Employees union leaders
-
AP: ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ సస్పెండ్ అయ్యారు. ఆయన్ను సస్పెండ్ చేస్తూ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, 2019 నుంచి 2021 మధ్య గుంటూరు జిల్లా కుంచనపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన కేఆర్ సూర్యనారాయణతోపాటు ఆయన సహ ఉద్యోగులు మెహర్‌కుమార్, సంధ్య, వెంకట చలపతి, సత్యనారాయణ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని తెలిపారు. ఉద్యోగ సంఘ నాయకుడిగా, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఆయన పలువురు వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే అభియోగంపై విజయవాడ సిటీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయన పరారీలో ఉన్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం, ఉద్యోగిగా ఉంటూ విచారణకు సహకరించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపింది. హైకోర్టులో సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తం ఆరి్థక నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న కేఆర్ సూర్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు. కొందరు వ్యాపారులతో కుమ్మక్కై వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి భారీగా గండికొట్టి కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినందుకు సూర్యనారాయణతో పాటు మరికొందరు ఉద్యోగులపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సూర్యనారాయణ పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విజయవాడ కోర్టు గత వారం కొట్టేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఇది కూడా చదవండి: గిరిజనుల అభ్యున్నతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం -
మీరు బాగుంటేనే ప్రజలు బాగు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా సరే చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, వారంతా చిరునవ్వుతో ఉండేలా చూస్తామని అన్నారు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని, ఉద్యోగుల మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొత్తగా.. జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీం) తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, 12వ పీఆర్సీ ఏర్పాటు సహా పలు అంశాలపై ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సదర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ఏమన్నారంటే.. పరిష్కారాల కోసం తపనపడ్డాం ♦ ఉద్యోగుల మనసు కష్టపెట్టకూడదనే ఉద్దేశంతోనే పెన్షన్ సహా కొన్ని సమస్యల పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపన పడ్డాం. గతంలో ఎవరూ కూడా ఒక పరిష్కారం కోసం ఇంతగా తపన పడిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి.. అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలనే ఆలోచన చేశాం. వీటన్నింటి దృష్ట్యా జీపీఎస్ తీసుకువచ్చాం. ♦ రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.లక్ష జీతం ఉంటే రూ.50 వేలు రిటైర్ అయిన తర్వాత పింఛన్ వస్తుంది. 62 ఏళ్లకు రిటైర్ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని ఆలోచన చేశాం. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం. ♦ ఉద్యోగులకు న్యాయం జరగాలి.. మరోవైపు నడపలేని పరిస్థితులు రాకుండా కూడా చూడాలని ఆలోచించాం. సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. దీనికోసం రెండేళ్లపాటు ఆర్థిక శాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఫలితంగా జీపీఎస్‌కు రూపకల్పన చేశాం. చదవండి: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి మంచి జరిగేలా అడుగులేశాం ♦ న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు మంచి జరగాలని ప్రతి అడుగులో కనిపించే విధంగా చేశాం. ఇది సంతృప్తినిచ్చే అంశం. అసలు చాలా మంది ఎఫర్ట్ కూడా పెట్టరు. ఇంత ఆలోచన చేయాల్సిన పని ఏముందని అనుకుంటారు. అలా చేస్తే పరిష్కారం రాదు. అందుకే తొలిసారిగా పరిష్కారం దిశగా అడుగులు వేశాం. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా మంచి ఆలోచన చేశాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం. నా దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు పదేళ్లను విండోగా అధికారులు నిర్ణయించారు. అలాగైతే మరీ ఆలస్యమవుతుందని ఐదేళ్లకు తగ్గించాం. తద్వారా గరిష్టంగా ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. చిరునవ్వుతో ఉండేలా చేస్తాం ♦ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేశాం. 010 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగా వీరికి జీతాలు సమయానికి రావు. పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో కూడా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకున్నాం. ♦ ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన మంచి జరగాల్సి ఉన్నా, మీ మొహంలో (ఉద్యోగులు) చిరునవ్వు ఉండేలా చేస్తాం. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలకూ మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ♦ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలపై చర్చించామని, టైమ్‌లైన్ ప్రకారం ప్రతి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, ఒక్కొక్క జీవోను వరుసగా విడుదల చేస్తామని, ఉద్యోగుల బకాయిల్లో 70 శాతం చెల్లించాం.. సీపీఎస్‌పై మరోసారి చర్చిస్తామని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్చించాం.. దాని అమలుకు స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు. హెల్త్‌కార్డుల కంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు మళ్లించాలని నిర్ణయించాం: వెంకట్రామిరెడ్డి ‘‘ఉద్యోగుల పెండింగ్ బకాయిల్లో రూ.5,820 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. పెండింగ్ డీఏలలో ఒక డీఏను చెల్లిస్తామని చెప్పారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి అన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వారం రోజుల్లో ఒక డీఏ ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరాం. 2004కు ముందు నోటిఫికేషన్లో భర్తీ అయిన వారికి ఓపీఎస్ పరిధిలోకి తెస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి టైమ్‌లైన్ కోవాలని కోరాం. సెప్టెంబర్ లోపు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఉత్తర్వులు ఇస్తామన్నారు. కొత్త పీఆర్సీని నియమించాలని కోరాం. ఉద్యోగుల హెల్త్‌కార్డుల కంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు మళ్లించాలని నిర్ణయించాం’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు. చదవండి: ‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’ -
ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సమావేశం
విజయవాడ: ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై చర్చల్లో భాగంగా బొత్స నివాసానికి ఉద్యోగ సంఘాల నేతలు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, ఇతర నాయకులు వచ్చారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాం. మా సమస్యలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏప్రిల్‌లో బదిలీ అవకాశం ఉంటుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సామాజిక పథకాలు ఇవ్వాలని కోరాం.గ్రేడ్-3 ఏఎన్ఎంలకు జాబ్‌చార్ట్ ప్రకారం ప్రమోషన్లు ఉంటాయి’ అని తెలిపారు. -
అన్ని అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తాం
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో పీఆర్సీ పెండింగ్ అంశాలు, వాటిలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సభ్యులైన సజ్జల, బొత్స సత్యనారాయణ చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఆర్థికేతర అంశాలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలులో సమస్యల పరిష్కారం, పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంపును సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాలతో పాటు పలు సంస్థల ఉద్యోగులకు వర్తింపచేయడం, కొత్త జిల్లాలకు పాత జిల్లాల హెచ్ఆర్ఏ వర్తింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కోవిడ్ వల్ల మరణించిన ఉద్యోగుల కుటుంబీకులకు సత్వరమే కారుణ్య నియామకం, క్యాడర్‌వారీగా పే స్కేళ్ల ఫిక్సేషన్ జీవో జారీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆర్థిక అంశాలకు సంబంధించి పెండింగ్ బిల్లుల క్లియరెన్సు, పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపు తదితర అంశాలపైనా చర్చించారు. ఈ సమావేశంలో జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కీలకమైన ప్రత్యేక హోదాయే ఇవ్వలేదు.. పునర్విభజన పెద్ద విషయం కాదు విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, కీలకమైన ప్రత్యేక హోదాయే ఇవ్వలేదని, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కేంద్రానికి పెద్ద విషయమేమీ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. బుధవారం ఆయన వెలగపూడి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ప్రత్యేక హోదాపైనే కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని చెప్పారు. చంద్రబాబు బీజేపీతో అధికారాన్ని పంచుకున్నప్పుడు ప్రత్యేక హోదా గురించి ఒత్తిడి చేయలేదని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చడం వంటి అంశాలతో వాళ్లు రాజీ పడ్డారని, దానివల్ల రాష్ట్రం నష్టపోయిందని తెలిపారు. తమ పార్టీ విధానం పరిపాలన వికేంద్రీకరణ అని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇంకా కిందిస్థాయికి ప్రాతినిథ్యం పెరుగుతుందని చెప్పారు. వరదల గురించి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన మొక్కుబడిగా లక్ష మాటలు మాట్లాడతారని, ఆయనది అంతా ఈవెంట్ మేనేజ్మెంట్ అని, కెమెరాలకు పోజులివ్వడానికే వెళతారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ వరద ప్రాంతాల్లో షెడ్యూల్లో లేని గ్రామాలకు కూడా వెళ్లారని, ప్రతి గడపను టచ్ చేశారని తెలిపారు. సాయం అందలేదన్న మాట ఎక్కడా వినపడలేదన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. విలీన గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపమని కోరలేదని స్పష్టం చేశారు. వరదలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. జిల్లా కేంద్రం పాడేరు దూరంగా ఉందని వేరే సందర్భంలో చెప్పిన విషయాన్ని వరదలకు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. -
AP: పీఆర్సీ జీవో అంశాలు.. తాజా మార్పులు ఇలా..
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ, దానికి సంబంధించిన పలు అంశాల్లో ప్రభుత్వం రెండ్రోజులపాటు ఆయా ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపి మార్పులు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఆదివారం జరిగిన మర్యాదపూర్వక భేటీలో ఉద్యోగులకు ఎంతో భరోసా కల్పించారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గత నెలలో ఇచ్చిన జీఓల ప్రకారం ఉద్యోగులకు కలిగే లబ్ధి ఎలా ఉంది.. సీఎం వైఎస్ జగన్ ఆమోదంతో తాజాగా చేసిన మార్పులు తర్వాత ఎలా ఉందంటే.. గత నెలలో పీఆర్సీ జీఓ ప్రకారం.. ► 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. హెచ్ఆర్ఏ శ్లాబులు.. ► 50 లక్షల జనాభా దాటితే : 24 శాతం ► 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే : 16 శాతం (సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఇది వర్తింపు) ► 5 లక్షల జనాభా వరకు : 8 శాతం పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (కేంద్ర వేతన సవరణ ఆధారంగా..) ► 80 ఏళ్లు దాటిన వారికి : 20 శాతం ► 85 ఏళ్లు దాటితే : 30 శాతం ► 90 ఏళ్లు దాటితే : 40 శాతం ► 95 ఏళ్లు దాటితే : 50 శాతం ► 100 ఏళ్లు దాటితే : 100 శాతం ► సవరించిన పే స్కేల్స్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి గ్రాట్యుటీ చెల్లింపు ► 2019 జూలై నుంచి 2021 డిసెంబర్ వరకు చెల్లించిన మధ్యంతర భృతిని డీఏ బకాయిల నుంచి సర్దుబాటు ► వేతన సవరణ కాల పరిమితి కేంద్ర వేతన సవరణ కమిషన్ ప్రకారం వర్తింపు ► కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు.. ఉద్యోగాల క్రమబద్ధీకరణకు చర్యలు ► ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు ► కార్యదర్శుల కమిటీ సిఫారసుల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీసీఏ అవసరంలేదని భావించి ఉపసంహరణ ► సీసీఏ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని నిర్ణయం ► మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్‌టెన్షన్‌పై త్వరితగన నిర్ణయం ► ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు ► గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను 2022 జూన్ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు తాజా చర్చల్లో ప్రభుత్వం ఆమోదించిన అంశాలు.. ► గతంలో ప్రకటించిన విధంగా ఫిట్మెంట్ 23 శాతం కొనసాగింపు మారిన హెచ్ఆర్ఏ శ్లాబులు ► 50 వేలలోపు జనాభా ఉంటే : 10 శాతం, రూ.11 వేలు సీలింగ్ ► 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే : 12 శాతం, రూ.13 వేలు సీలింగ్ ► 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా : 16 శాతం, రూ.17 వేలు సీలింగ్ (13 జిల్లా కేంద్రాలకు ఇదే శ్లాబు వర్తింపు) ► 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే 24 శాతం, రూ.25 వేల సీలింగ్ ► సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో 24 శాతం హెచ్ఆర్ఏ (2022 జూలై నుంచి 2024 జూన్ వరకు) రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్.. ► 70–74 ఏళ్ల వయసు వారికి : 7 శాతం ► 75–79 ఏళ్ల వయసు వారికి : 12 శాతం ► గ్రాట్యుటీ గతంలోలా కాకుండా 2022 జనవరి నుంచి అమలు ► 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు (9 నెలలు) ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని సర్దుబాటు చేయరు. ► వేతన సవరణ పరిమితి ఐదేళ్లు. కేంద్ర వేతన సవరణ కమిషన్‌ను రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయరు. ► ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు ► పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు ► మారిన హెచ్ఆర్ఏ శ్లాబులు ఈ ఏడాది జనవరి నుంచి అమలు. ► ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల. ► సీపీఎస్ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటు. 2022 మార్చికల్లా దీనిపై రోడ్ మ్యాప్ రూపకల్పన ► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు. ఎన్ఎంఆర్ ఉద్యోగుల అంశం దీనిలోనే పరిశీలన ► మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్టెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల ► ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు ► గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ 2022 జూన్ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు ► పీఆర్సీ నివేదిక విడుదల అంశం పరిశీలిస్తాం -
భాద పోయింది.. చాలు సర్
-
AP: ఆందోళన విరమణ
ఒప్పంద వివరాలివీ.. ► ప్రత్యేక జీవో ద్వారా త్వరలో పీఆర్సీ నివేదిక విడుదల.. గతంలో ప్రకటించిన విధంగా ఫిట్మెంట్ 23 శాతం కొనసాగింపు ► 50 వేల లోపు జనాభా ఉంటే రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్ఆర్ఏ ► 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్ఆర్ఏ ► 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉంటే రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్ఆర్ఏ ► 13 జిల్లా కేంద్రాలకు ఇదే స్లాబు వర్తింపు.. ఈ జనవరి నుంచి అమలు ► 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.25 వేల సీలింగ్‌తో 24 శాతం హెచ్ఆర్ఏ ► సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో 2024 జూన్ వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ► రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70–74 ఏళ్ల వారికి 7 శాతం, 75–79 ఏళ్ల వారికి 12 శాతం ► 2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు.. మధ్యంతర భృతి రికవరీ ఉపసంహరణ ► వేతన సవరణ పరిమితి ఐదేళ్లే.. అంత్యక్రియల ఖర్చు రూ.25 వేలు ► పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు ► ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల ► సీపీఎస్‌ను పరిశీలించేందుకు కమిటీ ఏర్పా టు.. 2022 మార్చి 31 నాటికి రోడ్ మ్యాప్ ► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు.. ఎన్ఎంఆర్ ఉద్యోగుల అంశంపై ఇందులోనే పరిశీలన ► మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్టెన్షన్కు సంబంధించి త్వరలో ఉత్తర్వులు ► ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు ► 2022 జూన్ 30లోపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు. సాక్షి, అమరావతి: మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటిస్తూ.. చొక్కాలకు పెట్టుకున్న నల్ల బ్యాడ్జీలను తొలగించారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సీఎంను కలిసి ధన్యవాదాలు తెలుపుతామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల కోరికలపై సీఎం వైఎస్ జగన్ సూచనలకు అనుగుణంగా మంత్రివర్గ ఉప సంఘం రెండు రోజులపాటు విస్తృతంగా చర్చలు జరిపింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుది విడత చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు టెలిఫోన్లో సీఎంకు వివరిస్తూ ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు పూర్తయ్యాక మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎంకు ఫోన్లో వివరించగా ఆయన ఆమోదించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన సమితి సంయుక్తంగా వెలగపూడి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చర్చోప చర్చలు.. తొలుత ఉదయం మంత్రుల కమిటీలో ఉన్న సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, జీఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు పలు అంశాలపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి శుక్రవారం జరిగిన చర్చల వివరాలను తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని ఉద్యోగులు కోరిన మార్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి ఆర్థిక శాఖాధికారులతో చర్చించారు. అనంతరం 4 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై రాత్రి 10 గంటల వరకు చర్చలు జరిపారు. ఏకాభిప్రాయంతో సానుకూలంగా ఉద్యోగ సంఘాలను ఒప్పించడంతో వారు సమ్మె విరమించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డిలతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యోగుల ఆవేదన గుర్తించాం.. పీఆర్సీ తదనంతర పరిణామాలపై నిన్న (శుక్రవారం), ఈరోజు (శనివారం) సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఉద్యోగులు ఆశించిన మేర పీఆర్సీ లేకపోవడం వల్ల వారిలో ఉన్న ఆవేదన, అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి అంశాన్ని లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. అందుకే అడక్కుండానే సీఎం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సీఎం మొదటి నుంచి చెబుతున్నారు. ఒకేసారి ఐదు డీఏలు ఇచ్చారు. పీఆర్సీ కూడా వారికి బాగా ఇవ్వాలని భావించారు. కానీ కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా దెబ్బతింది. అందుకే అనుకున్న మేరకు, ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ ఇవ్వలేకపోయారు. వారికి ఇంకా మేలు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. ఎంత వరకు చేయాలో అంతవరకు పీఆర్సీ ఇచ్చారు. ఆందోళనల సందర్భంగా కొందరు ఉద్యోగులు ఇబ్బందికరంగా మాట్లాడినా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించింది. త్వరగా సమస్య పరిష్కారం అవడానికి చర్చలే దోహదం చేశాయి. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు నిజంగా ఇది గుడ్ డీల్ ఈ రోజు ఉద్యోగులకు గొప్ప శుభదినం. వ్యవస్థలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలుంటాయి. వాటిని నేర్పుతో, ఓర్పుతో సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలి. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగుండి ఉండే మంచి బెనిఫిట్స్ వచ్చి ఉండేవని ఆశించేవాళ్లం. కానీ ఉన్నంతలో మంచి పీఆర్సీ ఇచ్చారు. కొన్ని అంశాలలో అన్యాయం జరగడంతో రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈరోజు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోగలిగాం. పీఆర్సీ కోసం ఏర్పాటైన అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మేము లేవనెత్తిన డిమాండ్లలో ప్రధానమైన ఐఆర్ రికవరీ నిలిపి వేయడం, హెచ్ఆర్ఏ స్లాబ్‌లు సరిచేయడం, పెన్షనర్స్‌కు అదనపుæ క్వాంటంను పునరుద్దరించడం, ఐదేళ్ల కోసారి పీఆర్సీ ఏర్పాటు చేసే అంశాన్ని కొనసాగిస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఆర్టీసీలో పీఆర్సీ అమలుకు ప్రత్యేక ఉత్తర్వులిస్తామన్నారు. సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకోవడంతో మార్చి 31వ తేదీలోగా రోడ్‌మ్యాప్ డిక్లేర్ చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, 1993 నవంబర్ 25కు ముందున్న ఎన్ఎంఆర్ కంటిజెంట్ ఎంప్లాయిస్ను కూడా ఆ పరిధిలోకి తీసుకురావాలన్న హామీని కూడా అంగీకరించారు. విలేజ్, వార్డు సచివాలయ సిబ్బందికి జూన్ 30లోగా ప్రొబెషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ అమలు చేస్తామని చెప్పారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ స్టీమ్‌లైన్ చేసే వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ కొనసాగిస్తామని చెప్పారు. పీఆర్సీ రిలేటెడ్ అంశాలు 9, ఇతర సమస్యలు 4 అంశాలు తాము లేవనెత్తగా, తాము డిమాండ్ చేయని మరో నాలుగు అంశాలు కలిపి..17 అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. నాలుగు జేఏసీల తరఫున పీఆర్సీ సాధన సమితి ఏకగ్రీవంగా ఈ డిమాండ్లను ఆమోదిస్తూ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. మంత్రులు, సీఎస్, ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా మాట్లాడి ఉంటే మన్నించగలరు. – సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత సీఎం చొరవతోనే సమస్య పరిష్కారం రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించిన మీదట సమస్యలు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే మనమే తిప్పలు పడదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. సీఎం చొరవతోనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గంటల కొద్దీ చర్చించాం. చివరిలో కావాలని చేసినట్టు ఒకరిద్దరు ఇబ్బందిగా మాట్లాడారు. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు చర్చలపై సానుకూలంగా స్పందించి సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. సీఎం వైఎస్ జగన్ చొరవతోనే సమస్య పరిష్కారమైంది. రాష్ట్రం ఇంత ఆర్థిక పరమైన ఒడిదుడుకులు పడినా వాటిని అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. – మంత్రి పేర్ని నాని ప్రభుత్వానికి కృతజ్ఞతలు రెండు రోజులుగా చీఫ్ సెక్రటరీ, మంత్రి మండలి ఉప సంఘంతో జరిపిన చర్చలు అందరికీ ఆమోద యోగ్యమైన రీతిలో సాగాయి. మంత్రుల కమిటీ నిన్న రాత్రి ఒంటిగంట వరకు చర్చలు జరిపి.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల్ల పట్ల ప్రేమాభిమానాలను స్పష్టం చేసింది. మాకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించి, మేము లేవనెత్తిన డిమాండ్లపై కూలంకషంగా చర్చించి వాటి పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము అడక్కుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆశా వర్కర్ల జీతాలు పెంచారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇలా ఎన్నో చేశారు. అందువల్లే మరింత మెరుగైన పీఆర్సీ ఇస్తారని ఆశించాం. అదే స్థాయిలో చాలా వరకు ఇచ్చారు కూడా. అయితే కొన్ని అంశాల్లో మాకు జరిగిన అన్యాయం దృష్ట్యా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఛలో విజయవాడలో కొంత మంది మాకేదో ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న ఆవేదనతో ముఖ్యమంత్రి పట్ల చేసిన వ్యాఖ్యల విషయంలో అన్యధా భావించవద్దు. ప్రభుత్వం వేరు.. ఉద్యోగులు వేరు కాదు.. ఉద్యోగులూ మా కుటుంబ సభ్యులని ముఖ్యమంత్రి చెబుతుంటారు. ఏది ఏమైనా మా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఐదు డీఏలు ఒకేసారి ఇవ్వడంతో పాటు మేము కోరుకున్నట్టుగా హెచ్ఆర్ఏ, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సీసీఎస్‌ను పునరుద్దరించడం కోసం రూట్‌మ్యాప్ వంటి ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావడంతో 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నాం. ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తాం. – బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు, పీఆర్సీ సాధన సమితి సభ్యుడు సీఎం చొరవ అభినందనీయం ముఖ్యమంత్రికి ఉద్యోగుల పట్ల ఎంత అభిమానం ఉందో మరోసారి చూపించారు. 3వ తేదీన భారీ సంఖ్యలో ఉద్యోగులు రోడ్డుమీదకొచ్చి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసి.. 24 గంటలు గడవక ముందే సీఎం స్పందించి మా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండ్రోజులుగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి సూచనలతో మంత్రుల కమిటీ మాతో సుదీర్ఘంగా చర్చించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాలను కనుక్కోవడంలో ముఖ్యమంత్రి చూపిన చొరవ అభినందనీయం. ముఖ్యమంత్రికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. మేము ఎక్కువగా రాజీకి వచ్చే అవకాశం లేకుండానే మేము పెట్టిన చాలా డిమాండ్లలో ఒకటి రెండు తప్ప అన్ని డిమాండ్ల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఉన్న హెచ్ఆర్ఏ కొనసాగించాలనే డిమాండ్ మేరకు 24 శాతం హెచ్ఆర్ఏ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. సీసీఎస్ కొనసాగేలా అంగీకరించినందుకు కృతజ్ఞతలు. 10 ఏళ్ల పీఆర్సీ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రొబేషన్ డిక్లేర్ అయ్యాక కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ఇస్తామన్నారు. ఐదు డీఏలు ఒకేసారి అమలు చేయడం గొప్ప నిర్ణయం. దాంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత ఎక్కువ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించారు. మా ఆవేదనలో హద్దుమీరి ఒకరిద్దరు మాట్లాడి ఉంటారు. వారి తరఫున ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతున్నాం. – కె వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత మా సమస్యలు పరిష్కారం ఊహించని రీతిలో మంత్రులు కమిటీ ముందుకొచ్చి మా డిమాండ్ల పరిష్కార దిశగా సానుకూలంగా స్పందించడం అభినందనీయం. ఒకేసారి ఐదు డీఏలు ఇవ్వడంతో జీతం పెరుగుతుందన్న ఆలోచనతో హెచ్ఆర్ఏ, సీసీఏలు, పెన్షనర్ల బెనిఫిట్లు పూర్తిగా తొలగించడం, కొన్ని తగ్గించడం వంటి చర్యలు వలన ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ఈరోజు చర్చలనంతరం ప్రధానంగా మేము కోరుతున్న పీఆర్సీ నివేదికను ఉత్తర్వులతో పాటు ఇస్తామని చెçప్పడం మాకు చాలా సంతోషం కల్గించింది. హెచ్ఆర్ఏ స్లాబ్‌లలో సవరణ, ఐఆర్ రికవరీ చేయడాన్ని నిలుపుదల చేయడం, గతంలో మాదిరిగా పీఆర్సీ 5 ఏళ్ల కోసారి ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్, యూనివర్సిటీ, గురుకులాలకు పీఆర్సీ అమలుకు ఉత్తర్వుల జారీ విషయంలో చాలా రోజులు పట్టేది. వీరికి కూడా తక్షణమే పీఆర్సీ అమలయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సపరేట్గా ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించారు. పీఆర్సీతో పాటు అనుబంధంగా ఉన్న సీపీఎస్ రద్దు అంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, వార్డు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక రోడ్ మ్యాప్ ద్వారా పరిష్కరించే దిశగా సిద్ధం చేస్తామని చెప్పడం చాలా సంతోషం కలిగించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించడానికి ఒప్పుకున్నారు. ఈలోగా ఎంప్లాయిస్ హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో స్ట్రీమ్‌లైన్‌లోకి తీసుకొచ్చేందుకు హామీ ఇవ్వడం సంతోషం. కోవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యమ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిని పలు సందర్భాల్లో విమర్శించినందుకు అన్యధా భావించవద్దని కోరుతున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, పీఆర్సీ సాధన సమితి నేత -
AP: మంత్రుల కమిటీతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించిన ఉద్యోగ సంఘాలు చర్చించాయి. దాదాపు నాలుగున్నర గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎస్ సమీర్ శర్మ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. స్టీరింగ్ కమిటీ తరపున 20 మంది ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ) -
చర్చోప చర్చలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రుల కమిటీ మధ్య మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తొలుత ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రుల కమిటీ సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల వ్యవహారాలు) చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహించిన చర్చలు సానుకూలంగా జరిగాయి. (మరో సభ్యుడు మంత్రి పేర్ని నాని అనారోగ్యంతో ఈ సమావేశానికి హాజరు కాలేదు) పీఆర్సీ సాధన సమితి నేతలు వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ తదితర నేతలు ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు. తమకు పాత జీతాలే వేయాలని మరోసారి మంత్రుల కమిటీని కోరారు. దీంతో పాటు కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవోలను రద్దు చేయాలని, పీఆర్సీ నివేదికను ఇవ్వాలన్నారు. అంశాల వారీగా చర్చలు జరిపిన తర్వాత మరోసారి చర్చలకు పిలుస్తామని మంత్రుల కమిటీ వారికి చెప్పింది. చర్చలకు అందుబాటులో ఉండాలని కోరింది. అన్ని విషయాల గురించి మాట్లాడుకుందామని, ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించవద్దని మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలను కోరింది. అనంతరం వారు అక్కడి నుంచి బయటకు వెళ్లారు. కాగా, మంగళవారం చర్చలు సానుకూలంగా జరిగాయని, మరోసారి మళ్లీ చర్చలు జరుపుతామని సాయంత్రం తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. పీఆర్సీ సాధన కమిటీ ర్యాలీకి అనుమతి నిరాకరణ విజయవాడ స్పోర్ట్స్: పీఆర్సీ సాధన కమిటీ ఈ నెల 3వ తేదీన చేపట్టనున్న చలో విజయవాడ ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పోలీస్ కమిషనరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మూడో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలో భారీ ర్యాలీకి పీఆర్సీ సాధన కమిటీ అనుమతి కోసం తమకు దరఖాస్తు చేసుకుందన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తి, సెక్షన్ పోలీస్ యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో వారికి అనుమతి నిరాకరించామని చెప్పారు. విజయవాడ నగరంలో కోవిడ్ ఉధృతి ఎక్కువ ఉందని, ఈ ర్యాలీ ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వారి వద్దకు వచ్చే సామాన్య ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేల మందితో ర్యాలీలు చట్టపరంగానే కాకుండా ఎంప్లాయ్ కాండాక్ట్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల ఉద్యోగులెవ్వరూ ఈ ర్యాలీకి రాకూడదని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమ్మెకు వెళ్లొద్దు.. అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఆందోళనలు విరమించుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలను కోరాం. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ ద్వారా ఉద్యోగులకు ఎంత చేయాలో అంత చేసిన విషయాన్ని మరోసారి వారికి వివరించాం. ఉద్యోగ సంఘాల నాయకులు పాత పీఆర్సీని అమలు చేయాలని కోరారు. పీఆర్సీ ప్రకటించి కొత్త పీఆర్సీ అమలైన తర్వాత పాత పీఆర్సీని అమలు చేయడం ఎంత వరకు సాధ్యమో ఆలోచించాలని చెప్పాం. ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని రికవరీ చేయడం ఏమీ లేదు. ఐఆర్ అనేది కేవలం సర్దుబాటు మాత్రమే. అది రికవరీ కాదు. ఉద్యోగులపై బెదిరింపులు, ఒత్తిళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించే వరకు వెళ్లవద్దని వారిని కోరాం. అధికారుల కమిటీ నివేదికలోనే పీఆర్సీ నివేదికలోని అన్ని అంశాలు ఉన్నాయని వారికి వివరించాం. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు చలో విజయవాడను విజయవంతం చేయాలి గురువారం చేపట్టే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులందరూ విజయవంతం చేయాలి. ప్రభుత్వంతో చర్చలు సఫలం కాలేదు. ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుంది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో కొత్త పీఆర్సీ ప్రకారం నష్ట పోతున్న విషయాన్ని మళ్లీ చెప్పాం. మూడు ప్రధాన అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం. అవి సాధ్యపడవని మంత్రుల కమిటీ సమాచారం ఇచ్చింది. అందుకే కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్లు ఛలో విజయవాడకు వెళ్లొద్దని ఉద్యోగులకు చెప్పే ప్రైవేటు క్లాసులు మానుకోవాలి. ఉద్యోగులను భయ భ్రాంతులకు గురి చేయొద్దని కలెక్టర్లకు చెబుతున్నాం. సమ్మెలు, ఆందోళనలు తాత్కాలికమే. మళ్లీ అంతా కలిసి పని చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. – బండి శ్రీనివాసరావు, పీఆర్సీ సాధన సమితి నేత, ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు -
కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: పీఆర్సీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సమస్యలపై చర్చకు ఉద్యోగులను ఆహ్వానించామని, అయినప్పటికీ ఉద్యోగులు రాలేదన్నారు. మూడు రోజులు ఎదురు చూసినా ఉద్యోగులు రాలేదని, వాళ్లు రాకుండా ద్వితీయ శ్రేణి వాళ్లను పంపారని చెప్పారు. ఇకపై కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల కోసమే సీఎం కమిటీ వేశారని మంత్రి బొత్స తెలిపారు. ఉద్యోగులు ఏ కోరిక కోరినా సమంజసంగా ఉండాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించకుండా నిరసన చేస్తూనే జీతాలు ఇవ్వమంటున్నారని, తాము ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. మాట తూలితే దానికి సంఘ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. చదవండి: ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పదోన్నతి -
మీరు కోరినప్పుడే చర్చలు
సాక్షి, అమరావతి, విశాఖపట్నం: తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చినప్పుడే ప్రభుత్వం చర్చలకు కూర్చుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో, ఆ తర్వాత విశాఖలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రుల కమిటీ నాలుగు రోజులుగా చర్చలకు ఆహ్వానిస్తున్నా ఉద్యోగ సంఘాల నాయకులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల కమిటీ రోజూ వచ్చి కూర్చోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వ సానుకూల వైఖరిని అలుసుగా తీసుకోవద్దని హితవు పలికారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఏ సమస్య వచ్చినా తమకు వచ్చినట్లేనన్నారు. సుహృద్భావ వాతావరణంలో పరిష్కారాన్ని అన్వేషించాలన్నారు. ఉద్యోగుల పిలుపు కోసం ఎదురు చూస్తామని, ఎప్పుడొచ్చినా తలుపులు తెరిచే ఉంటాయన్నారు. జీతాలు చూశాక మీరే చెప్పండి ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వంలో అంతర్భాగమని, మొండిగా వాదించకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు కంటే ఈ పీఆర్సీలో రూ.16 వేల కోట్లు అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు. ‘1వ తేదీన వచ్చే పే స్లిప్‌లో జీతం పెరుగుతుందో.. తగ్గుతుందో చూసుకోమంటే మాకు కొత్త జీతాలు వద్దంటున్నారు. ఆ జీతం తీసుకుని వాస్తవాలను ప్రజలకు చెప్పవచ్చు కదా? ఉద్యోగుల జీతాలు ఏ ఒక్కరికీ రూపాయి కూడా తగ్గవు. ఇతర సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలి. చరిత్రను చూస్తే చర్చలు విఫలమైన తర్వాతే యుద్ధాలు జరిగాయి. ఇక్కడ మనస్పర్థలు లేవు, భేషజాలు లేవు. మంచి వాతావరణం ఉంది. ఎందుకోసం ఇది జరుగుతుందో ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. చర్చల విషయంలో ఉద్యోగ సంఘాల ఆలోచనలు తమకు అర్థం కావట్లేదన్నారు. తాను గతంలో పదేళ్లు మంత్రిగా పని చేశానని, ఎన్నో ఉద్యోగ సంఘాల పోరాటాలు చూశానన్నారు. అప్పటి నాయకులు చర్చలు నిర్వహించాలని తనను కోరేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే చర్చలకు ఆహ్వానిస్తున్నా రాకపోవడం వెనుక రాజకీయ ఆలోచనలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను ప్రశ్నించడం సరికాదు సంక్షేమ పథకాల అమలును ప్రశ్నించడం సరికాదని మంత్రి బొత్స అన్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలతో పోలిస్తే సంక్షేమ పథకాలకు వెచ్చించేది చాలా తక్కున్నారు. ఇలాంటి లెక్కలతో ఘర్షణ వాతావరణానికి తెర తీసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వెనక ఇతరుల ప్రమేయం ఉంటుందనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయని చెప్పారు. 5 కోట్ల మంది ప్రజలను మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితం చేసేస్తారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటేనే ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు. చదవండి: ‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’ -
కష్టకాలంలో మంచి నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, సొంతింటి కల దిశగా ఎంఐజీ లే అవుట్లలో ప్లాట్లు తాము ఊహించలేదని, మొత్తంగా పీఆర్సీ పట్ల సంతృప్తిగా ఉన్నామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని, కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వారు సీఎంవో అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ చిత్రపటానికి స్వర్ణ కమలాభిషేకం శ్రీకాళహస్తి: ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఇతర వరాలు ప్రకటించిన నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన చిత్రపటాన్ని స్వర్ణ పుష్పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు చెంచురత్నంయాదవ్, నారాయణరెడ్డి, రవికాంత్, నాగేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేతలు కృష్ణగిరి రెడ్డి, గోపి, విశ్రాంత ఉద్యోగుల సంఘం నేత రమణయ్య, పురపాలక, ఆర్టీసీ తదితర ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల్లో పండుగ సందడి ప్రభుత్వం పీఆర్సీ 23 శాతం పెంచడంతో పాటు పలు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఉద్యోగులందరూ ఆనందంగా ఉన్నారని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాపరెడ్డి అన్నారు. శనివారం ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఆయన ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు గుంటూరులో ఎమ్మెల్సీ కల్పలత ఉపాధ్యాయ, ఉద్యోగులతో కలసి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు ఆశించినట్లే హెచ్ఆర్ఏ ఉంటుంది హెచ్ఆర్ఏ విషయంలో ప్రస్తుత శ్లాబులనైనా కొనసాగించాలి, లేదా పీఆర్సీ కమిషనర్ సూచించిన శ్లాబులనైనా పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశాం. పెన్షనర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాం. హెచ్ఆర్ఏ ఉద్యోగులు ఆశించినట్లే ఉంటుంది. సీఎం నిర్ణయాల పట్ల అందరూ ఆనందంగా ఉన్నారు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వంపై నమ్మకం ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద మాకు నమ్మకముంది. అదనపు పెన్షన్ విషయంలో సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే పెన్షనర్లు ఇబ్బందులు పడతారని చెప్పాం. 62 ఏళ్లకు పదవీ విరమణ, సొంతింటి కల మేము ఊహించని నిర్ణయం. అన్ని సమస్యలపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి సచివాలయాల ఉద్యోగులకు మేలు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలిసీ తెలియక కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వాళ్లందరికీ తప్పకుండా రెగ్యులర్ అవుతుంది. ఇతర ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది. కారుణ్య నియామకాల విషయంలో ఏ శాఖలో అయినా నియామకం చేయాలని కోరాం. – కె.వి.శివారెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేటి సమావేశం వాయిదా ఈ నెల 7న సీఎం జగన్ ప్రకటించినవి కాకుండా మిగిలిన విషయాల గురించి శనివారం సీఎంవో అధికారులతో చర్చించాం. కోవిడ్, నాన్ కోవిడ్‌లో చనిపోయిన వారికి కూడా కారుణ్య నియామకాలు చేయాలని కోరాం. సానుకూలంగా నిర్ణయాలు జరిగాయి కాబట్టి మా కార్యాచరణ కోసం ఆదివారం జరగాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నాం. – వైవీ రావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ ఫిట్మెంట్ విషయంలో ఉపాధ్యాయులు కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. కానీ డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. సీఎం రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించాలని చెప్పారు. మేమంతా అర్థం చేసుకుని ఆమోదించాం. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతున్నాయి. – జోసెఫ్ సుధీర్ బాబు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరాం. సీఎంవో అధికారులను కలిసి మా సమస్యను వివరించాం. ఎలిజిబిలిటీ ఉన్న వారికి వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని విన్నవించాం. ఉన్నతాధికారి అజయ్ జైన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం నిర్మాణ భవన్లో నిర్వహిస్తామన్నారు. – బత్తుల అంకమ్మ రావు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు కొత్త పీఆర్సీలో భాగంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొత్త స్కేల్స్ వర్తింప చేస్తామని ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కార్యక్రమాలతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కడం పట్ల గర్వంగా ఉంది. – కె.నాగరాజు, స్టేట్ సెర్ప్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ సీఎం నిర్ణయం సాహసోపేతం ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం సాహసోపేతమైనది. ఈ పీఆర్సీలో మానవత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉద్యోగులను వేరుగా చూడటంలేదు. ప్రభుత్వంలో అంతర్భాగంగా చూస్తోంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా ఉద్యోగుల కష్టాలను తీరుస్తోంది. రిటైర్మెంట్ వయో పరిమితి పెంచటంపై ఎల్లో మీడియా పెదవి విరచడం దారుణం. చంద్రబాబు వయస్సు ఎంత, ఎందుకు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వడంలేదో చెప్పాలి. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లకు జగనన్న ఇచ్చిన సంక్రాంతి కానుక. – వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ -
ఉద్యోగులకు ఇచ్చినదాంట్లో అదే హైలైట్
-
AP: చాలా సంతోషంగా ఉంది: ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేస్తామనడం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హెచ్ఆర్ఏపై సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు చెప్పారన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు కూడా న్యాయం జరుగుతోందన్నారు. ఊహించని విధంగా పదవీ విరమణ వయస్సు పెంచారన్నారు. ఈ నెల 9న చేపట్టిన జేఏసీ సమావేశం వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. చదవండి: వెలుగు చూసిన టీడీపీ నేతల దురా‘గతం’.. అసలేం జరిగిందంటే? -
సీఎం జగన్ పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం
-
ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయమని ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువే చేసినందున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జనవరి జీతం నుంచే పెంచిన పీఆర్సీ, ఐదు డీఏలు ఇస్తామడం మంచి బెనిఫిట్ అనిపేర్కొన్నారు. ఉద్యోగుల పక్షపాతి సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్డ్ తీసుకున్న నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారు. రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమైన నిర్ణయం. ఈ జనవరి జీతం నుంచే పెంచిన పీఆర్సీ, 5డీఏలు ఇస్తామనడం మంచి బెనిఫిట్. ఏప్రిల్‌లోపు పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తామని చెప్పడం మంచి పరిణామం. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎవరూ ఊహించని వరాలు ఎవరూ ఊహించని విధంగా సీఎం.. మాకు వరాలిచ్చారు. సీఎస్ కమిటీ సిఫారసు చేసినట్లు 14.29 ఫిట్‌మెంట్‌ను పక్కన పెట్టి 23 శాతం ఇచ్చారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను జూన్ 30లోపు కొత్త ఫిట్మెంట్ సహా క్రమబద్దీకరిస్తామని స్పష్టంగా చెప్పారు. ఇళ్లు లేని వారికి 20 శాతం రిబేటుతో స్థలాలు కేటాయిస్తామనడం అభినందనీయం. మేం ప్రభుత్వానికి 71 డిమాండ్లు ఇవ్వగా 50 డిమాండ్లకు పరిష్కారం దొరికింది. – బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్ సాహసోపేత నిర్ణయాలు సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలివ్వాలని ప్రతిపాదించినప్పటికీ, ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే ఇవ్వాలని సీఎం ఆదేశించటం అభినందనీయం. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడంపై మేం ఆశ్చర్యానికి గురయ్యాం. ఇది నిజంగా సాహసోపేత నిర్ణయం. మెజారిటీ బెనిఫిట్స్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఎసీ అమరావతి చైర్మన్ అన్నీ ఉద్యోగ సంఘాలు హర్షిస్తున్నాయి ఎక్కడా లేని విధంగా పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం పట్ల అన్ని ఉద్యోగ సంఘాలు హర్షించాయి. రెండు వారాల్లో హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. ఇళ్లు లేని ఉద్యోగులకు ఎంఐజీ లే అవుట్ లో 20 శాతం రిబేటు ఇచ్చి స్థలం కేటాయిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను ఈ నెల వేతనంతో ఇవ్వనున్నారు. మొత్తంగా సీఎం నిర్ణయాల పట్ల ఉద్యోగులందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది. – ఎన్.చంద్రశేఖరరెడ్డి, ప్రభుత్వ సలహాదారు జగన్ అంటే ఒక నమ్మకం ఊహించని విధంగా ఉద్యోగులకు సీఎం వరాలు ఇచ్చారు. చేస్తానని చెప్పటం వేరు.. చేయడం వేరు. సీఎం జగన్ చేసి చూపించారు. అది ఒక్క సీఎం జగన్‌కే సాధ్యం. సీఎం జగన్ అంటే ఒక నమ్మకం. ఇది ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన సంక్రాంతి కానుక. పెండింగ్ డీఏలన్నీ ఒకేసారి చెల్లిస్తామనడం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రంలోని ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు. – వైవీరావు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేత మాకు శుభవార్త గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మూడు నెలలుగా పడుతోన్న ఆందోళనకు తెరపడింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్ కావని కొందరు చేసిన దుష్ప్రచారానికి సీఎం అడ్డుకట్ట వేశారు. ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించి సీఎం జగన్ ఈ నిర్ణయాలను ప్రకటించినట్లు అర్థమైంది. ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగుల సహాయ, సహకారాలు మరింతగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయని చెబుతున్నాం. ఉద్యోగుల ఆశీస్సులు, చల్లని దీవెనలు సీఎం జగన్‌కు ఎల్లవేళలా ఉంటాయి. – మహ్మద్ జానీ బాషా, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం నేత నిజంగా మాకు పండుగే సంక్రాంతి ముందు ఇంకో పెద్ద పండుగలా ఉంది. కరోనా ఆర్థిక పరిస్థితుల్లో సైతం 23 శాతానికిపైగా ఫిట్మెంట్ ప్రకటించడం హర్షించతగ్గ విషయం. పదవీ విరమణ వయస్సు పెంపు హర్షణీయం. – బి.సేవానాయక్, కార్యదర్శి, జేఏసీ ఏపీ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ చైర్మన్ స్వాగతిస్తున్నాం ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఉద్యోగులు ఊహించని విధంగా సర్వీసు కాల పరిమితిని 62 ఏళ్లకు పెంచడం పట్ల కృతజ్ఞతలు. సర్వీసు కాలాన్ని పెంచడంతో పాటు ఇంటి స్థలాల కొనుగోలుపై 20 శాతం రిబేట్ ఇవ్వడం, పెండింగ్ డీఏల చెల్లింపు, నిర్ణీత సమయంలో కారుణ్య నియామకాలు తదితర నిర్ణయాలు మాకందరికీ సంతృప్తినిచ్చాయి. అర్హత గలవారికి పదోన్నతులు ఇవ్వాలని కోరుతున్నాం. – ఎస్.కృష్ణమోహన్, ఏపీ మునిసిపల్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎంకు ధన్యవాదాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏప్రిల్ లోపు ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం హర్షించతగ్గ విషయం. వైద్యపరంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగులెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. – పావులూరి హనుమంతరావు, ఏపీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనందంగా ఉంది కరోనా పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ 23.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం హర్షణీయం. ఈ నెల నుంచే డీఏలన్నీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం నిజంగా హర్షించతగ్గ విషయం. ఉద్యోగుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు. – ఏఏ భాస్కరరెడ్డి, అధ్యక్షుడు, ఏఎంసీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉద్యోగులకు ఎంతో మేలు ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగులకు ప్రభుత్వం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. స్మార్ట్ సిటీలలో 10 శాతం స్థలాల కేటాయింపుతో పాటు 20 శాతం రాయితీ ఇవ్వడం ఇళ్లు లేని ఉద్యోగులకు ఎంతో మేలు చేసే అంశం. ఈ పీఆర్సీలో ఉద్యోగులు ఊహించని ఎన్నో లాభాలను చేకూర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. – వి.జయదేవ్, టూరిజం కార్పొరేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనుకున్నదాని కంటే ఎక్కువ ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగిస్తోంది. ఉద్యోగులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న దానికంటే సీఎం ఎక్కువే చేసినందుకు కృతజ్ఞతలు. – కళ్లే పల్లి మధుసూదన రాజు, కన్వీనర్ కోన దేవదాసు, ఏపీ గ్రంథాలయ ఉద్యోగుల సంఘం (108/19) ఆర్థిక సమస్యలున్నా ఉద్యోగుల సంక్షేమాన్ని వీడలేదు కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడ్డారు. రాష్ట్ర ఉద్యోగుల కోర్కెలను చాలావరకు తీర్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వచ్చే జూన్ నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేసి రెగ్యులర్ పే స్కేల్ ఇస్తామని ప్రకటించడం శుభపరిణామం. – వీఎస్ దివాకర్, రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్ హర్షణీయం కోవిడ్ సంక్షోభంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా 23 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించడం హర్షణీయం. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారనేందుకు ఇది తార్కాణం. ఇళ్లు లేని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఇళ్లు.. తదితర అంశాలు ఎంతో అభినందనీయం. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ ముందుగానే సంక్రాంతి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 27శాతం ఐఆర్ ఇచ్చారు. పెండింగ్ డీఏలను జనవరి నుంచి ఇస్తామనడం, ఇళ్లు లేని ఉద్యోగులకు రాయితీపై ఎంఐజీలో అవకాశం కల్పించడంతో ఉద్యోగులకు సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయి. సీఎంకు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు – కె.జాలిరెడ్డి, కె.ఓబుళపతి వైఎస్సార్ టీఎఫ్ సంతోషకరం ఉద్యోగులకు 23% ఫిట్మెంట్ నిర్ణయం, ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం హర్షణీయం. ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల నిర్ణయం సంతోషకరం. – లెక్కల జమాల్‌రెడ్డి, గురువారెడ్డి.. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆపద్బాంధవుడు సీఎం ఉద్యోగుల పాలిట ఆపద్బాంధవుడుగా సీఎం జగన్ మరోసారి నిలిచారు. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం ఎందరో మధ్యతరగతి ఉద్యోగులకు ఊరటనిచ్చింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం జగన్ 27శాతం ఐఆర్ ఇచ్చారు. – తూతిక శ్రీనివాసవిశ్వనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రకాశం చదవండి: ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్ -
సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు: ఉద్యోగ సంఘాల నేతలు
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల భేటి ముగిసింది. ఈ సందర్భంగా పీఆర్సీపై రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ వెల్లడించారు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నట్లు తెలిపారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఉద్యోగ సానుకూల నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు ప్రశంసించాయి. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం తెచ్చారని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. 27 శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఉండాలని సీఎం జగన్‌ను కోరినట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు తెలిపారు. తమ విజ్జప్తులపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగస్తులను సంతృప్తి పరచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఉన్నారని, సానుకూల నిర్ణయం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు వివరించారు. సీఎం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అదే విధంగా ఫిట్మెంట్ 34 శాతం ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. -
త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ!
సాక్షి, అమరావతి: వేతన సవరణ సంఘం సిఫారసులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ తన సిఫారసులను ముఖ్యమంత్రికి అందజేసిన నేపథ్యంలో అందులోని అంశాలపై చర్చోపచర్చలు జోరందుకున్నాయి. అంతిమంగా త్వరలో ఉద్యోగ సంఘాల∙నేతలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. దీనికి ముందస్తుగా మంగళవారం పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. విడివిడిగా కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకున్న సజ్జల... ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా ఉన్నారని, కరోనా రాకుంటే ఈ పాటికే పీఆర్సీ ప్రకటించేవారని చెప్పారు. కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఏ రకంగా దెబ్బతిన్నదీ వారికి వివరించారు. గడిచిన రెండు సంవత్సరాల్లో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో రూ.22వేల కోట్లు కోవిడ్ కారణంగా తగ్గిపోయింది. దీనికితోడు కోవిడ్ నివారణ, నియంత్రణ కోసం మరో రూ.8వేల కోట్లు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. మొత్తంగా ఈ రెండేళ్లలో కోవిడ్ కారణంగా రూ.30వేల కోట్ల భారం ప్రభుత్వంపై అదనంగా పడింది. వీటికితోడు ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే... ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ప్రకటించింది. ఐఆర్ అమలు చేయటం వల్ల 2018–19లో రూ.52,512 కోట్లుగా ఉన్న జీతాలు, పెన్షన్ల వ్యయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.67,340 కోట్లకు చేరిపోయింది. ఇక శాతం పరంగా చూస్తే రాష్ట్ర సొంత ఆదాయంలో 2018–19లో 84 శాతంగా ఉన్న జీతాలు, పెన్షన్ల వ్యయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 111 శాతానికి చేరింది. ఈ పరిస్థితిల్లో ఫిట్‌మెంట్‌ను గనక మరింత పెంచితే దాన్ని భరించే పరిస్థితి ఉండదని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని సజ్జల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో చూసుకున్నా 2018–19లో జీతాలు, పెన్షన్ల కోసం పెడుతున్నది 32 శాతంగా ఉండగా 2020–21లో ఇది ఏకంగా 36 శాతానికి చేరిపోయింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ వ్యయం మన రాష్టంలోనే అత్యధికంగా ఉంది. ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాలని ఉద్యోగ సంఘాలను ఆయన కోరినట్లు సమాచారం. ఐఆర్ ఇవ్వడం వల్ల ఖజానాపై రూ.15,839.99 కోట్ల భారం పడగా... అంగన్వాడీలు, ఆశావర్కర్లు, శానిటరీ వర్కర్లు, ఎన్‌ఎన్‌ఎంలు, హోంగార్డులు.. ఇలా పలువురు ఉద్యోగులకు జీతాలు పెంచటాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే కార్యదర్శుల కమిటీ నివేదికలోని ప్రధాన అంశమైన 14.29 ఫిట్‌మెంట్‌ను అంగీకరించేది లేదని దాదాపు అన్ని సంఘాల నేతలూ నొక్కి చెప్పారు. దీనిపై తాము ముఖ్యమంత్రిని కలిసినపుడు చెబుతామని, ఆయన సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ చర్చల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ నేతృత్వంలో పలు సంఘాలు పాల్గొన్నాయి. అనంతరం రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించిన అంశాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. అసంతృప్తితో మెజారిటీ ఉద్యోగులు అధికారుల కమిటీ సిఫార్సులేవీ ఉద్యోగులు ఆశించిన రీతిలో లేవని సజ్జలకు చెప్పాం. మెజారిటీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని విన్నవించాం. 34 శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని కోరాం. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉద్యోగులకు సీఎం మంచి చేస్తారని నమ్ముతున్నాం ఉద్యోగులకు సీఎం జగన్ మంచి చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. ఉద్యోగులకు 55 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. హామీలు అమలయ్యే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. – బండి శ్రీనివాసరావు, ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ 55 శాతం ఫిట్మెంట్ ఇస్తేనే అంగీకరిస్తాం సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని సజ్జలకు తెలియజేశాం. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను రెండు జేఏసీలూ వ్యతిరేకించాయి. ఫిట్మెంట్, మానిటరీ బెనిఫిట్ అమలు, లబ్ధిపై తేడాలున్నాయి. సీఎం జగన్‌తో చర్చల్లో మేము దీనిపై స్పష్టత తీసుకుంటాం. 55 శాతం ఫిట్మెంట్ ఇస్తేనే అంగీకరిస్తాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, అమరావతి జేఏసీ చైర్మన్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫిట్మెంట్, మానిటరింగ్ బెనిఫిట్స్ ఇవ్వాలి 2018 జూలై నుంచి ఫిట్మెంట్, మానిటరింగ్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరాం. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం.. ఫిట్మెంట్ అంగీకారం కాదని తెలిపాం. – సూర్యనారాయణ, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం హర్షణీయం. – మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్, ఏపీఎంఎస్‌ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి.మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు టీవీ మార్కండేయ హనుమంతరావు సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ హర్షణీయం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సైతం కొత్త పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించడం హర్షణీయం. – గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.అంజన్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు విపర్తి నిఖిల్ కృష్ణ, సుజత్ భార్గవ్ కుమార్ -
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ
సాక్షి, అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో విడివిడిగా ఆయన సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సజ్జల వివరించారు. సీఎం జగన్ ఎప్పుడూ ఉద్యోగుల పక్షపాతిగా ఉంటారని సజ్జల అన్నారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ నూతన ఏడాది కానుక ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని పేర్కొన్నారు. తమకు ఇంత కావాలని ఉద్యోగులు చెప్పడంలో తప్పు లేదని.. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని సజ్జల అన్నారు. పట్టు విడుపులు అటూ ఇటూ ఉండటం కామనేనన్నారు. పీఆర్సీపై రేపు స్పష్టతపై వచ్చే అవకాశం: వెంకట్రామిరెడ్డి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను వివరించారని తెలిపారు. పీఆర్సీపై రేపు స్పష్టతపై వచ్చే అవకాశముందన్నారు. ముఖ్యమంత్రితో రేపు సమావేశం ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్ సీఎంకు వివరిస్తామని వెంకట్రామిరెడ్డి అన్నారు. -
సీఎంను కలిసిన హైకోర్టు ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తమ సమస్యలను వివరించి.. వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య సాయం కింద ప్రస్తుతమున్న రుణ సదుపాయం మొత్తాన్ని రూ.4 లక్షలకు పెంచాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని రకాల వ్యాధులకే రుణ సదుపాయం కల్పిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల వ్యాధులకు రుణ సదుపాయాన్ని వర్తింపజేయాలన్నారు. ఉద్యోగుల పిల్లలకు స్థానికత క్లెయిమ్ చేసే గడువును మరో ఏడాది పెంచాలని కోరారు. హైకోర్టు ఉద్యోగులకు రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్స్‌లో కలిపిస్తున్న ఉచిత వసతి, రవాణా సదుపాయాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించాలని అభ్యర్థించారు. పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని.. డీఏను వెంటనే చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు కె.సురేంద్రనాథ్, కార్యదర్శి ఎన్.సతీష్ వర్మ, సంయుక్త కార్యదర్శులు జి.కోటేశ్వరరావు, ఎన్.పీరు సాహెబ్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జి.చంద్రబాబు తెలిపారు. -
వీళ్లేం.. నాయకులు!
-
సీపీఎస్ రద్దు చేసే పార్టీలకే మా మద్దతు
సాక్షి, విశాఖపట్నం: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసే రాజకీయ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 1.87 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలతోపాటు 4 లక్షల పాత పెన్షన్ ఉద్యోగుల కుటుంబాల మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. సీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం విశాఖపట్నంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 10 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలేల రామాంజనేయులు యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు 35 ఏళ్ల పాటు కష్టపడి దాచుకున్న సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టి కార్పొరేట్ వ్యాపారులకు దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఐదేళ్లు పరిపాలించే వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం 35 ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలుచేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి పఠాన్ బాజీ మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోదని కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖలో స్పష్టం చేసిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రొంగలి అప్పలరాజు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం రద్దు చేయడం ద్వారా రూ.800 కోట్లకు పైగా ఆదా అవుతుందని, ఎన్ఎస్డీఎల్ వద్ద రూ.5 వేల కోట్లు పీఎఫ్ ఖాతాలో జమ చేసుకొని వాటిని ప్రభుత్వ పథకాలకు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఏపీ జేఏసీ (అమరావతి) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రెండు రకాల పెన్షన్ విధానాలతో ఉద్యోగులను విభజించేందుకే సీపీఎస్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.సతీష్, ప్రధాన కార్యదర్శి ఎం.ఉమామహేశ్వరావు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. సీపీఎస్ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి నెల్లూరు (అర్బన్): సీపీఎస్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జి డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నా చేయనున్నట్టు తెలిపారు. 2004 సెప్టెంబర్ తర్వాత నియమితులైన 1.84 లక్షల మంది ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను సర్వేలు, ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించుకోవడం మానుకోవాలన్నారు. లేదంటే ఉపాధ్యాయులే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
ఆబ్కారీ కుర్చీలకు ఇక కదలిక
సిద్ధమైన ఉద్యోగుల బదిలీల ఫైల్ సీఎం ఆమోదముద్రే తరువాయి మూడేళ్లు సర్వీస్ దాటిన ఎక్సైజ్ అధికారులకు స్థానచలనం ఆరేళ్లు ఒకే జిల్లాలో పనిచేసిన వారికి జిల్లాల మార్పు తప్పనిసరి సమస్యాత్మక స్టేషన్లలో పనిచేసిన వారు తప్పనిసరిగా ఎ- కేట గిరీలోకి సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. నాలుగేళ్ల విరామం తరువాత కానిస్టేబుళ్లు మొదలుకొని డిప్యూటీ కమిషనర్ల వరకు స్థానచలనం చేసేందుకు ఉద్దేశించిన ఫైలు సీఎం టేబుల్ మీదికి చేరింది. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఆయన సంతకం చేసిన మరు నిమిషమే సుమారు 1700 ఉద్యోగుల సీట్లు మారనున్నాయి. ఎక్సైజ్ శాఖ రూపొందించిన విధివిధానాల మేరకు ప్రభుత్వం జిల్లాల వారీగా బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. ఈనె లాఖరులో ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బదిలీల గురించి ఉద్యోగ, అధికారుల సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా, రాష్ట్ర విభజన, ఉద్యోగుల కేటాయింపు తదితర కారణాలతో ముందుకు కదలలేదు. కమలనాథన్ కమిటీ ఎక్సైజ్ శాఖలో విభజన ప్రక్రియ పూర్తిచేసిన నేపథ్యంలో బదిలీల ఫైలుకు మోక్షం లభిస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలను కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి రూపొందించారు. వాటికి ఇటీవలే మంత్రి పద్మారావు గౌడ్ ఆమోదం లభించింది. మంత్రి నుంచి ఫైలు సీఎం కార్యాలయానికి చేరింది. వరంగల్ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ 24తో పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెలాఖరులోగా కేసీఆర్ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సంతకం చేసే అవకాశం ఉంది. భారీగా స్థాన చలనాలు ఎక్సైజ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ స్థాయిలో 1200మంది వరకు విధుల్లో ఉండగా, ఎస్ఐ నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయిలో సుమారు 500 మంది ఉన్నా రు. వీరంతా గత నాలుగేళ్లుగా బదిలీలకు నోచుకోలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్ నెలను కటాఫ్‌గా నిర్ణయించి అప్పటికి ఆయా స్థానాల్లో మూడేళ్లు సర్వీస్ పూర్తయిన వారిని బదిలీల కేటగిరీలోకి తీసుకోనున్నారు. ఈలెక్కన దాదాపు 80 శాతానికి పైగా ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆరేళ్లు పనిచేస్తే స్థానభ్రంశం బదిలీల విధానంలో కొన్ని మార్పులు కూడా తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎస్ఐ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు జరిగే బదిలీలకు సంబంధించి ఒకే జిల్లాలో ఆరేళ్లుగా పనిచేసినా లేదా ఒకే జిల్లాలో మూడు సార్లు బదిలీలు జరిగిన అధికారులను వేరే జిల్లాకు మార్చనున్నారు. స్థానికతకు కూడా ప్రాధాన్యమిస్తూ లోకల్ యూనిట్లో అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అలాగే ఎ,బి,సి కేటగిరీ స్టేషన్లలో పనిచేస్తున్న వారికి కూడా వాటిని మార్చాలని నిర్ణయించారు. ధూల్‌పేట, చార్మినార్ వంటి స్టేషన్లతో పాటు చెక్‌పోస్టులు, బోర్డర్ మొబైల్ పార్టీలు వంటి సి-కేటగిరీలో పనిచేస్తున్న వారికి ఎలాంటి అడ్డంకులు కల్పిం చకుండా ఎ-కేటగిరీ స్టేషన్లు(కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు) కేటాయించనున్నారు. అలాగే బదిలీల్లో రెవెన్యూ అధికంగా సాధించి పెట్టిన స్టేషన్ అధికారికి ఏ కేటగిరీ స్టేషన్‌ను కేటాయించడం, తరువాత స్థానాల్లో ఉన్న వారికి బి, సి కేటగిరీలకు పంపడం ఆనవాయితీగా వస్తోం ది. ఈసారి రెవెన్యూతో పాటు గుడుంబా, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టిన వారికి కూడా ప్రాధాన్యమివ్వాలని కూడా విధివిధానాల్లో పొందుపరిచినట్లు సమాచారం. సీఎంకు నెగిటివ్ రిపోర్ట్ ఆబ్కారీ శాఖ బదిలీల్లో రూ.లక్షల్లో చేతులు మారుతాయని, కోరిన పోస్టింగ్ కోసం ఎస్.ఐ. నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు భారీ ఎత్తున సమర్పించుకుంటారని ముఖ్యమంత్రికి ఇప్పటికే ఉప్పందింది. గతంలో ఎస్ఐ, సీఐ, ఏఈఎస్, ఈఎస్, ఏసీ పోస్టులకు వేర్వేరుగా ధరలు నిర్ణయించి బదిలీలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎంను ఉద్యో గ సంఘాల నేతలు కలిసి బదిలీల ఊసెత్తినప్పుడు చూద్దాం, చేద్దాం అనే రీతిలో సమాధానాలు చెప్పినట్లు సమాచారం. నాలుగేళ్లుగా బదిలీలు జరగలేదని, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తామని ఇటీవల సీఎంను కలిసిన ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ చెప్పడంతో ఆయనఒప్పుకున్నట్లు తెలిసింది. -
బదిలీలకు రంగం సిద్ధం
పైరవీలకు అవకాశం ఇన్చార్జి మంత్రి నేతృత్వంలో ప్రక్రియ దేశం నేతల ఇళ్లకు క్యూ కడుతున్న ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా బదిలీలు చేయాలంటున్న ఉద్యోగ సంఘాల నేతలు కర్నూలు(అగ్రికల్చర్) : ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు రంగం సిద్ధం అయింది. ఇందులో రాజకీయాలదే పైచేయిగా ఉండే అవకాశం ఉంది. దీంతో బదిలీల్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారే అవకాశం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది భూమి రికార్డులు, సర్వే డిపార్ట్మెంట్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఐసీడీఎస్, పశుసంవర్ధక శాఖలో భారీ ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈసారి కూడా బదిలీలను రాజకీయాలతో ముడిపెట్టడంతో అవకతవకలు భారీగా జరిగే వీలుందనే విమర్శలు వస్తున్నాయి. ఒకే చోట రెండేళ్లు పైబడి పనిచేస్తున్నవారిని కూడా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద బదిలీ చేయడానికి అవకాశం కల్పించడమే అవకతవకలకు అవకాశం కలిగిస్తుంది. అంతేకాక బదిలీల ప్రక్రియ ఇన్చార్జి మంత్రి నేతృత్వంలో జరగనున్నందున ఇందులో అధికార తెలుగుదేశం పార్టీ నేతల హవా ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులు దేశం నేతల ఇళ్లకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా ఉండేందుకు కౌన్సెలింగ్ విధానాన్ని చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలుకుతుంది. రాజకీయాలకు అతీతంగా బదిలీలు జరగాలి ఉద్యోగుల బదిలీల్లో రాజకీయాల ప్రమేయం ఏమాత్రం ఉండరాదు. గతేడాది బదిలీల్లో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగింది. ఈసారి కూడా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే మళ్లీ అదే పరిస్థితి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో బదిలీలు జరిగేలా ఉత్తర్వులు ఉండటం అనుమానాలకు కారణం. - శ్రీరాములు, కార్యదర్శి,జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ పారదర్శకంగా బదిలీలు చేపట్టాలి ఉద్యోగుల బదిలీలు 100 శాతం పారదర్శకంగా జరగాలి. రాజకీయాలకు బదిలీలతో సంబంధం లేకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు పరిశీలిస్తే అవకతవకలకు అవకాశం ఏర్పడుతోంది. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు జరగాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. - టి.ఎం.డి.హుసేన్, అధ్యక్షుడు, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అవకతవకలకు అవకాశం కల్పించరాదు గజిటెడ్, ఆపై స్థాయి అధికారుల బదిలీలకు కౌన్సెలింగ్ లేకుండా బదిలీ చేయనుండటం వల్ల భారీగా అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో బదిలీలు జరిగే విధంగా ఉత్తర్వులు ఉండటం అందులో రాజకీయ ప్రమేయాన్ని సూచిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున పైరవీలు ఉండే అవకాశం ఉంది. - డాక్టర్ నాగరాజు, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ సంఘం