
సాక్షి, అమరావతి: బాలినేని శ్రీనివాసరెడ్డి నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. బాలినేని అంశం తమ పార్టీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అంతర్గతం అని సజ్జల పేర్కొన్నారు.
‘‘బాలినేని స్పష్టమైన కారణం చెబుతున్నారు. తన సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని అంటున్నారు. వైఎస్సార్‌సీపీలో ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రయత్నం చేస్తోంది. టీ కప్పులో తుఫాను కాదు కదా.. అందులో టీ కూడా లేదు. వివాదాలేమీ లేవు.. అంతా మీడియా హడావుడి తప్ప మరేమీలేదు. మాట్లాడేందుకు ఏమీలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
చదవండి: భగవంతుడి నిర్ణయమో తెలీదు కానీ.. సీఎం జగన్‌పై జీఎంఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment