ఇండియా కూటమి భేటీ.. ఈ అంశాలే ప్రధానంగా.. | Opposition Alliance INDIA Meeting With 28 Parties In Mumbai Grand Hyatt Over 2024 Elections - Sakshi
Sakshi News home page

INDIA Meeting In Mumbai: ఇండియా కూటమి భేటీ.. ఈ అంశాలే ప్రధానంగా..

Published Thu, Aug 31 2023 11:48 AM | Last Updated on Thu, Aug 31 2023 4:50 PM

INDIA Meets In Mumbai Today Updates - Sakshi

ముంబయి: 2024 ఎన్నికల్లో బీజేపీని ప్రధాని పీఠం నుంచి దించే లక్ష్యంతో ప్రతిపక్షాల ఐక్య కూటమి 'ఇండియా' సన్నద్ధమవుతోంది. నేడు 28 పార్టీలు ముంబయి వేదికగా జరుగుతున్న డిన్నర్ భేటీలో పాల్గొననున్నాయి. కూటమికి ఓ లోగోను ఎంపిక చేయడంతోపాటు సమన్వయ కమిటీ, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. దేశంలో బీజేపీకి ధీటుగా ఐక్యంగా పోరాడుతామని ప్రతిపక్ష పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

ఇండియా కూటమి భేటీకి ముంబయికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను పార్టీ శ్రేణులు గణంగా ఆహ్వానిస్తున్నాయి. ఈ మేరకు బ్యాండ్ బాజాలతో సోనియా గాంధీని, రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. 

కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ముంబయికి చేరుకున్నారు. 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ముంబయికి చేరుకున్నారు. మరికాసేపట్ల భేటీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

ఇండియా కూటమి మూడో భేటీకి హాజరవడానికి జమ్మూ కశ్మీర్ పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ముంబయి చేరుకున్నారు. కూటమి వర్థిల్లాలని నినదించారు. 

ముంబయిలో జరగనున్న సమావేశానికి హాజరవడానికి కాంగ్రెస్ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు.

ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి 28 పార్టీల తరుపున 63 మంది నేతలు పాల్గొననున్నారు. ఈ మేరకు ముంబయిలోని గ్రాండ్ హయత్‌ హోటల్‌లో భేటీ కానున్నారు. కూటమికి ఓ జెండాను ఎంపిక చేయనున్నారు. పార్టీల మధ్య సమన్వయం చేయడానికి ఓ కమిటీని కూడా నియమించనున్నారు. పాట్నా, బెంగళూరు సమావేశాల తర్వాత ముంబయి వేదికగా మూడోసారి జరుగుతున్న నేటి భేటీ చివరిది కావడం గమనార్హం. అందుకే ఈ సమావేశంలోనే కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం.   

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నితీష్ కుమార్, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ రోజు ముంబయికి చేరనున్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలో నేటి డిన్నర్ భేటీ జరగనుంది. 

దేశంలో ప్రస్తుతం ఏర్పడుతున్న ఇండియా కూటమి రాజకీయ ప్రత్యామ్నాయంగా మారనుందని ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ తెలిపారు. సీట్ల పంపకాలపై ఎలాంటి చర్చలు ఉండవని పేర్కొన్నారు. ఇండియా కూటమి భేటీకి వ్యతిరేకంగా మహారాష్ట్ర బీజేపీ కూడా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో లోక్‌సభ సీట్లపై సమీక్ష నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: Jammu Kashmir: జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement