ఇండియా కూటమి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే.. | Key Decisions Likely At INDIA Bloc 3rd Meet In Mumbai Today Latest Updates Inside - Sakshi
Sakshi News home page

INDIA Meeting In Mumbai: ఇండియా కూటమి భేటీ లైప్‌ అప్‌డేట్స్‌

Published Fri, Sep 1 2023 11:23 AM | Last Updated on Fri, Sep 1 2023 6:38 PM

Key Decisions Likely At INDIA Bloc 3rd Meet In Mumbai Updates - Sakshi

Updates..

ముంబైలో జరిగిన ఇండియా కూటమి భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతల కూటమి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. జుడేగా ఇండియా.. జీతేగా ఇండియా నినాదంతో ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అదే విధంగా చంద్రయాన్‌-3 విజయంపై ఇస్రోను అభినందిస్తూ కూటమి తీర్మానించింది. 13 మందితో సమన్వయ కమిటీని ఇండియా కూటమి ప్రకటించింది. ఇందులో శరద్‌ పవార్‌, స్టాలిన్‌ సహా పలువురు కీలక నేతలకు చోటు దక్కింది. 

ఇండియా కూటమి సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ వేదికపై 60 శాతం భారత్‌ ఉందన్నారు. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదని అన్నారు. ఎన్నికలు చాలా దగ్గరగా వచ్చాయని,  త్వరలోనే జీ 20 శిఖరాగ్ర సదస్సు జరగనుందని తెలిపారు. అదానీ విషయంలో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

తన లఢక్ యాత్ర గురించి చెబుతూ..లఢక్‌లో చాలా భాగాన్ని చైనా ఆక్రమించిందని చెప్పారు. మన భూభాగాలను చైనా ఆక్రమించలేదని ప్రధాని మోదీ చెప్పడం పూర్తిగా అబద్ధమని అన్నారు. అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడానని అన్నారు. భారత ప్రభుత్వం తమను మోసం చేస్తోందని లఢక్‌లో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసని అన్నారు. చైనా, భారత మధ్య సరిహద్దు విషయంలో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. సరిహద్దు మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. 

► కూటమి పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే ఓడించే సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సమర్ధవంతంగా ఐక్యంగా ఉండటమే తమ ముందున్న కర్తవ్యమని చెప్పారు. సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కూటమిలో నాయకుల మధ్య ఏర్పడిన సంబంధాలే అసలైన బలమని రాహుల్ చెప్పారు. బీజేపీని తప్పుకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

► బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పార్టీలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. దాని ఫలితమే ఈ సమావేశం. కూటమి చేతిలో కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓడిపోతుండి. ప్రస్తుతం మీడియా వారి చేతిలో ఉంది. వారి చెర నుంచి ఒక్కసారి మీడియాకు విముక్తి కలిగితే మళ్లీ మీడియా స్వేచ్చగా పనిచేస్తుంది. ఇలా చాలా ముఖ్యమైంది. వారు చరిత్రను మార్చాలనుకుంటున్నారు. అందుకు మేము అంగీకరించం. దీనిపై ప్రజలు, మేము కలిసి పోరాడతామన్నారు.  

► ఇండియా కూటమి కేవలం 28 పార్టీల కూటమి కాదు.. 140 కోట్ల కూటమిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. దేశ చరిత్రలో మోదీ ప్రభుత్వం అత్యధిక అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రం కొందరి కోసమే పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఇండియా కూటమిని చీల్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ఇండియా కూటమి ఉందని అన్నారు. ఇక్కడ పదవులు ఎవరూ ఆశించరని చెప్పారు. 

► 'ఎవరూ అడగకుండానే పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను ఏర్పాటు చేశారు. మణిపూర్ ఘటన జరిగిన సందర్భంలో ఎలాంటి సెషన్‌లు నిర్వహించలేదు. పెద్దనోట్ల రద్దు, చైనా దురాక్రమణ, కరోనా సమయంలో కూడా ఎలాంటి ప్రత్యేక సెషన్‌లను ప్రకటించలేదు. నియంతలా కేంద్రం దేశాన్ని పరిపాలిస్తోంది.'  అని కేంద్రాన్ని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 

►  ఇండియా కూటమి భేటీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీలకు ఒకటే ధ్యేయం దేశాన్ని రక్షించడమేనని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై పొరాడతామని చెప్పారు. కేంద్రం మొదట గ్యాస్ ధరలు పెంచిన మళ్లీ తగ్గిస్తున్నారు.. మోదీ ప్రభుత్వం పేదల కోసం పనిచేయడం లేదని అన్నారు.   

మూడు తీర్మాణాలు..

మూడు తీర్మాణాలు
   
  1)  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం

      2)  ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు నిర్వహించనున్నారు. 

      3)  జుడేగా భారత్‌-జీతేగా ఇండియా నినాదంతో ప్రజల ముందుకు 

ఇండియా కూటమికి 14 మందితో కూడిన సమన్వయ కమిటీని నియమించారు. కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తారనే విషయం ఇంకా ప్రకటించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. 

సమావేశం జరగునున్న హోటల్‌ గదికి కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీలు హాజరయ్యారు. 

భేటీకి హాజరుకావడానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ముంబయిలోని హాయత్ హోటల్‌కు చేరుకున్నారు. 

► ఇండియా కూటమి సమన్వయ కమిటీని నేడు ప్రకటించనున్నారు. అన్ని పార్టీల నుంచి ఒక అభ్యర్థి పేరు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూటమి నాయకులను కోరారు. 

ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు ముంబయి వేదికగా రెండో రోజు సమావేశం ముగిసింది. 28 పార్టీల నుంచి 63 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన డిన్నర్ భేటీలో కూటమికి లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. నేడు ప్రధానంగా మూడు అంశాల్లో తుది నిర్ణయం తీసుకున్నారు.

► సమన్వయ కమిటీతో పాటు ఎన్నికల ప్రచారం, ర్యాలీల నిర్వహణకు మరో నాలుగు బృందాలను నియమించనున్నారు. ఈ కమిటీ సభ్యులే సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలను చేపట్టనున్నట్లు సమాచారం.

► అక్టోబర్ 2నాటికి ఇండియా కూటమి తన మేనిఫెస్టోని విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీకి హాజరైన నాయకులను కోరారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా కామన్ అజెండాను రూపొందించాలని కోరారు. 

► కూటమికి లోగోను రూపొందిండంపై నేడు తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఉమ్మడిగా అధికార ప్రతినిధిని కూడా నియమించనున్నారు. ఇండియా కూటమికి కన్వినర్ పదవిని నియమించాలా..? వద్దా..? అనే అంశంపై కూడా నేడు చర్చలు జరగనున్నాయి.

► నిన్న రాత్రి శివ సేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని డిన్నర్ భేటీలో కూటమి నాయకులందరు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు రానున్నాయని కొందరు నాయకులు అంచనా వేశారు. ఎన్డీయే వేసే ఎత్తులకు ధీటైన జవాబు ఇవ్వాలని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. 

 ► ఇండియా కూటమి ముంబయిలో సమావేశమైన మొదటి రోజే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ అంశం కూడా నేడు కూటమి నాయకుల చర్చకు రానుంది. 

► ఇండియా కూటమి మొదటి సమావేశం పాట్నాలో జరగగా.. రెండవసారి బెంగళూరు వేదికగా పూర్తయింది. మూడోసారి ముంబయి వేదికగా కూటమి నాయకులు హాజరయ్యారు. ఎన్నికల దగ్గర పడనున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 

ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement