![Putin Give Mother Heroine Awards To Women With 10 More Children - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/15/russia.jpg.webp?itok=ZNvUxFBK)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోవియట్ శకం నాటి మదర్ హీరోయిన్ టైటిల్ అవార్డును పునరుద్ధరించారు. పదిమంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిని పుతిన్ ఈ అవార్డుతో సత్కరిస్తారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ అవార్డులు ఇస్తున్నట్లు రష్యా తెలిపింది. రష్యా అధికారిక డిక్రీ ప్రకారం...ఈ అవార్డును రష్యా ఫెడరేషన్ పౌరులై ఉండి, పదిమంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి, పెంచిన తల్లులకు మాత్రమే ఈ అవార్డును ప్రధానం చేస్తోంది మాస్కో.
ఈ అవార్డు గ్రహితల్లో పుతిన్ స్నేహితుడు రమ్‌జాన్ కదిరోవ్ భార్య మెద్నీ కూడా ఉన్నారు. అంతేగాదు చెచెన్ రిపబ్లిక్ అధిపతిగా పనిచేస్తున్న పుతిన్ స్నేహితుడు కదిరోవ్ ఉక్రెయిన్ యుద్ధం కోసం యుక్త వయసులో ఉన్న తన కొడుకులను పంపుతానని పుతిన్‌కి వాగ్దానం చేశాడు. అలాగే ఆర్కిటిక్‌యమలో నెనెట్స్ ప్రాంతానికి చెందిన మరో మహిళ ఈ అవార్డును దక్కించుకున్నట్లు రష్యా తెలిపింది.
వాస్తవానికి ఈ టైటిల్‌ని రష్యాలో 1990 నుంచి 1994 మధ్యకాలంలో అందించారు. ఆ తర్వాత పుతిన్ కొన్నినెలలు క్రితమే దీన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఐతే ఈ అవార్డులను పునరుద్ధరించిన తదనంతరం ప్రదానం చేయడం ఇదే తొలిసారి. ఈ అవార్డును అందుకున్న ప్రతి తల్లికి దాదాపు రూ. 13 లక్షలు వరకు చెల్లిస్తోంది మాస్కో. ఈ టైటిల్ పునరుద్ధరణను గమనిస్తే ఉక్రెయిన్‌పై దాడి తదనంతరం రష్యాలో సాంప్రదాయవాద ధోరణి తీవ్రతరం అవుతున్నట్లు తెలుస్తోంది.
(చదవండి: ప్రజాస్వామ్యం వర్సెస్ నిరంకుశత్వం...బైడెన్‌కి చైనా కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment