
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తామనడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హెచ్‌ఆర్‌ఏపై సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు చెప్పారన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా న్యాయం జరుగుతోందన్నారు. ఊహించని విధంగా పదవీ విరమణ వయస్సు పెంచారన్నారు. ఈ నెల 9న చేపట్టిన జేఏసీ సమావేశం వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.
చదవండి: వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment