ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా తప్పక విజయం సాధిస్తుందని, తమ భవిష్యత్తు అంతా సైనికుల భుజస్కందాలపైనే ఆధారపడి ఉందని వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పుతిన్ మంగళవారం మాస్కోలోని రెడ్ స్క్వేర్ విక్టర్ డే పరేడ్‌లో మాట్లాడుతూ.. నేడు నాగరికత మళ్లీ నిర్ణయాత్మక మలుపులో ఉందని, తమ మాతృభూమిపైనే యుద్ధం జరుతోందంటూ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా.. అనుభవజ్ఞులైన తన సాయుధ దళాలను ఉద్దేశించి.. రష్యా విజయం సాధించాలని పిలుపు నిచ్చారు. ప్రస్తుతం మీ పోరాట ప్రయత్నానికి మించినది ఏదీ లేదన్నారు. మొత్తం దేశం మీ వెంట ఉందని సైనికులకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పుతిన్ పాశ్చాత్య గ్లోబలిస్ట్ ఎలైట్స్‌పై కూడా మండిపడ్డారు. వారంతా ప్రపంచ వ్యాప్తంగా విభేదాలు, తిరుగబాటులకు అంకురార్పణం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
రష్యా దీనిని కచ్చితంగా అధిగమించగలదని, అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఐతే తాము అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టామని, తూర్పుఉక్రెయిన్ (డోన్బాస్) ప్రజలను రక్షించడమే గాక వారి భద్రత కూడా కల్పిస్తామన్నారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగి 15 నెలలు పూర్తి కావస్తున్న తరుణంలో నాజీలపై మాస్కో సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే సాంప్రదాయ సోవియట్ శైలి కార్యక్రమం తొలిసారిగా భద్రతా భయాల నడుమ జరిగింది.
(చదవండి: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment