
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించిన ఉద్యోగ సంఘాలు చర్చించాయి.
దాదాపు నాలుగున్నర గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎస్ సమీర్ శర్మ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. స్టీరింగ్ కమిటీ తరపున 20 మంది ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు.
చదవండి: (సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ)