Putin defends invasion: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై చేస్తున్న దాడిని సమర్థించుకునేందుకు యత్నించారు. ఉక్రెయిన్ పై జరుగుతున్న నిరవధిక దాడి గురించి స్థానిక మీడియాతో మాట్లాడుతూ..."ఉక్రెయిన్‌కు రష్యా బలగాలను పంపడం నిస్సందేహంగా కష్టమైన నిర్ణయం. ఇది అనివార్యమైన సంఘటన. ఇది రాజ్యంగ విరుద్ధ తిరుగుబాటు.
అయితే ఉక్రెయిన్‌లో పరిస్థితి అదుపు తప్పింది. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలు పాలన మార్పును తిరస్కరించాయి. ఆగ్నేయ డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలలో అసమ్మతివాదులు తదనంతరం హింసను ఎదుర్కొన్నారు. కీవ్ ప్రభుత్వం డాన్‌బాస్‌లో పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలను నిర్వహించిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అయినా ఆ ప్రాంత ప్రజలు ఏమి వీది కుక్కలు కాదు. పైగా ఆ ప్రాంతంలోని వందలాది మంది ప్రజలు, పిల్లలు చంపబడ్డారు. దీనికి పశ్చిమ దేశాలు చురుకుగా మద్దతు ఇస్తున్నాయి. అంతేకాదు మాస్కో ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి, అదే సమయంలో డోనెట్స్క్ లుగాన్స్క్ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నించింది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం డాన్‌బాస్‌ను దిగ్బంధించి ప్రజలను అణచివేసింది. అంతేగాక ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోరనే హామీ ఇవ్వడంలో విఫలమైందని తదితర కారణాల వల్లే మేము దాడులకు దిగవలసి వచ్చింది." అని పుతిన్ తన చర్యలను సమర్ధించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment