పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ముగిసింది. ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరు అయ్యారు. భేటీ అనంతరం విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో కోరామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని సమావేశంలో లేవనెత్తామన్నారు.