ప్రముఖ పత్రిక ‘టైమ్’.. ప్రపంచంలో వందమంది ప్రభావశీలుర జాబితా తయారీ కోసం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పోల్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి.
న్యూఢిల్లీ: ప్రముఖ పత్రిక ‘టైమ్’.. ప్రపంచంలో వందమంది ప్రభావశీలుర జాబితా తయారీ కోసం నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పోల్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ఆదివారం చివరి ఫలితాలు అందే సమయానికి ఆయనకు అందరికంటే ఎక్కువ వ్యతిరేక ఓట్లు పడ్డాయి. మోడీకి ‘నో’ ఓట్లు 62 శాతం, ‘ఎస్’ ఓట్లు 38 శాతం పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు ’ఎస్’ ఓట్లు 87 శాతం, ‘నో’ ఓట్లు 13 శాతం పడ్డాయి. అమెరికన్ గాయని కేటీ పెర్రీ ‘ఎస్’ ఓట్లలో తొలి స్థానంలో ఉన్నారు. ఈ పోల్ తుది ఫలితాలను 24న వెల్లడిస్తారు.