All Party Meetings
-
అఖిలపక్ష భేటీకి దీదీ దూరం
-
‘హోదా అంశాన్ని అఖిలపక్షంలో లేవనెత్తాం’
-
పార్లమెంట్ సమావేశాలు అఖిలపక్షం భేటీ
-
ఢిల్లీలో కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం
-
ఉగ్రవాదంపై రెండేళ్ల తర్వాత అఖిలపక్ష భేటీ
-
హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు
-
అఖిలపక్ష సమావేశం..కీలక నిర్ణయాలు
విజయవాడ : మాకినేని బసవపున్నయ్యభవన్‌లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె.పార్థసారధి (వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిథి), చలసాని శ్రీనివాస్(ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్), పి.మధు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి), కె.రామకృష్ణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు పార్లమెంటు విలువలను తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ చేస్తోన్న దొంగ దీక్షలకు నిరసనగా గురువారం ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష. ఢిల్లీలో ఆమరణదీక్ష చేస్తున్న ఎంపీలకు సంఘీభావం. 16వ తేదీన బ్లాక్‌డేగా పాటించాలని నిర్ణయం. రాత్రి సమయంలో ప్రజలు ఇళ్లలో కరెంటు ఆపి నిరసన తెలియజేయాలని విన్నపం. 17వ తేదీన ప్రజా బ్యాలెట్ ద్వారా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం. 20న రాజమహేంద్రవరంలో ప్రత్యేక హోదా విభజన హమీల సాధనకై బహిరంగ సభ. కర్ణాటక ఎన్నికలలో బీజేపీని ఓడించాలని తెలుగువారికి పిలుపు. -
బోగస్‌పై గురి
♦ ఆధార్‌తో ఎపిక్ అనుసంధానం ♦ జీహెచ్ఎంసీ ముమ్మర చర్యలు ♦ ఇంటింటికీ సిబ్బంది ♦ అఖిలపక్ష సమావేశాలకు సన్నాహాలు ♦ వివిధ సంఘాలకు అవగాహన కార్యక్రమాలు సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ అధికారుల దృష్టి బోగస్ ఓట్లపై పడింది. వీటిని ఏరివేసే కార్యక్రమానికి వారు సిద్ధమవుతున్నారు. దీనికోసం ఆధార్‌ను ఉపయోగించుకునే పనిలో పడ్డారు. కొద్దిరోజుల కిందటి వరకూ ఆస్తిపన్ను వసూళ్లలో మునిగితేలిన జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఇక ఆధార్‌తో ఓటర్ కార్డుల అనుసంధాన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. గ్రేటర్లో జనాభా కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండటంతో డూప్లికేట్, బోగస్ ఓటర్ల ఏరివేతకు అధికారులు సిద్ధమయ్యారు. ఎన్నికల సంఘం నుంచి కూడా ఆదేశాలు రావడంతో గురువారం నుంచి ఆధార్‌తో ఓటర్ కార్డు (ఎపిక్) అనుసంధాన ప్రక్రియలో పాల్గొన బోతున్నారు. భారీ తేడా... గత ఏడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మేరకు గ్రేటర్లో 76.41 లక్షల జనాభా ఉండగా... ఓటర్లు మాత్రం 80 లక్షలకు పైగా ఉన్నారు. దీంతో రెండేసి చోట్ల ఓటరు జాబితాలో పేర్లు గల వారు భారీ సంఖ్యలో ఉన్నట్లు అంచనా వేశారు. నగరంలో ఒకచోటు నుంచి మరో చోటుకు మారే వారు కొత్త చిరునామాతో ఓటర్ కార్డులు పొందుతున్నారు. పాత చిరునామాలో వివరాలు తొలగించకపోవడం.. మరణించిన వారి పేర్లు జాబితాలో ఉండటం వంటి కారణాలతో జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనుండటంతో బోగస్ ఓటర్ల ఏరివేతకు ఆధార్‌తో అనుసంధానం ఉపకరించగలదని భావిస్తున్నారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఈ ఆర్థిక సంవత్సరం పెద్ద ఎత్తున ఉపాధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సిద్ధమైంది. వీటిని నిజంగా అర్హులైన లబ్ధిదారులకే అందించేందుకు ఈ కార్యక్రమం సహకరిస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెలాఖరులోగా ఆధార్‌తో ఎపిక్ కార్డుల అనుసంధానాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. సమావేశాలతో అవగాహన ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాలనీ సంఘాలు, యువజన, మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం వల్ల ఇబ్బందులు ఉండవని ప్రజలకు వివరించనున్నారు. స్థానికంగా రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రోజువారీ సమీక్షించేందుకు సర్కిళ్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. వారు ఏరోజుకారోజు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తూ సంబంధిత సిబ్బందికి సలహాలు, సూచనలు ఇస్తారు. జోనల్ కమిషనర్లు కూడా ఈ కార్యక్రమాన్ని రోజూ సమీక్షిస్తారు. ఇంటింటికీ వెళ్లేందుకు బూత్ స్థాయి అధికారులు సరిపడినంతమంది లేని పక్షంలో రిటైర్టు ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటారు. వారికి ప్రత్యేకపారితోషికం అందిస్తారు. ఈ నెలాఖరులోగా నగరంలోని ఓటర్లందరి ఎపిక్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించాలనేది లక్ష్యం. ఈ ప్రక్రియలో అలసత్వం వహించరాదని, ఎవరైనా అశ్రద్ధ వహిస్తే ఉపేక్షించేది లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం ఈ అంశంపై జోనల్, డిప్యూటీ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనుసంధానం చేసే నెంబర్లను ఏరోజుకారోజు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏమరుపాటుకు తావివ్వరాదని స్పష్టత చేశారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా శ్రద్ధ వహించాలని సూచించారు. ఇలా అనుసంధానం చేసుకోవచ్చు... ♦ ఎస్ఎంఎస్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ప్రజలు స్వయంగానే అనుసంధానం చేసుకోవచ్చు. ఎస్‌ఈఈడీఈపీఐసీ(సీడ్‌ఎపిక్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరుగుర్తింపుకార్డు నెంబరు వేసి స్సేస్ ఇచ్చి ఆధార్‌నెంబరు వేసి 8790499899 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాలి. ♦ ఇంటర్నెట్ ద్వారా ((http://164.100.132.184/ epic/SelfSeeding.jsp) ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. ♦ ఏవైనా సందేహాలు ఉంటే ప్రజలు జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నెంబరు 040-21 11 11 11ను సంప్రదించవచ్చు. లేదా ముఖ్య ఎన్నికల అధికారి టోల్‌ఫ్రీ నెంబరు 1950ను సంప్రదించవచ్చు. ఇంకా.. ♦ వివిధ సర్కిళ్లలోని పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆధార్ కార్డు నెంబర్లు, ఓటర్ కార్డు నెంబర్లు సేకరిస్తారు. అనంతరం వాటిని ఆన్లైన్లో అనుసంధానం చేస్తారు. ♦ ఏ ఇంటికైనా తాళం వేసి ఉంటే అది తెలిసేలా ‘డోర్‌లాక్’ అనే స్టిక్కర్ అంటిస్తారు. ఆ స్టిక్కర్‌పై సంబంధిత బూత్ స్థాయి అధికారి సెల్ నెంబరు ఇచ్చి సంప్రదించాల్సిందిగా సూచిస్తారు. ♦ ప్రజలు సమీపంలోని మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు జిరాక్స్ ప్రతులను అందించడం ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. -
రైతుల పక్షాన న్యాయపోరాటాలు
ఏపీ రాజధానిపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు రాజధాని ప్రాంత రైతుల్లో ధైర్యం నింపేందుకు అన్ని పక్షాలు కలసిరావాలని పిలుపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ బాధ్యత తీసుకోవాలని తీర్మానం సాక్షి, హైదరాబాద్: ఖాకీల నీడలో మానవ హక్కుల్ని హరిస్తూ రాజధాని ప్రాంత రైతుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వ విపరీత పోకడలను ఉద్యమ రూపంలో ఎదుర్కోవాల్సి ఉందని ఏపీ రాజధానిపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం అభిప్రాయపడింది. అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి రైతుల్లో మనోధైర్యం నింపాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందని పేర్కొంది. న్యాయపోరాటాలతో పాటు ప్రజా పోరాటాలు నిరాటంకంగా కొనసాగించాలని, కరపత్రాలతో ప్రచారం చేయాలని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో విశాల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ దుశ్చర్యల్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని అభిప్రాయపడింది. ఇందుకు అభ్యుదయవాదులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షపార్టీ వైఎస్సార్ సీపీ బాధ్యత తీసుకోవాలని వక్తల ఏకాభిప్రాయంతో తీర్మానించింది. సమావేశంలో పాల్గొన్న వక్తలంతా ప్రభుత్వం భూములు సమీకరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జరీబు భూముల్ని రాజధాని నిర్మాణానికి మినహాయించాలని తీర్మానం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంగా ఎంపికచేసిన మండలాల్లో వైవిధ్యం గల పంటల ఫొటో ఎగ్జిబిషన్, ఏపీ రాజధానిపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. తొలుత జస్టిస్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రైతులు భూ సమీకరణకు ఒప్పుకోకుంటే బలవంతపు భూ సేకరణ చేపడతామని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, అయితే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌లో రాజధాని నిర్మాణానికి బలవంతపు సేకరణకు అవకాశం లేదని చెప్పారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ మన దేశ సంస్థలే ఇతర దేశాల్లో భారీ నిర్మాణాలు చేస్తుంటే సింగపూర్ సహకారం ఎందుకని ప్రశ్నించారు. రైతుల పక్షాన ఉంటాం: వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ భూములు ఇవ్వనన్నాడనే కారణంతో ఆ ప్రాంతానికి చెందిన రైతు శ్రీనాథ్చౌదరిని పోలీసులు తీసుకెళ్లారని, వారం రోజులుగా ఆయన జాడ లేదని చెప్పారు. పోలీసుల దాష్టీకాన్ని ప్రపంచానికి చెప్పేందుకు అన్ని రాజకీయ పక్షాలు కలసి ఉద్యమ బాట పట్టాలన్నారు. వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన కడవరకు పోరాడుతుందని చెప్పారు. రైతు ఉద్యమనేత అనుమోలు గాంధీ మాట్లాడుతూ ఇక్కడి పొలాల్లో 120 రకాల పంటలను పండిస్తున్నారని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సమీకరణ విధానం చట్టవిరుద్ధమైందన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ 2011లో రైతుల భూముల జోలికొస్తే ఖబడ్దార్ అన్న బాబు ఇప్పుడు భూ సమీకరణకు అడ్డువస్తే ఖబడ్దా ర్ అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కిసాన్‌సెల్ నేత కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏ విషయంలోనైనా నష్టం జరుగుతుందంటే సీఎంగా ఉన్న సమయంలో వైఎస్సార్ రైతులకు అనుకూలంగా నిర్ణయా లు తీసుకునే వారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, సీపీఐ ఎం.ఎల్. నేత గుర్రం విజయకుమార్, హైకోర్టు న్యాయవాది జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటల ఫొటో ఎగ్జిబిషన్ పలువురిని ఆకట్టుకుంది. సమావేశానికి ముందు జస్టిస్ లక్ష్మణరెడ్డి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఫొటోల్లో పంటలను రైతు నాయకుడు ఎ.గాంధీ వివరించారు.