makineni basavapunnaiah
-
హోదా సాధన సమితి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు
-
అఖిలపక్ష సమావేశం..కీలక నిర్ణయాలు
విజయవాడ : మాకినేని బసవపున్నయ్యభవన్‌లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె.పార్థసారధి (వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిథి), చలసాని శ్రీనివాస్(ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్), పి.మధు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి), కె.రామకృష్ణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు పార్లమెంటు విలువలను తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ చేస్తోన్న దొంగ దీక్షలకు నిరసనగా గురువారం ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష. ఢిల్లీలో ఆమరణదీక్ష చేస్తున్న ఎంపీలకు సంఘీభావం. 16వ తేదీన బ్లాక్‌డేగా పాటించాలని నిర్ణయం. రాత్రి సమయంలో ప్రజలు ఇళ్లలో కరెంటు ఆపి నిరసన తెలియజేయాలని విన్నపం. 17వ తేదీన ప్రజా బ్యాలెట్ ద్వారా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం. 20న రాజమహేంద్రవరంలో ప్రత్యేక హోదా విభజన హమీల సాధనకై బహిరంగ సభ. కర్ణాటక ఎన్నికలలో బీజేపీని ఓడించాలని తెలుగువారికి పిలుపు. -
'రూ.కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొంటున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యలను టీడీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. మాకినేని బసవపున్నయ్య 24 వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో స్మారక సభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకినేని వర్థంతి సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ముఖ్య అతిధిగా హాజరై స్మారకోపన్యాసం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థను సంస్కరణలు దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. సంస్కరణల పేరుతో పేదలకు ఇచ్చే రాయితీలు తగ్గించి...బడా కార్పొరేట్లకు రూ.62 వేల కోట్లు కేటాయించారని కేంద్రప్రభుత్వంపై ప్రకాశ్ కారత్ మండిపడ్డారు.