అఖిలపక్ష సమావేశం..కీలక నిర్ణయాలు | Important decisions taken in All party meeting | Sakshi
Sakshi News home page

అఖిలపక్ష సమావేశం..కీలక నిర్ణయాలు

Published Wed, Apr 11 2018 3:49 PM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

Important decisions taken in All party meeting - Sakshi

అఖిలపక్ష సమావేశానికి హాజరైన నాయకులు

విజయవాడ : మాకినేని బసవపున్నయ్యభవన్‌లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో కె.పార్థసారధి (వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిథి), చలసాని శ్రీనివాస్(ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్‌), పి.మధు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి), కె.రామకృష్ణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), పలు ప్రజాసంఘాల నాయకులు  పాల్గొన్నారు.

సమావేశంలో కీలక నిర్ణయాలు

  • పార్లమెంటు విలువలను తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ చేస్తోన్న దొంగ దీక్షలకు నిరసనగా గురువారం ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష.
  • ఢిల్లీలో ఆమరణదీక్ష చేస్తున్న ఎంపీలకు సంఘీభావం.
  • 16వ తేదీన బ్లాక్‌డేగా పాటించాలని నిర్ణయం.
  • రాత్రి సమయంలో ప్రజలు ఇళ్లలో కరెంటు ఆపి నిరసన తెలియజేయాలని విన్నపం.
  • 17వ తేదీన ప్రజా బ్యాలెట్ ద్వారా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.
  • 20న రాజమహేంద్రవరంలో ప్రత్యేక హోదా విభజన హమీల సాధనకై బహిరంగ సభ.
  • కర్ణాటక ఎన్నికలలో బీజేపీని ఓడించాలని తెలుగువారికి పిలుపు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement