
కఠిన నిర్ణయాలు తప్పవు: నరేంద్ర మోడీ
దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రానున్న రెండు మూడు సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని మోడీ స్పష్టం చేశారు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని వర్గాల వారు ఇష్టపడకపోవచ్చని అన్నారు. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాలను అనుసరించే ఉంటాయని మోడీ స్పష్టం చేశారు.