contract employees regularization
-
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌లైన్స్‌ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. 15వ తేదీ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగుల నమోదు ప్రక్రియ మొదలవుతుంది. సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ వారి జీవితాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇదీ చదవండి: రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్ -
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటు, ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ గురువారం భేటీ అయ్యింది. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలో గైడ్ లైన్స్ విడుదల చేస్తామని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కటాఫ్ డేట్ మార్చే అంశంపై ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 7న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై జీవో ఇస్తామని మంత్రి బొత్స తెలిపారు. చదవండి: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్టుకు ఏపీ ప్రభుత్వం -
కాంట్రాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వేళ కాంటాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కాంటాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఎంతోకాలంగా రెగ్యులరైజ్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఎట్టకేలకు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సాకారమైంది. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లోని 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్ నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేళ శుభవార్త. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరికీ శుభాకాంక్షలు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. — Harish Rao Thanneeru (@BRSHarish) April 30, 2023 ప్రభుత్వం నిర్ణయంతో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్), 390 మంది పాలిటెక్నిక్, 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు, వైద్య ఆరోగ్యశాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 158 మంది ఫార్మాసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులతో పాటు పలు విభాగాలకు సంబంధించిన పోస్టులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: కొత్త సచివాలయం వారి ప్రేమకు చిహ్నం: బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు మొత్తం 40 విభాగాల్లో, 5544 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఉత్తర్వులు విడుదల. https://t.co/w0TPP3QJp2 pic.twitter.com/hxTzoUoqBs — Harish Rao Thanneeru (@BRSHarish) April 30, 2023 నూతన సచివాలయంలోని తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ సంతకాలు చేసిన ఫైళ్ల వివరాలు.. 1. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఫైలుమీద సిఎం కేసీఆర్ సంతకం చేశారు. 2. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద నూతన సచివాలయంలో సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజక వర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలనే ఫైలుమీద సీఎం కేసీఆర్ సంతకం చేశారు. 3. పోడుభూముల పట్టాల పంపిణీ కి సంబంధించిన ఫైలుమీద కేసీఆర్ సంతకం చేశారు. మే నెల నుంచి జిల్లాల వారీగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. తద్వారా 1 లక్షా 35 వేల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందచేయనున్నారు . 4 సీఎంఆర్ఎఫ్ నిధులు లబ్ధిదారులకు సంబంధించిన ఫైలు మీద కేసీఆర్ సంతకం చేశారు. 5. గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అందించే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు సంబంధించిన ఫైలు మీద సీఎం సంతకంచేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ జరుగనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్న నేపథ్యంలో 6.84 లక్షల మంది గర్భిణిలు లబ్ధి పొందనున్నారు. కాగా ఒక్కో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ విలువ రెండు వేల రూపాయలు. ఇందుకు గాను ప్రభుత్వం మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనున్నది. 6. పాలమూరు లిఫ్టు ఇరిగేషన్‌కు సంబంధించిన ఫైలు మీద సిఎం కేసీఆర్ సంతకం చేశారు. -
రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఉంటే అర్హులే
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు జారీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. క్రమబద్ధీకరణను చేపట్టడానికి ఇప్పటివరకూ అడ్డంకిగా ఉన్న చట్టాన్ని సవరించడంతోపాటు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులోని నిబంధనల ప్రకారం 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగంలో ఉండి, క్రమబద్ధీకరణ నిర్ణయం అమలయ్యే నాటికి కొనసాగుతున్న వారందరినీ రెగ్యులరైజేషన్‌కు అర్హులుగా పరిగణిస్తారు. అయితే సంబంధిత శాఖలో సమాన కేటగిరీలో రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉంటేనే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ఫుల్‌టైమ్ కాంట్రాక్టు పద్ధతిన నియామకమై నెలనెలా వేతనం పొందిన వారిని మాత్రమే క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకుంటారు. విద్యా, సంక్షేమ శాఖల్లో ఏడాది మధ్యలో వచ్చే సెలవులను గైర్హాజరుగా పరిగణించకుండా మినహాయింపు ఉంటుంది. అనధికారిక గైర్హాజరు, క్రమశిక్షణా రాహిత్యం వంటి అంశాల్లో ఈ మినహాయింపు వర్తించదు. ప్రభుత్వం నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుంచే రెగ్యులరైజేషన్ అమల్లోకి వస్తుంది. క్రమబద్ధీకరణ ద్వారా పోస్టుల రిజర్వేషన్లకు విఘాతం కలిగితే ఆ కేటగిరీ పోస్టులను బ్యాక్లాగ్ పోస్టులుగా పరిగణించి భర్తీ చేయాల్సి ఉంటుంది. కొత్త మార్పులతో పాత చట్టం జనవరి రెండో తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ క్రమబద్ధీకరణకు ఉమ్మడి రాష్ట్రంలోని చట్టం (1994 యాక్ట్ 2) అడ్డంకిగా ఉండడంతో ఫిబ్రవరి 7న దీనిపై మంత్రిమండలి మరోమారు చర్చించి, చట్ట సవరణకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) యాక్ట్-1994ను తగిన సవరణలతో తెలంగాణ రాష్ట్రానికి అన్వయించారు. ప్రభుత్వ శాఖలన్నింటా కేవలం మూడు పద్ధతుల ద్వారా నియామకాలు జరగాలని పాత చట్టంలోని పదో సెక్షన్ పేర్కొంటోంది. ఒకటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, రెండోది డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీలు, డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీల (డీఎస్సీ) ద్వారా, మూడోది ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీ ద్వారా క్రమబద్ధీకరించడం. వీటితోపాటు కొత్తగా కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమితులైన వారిని క్రమబద్ధీకరించే అంశాన్ని ఇదే సెక్షన్లో 10(ఏ)గా చేర్చారు. దాదాపు 25 వేల మందికి లబ్ధి ప్రభుత్వం తీసుకున్న క్రమబద్ధీకరణ నిర్ణయంతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖలో పనిచేస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఉన్న లెక్చరర్లు సైతం రెగ్యులరైజ్ అవుతారు. మార్గదర్శకాలు ఖరారు కావటంతో ఏ శాఖలో ఎంత మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు, నిర్దేశించిన నిబంధనలకు లోబడి ఎంత మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుందనే వివరాలను తెప్పించుకునేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. అన్ని శాఖల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఎంత మంది రెగ్యులరైజ్ అవుతారనే లెక్క తేలనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రత్యేక ప్రాజెక్టులు, పథకాల కింద పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ వర్తించదని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఐదేళ్ల సర్వీసుంటే క్రమబద్ధీకరణ!
-
ఐదేళ్ల సర్వీసుంటే క్రమబద్ధీకరణ!
త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సాక్షి, హైదరాబాద్: కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా కాంట్రాక్టు ఉద్యోగులను ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకొన్న కొద్దీ దశల వారీగా క్రమబద్ధీకరిస్తారు. అయితే 2014 జూన్ 1వ తేదీ (రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రోజు) నాటికి కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉండి.. ఇప్పటికీ కొనసాగుతున్నవారికే దీనిని వర్తింపజేస్తారు. దీనికి సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి 8 మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం... ఆయా శాఖల్లో సంబంధిత కేటగిరీలో రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉండాలి. ఆ ఉద్యోగి నెలనెలా ఫుల్‌టైమ్ స్కేల్ జీతం పొంది ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుకు సరిపడే విద్యార్హత, వయసు ఉండాలి. మొత్తంగా ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. ఉద్యోగి సర్వీసు లెక్కించేటప్పుడు విద్యా, సంక్షేమ శాఖల్లో మాత్రమే సంవత్సరాంతపు సెలవులను పరిగణనలోకి తీసుకుంటారు. అనధికారిక గైర్హాజరు, క్రమశిక్షణా రాహిత్యం వంటివాటిల్లో ఈ మినహాయింపు ఉండదు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి ఈ రెగ్యులరైజేషన్ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఐదేళ్లు ఎప్పుడు నిండితే.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి ఉద్యోగంలో ఉండి.. ఐదేళ్ల సర్వీసు నిండని కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమపద్ధతిలో రెగ్యులరైజ్ చేస్తారు. ఈ ఐదేళ్లు నిండే వరకు వారి ని కాంట్రాక్టు ఉద్యోగులుగానే పరిగణిస్తారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పనిచేస్తున్న కాం ట్రాక్టు ఉద్యోగులకు వర్తించదు. వారి విషయాన్ని ఆలోచిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల సూచనప్రాయంగా వెల్లడించారు. రిజర్వేషన్ల సర్దుబాటుకు బ్యాక్లాగ్ మార్గదర్శకాలకు లోబడి అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలను సంబంధిత శాఖ కార్యదర్శి బిజినెస్ రూల్స్ ప్రకారం ఆర్థిక శాఖ హెచ్ఆర్ఎం విభాగం పరిశీలనకు పంపాలి. క్రమబద్ధీకరణ ద్వారా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల అమలులో అసమానతలు ఉత్పన్నమైతే వాటిని ఆయా కేటగిరీల్లో బ్యాక్లాగ్ పోస్టులుగా పరిగణించి భర్తీ చేయాలి. ఈ సమాచారాన్ని సంబంధిత శాఖ వెంటనే ఆర్థికశాఖలోని హెచ్ఆర్ఎం విభాగానికి తెలియపరచాలి. అయితే ఈ మార్గదర్శకాలను కేబినెట్ ఆమోదించినా... ఉత్తర్వుల జారీ, ప్రక్రియ అమలుకు మరికొంత సమయం పడుతుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. బాబు చేసిన చట్టానికి సవరణ రెండు దశాబ్దాల కిందట అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రభుత్వం... కాం ట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిషేధి స్తూ చట్టం చేసింది. తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అడ్డంకిగా మారడంతో.. ఈ ‘1994 యాక్ట్ నంబర్ 2’ను సవరించాలని కేబినెట్ తీర్మానించింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై టీఆర్ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా సీఎం కేసీఆర్ దీనిపై పలుమార్లు ప్రకటనలు చేశారు. తాజాగా దీనిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో వివిధ శాఖల పరిధిలో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.