happyness
-
'అనందంలో'.. ఫిన్‌ల్యాండ్ మొదటి స్థానం! మరి ఇండియా..??
"అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.." అని ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం సముద్రాల రామానుజాచార్య ఓ పాట రాశారు. ఆ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచి, ఆలపించారు ఘంటసాల. ఇది 1973లో వచ్చిన 'బతుకుతెరువు' సినిమాలోనిది. పాట చివర్లో "జీవితమే ఒక నాటకరంగం" అంటారు. నాటకం వంటి జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒకరోజు తెరపడుతుంది. అది తప్పదు. పుట్టినప్పటి నుంచి పోయేంత వరకూ సాగే బతుకు నడుమ ఆనందాన్ని పోగుచేసుకొని అనుభవిస్తేనే ఆనందం. లేకపోతే, అంతా అయోమయం, విషాదం. ఈ జీవనసారాన్ని మన మహర్షులు, మహర్షుల వంటి మహాకవులు, మహనీయులు, మాననీయ మూర్తులు తెలుసుకున్నారు, మనసారా అనుభవించారు, ఆచరించండని మనకు అనేక రూపాల్లో, మార్గాల్లో చెప్పారు. మార్చి, 20 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'. మనుషులంతా సంతోషంగా ఉండండి, అది అందరికీ పంచండి, అది ఎక్కుడుందో వెతికి పట్టుకోండి, పట్టుకొని వదలకండి.. అంటూ ఐక్యరాజ్య సమితి అంటోంది. సుమారు ఓ పుష్కరం క్రితం (2013) తొలిసారిగా, సమితిలోని సభ్యదేశాలన్నీ ఈ వేడుకను జరుపుకున్నాయి. అప్పటి నుంచి ప్రతి ఏడూ జరుపుకుంటున్నాయి. బుధవారం నాడు అందరం జరుపుకున్నాం. కానీ, అందరికీ ఈ ఉత్సవం గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ స్థాయిలో ప్రచారం జరుగలేదు. మనదేశంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో.. మనం ఈ ఆనంద సంబరాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోయాం. ఈ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడూ కొన్ని నివేదికలు అందుతూ వుంటాయి. ఏ ఏ దేశాలలో సంతోష, ఆనందాల స్థాయి ఎట్లా వుందని కొలుస్తారు. ఆ కొలతలకు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఈ నియమాల ప్రకారం నివేదిక ద్వారా మనకు అర్థమవుతున్నదేంటంటే? అనందంలో మనదేశం 126 వ స్థానంలో వుంది. మనకంటే ఎంతో పేద దేశాలు ముందు వరుసలో వున్నాయి. మన పొరుగు దేశాలైన చైనా, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ మనకంటే ఆనందంగా వున్నాయి. మొత్తం దేశాలలో ఫిన్ ల్యాండ్ అందరికంటే ఆనందమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు ఏడేళ్ల నుంచి ఫిన్ ల్యాండ్ తన అగ్రతను కాపాడుకుంటూ వస్తోంది. 60 వ ర్యాంక్ తో మనకంటే చైనా చాలా ఆనందంగా ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. క్షేత్రస్థాయిలో, నిజజీవితంలో వాస్తవాలు మనకు పూర్తిగా తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపిన సంస్థ చెప్పే నివేదికలో మాత్రం విషయాలు అలాగే వున్నాయి. ప్రపంచ మానవాళికి శాంతిని, ఆనందమయ జీవితాన్ని చాటి చెప్పామని చెప్పుకుంటున్న మన దేశం ఈ సూచీలో వెనుకబడి పోవడం వివిధ ఆలోచనలను రేకెత్తిస్తోంది. అంతర్ముఖంగా మళ్ళీ అలోచించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఏది ఆలోచిస్తే, ఏది చేస్తే, ఏది చూస్తే ఆనందం కలుగుతుందో? అవన్నీ మన మహర్షులు మనకు ఎన్నడో చెప్పేశారు. భగవద్గీత నుంచి సంగీతం వరకూ, ధ్యానం నుంచి యోగాభ్యాసం వరకూ, మౌనం నుంచి ఆధ్యాత్మిక సాధన వరకూ, శాంతి నుంచి స్థితప్రజ్ఞత వరకూ మనకు బోధించారు. వాటిని కొందరు ఆచరించారు, కొందరు ఆచరించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. కొందరు ఇవ్వేమీ తెలియకుండానే సహజంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎక్కువమంది ఆనందంగా లేరు. అసంతృప్తితో అలమటిస్తున్నారు, అయోమయంలో వున్నారు. ఐక్యరాజ్య సమితి పెట్టిన నియమాలను ఒకసారి వీక్షిద్దాం. ఆత్మతృప్తి, జీవనకాలం (లైఫ్ స్పాన్), సామాజిక మద్దతు, తలసరి ఆదాయం, దాతృత్వం, స్వేచ్ఛ, అవినీతి మొదలైన వాటిల్లో ఆయా దేశాలు, ఆయా దేశ ప్రజలు ఎలా వున్నారన్నది ప్రాతిపదికగా దేశాలకు ర్యాంకులను కేటాయించారు. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ వంటి దేశాలలో కూడా సంతోషం సన్నగిల్లుతోందని ఈ నివేదిక చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న దేశాలే ఎక్కువ ఆనందంగా వున్నాయి. "చిన్న కుటుంబం - చింతలులేని కుటుంబం " అన్న పాత సామెత గుర్తుకువస్తోంది. అనందాన్ని అనుభవించేవారి వయసుల్లోనూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరు నడుస్తోంది. పెద్ద వయస్సు వారికంటే చిన్నవాళ్లే ఆనందంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నా, అన్నిచోట్లా అట్లా లేదు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాల్లో యువత కంటే పెద్దలే ఎక్కువ ఆనందంగా వున్నారు. ఐరోపా వాసుల్లో ఆనందం కాస్త పెరుగుతున్నట్లు, పశ్చిమ యూరప్ లో అందరూ సమానమైన సంతోషకర వాతావరణంలో వున్నారని తెలుస్తోంది. ఒక్క ఐరోపా దేశాల్లో తప్ప మిగిలిన అన్ని దేశాలలోనూ ఆనందంలో అసమానతలు పెరిగిపోతూ ఉండడం బాధాకరం. అందులో మనదేశం కూడా వుండడం ఇంకా బాధాకరం. అందరి కంటే అత్యంత ఆనందంగా వున్న ఫిన్ ల్యాండ్ ప్రజలను గమనిస్తే వారి లక్షణాలు, ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రకృతితో ఎక్కువ మమేకమై ఉండడం, వృత్తిని - జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ, సమతుల్యత పాటిస్తూ సాగడం, విజయంపై స్పష్టమైన అవగాహన కలిగివుండడం, అవినీతి తక్కువగా ఉండడం, ప్రభుత్వాల పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి వుండడం, ఆరోగ్యం, విద్య, సంరక్షణలో ప్రభుత్వం సక్రమంగా పరిపాలన, సేవలు అందించడం మొదలైనవి ఫిన్ ల్యాండ్ వారి ఆనందమయ జీవితానికి కారకాలుగా, ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి. 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎజెండా పెట్టుకుంటున్నాం. "అనందానికి తిరిగి దగ్గర కావడం - స్థితప్రజ్ఞత కలిగే, పెరిగే సమాజాలు నిర్మించుకోవడం" ఈ 2024 సంవత్సరానికి పెట్టుకున్నాం. ఇది సాధించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే వుంది. మన ఆలోచనలలో వుంది, మన ఆచరణలో, నడవడికలో వుంది. రమణమహర్షి నుంచి రామానుజాచార్యులు (సముద్రాల) వరకూ, మహాత్మాగాంధీ నుంచి మార్క్ ట్వైన్ వరకూ, ఆదిశంకరాచార్యుల నుంచి అబ్రహం లింకన్ వరకూ, లియో టాల్ స్టాయ్ నుంచి జాన్ కీట్స్ వరకూ చెప్పింది ఒక్కటే! "ఆనందంగా ఉండండి, తోటివారిని అనందంగా ఉంచండి ". ఈ క్రమంలో, మనకు బోలెడు సారస్వతం వుంది, కళలు వున్నాయి, భగవద్గీత, మహాభారత రామాయణాది కావ్యాలు, ఇతిహాసాలు, వేదవేదాంగాలు అందించిన జ్ఞానభాండాగారం మన దేశానికి మెండుగా అండగా వుంది. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి జారుకొనేంత వరకూ ఏమేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యకూడదో ఆచార్యులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతూనే వున్నారు. ఆహారం, నిద్ర, వ్యాయామ నియమాలు, శాంతి, విశ్రాంతిని ఆచరించడం మన చేతుల్లోనే వుంది. ప్రతి మనిషి కోరుకొనేది ఒక్కటే.. ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. అదే జీవిత మకరందం. ఈ ఆనంద సూచీలో మనం ఫిన్ ల్యాండ్ ను దాటి మొదటి స్థాయిని అందుకోవాలి. అందరూ అనందంగా ఉండాలని అనుకుందాం. — మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
మంచిమాట.. ముందు నిన్ను నీవు సరిదిద్దుకో!
ఆనందం అంటే బయటికి నిరూపించలేనిది. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అనుభవించే స్థితి. ఒక్కో పదార్థం తినడం వల్ల ఒక్కో రుచికి సంబంధించిన అనుభూతి కలుగుతుంది. అలా ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది..? ఆ అనుభూతిని ఎలా పొందాలి..? ఆనందానికి అర్థం పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? అది తెలుసుకుంటే ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. నీ గురించి నువ్వు ఆలోచిస్తే, నీవు ఎవరో తెలుసుకుంటే చాలు. నిజానికి నీవు ఎవరు అంటే ఆ భగవంతుడివే. ఆ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది. నీ గురించి నీవు తెలుసుకోవడం మొదలుపెట్టగానే అంతరంగం శుద్ధి కావడం మొదలవుతుంది. వేరే వారి గురించి ఆలోచిస్తే నీ అంతరంగం కలుషితమవుతుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటే వారి సమాచారం, వారి భావాలు నీ మనసు లోకి ప్రవేశించి నీ మీద స్వారీ చేస్తాయి. నీవు ఎవరి గురించి అయితే అతిగా ఆలోచిస్తే నీ జీవితం వారికి సమర్పించినట్లు, మీ వ్యక్తిత్వం సహజత్వాన్ని కోల్పోయి అతనికి నీవు బానిసగా ఉన్నట్లే. ఇతరుల పట్ల ఆలోచిస్తున్నాను అంటే మనం వారిపై రాగద్వేషాలు పెంచుకున్నట్లే. ప్రస్తుతం మనుషులు తన జీవితం తను జీవించటం మర్చిపోయి ఇతరుల గురించి అనవసరంగా ఆలోచించుకుంటూ లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు ఈనాటి మానవుడు. ఒకసారి మనసు కలుషితమై పరిపరివిధాల అనవసరమైన విషయాల గురించి మనసులో ఆలోచన చేసి దాని ద్వారా శరీరంలో ప్రాణ శక్తి తగ్గి అనేక రకాల రసాయనిక చర్యలు జరిగి తద్వారా అవయవాలు పని చేయక అనేక రకాల జబ్బులు కలిగి శరీరం తన శక్తిని కోల్పోయి దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. మానవునికి ఈ శరీరం ఉంటేనే ఏ కార్యమైనా చేయగలిగేది. నీవు జీవించేది నీ కోసమా..? లేక ఇతరుల కోసమా..? ఆలోచించుకోవాలి. ఇతరుల కోసం జీవిస్తున్నాను అని నీవు అనుకుంటే నీవు మాయలో ఉన్నట్టే... బానిసత్వంలో బతుకుతున్నట్టే. సమాజాన్ని ఉద్ధరించే ముందు నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించాలి. నీ కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని ఉద్ధరించే ఆలోచన చాలా ప్రమాదకరం. ఇంతవరకు ఎవరు అది సాధించలేదు. సేవ చేయాలి కానీ నీవే తర్వాత సేవ చేయించుకునే పరిస్థితి ఏర్పడకూడదు. నిజానికి సేవ అంటే దాని నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు, అలా ఆశించి సేవ చేస్తే కర్మ రెట్టింపు అవుతుంది. సమాజం చెడిపోయింది. దానిని మంచి వైపు నడిపించాలని తపనతో తమ కుటుంబాన్ని మంచి వైపు నడిపించడం మరచిపోతున్నారు. సమాజాన్ని ఉద్ధరించడం తప్పనిసరి అవసరమే కానీ దానికి ఓ పద్ధతి ఉంది. ముందు తనని తను ఉద్ధరించుకోకుండా, తన బాధ్యతలు, బంధాలను, దాటకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం సరికాదు. అందుకు సమాజం కూడా సహకరించదు. నీ కోసం నీవు జీవించడమే నిన్ను నమ్ముకున్న వాళ్లకు నీవు ఇచ్చే అత్యున్నత జీవితం. నిన్ను నీవు ఉద్ధ్దరించి ఉన్నప్పుడే సమాజాన్ని సరి చేసే అర్హత వస్తుంది. కాబట్టి మొదలు నిన్ను నీవు సరి చేసుకో. ఆ తర్వాతనే సమాజం గురించి ఆలోచన చేయి. ఈ ప్రపంచంలో ఎవరి జీవితం వారిది. ఎవరి కర్మలు వారివి. కాబట్టి ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణలో ఉండాలి. నీకు ప్రపంచాన్ని మార్చే అర్హత వచ్చినప్పుడు ప్రపంచం నిన్ను వదలదు. నీకు ఆ అర్హత లేకుంటే సమాజం నిన్ను స్వీకరించదు. మేధావులు మాకు అంతా తెలుసు అనుకుంటారు కానీ అదే వారి బలహీనత. తమ ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు. భౌతిక పరమైన అభివృద్ధి ద్వారానే మనిషి ఆనందంగా జీవిస్తున్నా అనుకుంటున్నాడు. అందుకే భౌతికమైన అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. అందరూ తెలుసుకోవాల్సిన నగ్నసత్యం మనిషి జీవితకాలం పరితపించేది ఆనందం కోసమే. కానీ ఆ ఆనందం పొందాలనే తపనలో భౌతిక, శారీరక సుఖాలే ఆనందం అనే భ్రమలో నిజమైన ఆనందాన్ని పొందలేక అసంతృప్తి పడుతున్నాడు. దీనికి మూల కారణం తన గురించి తను ఆలోచించుకోలేకపోవడం. నీ గురించి నీవు తెలుసుకుంటూ నీ జీవితం గురించి ఆలోచించుకోవడమే దీనికి పరిష్కారం. మనిషి ఆనందంగా ఉండలేక పోవడానికి కొంత పూర్వ జన్మ, ఇంకొంత ఈ జన్మలో చేసిన కర్మలు కారణం. ఈ కర్మలను క్రమేణా నివృత్తి చేసుకుంటూ వాటి తీవ్రతను తగ్గించుకొని అనవసరమైన వాటికి విలువ ఇవ్వకుండా అవసరమైన విషయాలకు మాత్రమే విలువ ఇస్తూ ఫలితం పొందితే ఆనందం సిద్ధిస్తుంది. ఆనందం అంటే ఎవరికి వారు స్వయంగా అనుభవించే స్థితి. ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. ► భౌతిక సంపద పెరగడం అంటే మానసిక సంపద తరగడమే. ► సంపద పెరిగితే సంతృప్తి రావాలి ► సంతృప్తిని మించిన సంపద లేదు. ► ఆనందం లేనప్పుడు జీవితానికి అర్థం లేదు, ► మనం ఎందుకు జీవిస్తున్నాం ఎలా జీవిస్తున్నామో తెలుసుకోవాలి. ► ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా జీవిస్తాడు. – భువనగిరి కిషన్ యోగి -
ఉద్యోగులకు ఇచ్చినదాంట్లో అదే హైలైట్
-
AP: చాలా సంతోషంగా ఉంది: ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తామనడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హెచ్ఆర్ఏపై సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు చెప్పారన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా న్యాయం జరుగుతోందన్నారు. ఊహించని విధంగా పదవీ విరమణ వయస్సు పెంచారన్నారు. ఈ నెల 9న చేపట్టిన జేఏసీ సమావేశం వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. చదవండి: వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే? -
అన్ని స్థితులూ ఆ దైవం కల్పించినవే
జీవితం విభిన్న స్థితుల సంగమం. సుఖ దుఃఖ సమ్మేళనం. సంతోషం– బాధ, ఆనందం– విచారం, తీపీ– చేదూ; శీతలం– ఉష్ణం; సంతృప్తీ– అసంతృప్తీ; శాంతి–అశాంతీ ఉన్నాయి. ఇదంతా దైవాభీష్టం. అందుకని ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నిరాశానిస్పృహలకు లోను కాకూడదు. ఇవన్నీ దేవుని తరఫునే అని భావిస్తూ, ఆ కరుణామయుడే వీటినుండి విముక్తి కలిగిస్తాడని నమ్మాలి. ఇదేవిధంగా కష్టాలు దూరమై, పరిస్థితులు మెరుగు పడి, అంతా సజావుగా జరిగిపోతూ, సుఖసంతోషాలు ప్రాప్తమైతే అది తమ గొప్పదనమేనని, తమ రెక్కల కష్టార్జిత ఫలితమేనని భావించి విర్రవీగకూడదు. ఇదంతా అల్లాహ్ అనుగ్రహమని, ఆ కరుణామయుని ప్రసాదితమన్న విశ్వాసంతో ఉండాలి. ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు తాను ప్రసాదించిన అనుగ్రహాలను తిరిగి లాక్కోగలడు. కాబట్టి ప్రతి అనుగ్రహానికీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. అల్లాహ్ ఇలా అంటున్నాడు:‘మానవులారా! నా ప్రసన్నత కోసం, నేను ప్రసాదించే పుణ్యాన్ని పొందే సంకల్పంతో, దుఃఖ సమయం ఆసన్నమైనప్పుడు సహనం వహించినట్లయితే, నేను స్వర్గం కన్నా తక్కువైన దాన్ని, స్వర్గం తప్ప మరిదేన్నీ మీకు ప్రసాదించడానికి ఇష్టపడను.’ప్రతి వ్యవహారంలో, ప్రతిస్థితిలోనూ వారికి శుభాలే శుభాలు. వారికి శాంతి, సుఖ సంతోషాలు ప్రాప్తమైతే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇది వారి పాలిట శుభాలపంట. ఒకవేళ వారికి దుఃఖ విచారాలు కలిగితే, ఇదీ దైవ నిర్ణయమేనని భావిస్తూ సహనం వహిస్తారు. ఈ సహనం వహించడం కూడా వారి పాలిట శుభాల పంటే అవుతుంది. ప్రాపంచిక జీవితంలో కష్టనష్టాలు, సుఖ సంతోషాలు చాలా సహజ విషయాలు. వీటి ద్వారా దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి. సుఖ సంతోషాలు, శాంతి సంతృప్తులు ప్రాప్తమైనప్పుడు దైవానికి కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కష్టాలు కడగండ్లు ఎదురైతే, జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి కష్టనష్టాలు, బాధలు సంభవిస్తే సహనం వహించాలి. అంటే, అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలగాలి. ఇలాంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. -
సంతోషంలో వెనకబడ్డాం
ఐక్యరాజ్య సమితి: ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడు స్థానాలు దిగజారి 140వ స్థానానికి పడిపోయింది. 2018లో మన ర్యాంకు 133. ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి 156 దేశాలకు సంబంధించి బుధవారం విడుదల చేసిన ‘హ్యాపినెస్ రిపోర్ట్’లో ఫిన్లాండ్ వరుసగా రెండో ఏడాది అగ్ర స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. భారత్ కన్నా పాకిస్తాన్ మెరుగైన ర్యాంకు సాధించి 67వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. అలాగే బంగ్లాదేశ్(125), చైనా(93) కూడా భారత్ కన్నా ముందంజలో ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాకు 19వ ర్యాంకు దక్కింది. యుద్ధ ప్రభావిత దక్షిణ సూడాన్ ఈ సూచీలో అట్టడుగున నిలిచింది. -
పంచభూతాధికారి వాయువు
ఏ తాతగారింటికో వెళితే గ్రామీణప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావి పైకి మాత్రం ‘చక్కగా దిగెయ్యచ్చు’ అనిపించేలా కనిపిస్తుంది. అలాగే ఏ శ్రీశైలమో వెళ్తే అక్కడున్న పాతాళగంగని చూస్తే.. ‘ఇన్నేగా మెట్లు! దిగెయ్యచ్చు’ అనిపిస్తుంది. అక్కడ దిగుడుబావిలోకి దిగుతూ ఉంటేనూ, ఇక్కడి పాతాళగంగలో మెట్లని దిగుతూ ఉంటేనూ ఒక పక్క సంతోషం.. మరో పక్క ఎవరూ చేయలేని పనిని చేయగలుగుతున్నాననే అనిర్వచనీయ ఆనందం.. అనుభవపూర్వకంగా కలుగుతుంది. ఎందుకీ మాట చెప్పాల్సి వస్తోందంటే.. దిగుడుబావిలోకి దిగుతుంటే భలే సంతోషంగా ఉంటుంది. అలాగే పాతాళగంగ మెట్లను దిగుతూ గంగని సమీపించి స్నానం చేస్తే అద్భుతంగా ఉంటుందని కేవలం చెప్పడం వేరు. అదే మరి అనుభవంలో దానిని గమనిస్తే కలిగే అహ్లాదం వేరు అని చెప్పడానికే. సాయి గురించిన ఎన్నో కథలనీ.. లీలలనీ.. సంఘటనలనీ.. వినెయ్యడం, వినిపించడం, చదివేయడం, చదివించెయ్యడం కాదు చేయాల్సింది. దానిలోనికి వెళ్లి పరిశీలించగలగాలి సాయి అనుగ్రహ దృష్టిని. అప్పుడు సాయి చరిత్ర అర్థమవుతుంది మరింత హృదయ స్పర్శతో.లేని పక్షంలో ‘సాయి ఒకరికి ప్రాణాలు పోతుంటే బతికించాడు. మరొకరికి జ్వరాన్ని తగ్గించాడు. ఇంకొకరికి ప్రమాదం జరగకుండా రక్షించాడు, మరొకరికి జరిగిందాన్ని చెప్పాడు...’ అని ఈ తీరుగా అర్థమవుతూ సాయిచరిత్రలో సాయి, ఒక కథానాయకునిలాగానూ, ఆయన అన్నింటా విజయాలనే సాధించినవానిగానూ కనిపిస్తూ సాయి స్వరూపం సాయితత్త్వం తేలిపోతూ కనిపిస్తుంది. అది సరికాదు. ఈ నేపథ్యంలో సాయి.. పంచభూతాల మీదా ఆధిపత్యాన్ని కలిగిన సిద్ధునిగా అర్థం చేసుకుంటూ పృథ్వి–అప్–తేజస్సులని గురించి వివరించుకున్నాక వాయువు మీద ఎలా ఆధిపత్యాన్ని సాధించగలిగాడో, సాధించాడో ఇప్పటివరకూ ఎలా ఉదాహరణ పూర్వకమైన సంఘటనలతో తెలుసుకున్నామో అలాగే తెలుసుకుందాం! బ్రహ్మాండ /పిండాండాలు వాయువు అనగానే వీచే గాలే కదా! అనేసుకుంటారు. అది కాదు దానర్థం. వాయువు రెండు తీరుల్లో ఉంటుంది. పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశాలనే పంచభూతాల్లోనూ కనిపించే వాయువూ, అలాగే శరీరంలో ఉండే పృథ్వి, అప్, తేజస్, వాయు, ఆకాశాలనే పంచభూతాల్లో ఉండే వాయువూ అని రెండు తీర్లుగా ఉంటుంది. ప్రపంచంలో ఉండే వాయువు పేరు బ్రహ్మాండ వాయువు. శరీరం అంటే పిండాండం. ఈ శరీరంలో కనిపించే వాయువు పిండాండ వాయువు.పంచభూతాలనేవి బ్రహ్మాండంలోనూ పిండాండంలోనూ కూడా ఉన్నాయి. అందుకే బ్రహ్మాండాన్ని ప్ర–పంచ–ము అన్నారు. శరీరాన్ని ‘పాంచభౌతిక దేహము’ అన్నారు.బ్రహ్మాండంలో ఆ పిండాండంలో అంటే రెంటిలోనూ పంచభూతాలున్నాయి. వాటి ఉనికిని బట్టే ప్రపంచం పుట్టిందనే అర్థంలో ‘బ్రహ్మ+అండము’ అనీ శరీరం పుట్టిందనే అర్థంలో ‘పిండ+అండము’ అనీ పేరుని పెట్టారు ఋషులు.బ్రహ్మాండంలో కనిపించే పృథ్వి అంటే ఎక్కడెక్కడా ఉండే నేల. పిండాండంలో కనిపించే పృథ్వి మాంసమూ మజ్జా (ఎముకలోపల ఉండే మెత్తని పదార్థం– రక్తాన్ని ఉత్పత్తి చేసే పదార్థం) అనేవి. బ్రహ్మాండంలో కనిపించే అప్(జలం) అంటే నదులూ నదాలూ (పశ్చిమాన పుట్టి తూర్పు సముద్రంలో కలిసేవి) సముద్రాలూనూ. పిండాండంలో కనిపించే ‘అప్’(జలం) శరీరంలో ఉండే తడితనం. ఈ తడితనం ఉన్న కారణంగానే చర్మాన్ని కొద్దిగా పైకి లాగి విడవగానే మళ్లీ మామూలుగా అయిపోతోంది. అదే మరి తడితనం లేకపోతే ఆ లాగబడిన చర్మం అలాగే ఉండిపోతుంది. వేసవిలో కొందరికి వచ్చే వ్యాధి అదే. ఇక కంటిలో.. నోటిలో.. ఇలా అన్ని అవయవాల్లోనూ ఉండే తడితనమే పిండాండంలోని అప్(జలం). బ్రహ్మాండంలోని తేజస్సు– సూర్యుడు. పిండాండంలోని తేజస్సు– చల్లటి పదార్థాలని తిన్నాతాగినా, వేడిపదార్థాలని తిన్నాతాగినా కూడా ఒకే తీరుగా(98.4ౌ ఫారన్‌హీట్) ఉండే వేడిమితనం. బ్రహ్మాండంలోని వాయువు కనిపించకుండా వీస్తూ ఉండే గాలి. ఈ గాలిలో ఎన్నో భేదాలున్నాయి. అవి మనకి ప్రస్తుతానికి అప్రస్తుతమవుతుంది. ఇక పిండాండంలోని వాయువు ఒక్కటి కాదు. వాయువు 10గా విభజింపబడి కనిపిస్తుంది. ఆ పదింటిలోనూ అతి ముఖ్యమైనవి ఐదు. అవే ప్రాణ–అపాన–వ్యాన–ఉదాన–సమానమనే పేర్లతో ఉండేవి.అలాగే బ్రహ్మాండంలో కనిపించే ఆకాశమనేది ఎంత ఎత్తుకి ఎగిరినా ఉండనే ఉండదు గానీ ఉన్నట్లుగా భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది. (ఆకాశో అవకాశ శ్శూన్యమ్) నిజంగా ఆకాశమనేది లేదు. సముద్రపు ప్రతిబింబం కారణంగా నీలి రంగుతో కనిపిస్తుంది. ఇక పిండాండంలో ఉండే ఆకాశమనేది అనుభవంలో ప్రతి వ్యక్తికీ కనిపిస్తూ నిజానికి ఉండని ‘మనసు’ అనేది.ఈ వివరణనంతా ఎందుకంటే.. సాయి భూతాల్లో ఉన్న వాయువుని తన అధీనంలోనికి తీసుకున్నాడంటే కేవలం బ్రహ్మాండంలోని వాయువునే కాక, ప్రతివ్యక్తి శరీరంలోనూ ఉండే పిండాండపు 5 వాయువులనీ కూడా స్వాధీనపరుచుకున్నాడని చెప్పడానికీ.. ఉదాహరణ పూర్వకంగా వివరించడానికేను. ఆ క్రమంలో ముందు బ్రహ్మాండ వాయువుని ఎలా అదుపు చేశాడో తన అధీనంలోకి తెచ్చుకున్నాడో చూద్దాం! ఆపు నీ తీవ్రత షిర్డీ చాలా చిన్న గ్రామం. దీన్నే నాటివాళ్లు కుగ్రామం అంటూ ఉండేవారు వారి సాధారణ పరిభాషలో. ఏ చిన్న అలజడి వచ్చినా.. ఆనందం వచ్చినా.. కొత్త సంఘటన జరిగినా.. ఊరంతా ఓ కుటుంబంలానే దాదాపుగా ఉండే కారణంగా అందరికీ తెలిసిపోతూ ఉండేది. షిర్డీనే కాదు. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో ఆ పద్ధతి ఉండనే ఉంది. సరే!ఓసారి షిర్డీలోని సాయి భక్తులంతా ఎప్పటిలాగానే చక్కని భజనలని చేయాలనే ఆలోచనతో సాయి మందిరానికి అంటే ద్వారకామాయికి బయలుదేరారు. కొందరు ద్వారకామాయికి చేరిపోయారు. కొందరు త్రోవలో ఉన్నారు. మరికొందరు మిగిలిన పూజాసామగ్రిని కొనేందుకు అంగడి దగ్గరా,ఇంకొందరు ఇళ్ల నుండి బయటికి వచ్చి బయలుదేరడానికి సిద్ధంగానూ ఉన్నారు.ఇంతలో మెల్లగా మేఘాలన్నీ ఎక్కడి నుండో తరుముకొచ్చినట్టు రాసాగాయి. చూస్తున్నంతలోనే మరింత నల్లగా మేఘాలన్నీ ఒకచోటికి చేరిపోయాయి. వాయువు వీచడంలో రెండు పద్ధతులుంటాయి. ఒక తీరు వాయువు ఎంతటి బలమైన మేఘాన్నైనా బలంగా వీచి చెదరగొట్టి మేఘాన్ని తునుకలు తునుకలుగా చేసి తరమికొట్టేస్తుంది. ఇంకొక తీరు వాయువు వచ్చిన మేఘాన్ని చెదిరిపోనీకుండా చేస్తూ తనలో ఉన్న చల్లనిదనాన్ని మేఘానికి తగిలేలా చేసి వర్షింపజేస్తుంది.ఇలా సాయి భక్తులంతా తలొకచోటా ఉన్న వేళ ఈ రెండు తీరుల వాయువులూ గట్టిగా వీస్తూ తన లక్షణాలతో మేఘాన్ని ఒకచోటికి చేరేలానూ మెల్లగా చినుకులు ప్రారంభమయ్యేలానూ చేశాయి. ‘పెద్దవర్షమేముండదులే!’ అని అనుకుంటూ భక్తులందరూ భజనమీది అభిలాషతో ద్వారకామాయి వైపే నడవడం మొదలెట్టారు. నిజానికి ద్వారకామాయి పెద్ద దూరంలో లేనే లేదు.ఇంతలో వాయువు మరింత వీచడం మొదలెట్టింది. చినుకులు మరింత వేగంగానూ మీద పడసాగాయి. శరీరాలకి దెబ్బ తగులుతోందా? అన్నంతబలంగా చినుకులు పడుతుంటే సాయి భక్తులంతా ఎవరికీ వీలైన ప్రదేశాల్లో అంటే... కొందరు శనీశ్వరాలయంలో, మరికొందరు శివపార్వతుల ఆలయంలో, ఇంకొందరు మారుతి మందిరంలో ఇంకా కొందరు గ్రామదేవత అయిన ఖండోబా దేవాలయంలో తాత్కాలికంగా తలదాచుకునేందుకు వెళ్లారు.ఇళ్ల నుంచి బయలుదేరి ఇవతలకి వచ్చి వెళ్లబోతున్నవారు ‘అయ్యో! వెళ్లలేమేమో!’ అనుకుంటూ మళ్లీ ఇళ్లలోకే వెళ్లిపోయి వాయువూ వర్షమూ తగ్గాక బయలుదేరవచ్చనుకుంటున్నారు. ఈ దశలో వాయువు, వర్షముతో పాటు కళ్లు బైర్లు కమ్మేంత స్థాయిలో మెరుపులు మెరవసాగాయి. మెరుపులొస్తే మేంమాత్రం రాలేమా అన్నట్లుగా ఉరుములు తీవ్రంగా చెవులు చిల్లులు పడేలా.. గుండెలు బద్దలవుతాయేమో.. అన్నంతగా ధ్వనింపసాగాయి. పిడుగులెక్కడా పడలేదు కానీ, వాయు తీవ్రత, వర్షఆధిక్యం, ఉరుములు, మెరుపులు క్రమక్రమంగా పెరగసాగాయి. ద్వారకామాయిలో ఉన్న వారికి ఖండోబా ఆలయంలో ఎవరు ఉన్నారో.. ఈ ఆలయంలో ఉన్నవారికి ఎవరు ఏ త్రోవలో చిక్కుబడిపోయారో.. ఇళ్లలో ఉన్నవారికి తమ కుటుంబసభ్యులు ఎక్కడెక్కడున్నారో.. తెలియకనే పోయింది. అంత తీవ్రమైన గాలివానని దాదాపు ఆ దశాబ్దంలో ఎవరూ ఎరగమని నలుగురు కూడిన ప్రతిచోటా అనుకోనివారు లేరు. ఎప్పటికి తెరిపి ఇస్తుందో, త్రోవ ఎలా ఉండబోతోందో, ఇళ్లకి ఎలా చేరుకోవాలో అంతా అగమ్యగోచరం కాసాగింది.ఎవరికి వారు తామున్న ఆయా దేవాలయాల్లో వాయుతీవ్రత తగ్గాలనీ, వర్షం ఆగిపోవాలనీ భజనలని చేస్తూ ఉండిపోయారు. నేటికాలంలో లాగా నాడు వీధి దీపాల్లేని కారణంగా షిర్డీ మొత్తం చీకటితో నిండిపోయి అక్కడొక గ్రామం ఉందనే విషయం అర్థం కాకుండా పోయింది. ఏ అడవిలోనో ఉన్న భయం అందరికీ కలిగింది. ఈ దశలో కొందరు చొరవ తీసుకుని మనందరికీ రక్షకుడు,తోడునీడా ఆ సాయి మాత్రమే కదా! దృఢవిశ్వాసంతో అంతటి వర్షంలోనూ సాయి వద్దకి వెళ్లారు అందరి తరపునా ప్రార్థించడానికి.బట్టలు తడిసి వర్షంతో నీరు కారుతూ ఉన్న భక్తులందరూ ఒక్కొక్క మేఘంలా అనిపిస్తున్నారు. అందరూ సాయి పాదాల మీద ఒకరి వెంట ఒకరు చొప్పున పడుతూ.. ‘‘బాబా! పెళ్లాం బిడ్డలు.. గొడ్డు గోద.. పూరిపాకలు, వంటకట్టెలు, కొద్దిపాటి నగానట్రా.. అంతా ఏమైపోతుందోననే భయం ఆవరించేసింది మా అందరినీ. నువ్వే దిక్కు’’ అంటూ దీనాతిదీనంగా ప్రార్థించసాగారు.బాబా ఒక్కసారి అందరినీ అలా వ్యక్తివ్యక్తిని పరిశీలించి చూసి బయటి కొచ్చాడు. చేతిలోని సటకాని తీసుకుని... ‘వాయూ! ఆగు! ఆగు! ఆపు నీ తీవ్రతని! తగ్గించు! మందగించు! నెమ్మదించు!!’ అన్నాడు సార్ద్ర నయనాలతో ఆ భక్తులందరినీ ఓ పక్క చూస్తూ.ఏదో ఓ తండ్రి తన బిడ్డడితో ఓ మాటని అంటే ఆ బిడ్డ తన తండ్రి చెప్పిన మాటని వినినట్లుగా.. ‘వెంటనే వాయువు తన తీవ్రతని తగ్గించడం మొదలైంది. ఆ వెంటనే వర్షం ఆగుతున్నట్టుగా ఆ చూసేవారందరికీ తెలిసింది. దాదాపు 10 నిమిషాల సమయంలో మొత్తం వాయువూ వర్షమూ కూడా ఆగిపోయాయి.భక్తులందరికీ ఆశ్చర్యమయింది. సాయి గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూసి నట్టయింది వాళ్లకి. అందరూ కృతజ్ఞతాపూర్వకంగా సాయికి సాష్టాంగపడి ఆయనని చూసి మళ్లీ వాయువూ వర్షమూ ఉరుములూ మెరుపులూ రానే రావని చెప్పినట్లుగా కనిపిస్తున్న సాయి కళ్లని దర్శించి మెల్లగా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే సాయి అలా ‘నెమ్మదించు!’ అనగానే ఆకాశం కొద్దిసేపట్లో నిర్మలమయింది. నక్షత్రాలూ చంద్రుడూ కూడా కొద్ది సమయంలోనే కనిపించారు. ఆకాశం ప్రశాంతంగా కనిపించసాగింది. కృతజ్ఞత అందరూ దాదాపుగా ద్వారకామాయిని విడిచి ఎవరి ఇళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. అంతలా పెద్దగా భజన వినవచ్చింది. ‘ఏమిటా?’ అని ఆశ్చర్యపడుతూ చూస్తే సాయి అనుగ్రహం లభించి షిర్డీ వాసులందరికీ క్షేమం కలిగిందనీ, ఆందోళన తొలిగిందనీ హృదయపూర్వకంగా సాయి సమక్షంలో భజనని ప్రారంభించారు.ఎవరైనా గమనించాల్సిన అంశం ఇదే. సాధారణంగా కష్టం ఏదైనా వచ్చినప్పుడూ పరిస్థితి అగమ్యగోచరం అనిపించినప్పుడూ వెంటనే మొక్కుకోవడమనే పనిని చేస్తూ ఉంటాం. పని జరిగిన వెంటనే దర్శనానికి వస్తామనో లేక ఫలానిదాన్ని సమర్పించుకుంటామనో మొక్కేస్తాం. మొక్కుకునేప్పుడు ‘వెంటనే’ అనకుండా ఉండలేం. అనేస్తాం. తీరా పని పూర్తి అయ్యాక ‘ఫలాని పని ఉంది– ఫలానిది అడ్డొచ్చింది’ అంటూ మొక్కు తీర్చడాన్ని వాయిదా వేస్తూ వెడతాం. ప్రతి వాయిదాకీ ఓ గట్టి కారణాన్ని చెప్తాం. చూపిస్తాం. మరి అదే వాయిదాని దేవుడు కూడా వేయదలిచి – నీ పనిని ఫలాని రోజు వరకు తీర్చడం కుదరదంటున్నాడా? వెంటనే తీర్చేస్తున్నాడు కదా! ఆ కోరిన కోరికగాని సమంజసమైనదయ్యుంటే!మనకి సత్యనారాయణ వ్రతకథలో ఆ వైశ్యుని కథ మొక్కుని వాయిదా వేసే విధానంతో సాగలేదూ? ఎప్పుడైతే ఆ వైశ్యుడు మొక్కుకుని తీరా పని పూర్తయ్యాక తీర్చలేదో, తీర్చడం కాదు సరికదా అప్పుడు తీరుస్తా– ఇప్పుడు తీరుస్తానంటూ వాయిదా వేస్తూ ఉండేసరికి భగవంతుడు తనని శక్తిహీనునిగానూ అసమర్థునిగానూ లెక్కిస్తున్నాడనే నెపంతో ఓ పరీక్షని పెట్టి ఆ వైశ్యకుటుంబం వంకతో మన కందరికీ మొక్కుని ఎలా ఎప్పుడు తీర్చుకోవాలో తెలియజేసాడు.అదే పద్ధతిలో సాయిని శరణుకోరాక వాయుప్రకోపం వర్షం వీటి కారణంగా ఆందోళనా తగ్గేసరికి వెంటనే సాయి దగ్గరుండే భక్తులు దైవానికి కృతజ్ఞతలని ఘటిస్తూ భజన చేయసాగారు.అలాగని ఇళ్లకి వెళ్లిపోయినవారిని కృతఘ్నులుగా లెక్కించకూడదు. వాళ్లంతా గృహిణులైన కారణంగా బాధ్యతనీ కర్తవ్యాన్నీ విస్మరించరానివారు కాబట్టి వెళ్లారని భావించాలి తప్ప, సాయి విషయంలో శ్రద్ధాభక్తులు లేనివారూ లేదా మన పని మనకి ముఖ్యమనుకుంటూ ఇళ్లకి వెళ్లినవారు గానూ భావించకూడదు. భక్తుల ప్రశ్న ఇది సాయి చరిత్రలో కన్పడదు గానీ సాయి గురించి రాయబడిన ఓవీల్లో (మరాఠీ భాషలో ఓ ఛందస్సు శార్దూలం మత్తేభం వంటి పద్యాల్లో కనిపించే విధానం) మాత్రం కనిపిస్తోంది. ఏమని?సాయిభక్తులు కొందరు సాయిని ప్రశ్నిస్తూ... ‘దేవా! వాయువూ వర్షమూ అంత తీవ్ర స్థాయికి చేరేంతవరకూ నువ్వెందుకు ఊరుకున్నావు? పైగా పంచభూతాలనీ నీ అధీనంలో ఉంచుకున్నావు కాబట్టి ఆ వాయువూ వర్షమూ అనేవి ఎందుకని నీకు జడిసి అంతటి తీవ్రస్థితికి రాకుండా ఎందుకుండలేదు?’ అని.సాయి నిదానంగా సమాధానమిచ్చాడు. ప్రపంచమంటే మనం మాత్రమే కాదు. మనకి ధాన్యాన్నిచ్చే రైతూ, మనకి ధాన్యం లభించేందుకు కావల్సిన భూమి, మన పొలాన్ని దున్నే ఎద్దూ, ఆ ఎద్దుకి తల్లి అయిన ఆవూ, ఇంతేకాక ఏదో ఓ విధంగా మనకి సహాయపడే 84 లక్షల జీవరాసులు ఏం ఉన్నాయో వాటికి వర్షం అవసరమయ్యుండిఉంటుంది. అంత శాతం వర్షం వారి కానందం కాబట్టి వర్షించాడు దైవం. ఆయన సర్వసముడు. వాళ్లకి ఈ వర్షం ఎంతో ఆనందాన్ని కల్గించి ఉండి ఉంటుంది. మనకది అసౌకర్యం అనిపించవచ్చు.ఎక్కువ మందికి ప్రయోజనకరమనిపించే దేన్నైనా దైవం చేస్తాడు. ఆ సందర్భంలో కొందరికి తాత్కాలిక బాధ తప్పదు మరి’ అని. ఎంతగొప్ప తాత్త్విక దృష్టి సాయిది!పంచభూతాల్లో వాయువు మీద అధికారాన్ని బ్రహ్మాండపరంగా చూపిన సాయి, పంచభూతాల్లో వాయువు మీద అధికారాన్ని పిండాండపరంగా ఎలా చూపించాడో తెలుసుకుందాం! అంటే వ్యక్తుల ప్రాణవాయువుల్ని ఎలా పోబోతుంటే ఆధిపత్యాన్ని చూపించి ప్రాణాలు నిలిచేలా చేసాడో గమనిద్దాం! సశేషం! -
ఆనందమానందమాయె
మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. ఈ ఏడాది మేలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో ఆమె వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వ్యాపార వ్యవహారాల రీత్యా సోనమ్ భర్త ఆనంద్ ఢిల్లీలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాల్సి వస్తోందట. దీంతో పెళ్లైన తర్వాత ఢిల్లీకి సోనమ్ రాకపోకలు బాగా పెరిగాయి. అలాగే లండన్‌లోనూ ఆనంద్కి వ్యాపారాలు ఉన్నాయట. అప్పుడప్పుడూ భర్తతో టైమ్ స్పెండ్ చేయడం కోసం లండన్ కూడా వెళ్తున్నారట సోనమ్. దీంతో సోనమ్ కోసం ఆనంద్ తన వ్యాపారాలను ముంబైలో కూడా పెంచాలని అనుకుంటున్నారట. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నది బీటౌన్ టాక్. అలాగే సోనమ్ కూడా మూడేళ్ల క్రితం దాదాపు 30 కోట్లతో బాంద్రాలో కొన్న తన ఇంటిని రీ డిజైన్ చేయిస్తున్నారని బాలీవుడ్ సినీజనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఈ ఇంటి డిజైనింగ్ కంప్లీట్ అవుతుందని, ముంబైలో ఉన్నప్పుడు వీరిద్దరూ ఈ ఇంట్లోనే ఉండబోతున్నారనేది బాలీవుడ్ కథనాల సారాంశం. ఆనంద్‌ని పెళ్లి చేసుకున్నాక సోనమ్ లైఫ్ ఇంకా ఆనందంగా మారిందని పరిశీలకులు అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. .‘జోయా ఫ్యాక్టర్’, ‘ఏక్ లడకీ కో దేఖాతో ఏసా లగా’ సినిమాలతో బిజీగా ఉన్నారు సోనమ్. -
జాయ్ జాయ్ ఎంజాయ్
రొటీన్‌కి బ్రేక్ కొట్టి సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ట్రై చేసినప్పుడే లైఫ్‌లో కిక్ ఉంటుంది. లేకపోతే బోర్ కొడుతుంది. అలా బోర్ కొట్టకుండా ఉండేందుకు ఒక్కోసారి చిన్నపిల్ల్లల్లా మారిపోతుంటాం. శ్రుతీహాసన్ అలానే చేశారు. పిల్లలు ఆడుకునే చెక్క గుర్రపు బొమ్మపై ఎక్కి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. చిన్ననాటి రోజులను గుర్తు తెచ్చుకున్నారు. ఆ ఫన్నీ ఫొటోను ‘ప్యూర్ హ్యాపీనెస్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. లండన్ట్రిప్లో ఇలా ఫుల్‌గా ఎంజాయ్ చేసి, హ్యాపీ మూడ్‌తో ఇండియా ప్రయాణం అయ్యారు శ్రుతీహాసన్. లండన్ నుంచి గోవా వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో రవితేజ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మనీష్ మంజ్రేకర్ దర్శకత్వంలో విద్యుత్ జమాల్ హీరోగా రూపొందనున్న సినిమాలో శ్రుతీనే హీరోయిన్. -
కుశలమా.. నీవు కుశలమేనా?
ఒంగోలు టౌన్ : జిల్లాలోని ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారా..? లేకుంటే దుఖంగా ఉన్నారా..? అనే విషయమై జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టనుంది. హ్యాపీనెస్ సర్వే పేరుతో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు సర్వే నిర్వహించనుంది. వివిధ రంగాలకు చెందిన వారి నుంచి వివరాలను సేకరించనుంది. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1500 మందిని ఎంపిక చేసుకొని వారి నుంచి ఐదురకాల అంశాల ద్వారా వారి స్థితిగతులను తెలుసుకొని అత్యంత ఆనందంగా ఉన్నారా..? విచారంతో ఉన్నారా..?అనే వివరాలను తెలుసుకోనుంది. ఈ సర్వే నిర్వహణ బాధ్యతలను మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సహాయ గణాంకాధికారులుగా పనిచేస్తున్న వారికి అప్పగించింది. వారివద్ద ఉన్న ట్యాబ్‌లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు సర్వేకు సంబంధించిన అప్లికేషన్ అప్లోడ్ చేశారు. దీంతో సహాయ గణాంకాధికారులు ఏరోజుకారోజు తాము నిర్వహించిన సర్వే వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మూడురోజులపాటు జరగనున్న సర్వే ప్రక్రియను ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయ గణాంకాధికారులకు సలహాలు, సూచనలు అందించనున్నారు. సర్వే నిబంధనలు.. జిల్లాలో హ్యాపీనెస్‌కు సంబంధించిన నిర్వహించనున్న సర్వేలో ఐదురకాల అంశాలను ప్రామాణికంగా తీసుకొని సహాయ గణాంకాధికారుల బృందం వివరాలను సేకరించాల్సి ఉంటుంది. ఎంపిక చేసుకున్న కుటుంబాలకు వెళ్లిన సమయంలో ఆ కుటుంబ యజమానితో మాట్లాడాలి. వివరాలు సేకరించే సమయంలో కుటుంబ యజమాని తప్పనిసరిగా ఉండాలి. సర్వేలో 50 శాతం పురుషులు, 50 శాతం మహిళలు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని సర్వే చేపట్టాల్సి ఉంది. ఎంపిక చేసుకున్న ఒక్కో గ్రామంలో ఆరు శాంపిల్స్ తక్కువ కాకుండా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. వివరాలు సేకరించే వ్యక్తుల వయస్సు 15 ఏళ్ల పైబడి ఉండాలి. ఒక ఉద్యోగి, ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి, నిరుద్యోగి తప్పనిసరిగా ఉండాలి. బేల్దారి మేస్త్రి మొదలుకొని హోల్‌సేల్ వ్యాపారం చేసేవారి అభిప్రాయాలు తప్పనిసరిగా సర్వేలోపొందుపరచాల్సి ఉంటుంది. వివరాలు సేకరించే ఐదు అంశాలు ఇవే.. సంతోషంగా ఉన్నారా..? లేదా? ఆర్థికపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తి బంధువులు లేదా స్నేహితులు ఏమైనా సహాయం చేస్తారా..? లేదా..? సంతృప్తికరంగా జీవిస్తున్నారా..? అసంతృప్తితో ఉన్నారా..? గడచిన నెలలో ఏదైనా ఛారిటీకి ఆర్థిక సహాయం చేశారా, ఏవరైనా ఇబ్బందుల్లో ఉంటే నగదు సహాయం అందించారా లేదా..? ప్రభుత్వ కార్యాలయాల్లో, వ్యాపార కార్యకలాపాల్లో ఎక్కడైనా అవినీతి జరుగుతోందా, ఒకవేళ జరుగుతుంటే ఏ స్థాయిలో జరుగుతోంది? సర్వే పక్కాగా నిర్వహించాలి.. జిల్లాలో హ్యాపీనెస్ సర్వేను పక్కాగా చేపట్టాలని ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య ఆదేశించారు. శనివారం స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని సహాయ గణాంకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేకు సంబంధించిన ప్రామాణికాలను కచ్చితంగా పాటించాలన్నారు. సమస్య తలెత్తకుండా నిర్ణీత వ్యవధిలోగా వివరాలు అందించాలని సూచించారు. -
సంతోషంగా లేం
లండన్: ప్రపంచంలో సంతోషమయ జీవితాన్ని గడుపుతున్న దేశాల్లో భారత్ స్థానం దిగజారింది. 156 దేశాలతో కూడిన జాబితాలో భారత్ 133వ స్థానంతో సరిపెట్టుకుంది. గతంలో భారత్ ర్యాంకు 122 కావడం గమనార్హం. సార్క్దేశాలతో (దక్షిణాసియా) పోల్చితే యుద్ధ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్తాన్ (145 ర్యాంక్) కన్నా మాత్రమే ఈసారి మెరుగైన స్థితిలో ఉంది. పొరుగుదేశాలైన పాకిస్తాన్–75, భూటాన్–97, నేపాల్–101, బంగ్లాదేశ్–115, శ్రీలంక–116 భారత్ కన్నా మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఈ నెల 20న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపినెస్’ను పురస్కరించుకుని ఐరాసకు చెందిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్(ఎస్డీఎస్ఎన్) ఈ వార్షిక నివేదిక విడుదల చేసింది. అత్యంత సంతోషమయ దేశంగా ఫిన్లాండ్ నిలవగా ఆ తరువాతి స్థానాల్లో వరసగా నార్వే, డెన్మార్క్ ఉన్నాయి. వలసదారుల స్థితిగతులు, తలసరి ఆదాయం, స్వేచ్ఛ, విశ్వాసం, దాతృత్వం, అవినీతిరాహిత్యం, ఆరోగ్యకర ఆయుఃప్రమాణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించారు. 170 పేజీల రిపోర్ట్‌లో...ప్రపంచాన్ని పీడిస్తున్న మత్తు పదార్థాలు, ఊబకాయం, కుంగుబాటు వంటి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇతర దేశాలతో పోల్చితే ఈ సమస్యలు అమెరికాలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో అగ్రస్థానంలో ఉన్న డెన్మార్క్‌ను వెనక్కి నెట్టి ఈ ఏడాది సూచీలో అత్యంత సంతోషరకరమైన దేశంగా ఫిన్లాండ్(గతంలో అయిదోస్థానం) నిలిచింది. ప్రకృతి, భద్రత, పిల్లల సంరక్షణ, మంచి పాఠశాలలు, ఉచిత వైద్యసేవలు వంటి అంశాల్లో ఫిన్లాండ్ అత్యుత్తమ మార్కులు సాధించింది. అమెరికా 18వ స్థానంలో (గతేడాది 14), బ్రిటన్–19, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్–20వ స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో సిరియా కన్నా వెనిజులా వెనుకబడింది. భారత్, చైనా లాంటి వర్ధమాన దేశాల్లో ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు తరలిపోతున్నా వారు సంతోషంగా ఉండట్లేదని తేలింది. తొలి ఐదు 1. ఫిన్లాండ్ 2. నార్వే 3. డెన్మార్క్ 4. ఐస్లాండ్ 5. స్విట్జర్లాండ్ చివరి ఐదు ర్యాంకులు 156. బురుండి 155. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 154. దక్షిణ సూడాన్ 153. టాంజానియా 152. యెమెన్ -
సైకిల్ దొరికింది.. స్వాతి మురిసింది!
పాన్‌గల్ మండలం మల్లాయపల్లికి చెందిన 11ఏళ్ల స్వాతి పుట్టుకతోనే దివ్యాంగురాలు. అమ్మానాన్నలు నిరుపేద కూలీలు.. తల్లి తోడు లేనిదే బయటికి రాలేదు. ఎక్కడికి వెళ్లాలన్నా అమ్మ చంకనెక్కాల్సిందే..! బిడ్డకు ట్రైసైకిల్ మంజూరు చేయాలని ఆమె తల్లి సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో డీఆర్వో చంద్రయ్యకు విన్నవించింది. ఆయన ఆదేశాల మేరకు డీడబ్ల్యూఓ వరప్రసాద్ ఆమెకు అరగంటలోనే ట్రై సైకిల్‌ను సమకూర్చారు. జేసీ నిరంజన్, డీఆర్వో చంద్రయ్య తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా స్వాతికి మోములో చిరునవ్వు వెల్లివిరిసింది. – ఎం.యాదిరెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, వనపర్తి -
మీ కిడ్స్ స్మార్ట్ కావాలంటే..
తమ పిల్లలు అన్నింట్లోనూ రాణించాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారు. అన్ని అంశాల్లోనూ విపరీతమైన పోటీ నెలకొన్న ఈ రోజుల్లో పిల్లలను చిన్నప్పటినుంచే తగిన రీతిలో తీర్చిదిద్దడం చాలా అవసరం. ముఖ్యంగా ఇది స్మార్ట్ యుగం కాబట్టి వారిని మరింత స్మార్ట్ కిడ్స్‌గా మార్చాలి. చిన్నప్పటి నుంచే వారిపై శ్రద్ధపెట్టి సరైన స్థాయిలో రాణించేలా చూడాలి. ఈ విషయంలో పిల్లల్ని స్మార్ట్ కిడ్స్‌గా మార్చేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం... క్రీడల్లో ప్రవేశం.. పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. ఆటల వల్ల వారికి మంచి ఆరోగ్యం సమకూరుతుంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లలే చదువులోనూ రాణించేందుకు వీలుంటుంది. అందుకే మీ పిల్లల్ని క్రీడల దిశగా ప్రోత్సహించండి. చిన్నప్పటినుంచి కనీసం ఒక్క క్రీడలోనైనా ప్రవేశం ఉండేలా చూడండి. ఆటలతో శరీరం దృఢంగా తయారవుతుంది. దీంతో వారు సరిగ్గా ఎదుగగలుగుతారు. ఆటలు ఆడిన తర్వాత కానీ, వ్యాయామం చేసిన తర్వాత కానీ పిల్లలు కొత్త పదాల్ని 20 శాతం త్వరగా నేర్చుకుంటారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. క్రీడలతో పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. గ్రూప్‌తో కలిసి సమన్వయంతో ఎలా విజయం సాధించవచ్చో వారు తెలుసుకోగలుగుతారు. నాయకత్వ పటిమ, పోరాట పటిమ కూడా పెరిగేందుకు క్రీడలు తోడ్పడతాయి. ఒక హాబీ తప్పనిసరి.. చిన్నప్పటినుంచే ఏదైనా ఒక హాబీని వారికి తప్పనిసరిగా అలవాటు చేయండి. మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, మార్షల్ ఆర్ట్స్.. ఇలాంటి హాబీ ఏదైనా సరే వారిలో సృ జనాత్మక శక్తి పెరిగేందుకు ఉపకరిస్తుంది. మంచి హాబీలు కలిగి ఉన్న పిల్లలు చదువుతో పాటు ఇతర అంశాల్ని త్వరగా నేర్చుకోగలుగుతారు. వీటితో ఎన్నో మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పిల్లలు హాబీగా మొదలు పెట్టినా అంశంలోనే వారు రాణించి కీర్తి ప్రతిష్టలు పొందే వీలుంది. బాల్యంలో హాబీగా మొదలెట్టిన అంశాలతోనే ప్రపంచ గుర్తింపు పొందినవారు చరిత్రలో ఎందరో ఉన్నారు. పిల్లల్ని కేవలం చదువుకే పరిమితం చేయకుండా వారికి ఏదైనా ఒక ప్రయోజనకరమైన హాబీని అలవర్చండి. ఈ హాబీల వల్ల పిల్లల ఖాళీ సమయం కూడా సద్వినియోగం అవుతుంది. చాలినంత నిద్ర.. మీ చిన్నారుల్ని వారికి తగినంత సమయం నిద్రపోనివ్వండి. ఎందుకంటే నిద్రతో అనేక ప్రయోజనాలున్నాయి. చాలినంత నిద్ర పోవడం వల్ల పిల్లల మెదడు సక్రమంగా, సరైన స్థాయిలో ఎదుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. నిద్ర విషయంలో చిన్నారులకు స్వేచ్ఛనివ్వండి. వ్యాయామం, ఆహారం లాగే నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. మెదడు సరిగ్గా పనిచేసేందుకు, త్వరగా నేర్చుకునేందుకు నిద్ర ఉపయోగపడుతుంది. ఆసక్తిని ప్రోత్సహించండి.. మనం క్రీడల్ని, చదువుని, ఇతర హాబీల్ని వారికి తప్పనిసరిగా నేర్పించేందుకు ప్రయత్నిస్తాం. అందులో తప్పులేదు కానీ వారు మరేదైన అంశంపై ఆసక్తి చూపిస్తున్నారేమో గమనించండి. మనం సూచించిన మార్గంలోనే కాకుండా, వారికి నచ్చిన మార్గంలో వెళ్లేందుకు కూడా వారిని ప్రోత్సహించండి. వాళ్లు ఆసక్తి కనబరిచిన రంగం ఏదైనా మీరు తగిన ప్రోత్సాహం అందిస్తే అందులోనే వారు మరింతగా రాణించే వీలుంది. అది మీకు గతంలో సంబంధం లేని రంగమైనా సరే ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే వీలుంది. సంతోషమే సగం భలం.. పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకోగలుగుతారు. మీ పిల్లల్ని మీరు వీలైనంత సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. అతిగా బెదిరించడం, ఆంక్షలు విధించడం సరికాదు. వారి ఆలోచనల్ని గౌరవించండి. ఎక్కువ సమయం మీ చిన్నారులతో గడిపేందుకోసం ప్రయత్నించండి. తల్లిదండ్రుల సాంగత్యం, ప్రేమాభిమానాలు చిన్న వయసు పిల్లల మెదడుపై విపరీతమైన ప్రభావం చూపిస్తాయి. పిల్లల్లో సానుకూల, ఆశావహ దృక్పథం ఏర్పడేందుకూ కారణమవుతుంది. ఎప్పడూ ఆనందంగా ఉండే పిల్లలే చదువులో ఎక్కువగా రాణిస్తున్నారు. కుటుంబ సభ్యులతో సరైన సంబంధాలు కలిగినవారు మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకుంటున్నారు. వారితోపాటే చదవండి.. మీ పిల్లల్ని చదవమని చెప్పి మీరు మాత్రం టీవీ చూస్తూనో, మరో పని చేస్తూనే ఉంటే ప్రయోజనం ఉండదు. మీ పిల్లలు చదువుకునే సమయంలో వీలైనంత వరకు వారికి దగ్గర్లోనే ఉండండి. మీరు ఏదైనా న్యూస్ పేపరో, పుస్తకమో చదువుతుంటే వాటివైపు మీ పిల్లలు తొంగిచూస్తూ అందులోని అంశాల గురించి, కొత్త పదాల గురించి ఆసక్తిగా అడుగుతారు కదూ! మీరు ఇలా చేయడం వల్ల వారిలో చదువుపై ఆసక్తి పెంచిన వారవుతారు. మీ పిల్లల్తోపాటే మీరు కూడా ఏదైనా చదువుకునేలా చూడండి. అలాగే వారికొచ్చే సందేహాల్ని నివృత్తి చేయండి. దీనివల్ల వారు చదువును భారంగా కాకుండా, ఆసక్తిగా ఫీలవుతారు. సాక్షి, స్కూల్ ఎడిషన్