
సాక్షి, అమరావతి: జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ గురువారం భేటీ అయ్యింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో గైడ్ లైన్స్ విడుదల చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కటాఫ్ డేట్ మార్చే అంశంపై ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 7న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై జీవో ఇస్తామని మంత్రి బొత్స తెలిపారు.
చదవండి: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment