
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌లైన్స్‌ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. 15వ తేదీ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగుల నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ వారి జీవితాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment