
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న బండారి లక్ష్మయ్య
సాక్షి, మిర్యాలగూడ టౌన్ : పేరుమళ్ల ప్రణయ్ హత్య కేసు నిందితులపై రాజద్రోహం(120బీ)తో పాటు ఉపా కేసు నమోదు చే సి కఠినంగా శిక్షించాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండారి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడలోని ప్రణయ్ నివాసంలో ‘ప్రణయ్ అమృత న్యాయపోరాట సంఘీభావ కమిటీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం మిర్యాలగూడలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్నారు. ప్రణయ్ హత్య కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు, తుది తీర్పు వెలువడేంత వరకు కూడా నిందితులకు బెయిల్ మంజూరు చేయవద్దన్నారు. ప్రణయ్ హత్య కేసులో ఏ–6గా ఉన్న తిరునగరు శ్రవణ్‌కుమార్‌ను ఏ–2గా మార్చాలని డిమాండ్‌చేశా రు. కులాంతర వివాహాలు చేసుకున్న వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకరావాలని, ప్రణయ్ కుటుంబానికి, అమృతప్రణయ్‌కి పోలీసులు పూర్తిస్థాయిలో రక్షణకల్పించాలన్నారు. ప్రణయ్ హత్యను ప్రపంచ మొత్తం ఖండించా యని, కానీ కొంతమంది మారుతీరా వుకు మద్దతు పలుకుతున్నారని తెలి పారు. అదేవిధంగా చాలా మంది అమృతతో పాటు ప్రణయ్ కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేయడం విడ్డురంగా ఉందన్నారు.
మిర్యాలగూడలో ఈనెల 14న ప్రణయ్ అమృత న్యాయ పోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ప్రణయ్ సంస్మరణ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఈనెల 21న భారీ ఎత్తున సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమావేశం ప్రకటించింది. ఈ సంస్మరణ సభకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముత్తిరెడ్డికుంటలోని ప్రణయ్ నివాసం నుంచి భారీ ర్యాలీని నిర్వహించనున్నట్టు చెప్పారు. సభను విజయవంతం చేయాలని కోరారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు తాళ్లపల్లి రవి, దైద సత్యం, పేరుమళ్ల జోజి, నా గార్జునరావు, డాక్టర్ రాజు, ఉదయ. సీహెచ్. సుధాకర్, వేనేపల్లి పాండురంగా రావు, భిక్షమయ్య, గణేశ్, కస్తూరి ప్రభాకర్, ఏడుకొండలు, కిరణ్మయి, పద్మ, మల్లయ్య, పరశురాములు, శ్రీరాములు, నాగయ్య, వెంకట్, నాగయ్య, విజయ్ తదితరులు ఉన్నారు.
చదవండి:
అమృతకు వ్యవసాయభూమి, డబుల్ బెడ్‌రూం ఇల్లు
Comments
Please login to add a commentAdd a comment