'రూ.కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొంటున్నారు' | prakash karat participate in makineni basavapunnaiah memorial meeting | Sakshi
Sakshi News home page

'రూ.కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొంటున్నారు'

Published Sun, Apr 17 2016 1:48 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

'రూ.కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొంటున్నారు' - Sakshi

'రూ.కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొంటున్నారు'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలను టీడీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. మాకినేని బసవపున్నయ్య 24 వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో స్మారక సభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాకినేని వర్థంతి సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ముఖ్య అతిధిగా హాజరై స్మారకోపన్యాసం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థను సంస్కరణలు దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. సంస్కరణల పేరుతో పేదలకు ఇచ్చే రాయితీలు తగ్గించి...బడా కార్పొరేట్లకు రూ.62 వేల కోట్లు కేటాయించారని కేంద్రప్రభుత్వంపై ప్రకాశ్ కారత్ మండిపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement