memorial meeting
-
బయటపడ్డ చంద్రబాబు మరో నిర్వాకం..
-
చండ్ర పుల్లారెడ్డి: అవిశ్రాంత వీరునికి జోహార్లు
దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచ ఆకలి సూచిలో దయనీయ స్థానంలో దేశం కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం పేరిట నోట్లస్వామ్యం, రాజకీయాల్లో మతోన్మాదం రాజ్యమేలుతున్నాయి. పాలక పక్షం ప్రతిపక్షాల్ని సైతం తొక్కిపడ్తూ కాళ్లు, చేతులు ఆడనివ్వడం లేదు. అధికారం అనేది నియంతృత్వానికి సోపానమవుతుండగా విప్లవ ప్రతి పక్షం రోజూ నెత్తురోడుతున్నది. ప్రత్యామ్నాయ రాజకీయ విశ్వాసాలు సైతం బందీ అవుతున్నాయి. ప్రత్యామ్నాయ ప్రజా ప్రతిపక్షం అంతా ఒక శక్తిగా ముందుకొచ్చే తరుణంలో నవంబర్ మాసానికి ఒక ప్రత్యేకత ఉన్నది. విప్లవ శక్తుల ఐక్యతా కృషిలో నిమగ్నమై ఉన్న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 1984 నవంబర్ 9న కలకత్తాలో గుండె పోటుతో అమరులయ్యారు. 1917లో కర్నూలు జిల్లా వెలుగోడు గ్రామంలో జన్మించిన చండ్రపుల్లారెడ్డి భూస్వామ్య కుటుంబ వారసత్వాన్ని కాలదన్నాడు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో గెలిచిన బూర్జువా శాసన సభ్యత్వ హోదాను త్యజించి, 50వ ఏట గోదావరిలోయ అడవిలోకి అడుగుపెట్టాడు. 66వ ఏట ఉద్యమంలోనే చివరిశ్వాస వదిలాడు. ఇదే మాసంలో విప్లవ సింహంగా పేరుగాంచిన కామ్రేడ్ పొట్ల రామనర్సయ్య, విప్లవ ఉపాధ్యాయుడు నీలం రామచంద్రయ్య, విప్లవ విద్యార్థి నాయకుడు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, విప్లవ నాయకురాలు రంగవల్లి, కిషన్‌జీలతో పాటు ఎందరో తమ అమూల్యమైన ప్రాణాలర్పించారు. సామాజిక విప్లవకారుడు జ్యోతిబా పూలే నవంబర్ 26న అమరులైనారు. వీరంతా ఒక మనిషిని వేరొక మనిషి దోపిడి చేయని సమాజం కావాలన్నారు. వారందరికీ విప్లవ జోహార్లు అర్పిస్తూ జరిగే సంస్మరణ సభను జయప్రదం చేయాలని కోరుతున్నాము. – డేగల రమ, (రుద్రారం) తెలంగాణ – రమణారెడ్డి, (బొల్లవరం) ఏపీ అమరుల స్మారక కమిటీ (నేడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభ) -
వైఎస్సార్ మనసున్న మహారాజు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ మనసున్న మహారాజు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో వైఎస్సార్ సంస్మరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దివంగత మహానేత వైఎస్సార్ సుపరిపాలన అందించారన్నారు. వైఎస్సార్ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామన్నారు. తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుస్తున్నారని తెలిపారు. ‘‘ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్నాం. పార్టీలో కష్టపడిన వారందరికీ న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ భూములు ప్రజలకే చెందాలన్నది మా లక్ష్యం. ఎక్కడైనా భూ ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయొచ్చు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని’’ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండగ చేశారు: మంత్రి అవంతి దివంగత మహానేత వైఎస్సార్ భౌతికంగా లేకపోయిన ప్రజల గుండెల్లో కొలివై ఉన్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారని కొనియాడారు. రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చిన గొప్ప నేత అని, అభివృద్ధి విషయంలో వైఎస్సార్ రాజకీయాలు చూడలేదని మంత్రి అవంతి అన్నారు. ఇవీ చదవండి: మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చిరునవ్వుల వేగుచుక్క -
21న ప్రణయ్ సంస్మరణ సభ
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : పేరుమళ్ల ప్రణయ్ హత్య కేసు నిందితులపై రాజద్రోహం(120బీ)తో పాటు ఉపా కేసు నమోదు చే సి కఠినంగా శిక్షించాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడలోని ప్రణయ్ నివాసంలో ‘ప్రణయ్ అమృత న్యాయపోరాట సంఘీభావ కమిటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం మిర్యాలగూడలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. ప్రణయ్ హత్య కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు, తుది తీర్పు వెలువడేంత వరకు కూడా నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దన్నారు. ప్రణయ్ హత్య కేసులో ఏ–6గా ఉన్న తిరునగరు శ్రవణ్‌కుమార్‌ను ఏ–2గా మార్చాలని డిమాండ్‌చేశా రు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకరావాలని, ప్రణయ్ కుటుంబానికి, అమృతప్రణయ్కి పోలీసులు పూర్తిస్థాయిలో రక్షణకల్పించాలన్నారు. ప్రణయ్ హత్యను ప్రపంచ మొత్తం ఖండించా యని, కానీ కొంతమంది మారుతీరా వుకు మద్దతు పలుకుతున్నారని తెలి పారు. అదేవిధంగా చాలా మంది అమృతతో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు. మిర్యాలగూడలో ఈనెల 14న ప్రణయ్ అమృత న్యాయ పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ప్రణయ్ సంస్మరణ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈనెల 21న భారీ ఎత్తున సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమావేశం ప్రకటించింది. ఈ సంస్మరణ సభకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముత్తిరెడ్డికుంటలోని ప్రణయ్ నివాసం నుంచి భారీ ర్యాలీని నిర్వహించనున్నట్టు చెప్పారు. సభను విజయవంతం చేయాలని కోరారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు తాళ్లపల్లి రవి, దైద సత్యం, పేరుమళ్ల జోజి, నా గార్జునరావు, డాక్టర్ రాజు, ఉదయ. సీహెచ్. సుధాకర్, వేనేపల్లి పాండురంగా రావు, భిక్షమయ్య, గణేశ్, కస్తూరి ప్రభాకర్, ఏడుకొండలు, కిరణ్మయి, పద్మ, మల్లయ్య, పరశురాములు, శ్రీరాములు, నాగయ్య, వెంకట్, నాగయ్య, విజయ్ తదితరులు ఉన్నారు. చదవండి: ప్రణయ్ చట్టం కోసం పోరాడుతాం అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్రూం ఇల్లు అమృతను చట్టసభలకు పంపాలి -
'రూ.కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొంటున్నారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల సమస్యలను టీడీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. మాకినేని బసవపున్నయ్య 24 వ వర్థంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో స్మారక సభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లు కుమ్మరించి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకినేని వర్థంతి సభకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ముఖ్య అతిధిగా హాజరై స్మారకోపన్యాసం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థను సంస్కరణలు దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. సంస్కరణల పేరుతో పేదలకు ఇచ్చే రాయితీలు తగ్గించి...బడా కార్పొరేట్లకు రూ.62 వేల కోట్లు కేటాయించారని కేంద్రప్రభుత్వంపై ప్రకాశ్ కారత్ మండిపడ్డారు. -
‘నర్రా’ స్ఫూర్తిగా హక్కుల సాధనకు పోరు
- రాఘవరెడ్డి సంతాప సభలో సున్నం రాజయ్య హైదరాబాద్: ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవ రెడ్డి స్ఫూర్తిగా హక్కుల సాధనకోసం పోరాటం చేయాలని సీపీఎం శాసన సభాపక్ష నేత సున్నం రాజయ్య అన్నారు. బుధవారమిక్కడ తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రాఘవ రెడ్డి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తొలిసారిగా గ్రామ సేవకుల సంఘాన్ని ఏర్పాటు చేసింది రాఘవ రెడ్డి అని, వారి వేతనాల పెంపుకోసం ఆయన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర నాయకుడు వంగూరి రాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు, రాష్ట్ర నేతలు పాలడుగు భాస్కర్, ఎస్.రమా, రైతు సంఘం నేతలు బొంతల చంద్రారెడ్డి, ప్రొఫెసర్ అరబండి ప్రసాదరావు ప్రసంగించారు.