Minister Botsa Satyanarayana Meeting With Employees Union Leaders - Sakshi
Sakshi News home page

ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సమావేశం

Published Thu, Mar 2 2023 6:44 PM | Last Updated on Thu, Mar 2 2023 6:55 PM

Minister Botsa Satyanarayana Meeting With Employees Union Leaders - Sakshi

విజయవాడ: ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై చర్చల్లో భాగంగా బొత్స నివాసానికి ఉద్యోగ సంఘాల నేతలు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, ఇతర నాయకులు వచ్చారు.

అనంతరం వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాం. మా సమస్యలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏప్రిల్‌లో బదిలీ అవకాశం ఉంటుంది. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సామాజిక పథకాలు ఇవ్వాలని కోరాం.గ్రేడ్‌-3 ఏఎన్‌ఎంలకు జాబ్‌చార్ట్‌ ప్రకారం ప్రమోషన్లు ఉంటాయి’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement