సాక్షి, అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో విడివిడిగా ఆయన సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సజ్జల వివరించారు. సీఎం జగన్ ఎప్పుడూ ఉద్యోగుల పక్షపాతిగా ఉంటారని సజ్జల అన్నారు.
చదవండి: సీఎం వైఎస్ జగన్ నూతన ఏడాది కానుక
ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని పేర్కొన్నారు. తమకు ఇంత కావాలని ఉద్యోగులు చెప్పడంలో తప్పు లేదని.. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని సజ్జల అన్నారు. పట్టు విడుపులు అటూ ఇటూ ఉండటం కామనేనన్నారు.
పీఆర్సీపై రేపు స్పష్టతపై వచ్చే అవకాశం: వెంకట్రామిరెడ్డి
తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను వివరించారని తెలిపారు. పీఆర్సీపై రేపు స్పష్టతపై వచ్చే అవకాశముందన్నారు. ముఖ్యమంత్రితో రేపు సమావేశం ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్ సీఎంకు వివరిస్తామని వెంకట్రామిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment