సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలపై చర్చించామని, టైమ్‌లైన్ ప్రకారం ప్రతి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది.
అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, ఒక్కొక్క జీవోను వరుసగా విడుదల చేస్తామని, ఉద్యోగుల బకాయిల్లో 70 శాతం చెల్లించాం.. సీపీఎస్‌పై మరోసారి చర్చిస్తామని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్చించాం.. దాని అమలుకు స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
హెల్త్‌కార్డుల కంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు మళ్లించాలని నిర్ణయించాం: వెంకట్రామిరెడ్డి
‘‘ఉద్యోగుల పెండింగ్ బకాయిల్లో రూ.5,820 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. పెండింగ్ డీఏలలో ఒక డీఏను చెల్లిస్తామని చెప్పారని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి అన్నారు.
సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వారం రోజుల్లో ఒక డీఏ ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. సీపీఎస్ రద్దు చేయాలని కోరాం. 2004కు ముందు నోటిఫికేషన్‌లో భర్తీ అయిన వారికి ఓపీఎస్ పరిధిలోకి తెస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి టైమ్‌లైన్ కోవాలని కోరాం. సెప్టెంబర్ లోపు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఉత్తర్వులు ఇస్తామన్నారు. కొత్త పీఆర్‌సీని నియమించాలని కోరాం. ఉద్యోగుల హెల్త్‌కార్డుల కంట్రిబ్యూషన్‌ను ట్రస్టుకు మళ్లించాలని నిర్ణయించాం’’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.
చదవండి: ‘అవినాష్‌ను అనుమానించదగ్గ ఆధారాలు సీబీఐ దగ్గర లేవు’
Comments
Please login to add a commentAdd a comment