bhavan
-
మిషనరీస్ అఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్ ను సందర్శిస్తున్న సీఎం
-
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభ వేడుక..!
-
ఆర్టీసీ భవన్లో డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయం
సాక్షి, సికింద్రాబాద్: మెట్టుగూడ ప్రధాన రహదారిలోని ఆర్టీసీ భవనం ఇకపై తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంగా మారనుంది. మెట్టుగూడ నుంచి తార్నాకకు వెళ్లే దారిలో ఈ భవనం ఉంది. ఆర్టీసీ ఎండీ కోసం నిర్మించిన ఈ భవనం ఆర్టీసీ చైర్మన్ల నివాస భవనంగా కొనసాగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రవాణ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, ఆయన కుంటుంబం కొద్ది సంవత్సరాల పాటు ఈ భవనంలోనే నివసించారు. నాలుగేళ్ల క్రితం సీఎం హోదాలో సికింద్రాబాద్ పర్యటనకు వచ్చిన కేసీఆర్ ఇదే భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్పట్లోనే ఎక్సైజ్ మంత్రి హోదాలో పద్మారావు ఈ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వాడుకుందామని ఆలోచించారు. ఆ తరువాత మినిస్టర్ క్వార్టర్స్‌కు కొంతకాలం మకాం మార్చారు. కొద్ది రోజుల క్రితం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావుగౌడ్ ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మినిస్టర్ క్వార్టర్స్‌కు వెళ్లడం కంటే తన నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలనుకున్న ఆయన నిర్ణయానికి సీఎం అంగీకారం తెలిపినట్టు తెలిసింది. శనివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తన అనుచరులతో కలిసి ఆర్టీసీ భవనాన్ని సందర్శించారు. నీల ప్రభాకర్, ఓడియన్ శ్రీనివాస్, సుంకు రాంచందర్, అశోక్‌గౌడ్, శైలేందర్, మంత్రి తనయుడు రామేశ్వర్‌గౌడ్, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేత చందు గంగపుత్ర పాల్గొన్నారు. -
సివిల్ ఇంజనీరింగ్ నూతన భవనం ప్రారంభం
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి నూతనంగా నిర్మించిన అదనపు భవన సదుపాయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 2.38 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేయడం జరిగిందన్నారు. కార్పొరేట్ భవనాలను తలపించే రీతిలో ఆధునికత ఉట్టేపడే విధంగా భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. బోధన విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను సబ్ కమిటీ సూచనలకు అనుగుణంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. విశ్వవిద్యాలయాలలో సుదీర్ఘ కాలం తరువాత నియామకాలు చేపట్టడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జగదీష్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్ అవధాని, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రామమోహనరావు, పాలక మండలి సభ్యుడు డాక్టర్ పి.సోమనాథరావు, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఆచార్య జి.వి.ఆర్ శ్రీనివాస రావు, వజీర్ మహ్మద్, ఎం.జి మాధవబాబు తదితరులు పాల్గొన్నారు. -
అఖిలపక్ష సమావేశం..కీలక నిర్ణయాలు
విజయవాడ : మాకినేని బసవపున్నయ్యభవన్‌లో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కె.పార్థసారధి (వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిథి), చలసాని శ్రీనివాస్(ప్రత్యేకహోదా సాధన సమితి కన్వీనర్), పి.మధు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి), కె.రామకృష్ణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో కీలక నిర్ణయాలు పార్లమెంటు విలువలను తాకట్టు పెట్టి నరేంద్ర మోడీ చేస్తోన్న దొంగ దీక్షలకు నిరసనగా గురువారం ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష. ఢిల్లీలో ఆమరణదీక్ష చేస్తున్న ఎంపీలకు సంఘీభావం. 16వ తేదీన బ్లాక్‌డేగా పాటించాలని నిర్ణయం. రాత్రి సమయంలో ప్రజలు ఇళ్లలో కరెంటు ఆపి నిరసన తెలియజేయాలని విన్నపం. 17వ తేదీన ప్రజా బ్యాలెట్ ద్వారా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం. 20న రాజమహేంద్రవరంలో ప్రత్యేక హోదా విభజన హమీల సాధనకై బహిరంగ సభ. కర్ణాటక ఎన్నికలలో బీజేపీని ఓడించాలని తెలుగువారికి పిలుపు. -
బంగారు భవనం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ రైల్వే డివిజనల్ కార్యాలయం హైదరాబాద్ భవన్‌కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) నుంచి గోల్డ్ రేటింగ్ లభించింది. సహజ వనరుల సమర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ పోదుపులో సాధించిన అద్భుత ఫలితాలకు ఈ అవార్డు లభించినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణకు హైదరాబాద్ భవన్ అనేక చర్యలు చేపట్టి సత్ఫలితాలు సాధించింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు డస్ట్బిన్లు, నీటి సంరక్షణకు నాలుగు వాటర్ మీటర్లు ఏర్పాటు చేశారు. భవన పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు హానికారక రసాయనాలకు బదులు పర్యావరణప్రియమైన వాటినే వినియోగిస్తున్నారు. మొక్కలు పెంపకానికి సేంద్రియ ఎరువులే వాడుతున్నారు. అలాగే విదేశీ వృక్షాలకు బదులు దేశవాళీ వృక్షాల పెంపకానికే ప్రాధాన్యమిస్తున్నారు. భవనంలో గాలి, వెలుతురు, చల్లదనం ఉండేందుకు వీలుగా 2,300 చదరపు మీటర్ల పైకప్పునకు సోలార్ రిఫ్లెక్షన్ ఇండెక్స్ పెయింటింగ్‌ను అమర్చారు. విద్యాంగుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలు, ఆటలు, యోగా కోసం ఏర్పాటు చేసిన వసతులు తదితర సదుపాయాలకు గాను ఈ భవనానికి గోల్డ్ రేటింగ్ లభించింది. -
ఆదిలోనే ఆటంకం
ఆదిలాబాద్: ఆసరా లేని వారికి ఆశ్రయం కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న ‘ఆసరా భవనం’ ఆదిలోనే ఆగిపోయింది. కాం ట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆరు నెలల క్రితం ప్రారంభించిన భవన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లాలో నిరాశ్రయులకు నీడ కల్పన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షల నిధులతో రెండేళ్ల క్రితం రాత్రిబస కేంద్రాన్ని జిల్లా కేంద్రానికి మంజూరు చేసింది. 2017లో ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆగస్టులో పనులు ప్రారంభించగా కాంట్రాక్టర్ పునాదులు, పిల్లర్ల దశలోనే నాసిరకం పనులు చేపట్టడంతో భవనం కుంగిపోయింది. అధికారులు పర్యవేక్షించకపోవడంతో పిల్లర్ల వరకే పనులు చేసిన కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేశారు. అనాథలకు ఆసరాగా.. అనాథలుగా రోడ్లపై, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆశ్రయం లేక జీవనం సాగించే వారికి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని మంజూరు చేసింది. ఇందులో అన్ని సౌకర్యాలు కల్పించి రాత్రి భోజనంతో పాటు స్నానపు గదులు, నిద్రించేందుకు సదుపాయాలు సైతం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. గతంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిరాశ్రయుల కోసం ఓ కేంద్రాన్ని నిర్వహించింది. ప్రస్తుతం దాన్ని మూసివేయడంతో అభ్యాగులకు నిలువనీడలేకుండా పోయింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆశ్రయం లేనివారిని గుర్తించి ఇందులో వారికి నీడ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఏటా నిర్వహణ కోసం కూడా ప్రత్యేకంగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో భవన నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్, ఠాకూర్‌హోటల్, బస్టాండ్, ఓల్డ్‌బస్టాండ్, తాంసి బస్టాండ్, వినాయక్‌చౌక్, అంబేద్కర్‌చౌక్, శివాజీచౌక్, తదితర ప్రాంతాల్లో ఎంతో మంది నిరాశ్రయులు నిత్యం కనిపిస్తుంటారు. చలికాలం, వర్షకాలంలో వీరి అవస్థలు వర్ణనాతీతం. భద్రత కారణాల దృష్ట్యా పోలీసులు రోడ్ల పక్కన పడుకునే వారిని అక్కడి నుంచి పంపివేస్తుంటారు. ఇలా అన్ని రకాలుగా నిరాశ్రయులకు ఆధారం లేకుండా పోతోంది. చేతులెత్తేసిన కాంట్రాక్టర్.. కాంట్రాక్టర్‌కు అప్పగించిన ఈ భవన నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. పనులు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా.. ఇంకా పిల్లర్ల దశ దాటలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు నిలిపివేసి ఆరు నెలలు గడుస్తున్నా అతడిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం నోటీసులు అందించామని చెబుతున్న అధికారులు, సదరు కాంట్రాక్టర్ పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసినా ఇంకా అతని కోసం ఎదురుచూడడం గమనార్హం. సకాలంలో భవనం పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త టెండర్లు నిర్వహించి వేరేవారికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడా అది జరగడం లేదు. ఆసరా భవనం పూర్తయితే అందులో ఉండేందుకు నిరాశ్రయుల వివరాల సేకరణ సైతం చేశారు. నోటీసులు అందించాం.. భవన నిర్మాణాలు చేపట్టాలని ఇది వరకే కాంట్రాక్టర్‌కు నోటీసులు అందించాం. త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఆరు నెలల అగ్రిమెంట్‌తో పనులు అప్పగించడం జరిగింది. ఆర్థిక సమస్యలు ఉన్నాయని కాంట్రాక్టర్ చెబుతున్నాడు. నెల రోజుల్లో పూర్తి చేయకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొండల్రావు, మున్సిపల్ డీఈ -
కలెక్టరేట్‌గా ఈఆర్సీ భవనం
సింగరేణి భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే జలగం కొత్తగూడెం : నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాకు కలెక్టరేట్ కార్యాలయంగా ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న సింగరేణి ఈఆర్సీ శాప్ భవనాన్ని సిద్ధం చేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తెలిపారు. ఆదివారం ప్రభుత్వ కార్యాలయాల నిమిత్తం ఖాళీగా ఉన్న సింగరేణి భవనాలు, ఖాళీ స్థలాలను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. బస్టాండ్‌కు దగ్గరగా ఉన్న ఈఆర్సీ భవనాన్ని కలెక్టరేట్‌గా, సింగరేణి ప్రధాన వైద్యశాలలో ఉన్న డిస్పెన్సరీ తదితర భవనాలను ఎస్పీ కార్యాలయానికి ఎంపిక చేశారు. సీపీఓ వంటి ప్రాధాన్యత గల భవనాలకు పవర్‌హౌజ్‌లో ఉన్న ఖాళీ భవనాలను పరిశీలించారు. ఇప్పటికే త్రీ ఇంక్లైన్లోని సీటీసీని పరిశీలించి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉంచారు. ఇదే ప్రాంతంలోని సింగరేణి అధికారుల నివాస స్థలాల్లో, కలెక్టర్, ఎస్పీ, జేసీ క్యాంపు కార్యాలయాలకు, నివాస గృహాలకు అనువుగా ఉన్నట్లు ఎమ్మెల్యే, ఆర్డీఓ ఎంవీ రవీంద్రనాథ్‌లు పేర్కొన్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయం కూడా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరులోగా జిల్లా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కసరత్తు ప్రారంభించామని, సింగరేణి సంస్థలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ భవనాలు, ఖాళీ స్థలాలను కొలతలతో సహా నివేదిక రూపొందిస్తున్నట్లు వివరించారు. వీటన్నింటినీ ఉన్నతాధికారులకు పంపించిన అనంతరం ఆమోదం పొందిన తరువాత ఏ కార్యాలయానికి ఏ భవనం వినియోగించాలన్నది నిర్ణయిస్తామని, ప్రస్తుతం ప్రతి భవనం రూపురేఖలు, అవి ఏఏ ప్రాంతాల్లో ఉన్నాయో, వాటిని ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాలయాల భవనాలకు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వన్‌టౌన్ పరిధిలోని ఐఎంఏ భవనం కూడా ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలికంగా వినియోగించుకుంటామన్నారు. ఇదే ప్రాంతంలోని పవర్‌హౌజ్ భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సీఐలు రాజగోపాల్, శ్రీనివాస్, సింగరేణి అధికారులు అంతోని రాజా, నరేందర్, టీఆర్ఎస్ నాయకులు జి.వి.కె.మనోహర్, కంచర్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు. పవర్‌హౌజ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, ఆర్డీఓ, సింగరేణి అధికారులు -
రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం