ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడు స్థానాలు దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. 2018లో మన ర్యాంకు 133. ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి 156 దేశాలకు సంబంధించి బుధవారం విడుదల చేసిన ‘హ్యాపినెస్ రిపోర్ట్’లో ఫిన్లాండ్ వరుసగా రెండో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. భారత్ కన్నా పాకిస్తాన్ మెరుగైన ర్యాంకు సాధించి 67వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. అలాగే బంగ్లాదేశ్(125), చైనా(93) కూడా భారత్ కన్నా ముందంజలో ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు 19వ ర్యాంకు దక్కింది. యుద్ధ ప్రభావిత దక్షిణ సూడాన్ ఈ సూచీలో అట్టడుగున నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment