సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల భేటి ముగిసింది. ఈ సందర్భంగా పీఆర్సీపై రెండు మూడు రోజుల్లో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ వెల్లడించారు. ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తానని భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నట్లు తెలిపారు. అన్నింటినీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఉద్యోగ సానుకూల నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు ప్రశంసించాయి. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం తెచ్చారని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. 27 శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఉండాలని సీఎం జగన్‌ను కోరినట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు తెలిపారు. తమ విజ్జప్తులపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగస్తులను సంతృప్తి పరచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఉన్నారని, సానుకూల నిర్ణయం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పినట్లు వివరించారు. సీఎం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. అదే విధంగా ఫిట్‌మెంట్ 34 శాతం ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment