం, ఆత్మగౌరవం, విశ్వాసం, ఇతరులను గౌరవించడం, స్వీయ వాస్తవికత, నైతికత ఆనందాన్ని కలిగిస్తాయి. ►సామాజికంగా తెలిసిన వారితో స్నేహానుబంధాలు, ప్రేమ, బంధుత్వాల సాధనతోనూ చాలా మంది సంతోషపడి సంతృప్తి చెందుతారు. -
‘వరల్డ్ హ్యాపియెస్ట్ కంట్రీ’గా ఫిన్లాండ్
బ్లూమ్‌బర్గ్: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం (హ్యాపీయెస్ట్ కంట్రీ)గా ఫిన్లాండ్ వరుసగా మూడోసారి రికార్డుల్లోకి ఎక్కింది. మార్చి 20న వరల్డ్ హ్యాపినెస్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సుమారు 156 దేశాల ప్రజల జీవన స్థితిగతులు, సంతోషకరమైన జీవనశైలిని పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి అంశాల్లో ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉన్నారని పరిశోధనలో వెల్లడైంది. చదవండి: కరోనా: 'నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి' సంతోషకర నగరాల జాబితాలో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి టాప్‌లో నిలిచింది. ఇక అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా విషయానికి వస్తే అతి తక్కువ సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. అయితే అతి తక్కువ సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా నగరాల విషయానికి వస్తే అతి తక్కువ సంతోషకర నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ ఏడవ స్థానంలో నిలిచింది. కాగా.. ఫిన్లాండ్లో ఉండే విస్తారమైన అడవులు, వేల సంఖ్యలో సరస్సులు అక్కడి వాసులు ఆహ్లాదకర, సంతోషకరమైన వాతావరణంలో ఉండేలా ఉపకరించాయని తెలిసింది. ఇక జింబాబ్వే, సౌత్ సూడాన్, అప్ఘనిస్తాన్ ప్రపంచలోనే అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి. చదవండి: ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ? -
సంతోషంలో వెనకబడ్డాం
ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడు స్థానాలు దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. 2018లో మన ర్యాంకు 133. ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి 156 దేశాలకు సంబంధించి బుధవారం విడుదల చేసిన ‘హ్యాపినెస్ రిపోర్ట్’లో ఫిన్లాండ్ వరుసగా రెండో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. భారత్ కన్నా పాకిస్తాన్ మెరుగైన ర్యాంకు సాధించి 67వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. అలాగే బంగ్లాదేశ్(125), చైనా(93) కూడా భారత్ కన్నా ముందంజలో ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు 19వ ర్యాంకు దక్కింది. యుద్ధ ప్రభావిత దక్షిణ సూడాన్ ఈ సూచీలో అట్టడుగున నిలిచింది. -
భారత్‌కు షాక్.. ఇండియన్స్ నో హ్యాపీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు ఇదో షాకింగ్ విషయం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకున్నా.. ఉగ్రవాద సమస్యలు లేకున్నా.. నిత్యం అభివృద్ధితో దూసుకెళుతున్నా, ప్రజలంతా శాంతియుత వాతావరణంలో బతికేస్తున్నా సర్వేలు నిర్వహించినప్పుడు మాత్రం ఎవరూ ఊహించని ఫలితాలు వెలుగుచూస్తున్నాయి. భారతీయులు సంతోషంగా లేరట.. అదే సమయంలో పాకిస్థాన్ పౌరులు మాత్రం చాలా హాయిగా గడిపేస్తున్నారంట. తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో ఈ షాకింగ్ విషయం తెలిసింది. 2017 నివేదిక సమయానికి భారత్ 4 స్థానాలకు పడిపోగా తాజాగా విడుదల చేసిన 2018 నివేదికలో ఏకంగా 11 స్థానాల కిందికి పడిపోయింది. మొత్తం 156 దేశాల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేయగా 133ర్యాంకుతో భారత్ సరిపెట్టుకుంది. ప్రతి ఏడాది ఐరాసకు చెందిన ఎస్డీఎస్ఎన్ (సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్) ఈ రిపోర్టు తయారు చేస్తుంది. భారత్ ర్యాంకుతో నిత్యం ఉగ్రవాదం సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ను పోలిస్తే.. అక్కడి ప్రజలు ఆనందంగా, హాయిగా గడిపేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. 2017లో ర్యాంకులు ప్రకటించినప్పుడే భారత్‌కంటే మెరుగైన ర్యాంకును సాధించిన పాక్ మరోసారి 2018 నివేదికలో కూడా అదే పైచేయి సాధించింది. అంతేకాదు గత ఏడాదికంటే మరో 5 ర్యాంకులు పైకి ఎగబాకింది. ప్రస్తుతం పాక్ 75 ర్యాంకుతో భారత్‌కంటే చాలా ముందున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అంతేకాదు, భారత్‌కంటే చిన్న చిన్న దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంకవంటి దేశాలు కూడా హ్యాపియెస్ట్ కంట్రీల జాబితాలో భారత్‌కంటే ముందున్నాయి. ఇక చైనా కూడా భారత్‌కంటే ఎంతో ముందుంది. ఇక ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జాబితాలో తొలిస్థాన్ ఫిన్లాండ్ దక్కించుకుంది. నార్వే, డెన్మార్క్ రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. పది సంతోషకరమైన దేశాలు 1. ఫిన్లాండ్ 2. నార్వే 3. డెన్మార్క్ 4. ఐస్లాండ్ 5. స్విట్జర్లాండ్ 6. నెదర్లాండ్ 7. కెనడా 8. న్యూజిలాండ్ 9. స్వీడన్ 10. ఆస్ట్రేలియా 10 అసంతృప్తికరమైన దేశాలు 1. మలావి 2. హైతీ 3. లిబేరియా 4. సిరియా 5. రువాండా 6. యెమెన్ 7. టాంజానియా 8. దక్షిణ సుడాన్ 9. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 10. బురుండి -
ఆనందంలో అట్టడుగున..!
సంతోష సూచిలో 121వ స్థానంలో భారత్ ⇒ తొలిస్థానంలో నార్వే ⇒ ఐరాస నివేదికలో వెల్లడి ఐక్యరాజ్యసమితి: భారతీయుల కంటే పాకిస్తానీయులే ఎక్కువ సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు.. మన కంటే ఇరాక్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశ వాసులే అధిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. కాగా సంతోషకర దేశాల జాబితాలో భారత్ 121వ స్థానానికి పరిమితమై అట్టడుగున నిలిచింది. ‘ప్రపంచ సంతోషకర దేశాల నివేదిక 2017’ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా సోమవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జాబితాను విడుదల చేశారు. మొత్తం 155 దేశాలకు ర్యాంకులు ప్రకటించారు. 2014–15 నివేదిక ప్రకారం భారత్ స్థానం 118 కాగా.. ఇప్పుడు నాలుగు స్థానాలు తగ్గి చైనా, పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకంజలో నిలిచింది. ప్రజల తలసరి ఆదాయం, సాంఘిక భద్రత, ఆరోగ్యకర జీవితం, నచ్చింది ఎన్నుకోవడంలో ఉండే స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిపై జాగరూకత ఆధారంగా జాబితాను రూపొందించారు. వ్యక్తిగత అంశాలు సంతోషాన్ని ప్రభావితం చేస్తాయని ఈ నివేదిక వెల్లడించింది. డెన్మార్క్‌ను వెనక్కినెట్టి... ప్రపంచంలో అంత్యంత సంతోషకర దేశంగా నార్వే నిలిచింది. గతేడాది కంటే మూడు స్థానాలు ఎగబాకి నార్వే ఈ ఘనత సాధించింది. మూడేళ్లుగా నంబర్‌వన్‌గా కొనసాగుతున్న డెన్మార్క్ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. చైనా (79), పాకిస్తాన్ (80), నేపాల్ (99), బంగ్లాదేశ్ (110), ఇరాక్ (117), శ్రీలంక (120) స్థానాల్లో నిలిచా యి. నార్వే, డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో ఐస్లాం డ్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్ ఉన్నాయి. గతేడాది కంటే ఒక స్థానం తగ్గి అమెరికా 14వ స్థానం దక్కించుకుంది. 2012 నుంచి ఇంతవరకూ ఐదుసార్లు ఈ నివేదికల్ని విడుదల చేశారు.