decisions
-
వైఎస్ జగన్ నిర్ణయాలు విప్లవాత్మకం: కంచ ఐలయ్య
సాక్షి,విజయవాడ:అసలు తమకు రిజర్వేషన్లు అనేవే వద్దని,మొత్తం ప్రైవేట్ స్కూళ్లనును రద్దు చేసి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం(ఫిబ్రవరి2) వర్గీకరణపై రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మేము సైతం కార్యక్రమంలో ప్రొ.కంచ ఐలయ్య ,ఐపీఎస్ అధికారి పివి.సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కంచ ఐలయ్య మాట్లాడుతూ ‘35 ఏళ్ల తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్ల గురించి అడిగేవారు ఒక్కరు కూడా ఉండరు. గ్రామాల్లోని బీసీ,ఎస్సీ,ఎస్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే పట్టణాల్లోని వారికి ధీటుగా ఉద్యోగాలు సాధిస్తారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని అప్పటి ఏపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం అమలు చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి,ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేశారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఈ దేశాన్ని సమూలంగా మార్చే నిర్ణయాలు. తెలుగు మహాసభల్లో తెలుగును కాపాడాలని కొందరు మాట్లాడుతున్నారు.మా పిల్లలు తెలుగును కాపాడాలి. మీ పిల్లలేమో అంబానీ స్కూల్స్ లో చదవాలా. చంద్రబాబు మనవడికి ఇంగ్లీష్ ఎందుకు. తెలుగును కాపాడాలని చెబుతున్న వాళ్లు చంద్రబాబు మనవడిని ఎక్కడ చదివిస్తున్నాడో అడగమనండి. ఇంగ్లీష్ మీడియంలో పెట్టి, ఇంగ్లీష్ లోనే చెస్ ఛాంపియన్ సాధించే ట్యూటర్లను పెట్టారు. మీ ముఖ్యమంత్రి మనవడికి ఇంగ్లీష్ మీడియం కావాలి. మీ ఉపముఖ్యమంత్రి కొడుక్కి ఇంగ్లీష్ మీడియం కావాలి. ఇంగ్లీష్ ఏముంది..యూట్యూబ్‌లో నేర్చుకోవచ్చని పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. ఆయన పిల్లలను ఎందుకు యూట్యూబ్ స్కూల్లో పెట్టలేదు. రిజర్వేషన్స్ విభజనను కేంద్రం అమలు చేస్తూ రాష్ట్రాలకు కచ్చితమైన గైడ్ లైన్స్ ఇవ్వాలి’అని ఐలయ్య డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలను ఎలా సాధించాలని చర్చించేందుకు మేము సైతం కార్యక్రమం నిర్వహించామని,మాలలు,మాదిగలు ఒకరికొకరు శత్రువులు కాదని ఐపీఎస్ అధికారి పివి.సునీల్‌కుమార్ అన్నారు. -
హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కర్నూల్ లాయర్ల ఆందోళన
-
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
సాక్షి,తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సోమవారం(నవంబర్18) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పలు నిర్ణయాలను పాలకమండలి ఆమోదించింది.టీటీడీ కీలక నిర్ణయాలివే..శ్రీవాణి ట్రస్ట్ రద్దు..టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్ అనుసంధానం.సర్వదర్శనం భక్తులకు 2,3గంటల్లోనే శ్రీవారి దర్శనానికి చర్యలువిశాఖ శారదా పీఠం లీజు రద్దు.. పీఠం భవనం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయంటీటీడీ అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ లేదా ప్రభుత్వానికి అటాచ్టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయంతిరుపతి ఫ్లైఓవర్‌కు గరుడ వారధి పేరు పునరుద్ధరణతిరుమలలో అతిథి గృహాలకు సొంత పేర్లు నిషేధంతిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు -
కార్యసాధన
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని ఒక సామెత ఉంది. అంటే చెప్పిన పని కాక ఎక్కువ చేసి వచ్చాడు అని అర్థం. సందర్భానుసారంగా దీనిని మెచ్చుకోటానికి, తప్పు పట్టటానికి కూడా ఉపయోగిస్తారు. దీనికి పూర్తి వ్యతిరేకం ‘‘పుల్లయ్య వేమవరం’’ – రాకపోకల శ్రమ తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు అని. ఈ రెండు కూడా యజమాని చేత ఆదేశించబడిన దాసుడు పనిని ఏవిధంగా నిర్వర్తించాడు? అనే దాన్ని తెలిపేవే.‘‘రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి’’ అని యజమాని ఇంట్లో వాళ్ళతో చెపుతుంటే విని తెల్లవారే సరికి, వెళ్ళి తిరిగి వచ్చాడు. యజమాని పిలిచి వెళ్ళమని చెప్పే లోపే తాను చేసిన నిర్వాకం చెప్పాడు. వెళ్ళి ఏం చేశావు? అని అడిగితే సమాధానం లేదు. మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది.మరొక వ్యక్తి చెప్పిన పని మాత్రం పూర్తి చేసి రావటం జరిగింది. ఫలానా వారు ఉన్నారో లేదో చూసి రమ్మంటే ఉన్నదీ లేనిదీ కనుక్కుని వచ్చేయటం జరిగింది. లేరు అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటారు? అని తెలుసుకుంటే మరొక మారు వెళ్ళవలసిన పని ఉండదు. వేరొక వ్యక్తి యజమాని చెప్పిన పని చేసి, దానికి అనుబంధంగా ఉన్న మరిన్ని వివరాలు సేకరించి తిరిగి వచ్చి, యజమాని అడిగిన ప్రశ్నలకి తగిన సమాధానాలు ఇచ్చి మరొకమారు వెళ్ళవలసిన పని లేకుండా చేయటం జరిగింది. అంటే చూసి రమ్మన్న వ్యక్తి లేకపోతే ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అప్పుడు మా యజమాని రావచ్చా? మొదలైన వివరాలు తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అక్కడి వారితో మాట్లాడి తమ వివరాలన్నీ చెప్పి వచ్చే తెలివితక్కువ వారూ, అనవసర ప్రసంగం చేసి అతితెలివితో వ్యవహారాన్ని చెడగొట్టేవారూ కూడా ఉంటారు. ఇటువంటి వారితో ప్రమాదం. ఈ నలుగురిలో యజమానికి ప్రీతిపాత్రమైన వారు ఎవరు? తెలుస్తూనే ఉంది కదా! ఇటువంటి కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ హనుమ. ముందు తనంతట తాను సముద్ర లంఘనం చేస్తాను అనలేదు. జాంబవంతుడు ప్రేరేపిస్తే కాదని కూడా అనలేదు. నిజానికి వెళ్ళింది సీతని చూడటానికి.కాని, చూసి రాలేదు. మాట్లాడాడు. అప్పుడు, తరువాత ప్రతిపని చేస్తున్నప్పుడు తాను ఇది చేయవచ్చునా? లేదా? అని వితర్కించి, ఆ పని తాను చేయవలసిన పనిలో భాగం అని నిర్ధారించుకుని మరీ చేశాడు. తన ప్రభువు లక్ష్యం తెలుసు. తాను చేసే ప్రతి పని దానికి సహకరించేదిగా ఉన్నదీ, లేనిదీ విచారించి, అందులో భాగమేనని నిర్ధారించుకుని మరీ చేశాడు. ఆ యా సందర్భాలలో దూత అయిన వాడు ఏమి చేయవచ్చు, ఏమి చేయ కూడదు అని వితర్కించుకుని, అది శాస్త్ర సమ్మతమే అని నిశ్చయించుకున్నాక మాత్రమే చేశాడు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాలయాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ‘‘చూడబడినది నా చేత సీత’’ అని చెప్పగానే ‘‘ఆమె ఎట్లా ఉన్నది? ఏ మన్నది?’’ అని అడిగాడు రాముడు. నేను దూరం నుంచి చూశానే కాని, దగ్గరగా చూడలేదు, మాట్లాడ లేదు అని చెపితే ఏం బాగుంటుంది? లంకా నగరం గురించి, రావణుడి సైన్యం గురించి అడిగినప్పుడు అవి తెలుసుకోమని చెప్ప లేదు కనుక నేను పట్టించుకో లేదు అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు కాదు కదా అది!అందుకే సమర్థులు చూసి రమ్మంటే కాల్చి వస్తారు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాల యాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకో గలుగుతారు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్!
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానం, విజ్ఞాన్ ధార, ఇంటర్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనియన్ పెన్షన్ స్కీమ్న్(యుపిఎస్) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. విజ్ఞాన్ ధార పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురానుంది. సర్వీస్‌లో 25 ఏళ్లు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ ఇవ్వనుంది. ఈ పథకం కింద 15వ ఆర్థిక సంఘంలో 10,579 కోట్ల రూపాయల ఖర్చు చేయనుంది. సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానుంది.రిటైర్మెంట్కు ఏడాది ముందు ఉన్న సగటు జీతంలో సగం మొత్తం పెన్షన్‌గా అందజేసేలా కొత్త విధానం తీసుకువచ్చింది. పెన్షనర్ మరణిస్తే 60 శాతం కుటుంబానికి వచ్చేలా అమలు చేయనున్నారు.బయో ఈ-3 విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోందని.. బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయిమెంట్ ఆధారంగా బయో మనుఫ్యాక్చరింగ్ విధానం ఉంటుందన్నారు. -
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి,హైదరాబాద్: ఎన్నికల కమిషన్(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ ఉత్సవాలకు కాంగగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించాం. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్ నిర్ణయించింది.అమ్మ ఆదర్శ కమిటీద్వారా ప్రభుత్వస్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించాం. కాళేశ్వడ్యామ్‌పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. వర్షా కాలంలో గేట్లు తెరిచే ఉంచాలి. ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉంచొద్దని ఎన్డీఎస్ఏ సూచించింది’ అని మంత్రి పొంగులేటి తెలిపారు. -
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. రమణ దీక్షితులుపై వేటు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్ ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు నీచాతినీచమైన ఆరోపణలు చేశారని, టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయర్లపై నిరాధార నిందలు వేశారని, దీంతో రమణ దీక్షితులును ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాగా, దేవస్థానం ఉద్యోగులకు బోర్డు శుభవార్త చెప్పింది. 4736 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 4200 కార్పొరేషన్ ఉద్యోగులతో కలిపి 9వేల మందికి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. నడకదారిలో గాలిగోపురం, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం నిర్వహణకు నిర్ణయం తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం తిరుమల పెద్ద జీయర్‌స్వామి అనుమతి మేరకు, ద్వారపాలకులు అయినా జయవిజయలకు బంగారు తాపడం రూ.4 కోట్లతో తాళిబొట్లు తయారికి అంగీకారం పీఠాధిపతులు సదస్సులో సూచించిన సూచనలు ఆమోదం వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించే స్థలానికి రూ.8.16 కోట్లు తిరుచానూరు పద్మావతి అమ్మవాతి ఆలయాని విద్యుత్ అలంకరణలకు అమోదం భక్తుల సౌఖర్యార్థం శాశ్వత గోశాలకు బోర్డు మెంబర్ విరాళం ఎక్కవ సంఖ్యలో లడ్డు తయారికి సూపర్వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ పాపవునాశానం వద్ద 682 మోటర్ పంపు సెట్లకు 3.18 కోట్లు ఆమోదం ఎంఏమ్ఎస్ సేవలు మూడు సంవత్సరాలు పోడొగింపు 1700 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు అలిపిరి , గాలిగోపురం నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచాలని నిర్ణయం బాలబాలికల్లో భక్తి పెంపొందించడానికి 99 లక్షలు పుస్తాల ముద్రణకు స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్యం టీటీడీలో ఉన్న కాంట్రాక్టు, ఒఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్లో రూ.10కే భోజనం అన్నప్రసాద కేంద్రం సూపర్ వైజర్ పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి లేఖ ఇదీ చదవండి.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం -
మేడిగడ్డపై ‘నివేదిక’ అర్థరహితం!
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’రూపొందించిన నివేదికలో వాస్తవ విరుద్ధమైన అంశాలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కుంగిన ర్యాఫ్ట్ వద్ద తవ్వకాలు జరిపి పరిశీలన జరిపితేనే అసలు కారణాలు తెలుస్తాయని.. ఎన్డీఎస్ఏ వంటి చట్టబద్ధసంస్థ తొందరపాటుతో ఆరోపణలు చేయడం సమంజసం కాదని తప్పుపట్టారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందంటూ ఎన్డీఎస్ఏ సమర్పించిన నివేదికపై శనివారం ఆయన జలసౌధలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, ఇతర సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఎస్ఏ నివేదికలోని చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తమ సమావేశంలో నిపుణులందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని రజత్‌కుమార్ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఇప్పుడే ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. డిజైన్ల ప్రకారమే నిర్మాణం మేడిగడ్డ బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా డిజైన్ చేసి, దానికి విరుద్ధంగా రిజిడ్ స్ట్రక్చర్‌గా నిర్మించారని ఎన్డీఎస్ఏ నివేదికలో పేర్కొనడం వాస్తవ విరుద్ధమని రజత్‌కుమార్ తెలిపారు. ర్యాఫ్ట్, సీకెంట్ పైల్స్ మధ్య జాయింట్ ఉందని.. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే బ్యారేజీని నిర్మించామని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్లు, వ్యయ అంచనాలు, ఆపరేషనల్ వివరాలను గతంలోనే సీడబ్ల్యూసీకి, డైరెక్టరేట్ ఆఫ్ కాస్టింగ్‌కి సమర్పించామన్నారు. వారు ఎన్నో వివరాలు అడిగాకే ఆమోదించారని.. తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వీటిని ఆమోదించిందని తెలిపారు. కమిటీ చైర్మన్, సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఇంజనీరింగ్ అద్భుతంగా కితాబునిచ్చారని గుర్తుచేశారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ 2023 జూన్‌లో డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 పరిధిలోకి వచ్చిందని, కానీ అంతకుముందు సమయానికి సంబంధించి బ్యారేజీ నిర్వహణ నిబంధనలను పాటించలేదని నివేదికలో పేర్కొనడం అర్థ రహితమని విమర్శించారు. వానాకాలం ముగిసిన నేపథ్యంలో నవంబర్ నుంచి తనిఖీలు ప్రారంభిస్తామన్నారు. తనిఖీ చేయకుండానే ఆరోపణలు ఎలా? ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేయకుండానే వాటికి సైతం ప్రమాదం పొంచి ఉందని నివేదికలో పేర్కొనడాన్ని రజత్‌కుమార్ తప్పుబట్టారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేశారని ప్రశ్నించారు. అన్నారం బ్యారేజీ పునాదుల కింద నుంచి ఇసుక కదలడంతో పైపింగ్, బాయిలింగ్ (బ్యారేజీ గేట్లకు దిగువన సీపేజీ) జరిగాయని చెప్పారు. ఆప్రాన్ డిజైన్లను సరిదిద్దుతున్నాం మేడిగడ్డ బ్యారేజీ ఆప్రాన్ డిజైన్లలో ఎన్డీఎస్ఏ బృందం కొన్ని లోపాలున్నట్లు తెలిపిందని, తాము దీన్ని గతంలోనే గుర్తించి నిపుణుల కమిటీతో అధ్యయనం జరిపించామని రజత్‌కుమార్ తెలిపారు. 2021 వరదల్లోనే ఆప్రాన్ దెబ్బతిందని, డిజైన్లను సరిదిద్దాక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ఐఐటీ హైదరాబాద్ నేతృత్వంలోని నిపుణులు 10 డిజైన్లను సిఫారసు చేశారన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాపరంగా లోపాల్లేవని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకొని నిదానంగా కారు నడిపినా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయని, ఇది కూడా అలానే జరిగిందని వ్యాఖ్యానించారు. అధికారులిచ్చిన డిజైన్ల ప్రకారమే మేడిగడ్డ నిర్మాణం స్పష్టం చేసిన ఎల్అండ్టీ సంస్థ సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకు పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 23న 7వ బ్లాకు కుంగిపోవడంతో కొంతభాగానికి పగుళ్లు వచ్చాయని పేర్కొంది. నీటిపారుదల శాఖ అధికారులు అందజేసిన డిజైన్ అనుసరించి నాణ్యతను అనుసరిస్తూ బ్యారేజీని నిర్మించి 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని స్పష్టం చేసింది. నాటి నుంచి వరుసగా ఐదేళ్లపాటు బ్యారేజీ వరదలను తట్టుకుని నిలబడిందని పేర్కొంది. బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ పూర్తైన తర్వాత సత్వరంగా పునరుద్ధరణ పనులను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపింది. ప్లానింగ్, డిజైన్, నాణ్యతాలోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఎల్అండ్టీ సంస్థ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ‘నివేదిక’పై సమగ్రంగా సమాధానం ఎన్డీఎస్ఏ బృందం 20రకాల డాక్యుమెంట్లను కోరగా.. గత నెల 29న 17 రకాల డాక్యుమెంట్లు, ఈ నెల 1న మిగతా 3 డాక్యుమెంట్లను అందజేశామని రజత్‌కుమార్ తెలిపారు. కానీ 11 డాక్యుమెంట్లే ఇచ్చినట్టు నివేదికలో పేర్కొనడం దారుణమన్నారు. మళ్లీ 20రకాల డాక్యుమెంట్లను రిప్లైతో కలిపి పంపిస్తామని చెప్పారు. ఈ మేరకు రజత్‌కుమార్ ఎన్డీఎస్ఏ నివేదికలోని అంశాలకు వివరణలతో శనివారం రాత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు లేఖ రాశారు. -
ఇండియా కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
Updates.. ముంబైలో జరిగిన ఇండియా కూటమి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతల కూటమి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. జుడేగా ఇండియా.. జీతేగా ఇండియా నినాదంతో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అదే విధంగా చంద్రయాన్-3 విజయంపై ఇస్రోను అభినందిస్తూ కూటమి తీర్మానించింది. 13 మందితో సమన్వయ కమిటీని ఇండియా కూటమి ప్రకటించింది. ఇందులో శరద్ పవార్, స్టాలిన్ సహా పలువురు కీలక నేతలకు చోటు దక్కింది. ఇండియా కూటమి సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ వేదికపై 60 శాతం భారత్ ఉందన్నారు. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదని అన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా వచ్చాయని, త్వరలోనే జీ 20 శిఖరాగ్ర సదస్సు జరగనుందని తెలిపారు. అదానీ విషయంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తన లఢక్ యాత్ర గురించి చెబుతూ..లఢక్‌లో చాలా భాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. మన భూభాగాలను చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్పడం పూర్తిగా అబద్ధమని అన్నారు. అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడానని అన్నారు. భారత ప్రభుత్వం తమను మోసం చేస్తోందని లఢక్‌లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసని అన్నారు. చైనా, భారత మధ్య సరిహద్దు విషయంలో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. సరిహద్దు మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. #WATCH | Congress MP Rahul Gandhi says, "I spent a week in Ladakh. I went to Pangong Lake right in front of where the Chinese are. I had detailed discussions, probably the most detailed discussion that any politician outside Ladakh has had with the people of Ladakh. They… pic.twitter.com/neR3JPZ8ih — ANI (@ANI) September 1, 2023 ► కూటమి పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే ఓడించే సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సమర్ధవంతంగా ఐక్యంగా ఉండటమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కూటమిలో నాయకుల మధ్య ఏర్పడిన సంబంధాలే అసలైన బలమని రాహుల్ చెప్పారు. బీజేపీని తప్పుకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Congress MP Rahul Gandhi at INDIA alliance meet in Mumbai "Today, two very big steps were taken. If parties on this stage unite, it is impossible for BJP to win elections. The task in front of us is to come together in the most efficient way. Forming a coordination… pic.twitter.com/SyDw8Tzmhk — ANI (@ANI) September 1, 2023 ► బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. దాని ఫలితమే ఈ సమావేశం. కూటమి చేతిలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓడిపోతుండి. ప్రస్తుతం మీడియా వారి చేతిలో ఉంది. వారి చెర నుంచి ఒక్కసారి మీడియాకు విముక్తి కలిగితే మళ్లీ మీడియా స్వేచ్చగా పనిచేస్తుంది. ఇలా చాలా ముఖ్యమైంది. వారు చరిత్రను మార్చాలనుకుంటున్నారు. అందుకు మేము అంగీకరించం. దీనిపై ప్రజలు, మేము కలిసి పోరాడతామన్నారు. #WATCH | Bihar CM and JD(U) leader Nitish Kumar says, "...Parties are working together unitedly. So, as a result of this, those who are at the Centre will lose. They will go away. Be assured...You (media) are captive right now. Once you are free from them, you - the press - will… pic.twitter.com/53gmDcCin8 — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి కేవలం 28 పార్టీల కూటమి కాదు.. 140 కోట్ల కూటమిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దేశ చరిత్రలో మోదీ ప్రభుత్వం అత్యధిక అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రం కొందరి కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఇండియా కూటమిని చీల్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ఇండియా కూటమి ఉందని అన్నారు. ఇక్కడ పదవులు ఎవరూ ఆశించరని చెప్పారు. #WATCH | AAP National Convenor & Delhi CM Arvind Kejriwal on INDIA alliance meeting "This is an alliance not just of some 28 parties, but an alliance of 140 crore people...Modi government is the most corrupt and arrogant government in the history of independent India. We are… pic.twitter.com/Dqek2ybyVx — ANI (@ANI) September 1, 2023 ► 'ఎవరూ అడగకుండానే పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను ఏర్పాటు చేశారు. మణిపూర్ ఘటన జరిగిన సందర్భంలో ఎలాంటి సెషన్లు నిర్వహించలేదు. పెద్దనోట్ల రద్దు, చైనా దురాక్రమణ, కరోనా సమయంలో కూడా ఎలాంటి ప్రత్యేక సెషన్లను ప్రకటించలేదు. నియంతలా కేంద్రం దేశాన్ని పరిపాలిస్తోంది.' అని కేంద్రాన్ని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "Today, without asking anyone, the opposition, a special session of Parliament has been called. A special session of Parliament was never called even when Manipur was burning, during the COVID-19… pic.twitter.com/wjwkDEMzPJ — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి భేటీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీలకు ఒకటే ధ్యేయం దేశాన్ని రక్షించడమేనని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై పొరాడతామని చెప్పారు. కేంద్రం మొదట గ్యాస్ ధరలు పెంచిన మళ్లీ తగ్గిస్తున్నారు.. మోదీ ప్రభుత్వం పేదల కోసం పనిచేయడం లేదని అన్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge on INDIA alliance meeting in Mumbai "All parties conducted this meeting well. A structure was formed for the alliance during talks at my residence earlier, in the Patna meeting an agenda was set and now in Mumbai, everyone has kept… pic.twitter.com/3KKlz20UG8 — ANI (@ANI) September 1, 2023 మూడు తీర్మాణాలు.. ► మూడు తీర్మాణాలు 1) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం 2) ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు నిర్వహించనున్నారు. 3) జుడేగా భారత్-జీతేగా ఇండియా నినాదంతో ప్రజల ముందుకు #WATCH | Shiv Sena (UBT) leader Aaditya Thackeray says, "Today, INDIA parties passed three resolutions. One, we the INDIA parties hereby resolve to contest the forthcoming Lok Sabha elections together as far as possible. Seat-sharing arrangements in different states will be… pic.twitter.com/VAEXozqV9S — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమికి 14 మందితో కూడిన సమన్వయ కమిటీని నియమించారు. కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం ఇంకా ప్రకటించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. #WATCH | Shiv Sena (UBT) MP Sanjay Raut announces names of the 14-member coordination committee -- KC Venugopal (INC), Sharad Pawar (NCP), TR Baalu (DMK), Hemant Soren (JMM), Sanjay Raut (SS-UBT), Tejashwi Yadav (RJD), Abhishek Banerjee (TMC), Raghav Chadha (AAP), Javed Ali Khan… https://t.co/JrhGDqO74I pic.twitter.com/zPyGtxpdND — ANI (@ANI) September 1, 2023 ► సమావేశం జరగునున్న హోటల్ గదికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలు హాజరయ్యారు. #WATCH | Maharashtra | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party president Mallikarjun Kharge and MP Rahul Gandhi arrive at the venue of the meeting of INDIA alliance in Mumbai. pic.twitter.com/xOCth1XXm9 — ANI (@ANI) September 1, 2023 ► భేటీకి హాజరుకావడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముంబయిలోని హాయత్ హోటల్‌కు చేరుకున్నారు. #WATCH | Tamil Nadu CM and DMK leader MK Stalin arrives at the venue of the meeting of the INDIA alliance in Mumbai. pic.twitter.com/UNVMmvUGme — ANI (@ANI) September 1, 2023 ► ఇండియా కూటమి సమన్వయ కమిటీని నేడు ప్రకటించనున్నారు. అన్ని పార్టీల నుంచి ఒక అభ్యర్థి పేరు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూటమి నాయకులను కోరారు. Live: INDIA alliance meet Day 2 in Mumbai Live: Opposition bloc to unveil logo Read @ANI | https://t.co/OCbMsEp4Fp#INDIAAlliance #INDIA #OppositionMeeting pic.twitter.com/Tqotpp95UK — ANI Digital (@ani_digital) September 1, 2023 ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశం ముగిసింది. 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన డిన్నర్ భేటీలో కూటమికి లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. నేడు ప్రధానంగా మూడు అంశాల్లో తుది నిర్ణయం తీసుకున్నారు. ► సమన్వయ కమిటీతో పాటు ఎన్నికల ప్రచారం, ర్యాలీల నిర్వహణకు మరో నాలుగు బృందాలను నియమించనున్నారు. ఈ కమిటీ సభ్యులే సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నట్లు సమాచారం. ► అక్టోబర్ 2నాటికి ఇండియా కూటమి తన మేనిఫెస్టోని విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీకి హాజరైన నాయకులను కోరారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా కామన్ అజెండాను రూపొందించాలని కోరారు. ► కూటమికి లోగోను రూపొందిండంపై నేడు తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఉమ్మడిగా అధికార ప్రతినిధిని కూడా నియమించనున్నారు. ఇండియా కూటమికి కన్వినర్ పదవిని నియమించాలా..? వద్దా..? అనే అంశంపై కూడా నేడు చర్చలు జరగనున్నాయి. ► నిన్న రాత్రి శివ సేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని డిన్నర్ భేటీలో కూటమి నాయకులందరు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రానున్నాయని కొందరు నాయకులు అంచనా వేశారు. ఎన్డీయే వేసే ఎత్తులకు ధీటైన జవాబు ఇవ్వాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ► ఇండియా కూటమి ముంబయిలో సమావేశమైన మొదటి రోజే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ అంశం కూడా నేడు కూటమి నాయకుల చర్చకు రానుంది. ► ఇండియా కూటమి మొదటి సమావేశం పాట్నాలో జరగగా.. రెండవసారి బెంగళూరు వేదికగా పూర్తయింది. మూడోసారి ముంబయి వేదికగా కూటమి నాయకులు హాజరయ్యారు. ఎన్నికల దగ్గర పడనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
బాలినేని నిర్ణయంపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్ణయంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బాలినేని అంశం తమ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అంతర్గతం అని సజ్జల పేర్కొన్నారు. ‘‘బాలినేని స్పష్టమైన కారణం చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని అంటున్నారు. వైఎస్సార్సీపీలో ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రయత్నం చేస్తోంది. టీ కప్పులో తుఫాను కాదు కదా.. అందులో టీ కూడా లేదు. వివాదాలేమీ లేవు.. అంతా మీడియా హడావుడి తప్ప మరేమీలేదు. మాట్లాడేందుకు ఏమీలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్!
నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైజమని టీడీపీలోనే ప్రచారముంది. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వారి కోసం సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో గందరగోళ పరిస్థితులకు చంద్రబాబు నిర్ణయాలే కారణమని అక్కడి నేతలు వాపోతున్నారు. ఇంతకీ సింహపురి రాజకీయాల్లో కలకలానికి కారణం ఏంటి? తెగేసి చెబుతున్నారట.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాకను టీడీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఇన్చార్జ్ అబ్దుల్ అజీజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. రూరల్‌లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి.. ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఏకంగా ముఖ్య నాయకుల్నే అజీజ్ ప్రశ్నించారట. అయితే వారు అజీజ్‌ను లైట్ తీసుకోవడంతో.. ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకువచ్చి అధిష్టానం తన గొంతు కోసిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారట. తమ మీద హత్యాయత్నం కేసులు పెట్టించి, బెదిరించిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలను అజీజ్ ప్రశ్నిస్తున్నారట. బాబు మంత్రాంగం అంటే అంతే సంగతి పార్టీ దారుణంగా ఓడిపోయినా నాలుగేళ్ల నుంచి రూరల్ లో పార్టీని బలోపేతం చేస్తున్న తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని ఎలా తీసుకుంటారని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పార్ఠీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దగ్గర ప్రస్తావించారట. అయితే కోటంరెడ్డి సోదరుల రాక తమకు కూడా ఇష్టం లేదని వారు బదులివ్వడంతో అజీజ్ కు ఏం చెయ్యాలో అర్దం కాక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. కోటంరెడ్డి అధికారాన్ని ఉపయోగించి.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి.. అజీజ్ వారికి అండగా నిలిచేవారు. కొంతకాలం క్రితమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. వైసీపీ నుంచి టిక్కెట్ రాదని భావించిన ఆయన.. పచ్చ బ్యాచ్ తో చేతులు కలిపారు.. ప్రభుత్వం మీదే అనవసర విమర్శలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారని తేలడంతో శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పాపం.. బలిపశువు మరో నాలుగు నెలల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతారని.. ముందుగా తన తమ్ముడ్ని టీడీపీలోకి పంపారని రూరల్ లో చర్చ నడుస్తోంది. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తనకు ఎమ్మెల్యే సీటు రాదని భావిస్తున్న అజీజ్.. అన్నదమ్ముల రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న తనకు మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. గిరిధర్ రెడ్డికి సహాయ నిరాకరణ చేద్దామని.. తన అనుచరులతో చెబుతున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
బడ్జెట్: వాజ్‌పేయి చొరవ వల్లే.. అది ఇప్పటికీ అమలు
ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రజల ముందుకు వచ్చింది. ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. గతంలో కంటే కాస్తలో కాస్త జనాలకు ఊరట ఇచ్చే ప్రయత్నమే చేసింది కేంద్రం. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకున్న ఓ చారిత్రక నిర్ణయం ఇప్పటికీ బడ్జెట్ సందర్భంలో ప్రస్తావనకు వస్తుంటుంది. అదేంటో తెలుసా?.. ఈయన హయాంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 11 గంటలకు మార్చారు. ఫిబ్రవరి చివరి తేదీన సాయంత్రం వేళలో బడ్జెట్ ప్రవేశపెట్టడం బ్రిటిష్ కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కానీ, వాజ్‌పేయి ప్రభుత్వం ఆ పద్ధతిని మార్చేసింది. ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా.. 1999లోనే ఉదయం 11 గంటల ప్రాంతంలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని మొదలుపెట్టారు. అలాగే ఫిబ్రవరి చివరి తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే మరో సంప్రదాయానికి 2017లో పుల్‌స్టాప్ పడింది. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ.. ఫిబ్రవరి చివరి తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తారీఖునే బడ్జెట్ ప్రవేశపెట్టే ఆనవాయితీని మొదలుపెట్టారు. స్వాతంత్య్ర భారతదేశంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. ఈ జాబితాలో అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఉన్నారు. మోదీ 2.0 టీంలో 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీతారామన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు. దేశ చరిత్రలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ రికార్డు సృష్టించారు. మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారాయన. 1962-69 మధ్య.. ఆయన చేతుల మీద కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి ప్లేస్‌లో పీ చిదంబరరం, ప్రణబ్ ముఖర్జీ(8), యశ్వంత్ సిన్హా(8), మన్మోహన్ సింగ్(6) ఈ జాబితాలో ఉన్నారు. -
కొత్త సంకల్పాలు 2023: మూస నిర్ణయాలు వద్దు.. పాత నిర్లక్ష్యాలూ వద్దు
‘జిమ్‌లో చేరాలి’ ‘టైమ్‌కి భోజనం చేయాలి’ ‘వాకింగ్ మొదలెట్టాలి’ ‘స్మోకింగ్ మానేయాలి’... ఇలా కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకోవడం, మర్చిపోవడం, జోక్‌గా మార్చడం ఇకపై వద్దు. కొత్తగా ఆలోచించండి. ‘నాలో నుంచి ద్వేషం తీసేస్తాను’ ‘ఇక పై సహనాన్ని సాధన చేస్తాను’ ‘జ్ఞానాన్ని పెంచుకుంటాను’ ‘డిజిటల్ సమయాన్ని తగ్గించుకుని కుటుంబానికి కేటాయిస్తాను’ ఎంత బాగున్నాయి ఇలాంటి నిర్ణయాలు. రాబోయే కాలం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా మీకెన్నో సవాళ్లు విసరొచ్చు. వాటి కోసం సిద్ధం కండి. చెదరని సంకల్పాలు ఈ సంవత్సరం తీసుకోండి. ‘ఈ పని చేసి తీరాలి’, ‘ఇది జరిగి తీరాలి’ అని హెచ్చరించుకోకపోతే మనిషి ఏ పనీ చేయడు. తనకు తాను గట్టిగా చెప్పుకోవడం కూడా అవసరమే. ‘నిర్ణయం’ (డెసిషన్) తీసుకుంటే దానిని మార్చుకునే అవకాశం ఉంది. కాని సంకల్పం (విల్) తీసుకోవాలి. ఒక పని సంకల్పించాక దానిని ఇక మార్చకూడదు. పూర్వం దీక్షా కంకణాలు కట్టేవారు పెద్దలు. ఒక పని అనుకున్నాక పూర్తయ్యే వరకు ఆ పనిని గుర్తు చేస్తూ కట్టే కంకణం అన్నమాట. పని పూర్తయ్యాకే కంకణం విప్పాలి. ఇప్పుడు 365 రోజుల పాటు విప్పడానికి వీల్లేని మనో కంకణం కట్టుకోవాలి కొత్త సంవత్సర సంకల్పంగా. ఎందుకు? ఎప్పటికప్పుడు జీవితాన్ని మెరుగు పర్చుకోవడానికి. సరి చేసుకోవడానికి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ గడపడానికి. అర్థవంతంగా గడపడానికి. జీవితం జోక్ కాదు. తేలిగ్గా తీసుకునేది అంతకన్నా కాదు. చిన్న రాయి దెబ్బకు కూడా కకావికలం కావచ్చు జీవితం. అందువల్ల ఏమరుపాటుగా ఉండటానికి కూడా కొత్త సంవత్సర సంకల్పాలు తీసుకోవాలి. 2023లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎటువంటి మెరుగుదలకు సంకల్పాలు తీసుకోవచ్చో చూద్దాం. వ్యక్తిగతంగా... 1. భౌతికంగా ఎలా ఉన్నారు?: లావు, సన్నం తర్వాత. ముందు మీరు చురుగ్గా ఉన్నారా లేదా చూసుకోండి. ఆరోగ్యకరమైన శరీరం సగం సంతోషాన్ని, దేనినైనా ఎదుర్కొనవచ్చనే ధైర్యాన్ని ఇస్తుంది. మీకు మీరు దిలాసా ఇచ్చుకోవడానికి శరీరాన్ని చురుగ్గా ఉంచండి. వ్యాయామం, హెల్త్ చెకప్ అవసరం. సొంత వైద్యం మానాలి. అదే తగ్గిపోతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. శరీరమే ఆయుష్షు. మీ చర్యలతో మీకు మీరే ఆయుష్షు పోసుకోండి. 2. మానసికంగా: మానసిక ఉద్వేగాలు శరీరంపై ప్రభావం చూపుతాయి. కొన్ని లక్షణాలు జన్మతః, కొన్ని లక్షణాలు స్వభావరీత్యా ఏర్పడతాయి. వాటిలో పనికిమాలినవి వదిలేయండి. ఉదాహరణకు: ఈ సంవత్సరం అసూయ పడను అనుకుంటే చాలా మంది బంధువులు, స్నేహితులు, కలీగ్స్ మీకు ఆత్మీయులు అయిపోతారు. అసూయతోనే వారికి మీరు దూరం అవుతారు. అసూయ లేకపోతే ఇంత బలగం వస్తుంది. ద్వేషం, అత్యాశ, త్వరగా అందలం ఎక్కేయాలన్న కుతి... ఇవి వదులుకోవడం చాలా అవసరమైన సంకల్పాలు. ‘నా ప్రయాణం ఆరాంగా చేస్తాను. అంచెలంచెలుగా ముందుకు సాగుతాను. నా రేంజ్లో ఎంత పొందవచ్చో అంతా పొందుతాను. మిగిలినవారిని చూసి పోల్చుకోను’ అనుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. 3. ఉద్యోగపరంగా: వృత్తి నైపుణ్యం పెంచుకుంటాను అని సంకల్పించాలి. ఉన్న చోట ఉండిపోవడం తెలిసినదానితో ఆగిపోవడం సరి కాదు. పనిలో నైపుణ్యం పెరిగే కొద్దీ అందుకు అవసరమైన పరిజ్ఞానం పెంచుకునే కొద్దీ మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ‘ఈ ఉద్యోగం పోతే ఎలా’ అనే భయం పోతుంది. ‘ఎక్కడైనా బతకొచ్చు’ అనే ధైర్యం వస్తుంది. పని నేర్చుకోండి. మీ పనికి విలువ ఇచ్చే చోటుకు మారిపోండి. కుటుంబపరంగా... 1. మొదట కుటుంబం: కుటుంబం మొదటి ్రపాధాన్యం అనుకోవాలి. భార్య లేదా భర్త ఉద్యోగాలు చేస్తున్నా వేరే అభిరుచుల్లో ఉన్నా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కుటుంబమే మొదటి ్రపాధాన్యం. ‘రోజూ రాత్రి భోజనం కలిసి చేయాలి’ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే ఇల్లు దాదాపుగా ఒక దారికి వచ్చినట్టు. ‘చె΄్తాను... వింటాను’ అనేది కూడా చాలా పెద్ద సంకల్పం. భార్యకు/భర్తకు చెప్పాలనుకున్నది చెప్పకపోవడం, వారు చెప్పేది వినకపోవడం కుటుంబాల్లో అగాధాలకు కారణం. పిల్లల విషయంలో ‘అడుగుతాను/వింటాను’ అనే సంకల్పం. పిల్లలు ఏం చేస్తున్నారు... వారి రొటీన్... స్నేహితులు... ఇవి అడగడం 365 రోజులూ చేయాల్సిందే. వారి మనసులో ఏముందో మాటల్లో పెట్టి వినాల్సిందే. ‘ఫోన్ టైమ్ తగ్గించుకుంటాను’ అని సంకల్పించుకుంటే, సోషల్ మీడియా టైమ్ కట్ చేసుకుంటే రాబోయే సంవత్సరం మీకెన్నో కౌటుంబిక ఆనందాలు ఇస్తుంది. 2. ఆర్థిక నిర్లక్ష్యం వద్దు: ఇతర నిర్లక్ష్యాల కంటే అర్థిక నిర్లక్ష్యం మూలాల మీద కొడుతుంది. ఆప్తులను దూరం చేస్తుంది. చేతులు నులుముకునేలా చేస్తుంది. ‘ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటాను’ అనేది ముఖ్య సంకల్పం. కుటుంబం మొత్తం కలిసి ‘అనవసరమైనవి కొనం/ అనవసర ఖర్చులు చేయం/వేస్ట్‌ను నివారిస్తాం’ అనుకుంటే చాలా మంచి జరుగుతుంది. లైట్లు, గీజర్లు, స్టౌ, టీవీ, కంప్యూటర్ సమయానికి అందరూ ఆపినా చాలా పెద్ద విషయమే. ‘రాబోయే అవసరాలకు ఇప్పుడు ఎంత ఉంది’ అని చూసుకుంటే జాగ్రత్త అదే వస్తుంది. 3. చైతన్యంగా ఉంటాం: కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగున్నా చైతన్యం లేకుండా అజ్ఞానంతో ఉంటే ఎలా? పేపర్ తెప్పించండి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ నెలకు ఒక పుస్తకమైనా చదవాలి అని సంకల్పించుకోవడం ఇంటికి వెలుతురు తీసుకురావడం. సామాజికంగా... మంచి ΄పౌరుడిగా మారండి: రోడ్డు మీద ఉమ్మను... ట్రాఫిక్ నియమాలు పాటిస్తాను.. అని అనుకోవడం కూడా చాలా పెద్ద విషయమే. ఒకటి సంస్కారం.. రెండోది ్రపాణానికి భద్రత. సమాజంలో ఒకరికి హాని చేసే ద్వేషాన్ని ప్రచారం చేయకుండా, ఒకరికి నష్టం చేసే అబద్ధంలో భాగంగా కాకుండా, ‘తెలిసీ కావాలనీ తప్పని తెలిసినా’ అలాంటి పనులు చేసి సామాజిక కలనేతకు నష్టం కలగించకుండా ఉంటాను అనుకోవడం అత్యంత ముఖ్యమైన సంకల్పం. ఇక దీక్ష బూనడం మీ వంతు. -
స్వీడన్ నాటో బాట
స్టాక్‌హోమ్: నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్ సోమవారం ప్రకటించారు. తద్వారా 200 ఏళ్లుగా అనుసరిస్త్ను తటస్థ వైఖరికి స్వీడన్ ముగింపు పలుకుతోంది. ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ విధానంలో చరిత్రాత్మక మార్పుగా మగ్డలీనా అభివర్ణించారు. నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు అవసరమన్నారు. నాటోలో చేరికపై ఫిన్లాండ్తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నిర్ణయానికి స్వీడన్ పార్లమెంట్ రిక్స్డగెన్లో భారీ మద్దతు లభించింది. 8 పార్టీల్లో కేవలం రెండు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. రెండు దేశాల్లో కూడా నాటో చేరికపై ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వీడన్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. నాటోలో చేరినా తమ దేశంలో అణ్వాయుధాలను, నాటో శాశ్వత బేస్‌లను అంగీకరించబోమని మగ్డలీనా చెప్పారు. డొనెట్స్క్పై దాడులు ఉధృతం తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్పై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. మారియుపోల్‌లోని స్టీల్ ప్లాంట్ చుట్టూ వైమానిక దాడులు కొనసాగాయి. పలు పట్టణాలలోని పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఖర్కివ్ చుట్టూ రష్యన్ దళాలు తమను నిరోధించే యత్నాల్లో ఉన్నాయని ఉక్రెయిన్ తెలిపింది. అయితే సరిహద్దులో బెలరాస్ బలగాలున్నందున ఉక్రెయిన్ సేనలు ఉన్నచోటే ఉండి పోరాడడం మేలని బ్రిటీష్ సైన్యం సూచించింది. తూర్పు ప్రాంతంలో రష్యా ఒక ఆస్పత్రిపై జరిపిన దాడిలో ఇద్దరు మరణించారని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యాలో వ్యాపారాల అమ్మకం పలు పాశ్చాత్య కంపెనీలు రష్యాలోని తమ వ్యాపారాలను తెగనమ్ముకుంటున్నాయి. రష్యాలో వ్యాపార విక్రయ ప్రక్రియను ఆరంభించామని మెక్‌డొనాల్డ్స్ తెలిపింది. సంస్థకు రష్యాలో 850 రెస్టారెంట్లున్నాయి. వాటిలో 62 వేల మంది పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సంస్థ లాభాలపై ప్రభావం పడే అవకాశముందని తెలిపింది. ఇదే బాటలో కార్ల తయారీ సంస్థ రెనో సైతం రష్యాలో తమ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థకు స్థానిక అవటోవాజ్ కంపెనీలో ఉన్న 67.69 శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇదే కోవలో పలు పాశ్చాత్య కంపెనీలు పయనించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. (చదవండి: పుతిన్ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?) -
సంతోషాలు... సవాళ్ళు...
భారతీయ గృహాలలో నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. సొంత బ్యాంకు ఖాతాలున్న స్త్రీల సంఖ్య హెచ్చుతోంది. దేశంలో సంతాన సాఫల్య రేటు తగ్గుతోంది. ఇళ్ళలో కాకుండా ఆరోగ్య వసతులున్నచోట శిశు జననాల సంఖ్య 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగింది. అదే సమయంలో స్త్రీలలో నూటికి 30మంది పదిహేనో ఏట నుంచే భౌతిక హింసకు గురవుతున్నారు. అయినా వారిలో 77 శాతం మంది నోరు విప్పలేక, గృహహింసను గుట్టుగా భరిస్తున్నారు. కొండను అద్దంలో చూపుతూ ‘5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) తన జాతీయ నివేదికలో ప్రస్తావించిన వెలుగునీడలివి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించిన ఈ నివేదిక దేశంలో మారుతున్న ధోరణులను ప్రతిఫలిస్తూనే, మరింత పురోగతికి అవసరమైన వ్యూహాల గురించి అప్రమత్తం చేస్తోంది. తాజాగా వెల్లడైన సమాచారం అందుకే అంత కీలకమైనది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, తదితర అంశాలకు సంబంధించి విశ్వసనీయ, తులనాత్మక సమాచారం అందించడం ‘ఎన్ఎఫ్హెచ్ఎస్’ ప్రధాన ఉద్దేశం. అందుకే వరుసగా అనేక విడతల్లో ఈ సర్వే చేస్తుంటారు. ఆ వరుసలోదే ఈ 5వ సర్వే. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో (2017 మార్చి నాటికి) 6.37 లక్షల ఇళ్ళను శాంపుల్‌గా తీసుకొని, ఈ సర్వే సాగింది. అలా జిల్లా స్థాయి వరకు ఉన్న పరిస్థితిని ప్రతిఫలించే ప్రయత్నం సాగింది. ఆ సర్వే తాలూకు జాతీయ నివేదికను కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు విడుదల చేసింది. మునుపటి ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–4’ (2015–16) నాటికీ, ఆ తర్వాతి ‘ఎన్ఎఫ్హెచ్ఎస్–5’ (2019–21) నాటికీ మధ్య వివిధ అంశాల్లో జరిగిన పురోగతికి ఈ తాజా నివేదిక ఓ దర్పణం. గత విడత సర్వేతో పోలిస్తే, ఈ సర్వే పరిధిని విస్తరించారు. మరణాల నమోదు, ప్రీ–స్కూల్ చదువు, పిల్లల టీకాకరణ విస్తరణ, ఋతుక్రమ పరిశుభ్రత, ప్రతి ఒక్కరిలో బీపీ – షుగర్ లాంటి అనేక అంశాల సమాచారం సేకరించారు. తద్వారా ఇప్పటికే అమలులో ఉన్న ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకూ, పటిష్ఠీకరణకూ వీలుంటుంది. అవసరాన్ని బట్టి విధానపరంగా కొత్త వ్యూహాలను సర్కారు సిద్ధం చేసుకోగలుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు సంబంధించిన సూచికల్లో ఎంతో కొంత మెరుగుదల సాధించాయన్నది ఈ 5వ సర్వే లెక్క. సొంత ఆరోగ్య సంరక్షణ, ప్రధానమైన వస్తువుల కొనుగోలు, బంధువుల సందర్శన – ఇలా ఇంటికి సంబంధించి 3 ప్రధాన అంశాల్లో వివాహిత మహిళల నిర్ణయాత్మక భాగస్వామ్యం ఇప్పుడు పెరిగిందని సర్వే మాట. సొంతంగా వాడుకొనే బ్యాంక్, లేదా పొదుపు ఖాతా ఉన్న ఆడవారి సంఖ్య గత నాలుగేళ్ళలో 53 నుంచి 79 శాతానికి పెరగడం చెప్పుకోదగ్గ విశేషం. మతాలకు అతీతంగా మహిళలు ఇప్పుడు తక్కువమంది సంతానానికే జన్మనిస్తున్నారు. అలా దేశ జనాభా వృద్ధి నిదానిస్తోందని ఈ సర్వే తీపి కబురు చెబుతోంది. గతంలో మహిళల మొత్తం సంతాన సాఫల్య రేటు (టీఎఫ్ఆర్ – సగటున ప్రతి మహిళా తన జీవితకాలంలో జన్మనిచ్చే శిశువుల సంఖ్య) జాతీయస్థాయిలో 2.2 కాగా, ఇప్పుడది 2కు తగ్గింది. అన్ని మతాల స్త్రీలలోనూ తగ్గుదల కనిపించగా, ముస్లిమ్ స్త్రీలలో ఆ రేటు 2.62 నుంచి 2.36కు సర్రున పడిపోయింది. ఇది సర్వే చెబుతున్న సత్యం. అసలిప్పటి దాకా సాగిన 5 విడతల సర్వేలనూ పరిశీలిస్తే, సంతాన సాఫల్య రేటు హిందువుల (41.2 శాతం) కన్నా ముస్లిమ్లలోనే (46.5 శాతం) ఎక్కువగా తగ్గిందన్నది గమనార్హం. అంటే, సమీప భవిష్యత్తులో ఈ దేశంలో హిందువుల కన్నా ముస్లిమ్‌ల సంఖ్య మించిపోతుందంటూ దుష్ప్రచారంతో నమ్మించడానికి ప్రయత్నిస్తున్నవారి మాటలన్నీ వట్టి డొల్లవే అన్నమాట. అక్షరాస్యులా, నిరక్షరాస్యులా అన్న దాన్ని బట్టి సంతాన సాఫల్య రేటు ఉంటోందన్నది మరో కీలక అంశం. చదువుకున్న మహిళల్లో ఆ రేటు తక్కువగా ఉంటోందంటే, కుటుంబ నియంత్రణను పాటించడంలో స్త్రీ విద్యకున్న ప్రాధాన్యం అర్థమవుతోంది. 15 నుంచి 49 ఏళ్ళ మధ్య పునరుత్పత్తి వయసులో ఉన్న స్త్రీ పురుషుల్లో దాదాపు అందరికీ కుటుంబ నియంత్రణ విధానాలపై అవగాహన ఉందట. అయితే, 56.4 శాతమే వాటిని పాటిస్తున్నారు. అంటే, సామాజికంగా, ఆర్థికంగా దిగువ శ్రేణి వారిలో ప్రభుత్వాలు మరింత చైతన్యం తేవాలన్నమాట. అలాగే, ఇవాళ్టికీ దేశంలో గర్భనిరోధక సాధనాల వాడకం, కుటుంబ నియంత్రణ ఆడవారి పనే అన్న భావన ఉన్నట్టు సర్వే చాటింది. ఆ బాధ్యత తమకు లేదన్న పురుషుల భావన ఏళ్ళ తరబడిగా సమాజంలో మారని ఆధిపత్య ధోరణికీ, లింగ దుర్విచక్షణకూ మచ్చుతునక. హరియాణా, హిమాచల్‌లతో పోలిస్తే పంజాబ్‌లో బాల్య వివాహాలు తగ్గనే లేదు. ఈ వైఖరిని మార్చేందుకు ప్రభుత్వ ప్రచారోద్యమాలు తప్పవు. రెండేళ్ళ లోపు వయసు పిల్లల్లో పూర్తిగా టీకాలు వేయించుకున్నవారి శాతం ఒకప్పుడు 62. గత నాలుగేళ్ళలో అది 77 శాతానికి పెరిగింది. ఆ వయసు పిల్లల్లో నాలుగింట మూడొంతుల మందికి పైగా టీకాలు పూర్తిగా అందుతున్నాయనడం సంతోషకరమే. అదే సమయంలో స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. మన జీవనశైలిలో రావాల్సిన మార్పులను ఇది మరోసారి గుర్తు చేస్తోంది. మొత్తం మీద, దేశం అందుకోవాల్సిన ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల’కు సంబంధించి ఈ 5వ విడత సర్వే అందించిన 34 సూచికల డేటా ప్రభుత్వాల భవిష్యత్ కార్యాచరణకు కరదీపిక. ఇక, రానున్న 2023–24లో జరిగే 6వ సర్వే మరింత లోతైన సమాచారం అందిస్తుందని ఆశించవచ్చు. -
విధి లేక తీసుకున్న కఠిన నిర్ణయం! తన చర్యలను సమర్థించుకున్న పుతిన్
Putin defends invasion: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై చేస్తున్న దాడిని సమర్థించుకునేందుకు యత్నించారు. ఉక్రెయిన్ పై జరుగుతున్న నిరవధిక దాడి గురించి స్థానిక మీడియాతో మాట్లాడుతూ..."ఉక్రెయిన్‌కు రష్యా బలగాలను పంపడం నిస్సందేహంగా కష్టమైన నిర్ణయం. ఇది అనివార్యమైన సంఘటన. ఇది రాజ్యంగ విరుద్ధ తిరుగుబాటు. అయితే ఉక్రెయిన్‌లో పరిస్థితి అదుపు తప్పింది. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు పాలన మార్పును తిరస్కరించాయి. ఆగ్నేయ డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలలో అసమ్మతివాదులు తదనంతరం హింసను ఎదుర్కొన్నారు. కీవ్ ప్రభుత్వం డాన్‌బాస్‌లో పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలను నిర్వహించిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా ఆ ప్రాంత ప్రజలు ఏమి వీది కుక్కలు కాదు. పైగా ఆ ప్రాంతంలోని వందలాది మంది ప్రజలు, పిల్లలు చంపబడ్డారు. దీనికి పశ్చిమ దేశాలు చురుకుగా మద్దతు ఇస్తున్నాయి. అంతేకాదు మాస్కో ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి, అదే సమయంలో డోనెట్స్క్ లుగాన్స్క్ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నించింది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం డాన్‌బాస్‌ను దిగ్బంధించి ప్రజలను అణచివేసింది. అంతేగాక ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోరనే హామీ ఇవ్వడంలో విఫలమైందని తదితర కారణాల వల్లే మేము దాడులకు దిగవలసి వచ్చింది." అని పుతిన్ తన చర్యలను సమర్ధించుకున్నారు. (చదవండి: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగిన రష్యా) -
తడబాటు తప్పదేమో..!
ముంబై: ఈ వారంలోనూ స్టాక్ మార్కెట్‌కు తడబాటు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్ తీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయని వారంటున్నారు. అలాగే వచ్చే బడ్జెట్లో ప్రయోజనాలపై అంచనాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం (26న) మార్కెట్‌కు సెలవు దినం కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. జనవరి ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు గురువారం ముగియనుంది. ఈ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఒడిదుడుకుల ట్రేడింగ్ తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో గతవారంలో సూచీలు మూడున్నర శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. వారం మొత్తంగా సెన్సెక్స్ 2,186 పాయింట్లు, నిఫ్టీ 639 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(జనవరి 25న) మొదలై.., 26వ తేదిన(బుధవారం)ముగియనున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమైన వేళ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ రెండేళ్ల గరిష్టానికి, క్రూడాయిల్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడంతో ఫెడ్ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. ఇక ఈ వారంలో సుమారు 360 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇందులో అధిక భాగం బ్యాంకింగ్ రంగానికి చెందిన కంపెనీలు. -
ఉద్యోగులకు ఇచ్చినదాంట్లో అదే హైలైట్
-
AP: చాలా సంతోషంగా ఉంది: ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తామనడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హెచ్ఆర్ఏపై సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు చెప్పారన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా న్యాయం జరుగుతోందన్నారు. ఊహించని విధంగా పదవీ విరమణ వయస్సు పెంచారన్నారు. ఈ నెల 9న చేపట్టిన జేఏసీ సమావేశం వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. చదవండి: వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే? -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 1.22 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి బీమా పరిధిని కేబినెట్ ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. అలాగే 3.03 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్కరణ-ఆధారిత, ఫలిత-అనుసంధాన పవర్ డిస్కం పథకానికి కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. అలాగే దేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని నిర్ణయిందని తెలిపారు. 16 రాష్ట్రాల్లోని గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు భరత్నెట్ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) మోడ్ కింద రూ .19,041 కోట్లతో సాధ్యమయ్యే గ్యాప్ నిధులతో కేబినెట్ ఆమోదించినట్లు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు పవర్ డిస్కంల సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం డిస్కంల సామర్థ్యాన్ని పనితీరును మెరుగు పరచుకునేందుకు షరతులతో కూడిన ఆర్థిక సహాయం కొత్త పథకం కోసం 3,03,758 కోట్ల రూపాయల అంచనా వ్యయం 97,631 కోట్లు రూపాయలు కేటాయింపు ప్రభుత్వం కేంద్రం విధించిన షరతులకు అంగీకరిస్తే పెద్దఎత్తున డిస్కంలకు ఆర్థిక సహాయం భారత్ నెట్ ద్వారా 16 రాష్ట్రాల్లో ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు భారత్ నెట్‌కు రూ.19,041 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం పవర్ డిస్కమ్ సంస్కరణలు, బలోపేతానికి భారీ ఆర్థిక సహాయం డిస్కమ్‌ల సామర్థ్యం పెంపునకు షరతులతో కూడిన ఆర్థిక సాయం షరతులకు అంగీకరిస్తే డిస్కమ్‌లకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయం -
సంచలన వ్యాఖ్యలు చేసిన గడ్కరీ..
నాగ్‌పూర్: సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ధైర్యం తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వద్ద నిధులు ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో చొరవ చూపెట్టడం లేదంటూ సొంత ప్రభుత్వంపై అసమ్మతి వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన గడ్కరీ.. కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. గత ఐదేళ్లలో 17లక్షల కోట్లకు సంబంధించిన పనులను ప్రారంభించగా. ఈ సంవత్సరంలో 5లక్షల కోట్లకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించలేదన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం వద్ద నిధులు లేక కాదని, వచ్చిన సమస్యంతా నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యమే కారణమన్నారు. నిర్ణయం తీసుకునే చొరవ లోపించడంతోనే నిధులు మంజూరులో వెనుకడుగు వేస్తున్నారన్నారు. ప్రతికూల వైఖరి వల్లే సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం లేదని అన్నారు. ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్ల వ్యవస్థ గురించి స్పందిస్తూ.. ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఐఏఎస్ అధికారులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైతే ఇక ఇక్కడ కూర్చొని ఏమి ఉపయోగం అంటూ ఎద్దేవా చేశారు. ఇక తమకు నైపుణ్యమున్న రంగాలవైపే ప్రజలు దృష్టి పెట్టాలని గడ్కరీ సూచించారు. చదవండి: గడ్కరీని రంగంలోకి దించడం -
న్యూ ఇయర్ నిర్ణయాలు కొనసాగాలంటే
కొత్త సంవత్సరం వస్తోందనగానే అదో సందడి, హడావుడి, రంగురంగుల సంబరం. ఆ రోజు వరకు ఉన్న పాత అలవాట్లను విడిచి, కొత్త అలవాట్లతో సరికొత్త జీవితాన్ని అందంగా, ఆనందంగా ప్రారంభించాలని రాత్రికిరాత్రే ఉరుకులుపరుగుల మీద కొత్త కొత్త నిర్ణయాలు తీసేసుకుంటారు. ‘అది మానేయాలి, ఇది మానేయాలి’ అని పెద్ద పెద్ద ఒట్లు పెట్టుకుంటారు. అందరిచేతా మంచి అనిపించుకోవాలనుకుంటారు. ఎక్కువగా తీసుకునే నిర్ణయాలు వ్యాయామం చేయటం, బరువు తగ్గాలనుకోవటం, పద్ధతిగా ఉండాలనుకోవటం, కొత్త నైపుణ్యాలు సాధించాలనుకోవటం, ఆనందంగా ఉండాలనుకోవటం, తక్కువ డబ్బు ఖర్చు చేసి ఎక్కువ దాచాలనుకోవటం, ధూమపానం విడిచిపెట్టాలనుకోటం, కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపాలనుకోవటం, ప్రయాణాలు చేయాలనుకోవటం, పుస్తకాలు చదవాలనుకోవటం. జర్నల్ ఆఫ్ క్లినికల్ సైకాలజీ స్టడీ ప్రకారం ‘ఈ నిర్ణయాలు తీసుకున్నవారిలో కేవలం 46 శాతం మంది మాత్రమే వాటిని అమలుపరుస్తున్నారు’ అని తెలుస్తోంది. ఆ రోజు నిర్ణయాలు తీసుకోకపోయినా, ఆ తరవాత.. ఏదో ఒకటి సాధించాలని కొందరు అనుకుంటున్నారట. అలా అనుకున్నవారిలో నాలుగు శాతం మంది మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారట. ఆచరించటానికి పాటించాల్సినవి.. నిర్ణయాలు తీసుకుని, వాటిని ఆచరణలో ఉంచుకోవటానికి కొన్ని మార్గాలు ఉన్నాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ►తప్పనిసరిగా మారాలని మనసును సిద్ధం చేసుకోవాలి. గత సంవత్సరం ఏయే అంశాలను పాటించలేదు? ఎందుకు సాధించలేకపోయాను? అని ఎవరికివారు ప్రశ్నించుకుని, వాటిని సరిచేసుకోవాలి. ►సాధించగలిగే లక్ష్యాలను మాత్రమే ఎంచుకోవాలి. ►తక్కువ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ►నిర్ణయాన్ని పాజిటివ్ కోణంలో తీసుకోవాలి. అంటే.. సిగరెట్ మానేయాలి అనుకోవడం కంటె, ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడం మంచిది. ►పెద్ద పెద్ద లక్ష్యాలను బ్రేక్ చేసి చిన్న చిన్న లక్ష్యాలుగా సెట్ చేసుకోవాలి. ఏడాది పాటు ఒకే నిర్ణయానికి కట్టుబడకుండా, వారానికి, నెలకు చొప్పున నిర్ణయాలను నిర్దేశించుకోవాలి. వ్యవధిని తగ్గించుకుని క్రమంగా పెంచుకుంటూ పోవాలన్నమాట. ►లక్ష్యాలను ఒక బోర్డు మీద రాసుకుని, రోజూ టిక్కులు పెట్టుకోవాలి. ►తీసుకున్న నిర్ణయాలను ఇతరులతో పంచుకోవాలి. ►మొబైల్స్‌లో రిమైండర్ ఆప్స్ ఉంటాయి కనుక, అవి సమయానికి తగ్గట్టుగా గుర్తు చేసేలా సెట్ చేయాలి ►ప్రతిరోజూ ఎంతవరకు పాటించామో చూసుకోవాలి. ►నిర్ణయాలు తీసుకున్న వారం తరవాత కూడా ఆచరణలో పెట్టకపోతే, వెంటనే ఆచరణ ప్రారంభించాలి. ఈ చిన్న చిన్న సూచనలను పాటిస్తే, మనం తీసుకున్న నిర్ణయాలను సంపూర్ణంగా ఆచరించగలుగుతాం. ఏ మాత్రం అలసత్వం వహించినా వారం గడిచేసరికల్లా కొత్త ఏడాది పాతబడిపోతుంది. దాంతో నిర్ణయాలు కూడా పాత సామాన్ల అటక మీదకు ఎక్కి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతాయి. తస్మాత్ జాగ్రత్త!!! – జయంతి -
బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అవగాహన రహిత నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఇంతటి నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదని, వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, లక్షల కోట్ల రూపాయల సంపద నష్టపోయామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక తిరోగమన విధానాలకు నిరసనగా ఏఐసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఢిల్లీలోని రాం లీలా మైదానంలో నిర్వ హించనున్న ‘భారత్ బచావో ర్యాలీ’కి రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకావాలన్నారు. కార్యక్రమ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సి.జె.శ్రీనివాస్‌లకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. -
వరుస వివాదాల్లో టీటీడీ నిర్ణయాలు
-
అఖిలపక్ష సమావేశం..కీలక నిర్ణయాలు
విజయవాడ : మాకినేని బసవపున్నయ్యభవన్‌లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె.పార్థసారధి (వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిథి), చలసాని శ్రీనివాస్(ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్), పి.మధు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి), కె.రామకృష్ణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు పార్లమెంటు విలువలను తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ చేస్తోన్న దొంగ దీక్షలకు నిరసనగా గురువారం ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష. ఢిల్లీలో ఆమరణదీక్ష చేస్తున్న ఎంపీలకు సంఘీభావం. 16వ తేదీన బ్లాక్‌డేగా పాటించాలని నిర్ణయం. రాత్రి సమయంలో ప్రజలు ఇళ్లలో కరెంటు ఆపి నిరసన తెలియజేయాలని విన్నపం. 17వ తేదీన ప్రజా బ్యాలెట్ ద్వారా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం. 20న రాజమహేంద్రవరంలో ప్రత్యేక హోదా విభజన హమీల సాధనకై బహిరంగ సభ. కర్ణాటక ఎన్నికలలో బీజేపీని ఓడించాలని తెలుగువారికి పిలుపు. -
సంతోషం, సుభిక్షం.. అన్నీ మాయమైపోతాయి!
నేను బావుంటే సరిపోదు. నా ఒక్క ఇంట్లో సంతోషం ఉంటే సరిపోదు. నా ఇల్లు మాత్రమే సుభిక్షంగా ఉంటే సరిపోదు. ఏ?! ఉంటే తప్పేంటి!!? ఉండదుగా! నువ్వు కావాలన్నా ఉండదు. చెడు అన్న కారుమబ్బులు నీ ఇంటిని కమ్మేస్తాయి. చెడు అలలు ఎగిరిపడుతున్న సముద్రం మధ్యలో నీ దీవి ఒక ఎండమావి. సమాజాన్ని పీడిస్తున్న చెడు మన ఇంట్లోకి కూడా పాక్కుంటూ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు కోరుకున్న సంతోషం, సుభిక్షం.. అన్నీ.. మాయమైపోతాయి. మరేం చెయ్యాలి? నువ్వు వికసించాలి. నువ్వు మంచితనానికి నిర్వచనం కావాలి. నువ్వు మంచికి ఉదాహరణ కావాలి. మంచిది. కొత్త సంవత్సరంలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం పెద్ద పదవి పొందాలని, ఈ సంవత్సరం డబ్బు బాగా సంపాదించాలని, ఈ సంవత్సరం స్మోకింగ్ మానేయాలని, ఈ సంవత్సరం కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని, ఈ సంవత్సరం ఎక్కువ ప్రయాణాలు చేయాలని, ఈ సంవత్సరం యోగా చేసి బాడీని ఫిట్‌గా ఉంచుకోవాలని... ఒక్కో మనిషిది ఒక్కో నిర్ణయం. అమెరికాలో ప్రతి ఒక్కరూ 2018 కొత్త సంవత్సరానికి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? ‘రాబోయే సంవత్సరంలో నేనొక మంచి వ్యక్తిగా ఉండాలి’– అని. గతంలో అమెరికన్లు ఎక్కువమంది కొత్త సంవత్సర తీర్మానంగా ‘ఈ ఏడు బరువు తగ్గాలనుకుంటున్నాను’ అని చెప్పేవారు. అలాంటివారు ‘మంచి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను’ అని చెబుతున్నారంటే ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచమంతా మనుషులు మానవధర్మాన్ని విస్మరించే స్థితిలో పడ్డారా అనిపిస్తోంది. అసలు మనిషంటేనే మంచిగా ఉండేవాడు అని అర్థం. మరితన ధర్మాన్ని తాను గుర్తు తెచ్చుకుని కొత్త సంవత్సర నిర్ణయంగా తీసుకునేంత దురవస్థలో మనిషి ఎందుకు పడ్డాడు? అంటే ఈ కాలానికి ఇది అవసరమైన నిర్ణయం అన్నమాట. ఈ సంవత్సరం మన దేశంలో కూడా మంచి వ్యక్తిగా ఉండాలన్న నిర్ణయాన్ని ఎక్కువమంది తీసుకునేలా ప్రచారం జరిగిందనుకుందాం. కాని ఈ మంచి వ్యక్తిగా ఉండటం అంటే ఏమిటి? యూఎస్ఏ టుడేలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా కొన్ని ఆలోచనలు.... పొరుగువారిని ప్రేమిస్తున్నామా? ఇరుగు పొరుగు వారు ఎవరు? అని తెలుసుకోవడం ఇవాళ అతి పెద్ద మంచిగా అవతరించింది. గతంలో ఇరుగు పొరుగువారిని మన ప్రమేయం లేకుండానే తెలుసుకునేవాళ్లం. వాళ్ల ఇళ్లల్లో జరిగే మంచి చెడు మన ప్రమేయం లేకుండానే మనకు తెలిసేది. వాటిలో పాల్గొనడం మన జీవితంలో భాగం అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు డోర్లు మూత పడ్డాయి. మన డోర్ మనం మూసుకున్నాం. పొరుగువారు వారి తలుపులు వారు మూసుకున్నారు. కామన్‌వాల్స్ ఉన్నా సరే అన్‌కామన్ బిహేవియన్ ప్రదర్శిస్తున్నాం. సాటివారిని మనవారని అనుకునే మంచితనం మనలో లేకపోతే మనల్ని సాటివారు మనవారని అనుకోరు. వారికి మంచితనం లేక మనలో మంచితనం లేకపోతే మనం నివసించే గ్రామం, గల్లీ, వీధి, కాంప్లెక్స్, అపార్ట్మెంట్, ఇలాఖా, బస్తీ మంచిది లేనిది అవుతుంది. మంచితనం లేని సమాజం అక్కడే మొదలవుతుంది. దయతో కరుణతో ఉంటున్నామా? దయతో కరుణతో ఉండాలి. ఉన్నాం కదా అనుకుంటాం చాలామంది. దయతో కరుణతో ఉండాల్సింది కేవలం మన కుటుంబంతో కాదు. కేవలం మన స్నేహితులతో కాదు. కేవలం మనం ఇష్టపడేవారిని కాదు. అడ్రస్ కోసం వెతుక్కుంటున్న ఒక అపరిచితుడితో ఉండాలి. పర్స్ పోగొట్టుకుని సొంత ఊరికి చేరుకోలేని దురవస్థలో ఉన్న ఒక ప్రయాణికుడితో ఉండాలి. వైద్యం కోసం అగచాట్లు పడుతున్న ఒక రోగితో ఉండాలి. ఒక వీధి కుక్కతో, నీళ్లు లేక ఎండుతున్న పేవ్మెంట్ మొక్కతో, ఆకలితో అలమటించే బిచ్చగాడితో, మన సంతానం పొందిన మంచి స్కూలు, బట్టలు, సౌకర్యాలు పొందలేకపోతున్న మన బంధువుల అబ్బాయితో దయతో కరుణతో ఉండాలి. ఒక టీచర్ తన కుమారుడితో మంచిగా ఉండి తన స్టూడెంట్స్ దగ్గర దుర్మార్గంగా ఉంటే ఆ టీచర్ మంచి వ్యక్తి కాదు. ఒక డాక్టర్ తన సోదరుడితో మంచిగా ఉండి తన పేషెంట్‌తో మోసకారిగా ఉంటే అతడు మంచి వ్యక్తి కాదు. ఒక కాంట్రాక్టర్ తన ఇంటిని దృఢంగా కట్టుకుని ఒక నిర్మాణాన్ని నాసిగా చేస్తే అతడు మంచి వ్యక్తి కాదు. ఒక నాయకుడు ఇంట్లో నిజాలు మాట్లాడుతూ ప్రజలతో అబద్ధాలు చెబుతుంటే అతడు మంచి వ్యక్తి కాదు. ఒక రచయిత మంచి విషయాలను రాయడానికే పరిమితం చేసి తాను కపటిగా ఉంటే అతడు మంచి వ్యక్తి కాదు. చాలాసార్లు మంచి మన చేతుల్లోనే ఉంటుంది. మంచిగా ఉండాలా లేదా అనేది మనమే నిర్ణయించుకోవచ్చు. తలుచుకుంటే మంచిగా ఉండొచ్చు కూడా. కన్వినియంట్‌గా ఆ సంగతి మర్చిపోతున్నాం. అందుకే నూతన సంవత్సరం సందర్భంగా మంచిగా ఉండాలి అని నిర్ణయం తీసుకునేవరకూ వచ్చాం. బాధితుల పక్షం వహించామా? చాలామంది ఏమనుకుంటారంటే పాప భీతి ఉంటే మంచిగా ఉంటాం అని. అంటే దేవుడు శిక్షిస్తాడు కనుక మంచిగా ఉండాలి అనుకోవడం. దేవుని పట్ల మన ప్రేమ, భక్తి ఎలా ఉన్నా మంచిగా ఉండటం అనేది మన విధి. మన మంచిని విశాలం చేసుకోవాలనుకోవడం కూడా మన విధి. ఇతర మతాల వారితో మంచిగా ఉండటం, ఇతర వర్గాలతో మంచిగా ఉండటం, ఇతర పక్షాలతో మంచిగా ఉండాలి అని అనుకోవాలి. కాని మనం మంచిగా ఉండటానికి కొన్ని సామాజిక ఒత్తిడులు, తీర్పులు కూడా అడ్డు పడుతూ ఉంటాయి. స్త్రీలు, పురుషులతో మంచిగా ఉండే మనం థర్డ్ జండర్‌తో, లెస్బియన్లతో, హోమో సెక్సువల్స్తో మంచిగా ఎందుకు ఉండం అని ఎప్పుడైనా ఆలోచించామా? సింగిల్ ఉమన్‌తో, రేప్ విక్టిమ్స్‌తో, విడాకులు తీసుకున్నవారితో, పెళ్లి చేసుకోకూడదు అని నిశ్చయించుకున్నవారితో, సంతానం వద్దనుకున్నవారితో, బలవంతంగా వేశ్యావృత్తిలో దిగినవారితో మనం ఉండవలసినంత మంచిగా ఉంటున్నామా? కోల్పోయింది మన కుటుంబంలోని వ్యక్తి అయినా సరే ఉరిశిక్ష తప్పు అనేంత మంచిని మనం పెంచుకున్నామా? పగలు పర్సనల్ స్థాయిని దాటి ఎదుటి వ్యక్తి కులం, మతం, జాతి, దేశాన్ని కూడా ద్వేషించేంత చెడు మనలో ఎందుకు పేరుకుపోయిందో మనం ఆలోచించామా? ఎదుటివారి ఆకారాలను, భాషను, యాసను, ఆహారపు అలవాట్లను మంచిగా చూసేంత మంచి మనలో ఉందా? మంచిగా ఉండటం అంటే మరింత విశాలంగా ఉండటమే. తక్కువ మంచి ఎక్కువ మంచి లాభం కోసం కల్తీ చేయడం కన్నా ధర ఎక్కువ పెట్టడం మెరుగైన మంచి అవుతుంది. జీవిక కోసం తప్పుడు కేసు వాదించడం కన్నా న్యాయమున్న కేసులు రెండు ఎక్కువ వాదించడం మెరుగైన మంచి అవుతుంది. పది వాగ్దానాలు చేసి నిలబెట్టుకోకపోవడం కన్నా ఒక్క వాగ్దానం చేసి పూర్తి చేయడం మెరుగైన మంచి అవుతుంది. చాలాసార్లు మేలు చేయకపోయినా కనీసం కీడు తలపెట్టకపోవడమే మంచి అవుతుంది. అయితే చాలామంది మనస్తత్వ నిపుణులు ఏమంటారంటే అన్ని వేళలా మంచిగా ఉండటం రుషులకు కూడా సాధ్యం కాదు. సర్దుబాట్లు ఉంటాయి. చిన్న చిన్న లోపాలు, వెలుతులు, స్వార్థాలు ఉంటాయి. తుఫానులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఐదుమంది ఉన్న వైపు వెళ్లాలా ఒక్కరు ఉన్నవైపు వెళ్లాలా అనే విషయంలో సాపేక్ష మంచి ఉంది. అయినా సరే ఎక్కువ మంచి వైపే మనం మొగ్గు చూపాల్సి ఉంటుంది. నిపుణులు ఏమంటారంటే మనిషి సహజంగానే జన్మతః మంచితనంతో పుడతాడని. మనం చేయవలసిందల్లా ఆ మంచితనాన్ని వెతికి, కలుగులో దాక్కుని లోయలో జారిపోయి ఉన్న ఆ మొగ్గని బయటకు తీసి, నీరు స్ప్రే చేసి వికసింప చేయడమే. 2018 మనందరిలో అందుకు నాంది పలుకుతుందని ఆశిద్దాం. అమెరికాలో పబ్లిక్ సర్వేలు చేసే ‘మేరిస్ ఇనిస్టిట్యూట్ సంస్థ’ ఒక సర్వేను చేసి ఈ సంవత్సరం అమెరికాలో ఎక్కువ మంది ‘ఈ సంవత్సరం మంచి వ్యక్తిగా మసులుకోవాలనుకుంటున్నాను’ అనే కొత్త సంవత్సర తీర్మానం తీసుకున్నట్టు ప్రకటించింది. ఇదే విషయాన్ని ‘యుఎస్ఏ టుడే’ పత్రిక ప్రస్తావించి ముఖ్య వార్తగా ప్రచురించింది కూడా. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నేను చాలా మారిపోయా!
కొత్త ఏడాది వచ్చేస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకునేవాళ్లు తీసుకుంటున్నారు. 2016 ఎలా గడిచింది అని విశ్లేషించుకునే పని మీద కొంతమంది ఉన్నారు. శ్రుతీహాసన్ కూడా ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఓసారి ఆలోచించుకున్నారు. ఆ మార్పుల గురించి శ్రుతి చెబుతూ – ‘‘వ్యక్తిగా నేను చాలా మారాను. స్వీయ అవగాహన చేసుకోవడానికి ఈ ఏడాది ఎక్కువ టైమ్ కేటాయించాను. ఇంతకుముందు కొన్ని చేయడానికి సంశయించేదాన్ని. అది మంచిదైనా ఎందుకో వెనకడుగు వేసేదాన్ని. కానీ, ఇకనుంచి ముందడుగు వేస్తాను. నా ఇష్టాయిష్టాల పరంగా కూడా నేనో నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చేశా. ‘ఇది మనకు నచ్చదు’ అని ఓ విషయం గురించి అనుకుంటే ఇక ఎప్పటికీ నచ్చదు. నచ్చినది ఎప్పటికీ నచ్చుతుంది. అంత బలమైన అభిప్రా యాలను కలగజేసిన సంవత్సరం ఇది. వయసు, అనుభవం వ్యక్తుల్లో పరిణతి తెస్తాయంటారు. 30 ఏళ్లొచ్చేశాయ్ కదా.. నాలోనూ పరిణతి వచ్చింది’’ అన్నారు. -
జనం మెచ్చేలా 'కృష్ణా' వ్యూహం
► బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు ప్రభావంపై అధ్యయనానికి కేబినెట్ నిర్ణయం ► హరీశ్‌రావు నేతృత్వంలో ఉప సంఘం ఏర్పాటు ► నెల రోజుల్లో ఆరోగ్యశ్రీ, ఫీజు, రుణమాఫీ బకాయిల చెల్లింపు ► మహిళా ఉద్యోగులకు 90 రోజుల చైల్డ్‌కేర్ లీవ్ ► స్కూల్ అసిస్టెంట్లుగా పీఈటీలు, భాషా పండితులు ► 6 కొత్త జిల్లాల పేర్లకు జిల్లా కేంద్రాల పేర్లు జోడింపు ► ఏపీకి అప్పగించిన భవనాలను తిరిగివ్వాలని కోరుతూ తీర్మానం.. గవర్నర్‌కు అభ్యర్థన సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ప్రభావాన్ని అధ్యయనం చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందుకోసం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా, కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ట్రిబ్యునల్ తీర్పుతో ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తెలంగాణపై ప్రభావం, ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అనుసరించాల్సిన విధానాన్ని అధ్యయనం చేసే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించారు. ఏపీ వైఖరితో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చేలా మన వ్యూహం ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సబ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో ప్రధానంగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు, కొత్త సచివాలయం నిర్మాణం, మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవ్, భాషా పండితులు, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడ్, మిషన్ భగీరథ, కొత్త జిల్లాల పేర్లు, యూనివర్సిటీ విద్య, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ బకాయిలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. ఆ భవనాలు అప్పగించాలి రాష్ట్రంలో కొత్త సచివాలయం నిర్మాణం దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏపీకి కేటాయించిన అసెంబ్లీ, కౌన్సిల్, సెక్రటేరియట్ భవనాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని కోరుతూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8కు సంబంధించిన అంశం కావటంతో ఈ అభ్యర్థనను గవర్నర్‌కు పంపించనుంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడంతో విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఏపీ ప్రభుత్వం ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించుకునే వీలుంది. కానీ ఏపీ ప్రభుత్వం తమ రాజధాని అమరావతికి కార్యాలయాలను తరలించింది. దాంతో హైదరాబాద్‌లోని ఏపీ సీఎం కార్యాలయంతో పాటు మంత్రులు, శాఖాధిపతుల కార్యాలయాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అవసరాలకు వినియోగించుకునేందుకు వాటన్నింటినీ అప్పగించాలని గవర్నర్‌ను అభ్యర్థిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ప్రత్యామ్నాయంగా ఏపీ కార్యాలయాలు, పరిపాలనా వ్యవహారాల కోసం హైదరాబాద్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణమున్న భవనాలు సరిపోతాయని అంచనా వేశారు. నాంపల్లిలోని గృహకల్ప, మనోరంజన్ భవన్‌ను ఏపీకి అప్పగించాలనే యోచన ఉంది. పలు అంశాలపై సబ్ కమిటీలు.. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు పునర్ వైభవం తీసుకురావాలని, ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించే చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ పరిపాలన, ప్రవేశాలు, విద్యా విషయక అంశాలు, ఆర్థిక వ్యవహారాలపై దృష్టి సారించనుంది. అన్ని యూనివర్సిటీలకు ఏకరూప విధానాన్ని అమలుచేసే అంశంపై అధ్యయనం చేసేందుకు డిప్యూటీ సీఎం కడియం ఆధ్యర్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ సభ్యులుగా ఉంటారు. ఇక ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులన్నీ జలకళ సంతరించుకుని.. చేపల పెంపకానికి అనుకూలంగా మారాయి. దీంతో ఇప్పటికే రూ.45 కోట్ల విలువైన చేప విత్తనాన్ని ప్రభుత్వం సరఫరా చేసింది. ఎన్సీడీసీ నిధులతో గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు చేపలు, గొర్రెలు, మేకల పెంపకానికి అనుసరించాల్సిన చర్యలను అధ్యయనం చేసి, సిఫారసులు చేసేందుకు మంత్రి తలసాని ఆధ్వర్యంలో మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్ సభ్యులుగా సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీపైనా సబ్ కమిటీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిర్వహించే శస్త్రచికిత్సలు, ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేయటం లేదని, ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నాయని వస్తున్న ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆపరేషన్లకు నిర్ణయించిన ప్యాకేజీ సొమ్మును సవరించాలని.. లేదా నిర్ణయించిన ఫీజులకు శస్త్రచిక్సితలు చేసే ఆస్పత్రులకే ఆరోగ్యశ్రీ అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై పరిశీలన జరిపేందుకు మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవ్ మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు కేబినెట్ శుభవార్త ప్రకటించింది. వారికి 90 రోజుల సీసీఎల్ (చైల్డ్‌కేర్) సెలవులు ఇవ్వాలని తీర్మానించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రసూతి సెలవులతో పాటు కేంద్ర ప్రభుత్వం తరహాలో ఈ చైల్డ్‌కేర్ సెలవులు ఇస్తారు. తమ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎప్పుడైనా ఈ 90 రోజుల సెలవులు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఒక్కోసారి గరిష్టంగా 15 రోజులకు మించకుండా.. మొత్తంగా ఆరు దఫాలుగా మాత్రమే ఈ సెలవులను వాడుకునే వీలుంటుంది. స్కూల్ అసిస్టెంట్లుగా పీఈటీలు, భాషా పండితులు విద్యాశాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వారిని స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా చూడాలని ఆయా సంఘాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 3,534 పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో 2,487 భాషా పండిత పోస్టులు, 1,047 పీఈటీ పోస్టులున్నాయి. ఇకపై భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, పీఈటీలను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌గా పరిగణించనుంది. నెల రోజుల్లో బకాయిల చెల్లింపు రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదాయ వృద్ధికి తోడు ఎఫ్ఆర్బీఎం పరిమితి పెరిగినందున వాటిని చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని, విమర్శలకు తావివ్వకూడదని ముఖ్యమంత్రి సూచించారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,060 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలున్నాయి. అందులో ఇప్పటివరకు రూ.1,090 కోట్లు చెల్లించగా.. మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంది. ఇక మూడో విడత రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.2,020 కోట్లు విడుదల చేయగా.. మరో రూ.2,020 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెల రోజుల్లో వీటన్నింటినీ చెల్లించాలని సీఎస్‌కు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది నాలుగో విడత రుణమాఫీని ఏకమొత్తంలో ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల పేర్లపై స్పష్టత కొత్తగా ఏర్పాటైన కొమురం భీం, యాదాద్రి, భద్రాద్రి, జోగులాంబ, రాజన్న, జయశంకర్ జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ జిల్లాల పేర్లలో జిల్లా కేంద్రాల పేర్లు కూడా చేర్చింది. ఇకపై కొమురం భీం ఆసిఫాబాద్, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలుగా పిలిచే సవరణకు ఆమోదం తెలిపింది. ఆయా జిల్లాల ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. -
పదివేల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
విజయవాడ: రాష్ట్రంలో పదివేల ఖాళీలను భర్తి చేసేందుకు బుధవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో గ్రూప్ 1 ద్వారా 94, గ్రూప్ 2లో 750 పోస్టులు, గ్రూప్ 3 కేటగిరీలో 1000 పోస్టులు భర్తి చేయానున్నారు. అలాగే పోలీసు శాఖలో 6 వేల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తసుకుంది. ఇకపోతే టెక్నిషియన్స్ 1000, వైద్య ఆరోగ్య శాఖలో 422, వివిధ శాఖల్లోని 732 ఇతర పోస్టులు భర్తీకీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై రెండు విడతలుగా సర్వే చేపట్టాలని.. తొలి విడతగా జూన్ 20 నుంచి 30 తేదీ వరకు, రెండో విడతలో జులై 5 నుంచి 30 వరకు సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ శాఖకు చెందిన 'ఉదయ్' పథకం అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ రెండేళ్ల పాలనపై జూన్ 8న ఒంగోలులో సంకల్ప సభ నిర్వహించాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
దశల వారీగా 20 వేల ఉద్యోగాలు భర్తీ
విజయవాడ : దశల వారీగా 20 వేల ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ కేబినేట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన కేబినేట్ సమావేశం శనివారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏపీలో రిజస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు నకిలీ రిజిస్ట్రేషన్ల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కేబినేట్ సమావేశంలో నిర్ణయించారు. జాతీయ విద్యాసంస్థలకు భూములు కేటాయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం, తాడేపల్లిగూడెం, వైజాగ్‌లలో భూములు కేటాయించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం వెబ్ సైట్ ఏర్పాటుతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని వేగవంతం చేసి డిపాజిటర్లకు న్యాయం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్రానికి లేఖలు రాయించాలని నిర్ణయించింది. ఇక ఉచిత ఇసుక విధానంపై జీవో జారీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో చంద్రబాబు జిల్లా పర్యటనలు నిర్వహించనున్నారు. ఒక్కో జిల్లాలో రెండు నుంచి మూడు రోజులు పర్యటించి స్థానిక అధికారులు, నేతలతో సమావేశం కానున్నారు. -
‘షార్టు’గానే కానిచ్చారు!
అనంతపురం సెంట్రల్ : మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, పామాయిల్, కందిపప్పు సరఫరా చేయడానికి నిర్వహించిన టెండర్లలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. షార్ట్ టెండర్ల ముసుగులో రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు మాత్రమే అవకాశం కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.కోట్లు విలువజేసే నిత్యావసర వస్తువుల సరఫరాకు రూ.లక్షల్లో బ్యాంకు పూచీకత్తు ఉండాలనే నిబంధనతో చిన్న వ్యాపారుల ఆశలపై గండి పడింది. ఫలితంగా టెండర్లలో తక్కువ మంది మాత్రమే పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే... ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 17 ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు పామాయిల్, కందిబేడలు సరఫరాకు ఈ నెల 16న, కోడిగుడ్ల సరఫరాకు ఈనెల 17న టెండర్ ప్రకటన విడుదల చేశారు. పామాయిల్, కందిబేడల సరఫరాకు సంబంధించి షెడ్యూళ్లు దాఖలు చేయడానికి బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం సమక్షంలో టెండర్లు ఖరారు చేయనున్నారు. కోడిగుడ్ల సరఫరాకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకూ దరఖాస్తులు విక్రయిస్తారు. మూడు గంటలలోగా షెడ్యూళ్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. అయితే.. టెండర్లలో పాల్గొనేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. గడువు మాత్రం ఒకరోజే ఇచ్చారు. ముఖ్యంగా పామాయిల్ సరఫరా చేసే కాంట్రాక్టరు రూ.10 లక్షలు, కందిబేడలు సరఫరా చేసే కాంట్రాక్టరు రూ.20 లక్షలు బ్యాంకు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో సరఫరా చేసిన అనుభవం, వాహన సౌకర్యాలు తప్పనిసరి. ఇలాంటి ఆరు ఆరు రకాల నిబంధనలు పెట్టారు. వీటిలో పేర్కొన్న అంశాలన్నీ సరి చూసుకోవడానికి చిన్న కాంట్రాక్టర్లకైతే కనీసం వారం పడుతుంది. అయితే.. ఐసీడీఎస్ అధికారులు మాత్రం బడా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చేలా ఒకరోజు మాత్రమే అవకాశమిచ్చారు. పామాయిల్ సరఫరాకు 10 దరఖాస్తులు మాత్రమే అమ్ముడుపోయాయి. అందులోనూ ఆరుగురు దరఖాస్తుదారులు మాత్రమే షెడ్యూళ్లు దాఖలు చేశారు. కందిబేడల సరఫరాకు 11 దరఖాస్తులు అమ్ముడుపోగా..ఆరు దాఖలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఐసీడీఎస్ అధికారులు నిర్వహించిన షార్ట్ టెండర్ ప్రభావం చిన్న కాంట్రాక్టర్లపై ఏ విధంగా పడిందో అర్థమవుతోంది. ఎక్కువ మంది బ్యాంకు పూచీకత్తు చూపించలేమనే భావనతో తప్పుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గురువారం టెండర్ ప్రారంభం సమయంలో మరెంత మంది తప్పుకుంటారో వేచి చూడాలి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ... భారీ బందోబస్తు ఐసీడీఎస్ టెండర్లు ైరె ల్వే టెండర్లను తలపించాయి. గతంలో కనీసం ఒక కానిస్టేబుల్ లేకుండానే టెండర్లు నిర్వహించే అధికారులు.. ఈ ఏడాది మాత్రంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. బుధవారం ‘సాక్షి’లో ‘ఐసీడీఎస్ టెండర్లలో దౌర్జన్యకాండ’ శీర్షికన వెలువడిన కథనం ద్వారా ముఖ్యప్రజాప్రతినిధి అనుచరులు చేపడుతున్న బరితె గింపు కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. ఈ కథనంతో ఐసీడీఎస్ అధికారులే కాకుండా జిల్లా కలెక్టర్ శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అప్రమత్తమయ్యారు. బుధవారం అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ ఆధ్వర్యంలో ఒక సీఐ, ఎస్ఐ, పోలీసు సిబ్బంది, స్పెషల్‌పార్టీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వయాన జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం ఐసీడీఎస్ కార్యాలయానికి వచ్చి టెండర్ల నిర్వహణను పరిశీలించారు. అనంతపురం ఆర్డీఓ ఉస్సేన్‌సాహెబ్, తహశీల్దార్ షేక్ మహబూబ్‌బాషాలను అక్కడే ఉండాల్సిందిగా ఆదేశించారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటల వరకూ కార్యాలయంలోనే ఉన్నారు. ఐసీడీఎస్‌లోని కొందరి అధికారుల తీరుపై విమర్శలు రావడంతో ప్రాజెక్టు డెరైక్టర్ జుబేదాబేగం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి వరకూ సెక్షన్లో పనిచేసిన అధికారులను తప్పించి వివిధ ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్వైజర్లు, సమగ్ర బాలల పరిరక్షణ సమితి(ఐసీపీఎస్) అధికారులను టెండర్ల ప్రక్రియలో పాలుపంచుకునేలా ఆదేశించారు. ఫలితంగా బుధవారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దరఖాస్తులు స్వీకరణ ముగిసింది. 18 ఏఎన్జీ 22 బి: మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ముందు పోలీసు బందోబస్తు 18 ఏఎన్జీ 22 డి : ఐసీడీఎస్ టెండర్ల నిర్వహణపై అధికారులకు సూచనలిస్తున్న జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం -
మా బుజ్జిగాడూ... దేవుడు మెచ్చే నా అబద్ధాలు!!
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు. రాజకీయరంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో వివాదాలు. తీర్థయాత్రలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి వారినుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బాధ్యతల సమర్థవంత నిర్వహణకు ప్రశంసలు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం చివరిలో ఆస్తి వివాదాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. పనులు శ్రమానంతరం పూర్తి. ఇరుగు పొరుగుతో సఖ్యత. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులు బాధ్యతలపై మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. వారం వాహనయోగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల సర్దుబాటు. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు. ఇంటాబయటా అనుకూలం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. మిత్రులు, బంధువులతో వివాదాలు తీరతాయి. సేవలకు తగిన గుర్తింపు. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. వ్యయప్రయాసలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు ప్రారంభిస్తారు. గౌరవమర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాల పరిష్కారం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువులతో వివాదాలు తీరతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనుల్లో జాప్యం. బంధువులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. నిర్ణయాలలో తొందరవద్దు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో స్వల్ప ధనలాభం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) బంధువుల నుంచి శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు. -
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
-
‘మెట్రో’ భద్రతకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్
సాక్షి,సిటీబ్యూరో: నగర మెట్రో ప్రాజె క్టు, స్టేషన్లు, ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఏర్పాటుతో పా టు అదనపు సిబ్బందిని కేటాయిం చేం దుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూత్రప్రాయంగా అంగీకరించారు. బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ‘మెట్రో’ ప్ర యాణికుల భద్రతపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీ, బెంగళూరు నగరాలకు భిన్నంగా నగర మెట్రో రైళ్లలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అత్యాధునిక ప్రమాణాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో బ్యాగేజి స్కా నింగ్, సీసీటీవీలు, సెక్యూరిటీ అలారంలను ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ విషయంపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెట్రో స్టేషన్ల సమీపంలోని పార్కింగ్ కేంద్రాలు, వయాడక్ట్, ట్రాక్, డిపోల్లోనూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయనున్నామన్నారు. ఉగ్రపంజా నేపథ్యంలో.. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ, కౌంటర్ టైజం నిపుణుల పర్యవేక్షణలో నగర మెట్రో స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. సమగ్ర భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విషయంలో త్వరలో స్పష్టత రానుందన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ సందీప్ శాండిల్య, అంజనీ కుమార్, గంగాధర్, ఎల్అండ్ టీ ప్రాజెక్టు డెరైక్టర్ ఎంపీ నాయుడు, అనిల్‌కుమార్ సైనీ పాల్గొన్నారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
బాధితులకు తక్షణ న్యాయం కేసుల పరిష్కారంలో వేగం నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ విజయ్‌కుమార్ కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జి.విజయ్ కుమార్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ జిల్లాలోని ఇతర అధికారులతో కలిసి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని చెప్పారు. అలాంటి వారికి సిబ్బంది వత్తాసు పలికినా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి పోలీసుల సహకారం ఉన్నట్లు తెలిసినా శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయం కోసం స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. విధుల పట్ల అంకితభావం, బాధితులకు న్యాయం చేయటంలో చిత్తశుద్ధి చూపించాలని సూచించారు. నేరాలు జరిగిన తరువాత చర్యలు తీసుకోవడం కంటే నేరాలను అదుపు చేసేలా సిబ్బంది విధులను నిర్వర్తించాలన్నారు. స్టేషన్లలో పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీసులకు అందే ప్రతి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కట్టాలని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా ధైర్యంగా తనను కలిసి వివరించవచ్చునని చెప్పారు. సివిల్ పంచాయితీల విషయంలో పోలీసులు స్టేషన్లలో పంచాయితీలు పెట్టినట్లు తన దృష్టికి వస్తే తన నిర్ణయాలు కఠినంగా ఉంటాయన్నారు. జిల్లాలో జరిగే పేకాట, కోడిపందేలాపై ప్రత్యేక నిఘా ఉంచి వాటిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ బి.డి.వి. సాగర్, బందరు, గుడివాడ, నూజివీడు, నందిగామ డీఎస్పీలు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు, బదిలీలు
డివిజన్లు దాటుతుండడంపై పలువురి అభ్యంతరం నేతల ఒత్తిడితోనే ఉత్తర్వులు జారీ? కీలకపాత్ర పోషిస్తున్న జెడ్పీ క్యాంపు కార్యాలయం కోటరీ జిల్లా పరిషత్ : జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువుదీరిన తర్వాత తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గీసుకొండ ఎంపీడీఓ పారిజాతంను డిప్యూటేషన్‌పై దుగ్గొండి మండలానికి, మహబూబాబాద్ డివిజన్లోని కేసముద్రం ఎంపీడీఓకు వరంగల్ డివిజన్లోని ఆత్మకూరు మండల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించండం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ మండలాల్లోని ఎంపీడీఓలను మార్చాలని ఇటీవల జెడ్పీ చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. బదిలీలపై ఆంక్షలు ఉండడంతో అలా చేయడం వీలుకాదని జెడ్పీ అధికారులు సదరు ఎమ్మెల్యేలకు తెలి పారు. అయినా కొందరు ఎమ్మెల్యేలు తమ మండలంలో పాత ఎంపీడీఓలను కొనసాగించొద్దని పట్టు పట్టడంతో జెడ్పీ చైర్పర్సన్ సిఫారసు చేయాల్సి వచ్చిందని సమాచారం. కాగా, గీసుకొండ ఎంపీడీఓ పారిజాతంను తన నియోజకవర్గంలో పనిచేయకుండా సెలవుపై వెళ్లాలని పరకాల ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. పాత ఎమ్మెల్యేలకు సహకరిస్తున్నట్లు పార్టీ శ్రేణులు ఇచ్చిన సమాచారంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో ఆమె స్వయంగా మొగుళ్లపల్లి, దుగ్గొండి మండలాలకు బదిలీ చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ను కోరగా.. బదిలీలపై నిషేధం ఉన్న దృష్ట్యా డిప్యూటేషన్‌పై దుగ్గొండి మండలంలో పోస్టింగ్ ఇచ్చా రు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలుస్తున్నా.. పారి జాతం శనివారం దుగ్గొండిలో విధుల్లో చేరారు. కాగా, ఆమె నియామకంపై నర్సంపేట ఎమ్మెల్యే విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇదేవిధంగా మరికొన్ని మండలాల్లో ఎంపీడీఓలు కొత్త నేతలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. క్యాంపులో కోటరీ? జిల్లా పరిషత్ పాలన వ్యవహారాల్లో క్యాంపు కార్యాలయం కీలకంగా మారింది. జెడ్పీలోని ఇద్దరు అధికారులు, క్యాంపు కార్యాలయంలోని ఉద్యోగితో పాటు మరో మాజీ అధికారి కోటరీగా ఏర్పడినట్లు సమాచారం. పాలనాపరమైన నిర్ణయాల ఫైళ్లు జెడ్పీలో అధికారులపరిశీలన అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నాయి. అక్కడే క్యాంపులోని సలహాలు ఇస్తున్న ఉద్యోగి కనుసన్నల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే, చైర్‌పర్సన్‌తో వ్యక్తిగతంగా మాట్లాడాలని అనుకున్న అధికారులకు కూడా.. సీసీగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి ముందు ఏమీ చెప్పలేని పరిస్థితి ఎదురవుతోంది. అంతేకాకుండా జెడ్పీలో కీలక అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారి కొద్దిరోజులుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లి మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. సదరు అధికారి సూచనలతోనే గీసుకొండ ఎంపీడీఓకు డిప్యూటేషన్, ఆత్మకూరు ఎంపీడీఓగా కేసముద్రం ఎంపీడీఓకు అదనపు బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు డివిజన్ పరిధిలోనే జరిగేవి. ఇదే విషయాన్ని సెక్షన్ అధికారులు సదరు ఉద్యోగి దృష్టికి తీసుకుపోగా.. మంగపేట ఎంపీడీఓ భారతికి పరకాల మండ లం ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తుచేసినట్లు సమాచారం. అయితే, ఆ సమయంలో మంగపేట మండలంలో ఎన్నికలు వాయిదా పడిన విషయాలన్ని ఆయన గుర్తించకపోవడం గమనార్హం. ఫైళ్లకు చలనం.. మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లకు చలనం తె చ్చే ప్రయత్నంలో క్యాంపులోని కోటరీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించి సస్పెండ్‌కు గురైన ఉద్యోగికి పోస్టింగ్ ఇచ్చేందుకు గతంలో జెడ్పీ సీఈఓలుగా పని చేసిన వారు అంగీకరించలేదు. అదే ఉద్యోగి కొత్తగా వచ్చిన చైర్‌పర్సన్‌కు దరఖాస్తు పెట్టుకోగా సానుకూలం గా స్పందించి ఆదేశాలు జారీ చేయడం చర్చనీ యాం శంగా మారింది. ఇదే కాకుండా పెండింగ్‌లో ఉన్న మరి కొన్ని పైళ్లకు మోక్షం లభించి త్వరలోనే నిర్ణయాలు వెలువడనున్నట్లు జెడ్పీలో ప్రచారం జరుగుతోంది. కాగా, జెడ్పీలో కీలకంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో పాటు క్యాంపు కార్యాలయంలోని ఉద్యోగి సహకారంతో ఈ నిర్ణయాలు జరుగుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. -
ఇలా చేస్తే... ఆల్ హ్యాపీస్..
ఆర్థిక లక్ష్యాలకు తగ్గట్టే మదుపు బోలెడంత కష్టపడితే గానీ కాస్తంత సంపాదన చేతికి రాదు. మరి మనం ఇంత కష్టపడుతుంటే.. మనం సంపాదించిన డబ్బు... అంతంత మాత్రం వడ్డీలు ఆర్జిస్తూ బ్యాంకులో దర్జాగా కూర్చుంటే ఎలా కుదురుతుంది. వేణ్నీళ్లకు చన్నీళ్లలాగా అది కూడా మరికాస్త అదనంగా రాబడి తెచ్చిపెట్టినప్పుడే కదా సంపాదించిన డబ్బుకు సార్థకత. ఇలా లెక్కలేసుకుని రకరకాల సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఎవరో చెప్పారని ఒక దాంట్లోను.. భారీగా రాబడి వస్తోందంటూ మరో దాంట్లోనూ పెట్టేసి ఒకోసారి చేతులు కాల్చుకుంటూ ఉంటాం. ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసుకుంటూంటాం. ఇలా జరగకుండా.. పెట్టే పెట్టుబడి విషయంలోనూ, ఇతర అంశాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక ప్రణాళిక పట్టాలు తప్పకుండా చూసుకోవడాన్ని వివరించేది ఈ కథనం. మొహమాటానికి పోతే... సన్నిహితులు చెప్పారనో ... బంధువులు చెప్పారనో మొహమాటానికి పోయి నిరుపయోగకరమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కునే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ బాగుందని.. ఆ కంపెనీ షేరు బ్రహ్మాండంగా పెరుగుతుందని ఎవరో చెబితే కొన్నిసార్లు ఇన్వెస్ట్ చేసేస్తుంటాం. సదరు సాధనం మనకు సరిపడదని తెలిసిన తర్వాత కూడా విధిలేని పరిస్థితుల్లో కొనసాగించేస్తుంటాం. అలాగని వారి మాట అస్సలు వినకూడదని కాదు. కానీ, ఆయా సాధనాల గురించి అస్సలు తెలుసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో మొహమాటాన్ని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి. లక్ష్యం అంటూ ఉండాలి.. పెట్టుబడులకు ఏదైనా లక్ష్యం ఉండాలి. దాన్ని బట్టే ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందనేది తెలుస్తుంది. దీన్ని బట్టే.. ఏ సాధనంలో పెట్టుబడి పెట్టాలన్నది అవగాహనకు రావచ్చు. ఉదాహరణకు వాహనం కొనుక్కోవడమో లేదా ఇల్లు కొనుక్కోవడమో.. పిల్లల చదువుల కోసమో ఇలా ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఏం చేయాలన్నది నిర్దేశించుకోకుండా.. ఏదో పేరుకి ఇన్వెస్ట్ చేస్తూ పోతే ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే ఒక లక్ష్యం అంటూ విధించుకుంటారో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి.. ఎప్పుడు వైదొలగాలి అన్నదానిపై స్పష్టత వస్తుంది. రాబడే ప్రామాణికం కాదు.. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొందరు మిగతా అంశాలను పక్కన పెట్టి కేవలం రాబడే ప్రామాణికంగా చూసుకుంటూ ఉంటారు. తమ చేతిలో డబ్బు ఉన్న సమయాన్ని బట్టి అప్పటికప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఎక్కువ ఇస్తుంది వంటివి లెక్కలేసుకుంటారు. స్టాక్ మార్కెట్లు బాగుంటే షేర్లవైపు వెళ్లిపోవడం... బంగారం మెరుగ్గా అనిపిస్తే కొనేయడం.. వడ్డీ రేట్లు బాగున్నాయని ఎఫ్డీలు చేసేయడం.. ఇలా ప్రణాళిక లేకుండా డబ్బును అందులోను, ఇందులోనూ తిప్పేస్తూ నానా హైరానా పడితే చివరకు చేతికి వచ్చేదేమీ ఉండదు. చాలా మంది ఇన్వెస్టర్లలో ఇలాంటి ధోరణే ఉంటుంది. దీంతో ఎప్పటికప్పుడు భారీ రాబడులు అందించే సాధనాల కోసం వెతుకుతూనే ఉంటారు. చివరికి ఆయా సాధనాలు తార స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుని కూర్చుంటారు. కనుక అధిక రాబడులనేవి అభిలషణీయమే అయినా.. రిస్కులు చూసుకుని అడుగేయాలి. పన్నుల భారం తగ్గించుకోవడానికి.. పన్నుల భారాన్ని తగ్గించుకునేందుకు ఆఖరు నిమిషంలో చాలా మంది వేతన జీవులు.. ఆదరాబాదరాగా బీమా పాలసీలు తీసుకోవడమో లేదా ఫండ్స్‌లోనో మరో సాధనంలోనో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆయా పాలసీలు, ఫండ్లు తమ ఆర్థిక లక్ష్యాలకు ఎంత వరకూ ఉపయోగపడతాయన్నది పట్టించుకోరు. ముందు పన్ను భారం తగ్గితే చాలనుకుంటారు. కానీ సదరు యులిప్స్ కావొచ్చు.. లేదా మరో ఫండ్ కావొచ్చు ఆ తర్వాత సరైన పనితీరు కనపర్చకపోతే.. పన్ను పరంగా వచ్చిన లాభం, అందులో పోతుంది. ఇలాంటి వాటికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. అదేంటంటే.. మనం పెట్టే పెట్టుబడి అనేది మన లక్ష్యాలకు ఉపయోగపడేదిలా ఉండాలి. మన రిస్కు సామర్థ్యానికి తగ్గట్లుగా ఉండాలి. వాటి ద్వారా పన్నుపరమైన ప్రయోజనాలు అదనంగా రావాలి. అంతే తప్ప.. కేవలం పన్ను ఆదా అవుతుందనే ఉద్దేశంతో ఏవేవో పోగేసుకోవడం అనవసరం. ఉచిత సలహాలతో జాగ్రత్త.. ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి ఉచిత సలహాలిచ్చే వారి కన్నా కొంత ఫీజు ఇవ్వాల్సి వచ్చినా ... సరైన ఫైనాన్షియల్ అడ్వైజరు సలహాలు తీసుకోవడం మంచిది. ఇక్కడ ఫీజు మాత్రమే ప్రామాణికం కాదు. సదరు అడ్వైజరు నిబద్ధతను కూడా అంచనా వేసుకున్న తర్వాతే ఎంపిక చేసుకోవాలి. అంతా ఒకే దాంట్లో.. తక్కువ కాలంలో ఎక్కువ రాబడి వచ్చేస్తుందన్న అత్యాశతో మొత్తం డబ్బంతా తీసుకెళ్లి.. ఏ సాధనం అయితే బూమ్‌లో ఉందో అందులో పెట్టేస్తుంటాం. షేర్లలో రిస్కు ఎక్కువగా ఉంటుందని బ్యాంకు ఎఫ్డీలనో, సురక్షితంగా ఉంటుంది.. ఏదో రోజు భారీగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో పూర్తిగా రియల్ ఎస్టేట్నో పట్టుకుని కూర్చుంటే లాభం లేదని ఇటీవలి పరిణామాలు చెబుతూనే ఉన్నా యి. ఇలా ఒకేదాన్ని నమ్ముకుంటేనే రిస్కు కాస్త ఎక్కువ ఉంటుం ది. కాబట్టి మీ రిస్కు సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, ఏయే సాధనాలు మీ లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయో చూసుకుని వాటిల్లో సముచితంగా కేటాయింపులు జరపడం మంచిది. నేల విడిచి సాము చేయొద్దు.. ఉదయం నుంచి సాయంత్రం దాకా తొమ్మిది గంటల డ్యూటీ చేయడమే ఒకోసారి కష్టంగా అనిపిస్తుంది.. అలాంటిది ఆదాయాలపై సరైన అంచనాలు లేకపోతే ఏకంగా పదిహేను.. ఇరవై ఏళ్లపాటు ఇంటికోసం తీసుకున్న రుణభారాన్ని మేనేజ్ చేయడం ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి భవిష్యత్‌లో ఆదాయాన్ని మరీ ఎక్కువగానో మరీ తక్కువగానో అంచనా వేసుకోవద్దు. అధిక అంచనాలంటే.. జీతాలు భారీగా పెరిగిపోతాయని లెక్కలేసేసుకుని, వాటిని అందుకోవడానికి ముందే అధిక రేట్లకు ఇల్లు, కారు, ఇతర లోన్లు అంటూ తీసేసుకుంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఏది నిజంగా అవసరమో ఏది అనవసరమో కాస్త ఆలోచించి కేటాయించాలి. అలాగని, ఏ క్షణంలో ఆదాయం పోతుందో అన్న భయంతో చిన్న చిన్న సరదాలు కూడా పక్కన పెట్టేయాలని కాదు. పొదుపు చేయడమే కాదు సరదాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడో జరిగే రిటైర్మెంట్ కోసం దాచి పెట్టుకోవడం ఎంత ముఖ్యమో ప్రస్తుతం అప్పుడప్పుడు సరదా టూర్లు వేయడం కూడా అంతే ముఖ్యం. అయితే, దీని వల్ల పొదుపునకు భంగం కలుగుతోంది అనుకుంటే టూర్లో అనవసర ఖర్చులు కొంత తగ్గించుకుంటే సరి. కొంత ప్లానింగ్‌తో ఉంటే.. ఏదైనా మేనేజ్ చేసేయొచ్చు. చివరిగా.. పొదుపు చేయడానికైనా, మదుపు చేయడానికైనా డబ్బు చేతిలో ఉండాలంటే.. ముందు దేనిపై ఖర్చు చేస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, వాటి వల్ల మనకు ఒరిగే ప్రయోజనాలేమిటి అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పటిష్టమైన ప్రణాళికను వేసుకుని దానికి కట్టుబడి ఉండాలి. ముందు పొదుపు ఆ తర్వాతే ఖర్చు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతేనేం.. భయంకరమైన లెక్కలే సేసుకుని తలపోటు తెచ్చేసుకోకుండా.. సాధ్యమైనంత సింపుల్ ప్రణాళికను వేసుకుని, దానికి కట్టుబడి ఉంటే ఆర్థికంగా ఆల్ హ్యాపీసే. -
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
-
ట్రెండ్ సెట్ చేస్తా
రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కలెక్టర్ సిద్ధం ప్రతీ సోమవారం సెట్ కాన్ఫరెన్స్ సిబ్బంది వ్యవహారాలపై సీరియస్ తహశీల్దార్లకు బాధ్యతల నిర్దేశం విశాఖ రూరల్ : రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సిద్ధమయ్యారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శాఖలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వారంలో చేయాల్సిన విధులను స్వయంగా పురమాయించనున్నారు. భూక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్ల విషయంలో సిబ్బంది పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వీఆర్వో, ఆర్ఐ చేతుల్లో ఉన్న అడంగళ్లు, 1బి రిజిస్టర్లను వెంటనే తహశీల్దార్లకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూవివాదాల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో తహశీల్దార్లు ఉండాలి తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది తప్పనిసరిగా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు కలెక్టర్ మండల తహశీల్దార్లతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు మండల కార్యాలయాల్లో సదుపాయాల్లేకపోవడంతో సెట్ కాన్ఫరెన్స్‌లో తహశీల్దార్లకు సూచనలు, ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఆ వారంలో రెవె న్యూ సిబ్బంది చేపట్టాల్సిన బాధ్యతలను కలెక్టరే నిర్ధేశించనున్నారు. వాటిని వారంలోగా పూర్తి చేసి తరువాత సోమవారం జరిగే సెట్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌కు వివరించాల్సి ఉంటుంది. ఈ సోమవారం కూడా కలెక్టర్ కొందరు తహశీల్దార్లతో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆనందపురంలో సెట్ సక్రమంగా పని చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో కూడా సాంకేతికపరంగా కొన్ని ఇబ్బందులున్నట్లు గుర్తించారు. దీంతో వచ్చే వారంలోగా అన్ని సెట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. రికార్డుల బాధ్యత తహశీల్దార్లదే జిల్లాలోని కొన్ని మండలాల్లో అడంగళ్లు, 1బి రిజిస్టర్లు వీఆర్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల చేతిలో ఉన్నాయి. రికార్డుల ట్యాంపరింగ్ విపరీతంగా జరిగినట్లు ఇటీవల నిర్వహించిన భూముల సర్వేలో వెల్లడైంది. పాత అడంగళ్లన్నింటినీ సంబంధిత తహశీల్దార్‌కు వెంటనే అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే వెబ్‌ల్యాండ్‌లో కొత్తవి ప్రింట్ తీసుకోవాలని సూచన లిచ్చారు. అసైన్ భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించడంతో 1బి రిజిస్టర్లు కూడా తహశీల్దార్ల వద్దే ఉండాలని సెట్ కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టం చేశారు. రికార్డుల ట్యాంపరింగ్, ఇప్పటికీ అడంగళ్లు, అసెన్మైంట్ రిజిస్టర్లు వీఆర్వో, ఆర్ఐల వద్ద ఉంటే అందుకు తహశీల్దార్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టుల్లో 629 భూ వివాదాలు జిల్లాలో ప్రభుత్వ భూముల వివాదాలకు సంబంధించి న్యాయస్థానాల్లో 629 కేసులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో ప్రధానమైన కేసులను వేగంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోడానికి వీలుగా అన్ని కేసుల వివరాలను కంపూటర్లో పొందుపరచాలని కలెక్టర్ నిర్ణయించారు. తద్వారా ఏ కేసు ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని ఆయన భావిస్తున్నారు. -
చేపల చెరువు తవ్వకానికి బ్రేక్
నందివాడ : హైకోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని తమిరిశలో పొక్లెయిన్‌తో చేపల చెరువు తవ్వకం పనులు నిర్వహిస్తుండగా గ్రామస్తులు ఆది వారం అడ్డుకున్నారు. మండల కేంద్రమైన నందివాడలో శనివారం చెరువులు తవ్వాలనుకున్న వ్యక్తులే ఆది వారం తమిరిశలో కూడా ఇందుకు యత్నించారు. నందివాడలో మాదిరి గానే తమిరిశలో కూడా గ్రామస్తులు తవ్వకం పనులను అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సార్వా, దాళ్వా పండే పొలా లను ఇలా చేపల చెరువులుగా మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్ధం కావటం లేదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే చేపల చెరువు యజమానులకు పాలకులు ఎలా సహకరిస్తున్నారో తెలియటం లేదన్నారు. గ్రామంలో చేపల చెరువు తవ్వకం పనులపై సోమవారం మచిలీపట్నంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చేపల చెరువులకు మండల అధికారులే పరోక్షంగా సహకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. రెండు పంటలు పండే బంగారంలాటి భూములను చెరువులుగా మార్చడానికి అధికారులు ఎలా ఫైల్ పెడుతున్నారో అర్ధం కావటం లేదంటున్నారు. ఫైళ్లను కలెక్టర్‌కు పంపించటంలో అలస్యం జరుగుతుండటంతో భూముల యజమానులు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నట్లు తెలి పారు. అదే మొదటిలోనే వ్యవసాయ భూముల్లో చెరువుల తవ్వకం కుదరదని చెబితే సరిపోతుందన్నారు. అవసరమైతే అధికారుల తీరుపై కోర్టుకు సైతం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలో చెరువుల తవ్వకాలు జరగనివ్వమని వారు పేర్కొంటున్నారు. చుట్టూ చెరువులేగా.. గ్రామ పరిధిలోని పలుచోట్ల చెరువులు తవ్వినపుడు గ్రామస్తులు ఏం చేస్తున్నారని కొతగా తవ్వకాలు తల పెట్టిన భూముల యజమానులు ప్ర శ్నిస్తున్నారు. అప్పుడు చూసీ చూడనట్లు వదిలేసి ఇప్పుడు ఇలా అడ్డుకోవటం అన్యాయమని వారు అంటున్నారు. చుట్టూ చేపల చెరువులు ఉండటంతో తమ భూముల్లో పంట లు సక్రమంగా పండటం లేదని చెబుతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వారు పేర్కొంటున్నారు. -
కఠిన నిర్ణయాలు తప్పవు: నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రానున్న రెండు మూడు సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని మోడీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని వర్గాల వారు ఇష్టపడకపోవచ్చని అన్నారు. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాలను అనుసరించే ఉంటాయని మోడీ స్పష్టం చేశారు. -
ఏపీ తొలి కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
విరామమే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర విభజన ప్రక్రియ జిల్లా యంత్రాంగం విధులకు కళ్లెం వేస్తోంది. శనివారం సాయంత్రంతో ఖజానా విభాగం ద్వారా చేపట్టే చెల్లింపుల ప్రక్రియను నిలిపివేశారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు పూర్తయ్యేవరకు ఖజానా విభాగం నుంచి ఎలాంటి చెల్లింపులు చేపట్టొద్దని సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు మే 24లోగా అన్నిరకాల చెల్లింపులు పూర్తిచేయాల్సిందిగా గతంలోనే పేర్కొంది. దీంతో శనివారం సాయంత్రానికల్లా ఉద్యోగుల వేతనాలు, కార్యాలయాల నిర్వహణతో పాటు పెండింగ్ బిల్లులన్నీ పరిష్కరించారు. అయితే తెలంగాణ అపాయింటెడ్ డే.. జూన్ రెండో తేదీకి ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఈలోగానే ఖజానా చెల్లింపులకు స్వస్తి పలకడంతో ఈ ప్రభావం ఇతర శాఖలపైనా పడింది. పలు ప్రభుత్వ విభాగాల నుంచి వివిధ రకాల ఫైళ్ల పరిష్కారానికి సైతం బ్రేక్ పడింది. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ వారం రోజులపాటు స్తంభించే అవకాశం ఉంది. ఎలాంటి అధికారిక నిర్ణయాలకు, నిధుల మంజూరుకూ ఆస్కారం లేకుండాపోయింది. ఇక అధికారులూ ఖాళీగా కూర్చోవాల్సిందే తప్పితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. విన్నపాలు ఆలకించడమే.. కొత్త రాష్ట్ర ఏర్పాటులో భాగంగా స్థానికేతర ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయాల్లోని ఉద్యోగుల విభజన పూర్తి చేసిన ప్రభుత్వం.. జిల్లా స్థాయి ఉద్యోగుల బదిలీకి సైతం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి ఉద్యోగుల స్థానికత వివరాల పరిశీలనకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. స్థానిక, స్థానికేతర అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేస్తే కొత్త రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఒకవైపు ఖజానా విభాగం పనులు తాత్కాలికంగా నిలుపుదల కావడం .. ఇటు అధికారులు స్థానిక, స్థానికేతర వివరాల సేకరణలో బిజీగా మారడంతో రోజువారీ పాలనకు ఆటంకం కలుగ నుంది. చెల్లింపుల ప్రక్రియ నిలిచిన నేపథ్యంలో కేవలం ప్రణాళికలు, బిల్లులు తయారు చేసే వరకే అధికారుల చర్యలు పరిమితం కానున్నాయి. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి కేవలం ఆర్జీలు తీసుకోవడం తప్ప వాటి పరిష్కారానికి మాత్రం జూన్ 2వరకు ఆగాల్సిందేనని అధికారులు చుబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ఆలకించడం తప్ప వారం రోజులవరకు చేసేదేం లేదని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
పిల్లలు నన్ను తిట్టుకున్నా సరే...
లైఫ్ బుక్ నా జీవితంలో ఇప్పటి వరకు ఏ విషయంలోనూ పశ్చాత్తాపం ప్రకటించలేదు. మంచో చెడో...నేను తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనుకుంటాను. ప్రతికూల, అనుకూల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతిదానిలోనూ కొద్దో గొప్పో మంచి విషయాన్ని నేర్చుకున్నాను. టైమ్ సరిపోవడం లేదు...అనే మాట తరుచుగా వినిపిస్తుంటుంది. పక్కా ప్రణాళిక ఉంటే అదేమీ అసాధ్యం కాదనే విషయం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అయిందిటికల్లా మేల్కోవడం, ఆరింటికి జిమ్‌లో గడపడం, ఎనిమిదింటికల్లా పిల్లల్ని స్కూల్‌కు సిద్ధం చేయడం...ఇలా ప్రతి పని పక్కాగా చేస్తాను. ఒక్కసారి అలవాటు అయితే ఏదైనా సులువు అవుతుంది. నేను స్ట్రిక్ట్ మదర్‌ను. పిల్లలు నన్ను ఒక విలన్‌గా పరిగణించి తిట్టుకున్నా ఫరవాలేదు. పిల్లలకు వారి హద్దుల గురించి తెలియజేస్తుంటాను. ఒక పని ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? అనేది పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తుంటాను. అలా అని నా రూల్స్ శిలాశాసనాలు కావు. అప్పుడప్పుడూ వెసులుబాటు కల్పిస్తుంటా. ఉదాహరణకు ఒక రోజు మా అమ్మాయికి ఒక రూల్ పాటించాలనిపించలేదు. ‘నీ ఇష్టం’ అంటాను. మరుసటి రోజు మాత్రం రూల్ రూలే! - కాజల్ -
కిరణ్ ‘నిర్ణయాల’ ఫైళ్లపై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ఉత్తర్వులు జారీ చేసి, మంత్రివర్గం ఆమోదం పొందాల్సి ఉన్న ఫైళ్లపై అయోమయ పరిస్థితి నెలకొంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆ ఫైళ్లకు ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందో, ఏది తిరస్కరిస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ఫైళ్లను ఆమోదం (రాటిఫికేషన్) కోసం గవర్నర్‌కు పంపనున్నారు. ఈమేరకు గవర్నర్ నరసింహన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కేబినెట్ ఉనికిలో లేనందున కిరణ్ నిర్ణయాల ఫైళ్లను కేబినెట్ తరఫున గవర్నర్ ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేస్తారు. అయితే కేబినెట్ ముందు పెట్టాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను మాత్రం తనకు పంపించవద్దని ఆదేశాల్లో గవర్నర్ స్పష్టం చేశారు. ఆ ఫైళ్లను తాత్కాలికంగా సస్పెన్షన్‌లో ఉంచాలని సూచించారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త కేబినెట్ల ఆమోదానికి వాటిని పంపాలని, ప్రస్తుతం వాటిని సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ విభాగానికి కూడా పంపవద్దని పేర్కొన్నారు. దీంతో గతంలో వచ్చిన అటువంటి ఫైళ్లను సాధారణ పరిపాలన శాఖ కేబినెట్ విభాగం ఇప్పుడు సంబంధిత శాఖలకు తిరిగి పంపిస్తోంది. -
సిఎం,స్పీకర్ల అభిప్రాయం కీలకం