PRC report
-
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ
సాక్షి, అమరావతి: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఉద్యోగ సంఘాలతో విడివిడిగా ఆయన సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సజ్జల వివరించారు. సీఎం జగన్ ఎప్పుడూ ఉద్యోగుల పక్షపాతిగా ఉంటారని సజ్జల అన్నారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ నూతన ఏడాది కానుక ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని పేర్కొన్నారు. తమకు ఇంత కావాలని ఉద్యోగులు చెప్పడంలో తప్పు లేదని.. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని సజ్జల అన్నారు. పట్టు విడుపులు అటూ ఇటూ ఉండటం కామనేనన్నారు. పీఆర్సీపై రేపు స్పష్టతపై వచ్చే అవకాశం: వెంకట్రామిరెడ్డి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను వివరించారని తెలిపారు. పీఆర్సీపై రేపు స్పష్టతపై వచ్చే అవకాశముందన్నారు. ముఖ్యమంత్రితో రేపు సమావేశం ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్ సీఎంకు వివరిస్తామని వెంకట్రామిరెడ్డి అన్నారు. -
సీఎం జగన్‌కు పీఆర్సీ నివేదిక అందజేసిన కమిటీ
AP PRC Report 2021: సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పీఆర్సీ నివేదికను కమిటీ అందజేసింది. చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు హాజరయ్యారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎస్ కమిటీ సిఫార్సు చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులపై సీఎస్ కమిటీ సిఫార్సులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కమిటీ ప్రస్తావించింది. చదవండి: Nellore: టీడీపీలో ‘కార్పొరేషన్’ బ్లో అవుట్.. రాజీనామాల బాట ‘‘2018-19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు. 2020-21 నాటికి వ్యయం రూ.67.340 కోట్లు. 2018-19లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం. 2020-21 నాటికి 111 శాతానికి చేరుకుంది. ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయంలో 2018-19లో 32 శాతం.. 2020-21 నాటికి 36 శాతానికి చేరింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020-21లో తెలంగాణలో ఇది కేవలం 21 శాతమేనని’’ కమిటీ పేర్కొంది. ‘‘రాష్ట్ర విభజన ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపింది. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో కేవలం రూ.1,70,215 మాత్రమే. రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాలి. రెవెన్యూ లోటు కింద రూ.18,969 కోట్లు కేంద్రం ఇవ్వాలి. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా రూ.20వేల కోట్ల అదనపు భారం పడింది. కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. 2019, జులై 1న 27 శాతం ఐఆర్ ఇచ్చింది. ఐఆర్ రూపేణా ఉద్యోగులకు రూ.11,270 కోట్లు, పెన్షన్లకు రూ.రూ.4,569 కోట్లు చెల్లించాం. అంగన్వాడీ, ఆశా వర్కర్లు సహా వివిధ కేటగీరీలకు చెందిన ఉద్యోగులకు వేతనాలు పెంచాం. 3,01,021 ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచింది. జీతాల రూపంలో ప్రభుత్వ ఖర్చు రూ.1198 కోట్ల నుంచి రూ.3187 కోట్లకు పెరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల పరిహారం అమలు చేస్తోంది. ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు. దీని వల్ల 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. 2020, జనవరి నుంచి అక్టోబర్ 2021 వరకు ప్రభుత్వంపై రూ.5380 కోట్ల పడిందని’’ కమిటీ పేర్కొంది. పరిపాలనా సంస్కరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. ఏడాదికి రూ.2300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. దీని వల్ల అదనంగా ఏడాదికి ప్రభుత్వంపై రూ.820 కోట్ల భారం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్కాస్‌ను ప్రారంభించారు. అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ.2040 కోట్ల భారం పడిందని’’ కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వంపై 8వేల నుంచి 10వేల కోట్లు భారం: సీఎస్ ముఖ్యమంత్రికి పీఆర్సీ నివేదిక అందజేసిన అనంతరం చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందిస్తామన్నారు. నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. అనేక అంశాలను సిఫారసు చేశామన్నారు. ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి 10వేల కోట్ల భారం పడనుందని.. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని సీఎస్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని సీఎస్ తెలిపారు. -
ఉద్యోగులు టీఆర్ఎస్ నేతలను ఉరికించి కొడతారు
సాక్షి, హైదరాబాద్: చదువు ఎక్కువ అయితే ఉన్న మతి పోతుందనే విషయం కేటీఆర్‌ను చూస్తే నిజం అనిపిస్తుంది. తెలంగాణ రావడంలో సుష్మాస్వరాజ్.. అరుణ్ జైట్లీ ప్రమేయం ఉందా లేదా పార్లమెంట్ ప్రొసిడింగ్స్ చూసి తెలుసుకోండి. కేటీఆర్ ఓ చిన్న పిల్లాడిలా తెలంగాణ రావడానికి టీఆర్ఎస్ బాధ్యత అని చెప్తున్నారు. ఆయన మాటలు వింటుంటే భారతదేశాన్ని అభివృద్ధి చేసింది మేమే అని బ్రిటిష్ వాడు చెప్పినట్టు ఉంది అంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్చార్జ్ మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం, పీఆర్సీ నివేదికపై మండి పడ్డారు. మురళీధర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం అంటే పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమే. పార్లమెంట్ చరిత్రలో చట్టం ఆమోదించిన తర్వాత 13 సార్లు చర్చలు జరపడం.. ర్యాలీకి అనుమతివ్వడం వంటివి చేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. రిపబ్లిక్ డే నాడు చెలరేగిన హింస కాంగ్రెస్ పన్నిన కుట్రే. ఆ పార్టీ మద్దతు లేకపోతే దుండగులు ఎర్రకోట వరకు రాలేరు’ అని మురళీధర్ రావు ఆరోపించారు. రాముడిని విమర్శిస్తే కనుమరుగవుతారు ‘‘దేశవ్యాప్తంగా నడుస్తోన తీర్థా ట్రస్ట్ కార్యక్రమాలను తెలంగాణలో తప్ప ఎక్కడా.. ఎవరు అడ్డుకోలేదు. షాడో వార్ చేయడం కాదు.. కేసీఆర్ ఎమ్మెల్యేలకు బదులుగా తనే నేరుగా మాట్లాడాలి. రాముడిని విమర్శిస్తే.. కనుమరుగవడం ఖాయం. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు.. పార్టీలకతీతంగా విరాళాలు ఇస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ముఖ్యనేతలు విమర్శిస్తున్నారు. ఈ వైఖరి సరైంది కాదు’’ అని హెచ్చరించారు. (చదవండి: సీఎం పీఠంపై కేటీఆర్ ఖాయమే!) ఉద్యోగుల కడుపు కొట్టాలని చూస్తున్నారు ‘‘కేసీఆర్ ప్రభుత్వం పెరాలసిస్ గవర్నమెంట్. పీఆర్సీ రెండేళ్లు ఆలస్యంగా ఇచ్చింది. అది కూడా దేశంలోకెల్లా అత్యంత తక్కువ. గతంలో 1974లో అప్పటి ప్రభుత్వం 5శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంత తక్కువ ఏ రాష్ట్రం ఇవ్వలేదు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. ఉద్యోగుల కడుపుకొట్టాలని చూస్తున్నారు. కరోనా వల్ల ఇంటి అద్దెలు ఏమైనా తగ్గాయా. ప్రభుత్వ వైఖరి ఇలానే కొనసాగితే.. ఉద్యోగులు టీఆర్ఎస్ నేతలను చెప్పులు లేకుండా ఉరికించి కొడతారు. ఉద్యోగులకు గ్రాట్యూటి కేంద్రం ప్రభుత్వంతో సమానంగా ఇవ్వాలి. రాష్ట్రంలో ఓ వైపు నిరుద్యోగం.. మరోవైపు కాంట్రాక్టర్ల దోపిడి పెరిగిపోతుంది. దీనికి చరమ గీతం పాడాలి’’ అన్నారు మురళీధర్ రావు. (చదవండి: ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు) ‘‘తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థి.. వ్యతిరేకి టీఆర్ఎస్నే. బీజేపీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటెసే వారు బీజేపీకే వేస్తున్నారు. టీఆర్ఎస్ను కొట్టేది బీజేపీనే అని ప్రజలు డిసైడ్ అయ్యారు. పార్టీలు వాటికవే గ్రేట్ కాదు.. సిద్దాంతాలు.. పోరాటాలు ద్వారానే ప్రజలు గెలిపిస్తారు.తిట్టిన కొద్ది పెరిగేది బీజేపీ పార్టీ. ఎవరికి భయపడి పార్టీ కాదు. ప్రాణాలకు భయపడకండా పోరాటం చేసిన చరిత్ర తెలంగాణలో ఒక్క బీజేపీకే ఉంది’’ అన్నారు మురళీధర్ రావు. -
20 ఏళ్ల సర్వీసుంటే.. పూర్తి పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో గులు 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని పదవీ విరమణ చేస్తే వారికి పూర్తిస్థాయిలో పెన్షన్ సదుపాయం కల్పించాలని వేతన సవరణ సంఘం(పీఆర్సీ) సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే రాష్ట్ర మూ అనుసరించాలని సూచించింది. ప్రస్తు తం 33 ఏళ్ల సర్వీసు ఉంటేనే పూర్తి పరిమాణంలో పెన్షన్‌ను చెల్లిస్తున్నారు. 20 ఏళ్లలోపు సర్వీసుతో పదవీవిరమణ చేసే ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న ఐదేళ్ల సర్వీసు వెయిటేజీ విధానాన్ని కొనసాగించాలని సూచించింది. పెన్షనర్ల విషయంలో పీఆర్సీ కమిటీ సిఫార్సులివీ.. ►75 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు రిలీఫ్‌గా మూల పెన్షన్‌పై 15 శాతాన్ని అదనంగా చెల్లించాలి. 100 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు 100 శాతం వరకు మూల పెన్షన్‌ను అదనంగా చెల్లించాలి. ►కనీస పెన్షన్/ ఫ్యామిలీ పెన్షన్‌ను నెలకు రూ.9,700కు పెంచాలి. ►సవరించిన కనీస వేతనం (రూ.19 వేలు)లో 50% కనీస పెన్షన్‌గా ఉండాలి. కరువు భత్యం లేకుండా 2018 జూలై 1 నుంచి ఈ పెంపును వర్తింపజేయాలి. ►సర్వీసులో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే, మరణించిన మరుసటి రోజు నుంచి గరిష్టంగా 10 ఏళ్ల పాటు లేదా మరణించిన ఉద్యోగి/ పెన్షనర్ 65 ఏళ్ల వయస్సుకు చేరే వరకు.. ఈ రెండింటిలో ఏది ముం దు సంభవిస్తే అప్పటి వరకు కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్‌ను చెల్లించాలి. ►మానసికంగా/ శారీరకంగా వికలాంగులైన కుమారుడు/కుమార్తె వివాహమైనప్పటికీ జీవితకాలం పాటు ఫ్యామిలీ పెన్షన్ చెల్లించాలి. ►పదవీ విరమణ సమయంలో చెల్లించే గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలి. ►సర్వీసు పెన్షనర్/ ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు చెల్లించాల్సిన రిలీఫ్ అమౌంట్‌ను రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలి. ►కేంద్ర ప్రభుత్వం కమ్యుటేషన్ టేబుల్‌ను సవరించే వరకు పెన్షన్‌లో కమ్యుటెడ్ పోర్షన్‌ను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించే విధానాన్ని కొనసాగించాలి. చదవండి: (ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు) (కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జాబితా) -
ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి మూలవేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసు చేసింది. 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు చేయాలని సూచించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగించాలంటూ మరో కీలక సిఫారసు కూడా చేసింది. ఈ మేరకు చిత్తరంజన్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి పీఆర్సీ గత డిసెంబర్ 31న సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బహిర్గతం చేసింది. ఫిట్మెంట్ 7.5 శాతం ఎలా అంటే..? ఉద్యోగుల కనీస వేతనాన్ని నెలకు రూ.13,825 నుంచి రూ.19 వేలకు పెంచాలని కమిషన్ తొలుత నిర్ణయం తీసుకుంది. దీని ప్రాతిపదికగా ఫిట్మెంట్ శాతాన్ని ఖరారు చేసింది. అదెలాగంటే.. ప్రస్తుత కనీస వేతనం రూ.13,825కు 2018 జూలై 1 నాటికి ఉన్న 33.399 శాతం డీఏ కలిపిన తర్వాత 7.5 శాతం ఫిట్మెంట్ జోడిస్తే (రూ.13,825+33.399% డీఏ+7.5% ఫిట్మెంట్) కనీస వేతనం రూ.19 వేలకు పెరుగుతుంది. అందుకే 7.5 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరపాలని సిఫారసు చేస్తున్నట్టు కమిషన్ వివరణ ఇచ్చింది. కమిషన్ చేసిన ఇతర సిఫారసులు ఇలా ఉన్నాయి. మాస్టర్ పే విధానం యథాతథం కనీస వేతనాన్ని నెలకు రూ.రూ.13,825 నుంచి రూ.19 వేలకు పెంచాలి. గరిష్ట వేతనాన్ని రూ.1,10,850 నుంచి రూ.1,62,070కు పెంచాలి. కనీస, గరిష్ట వేతనాల మధ్య నిష్పత్తి 1:8.53గా ఉండనుంది. 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లతో మాస్టర్ పే విధానం యథాతథంగా కొనసాగనుంది. వార్షిక ఇంక్రిమెంట్ రేంజ్ ప్రారంభ దశలో 3.36 శాతం నుంచి తుదకు 2.33 శాతం వరకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి ఏటా రెండు పర్యాయాలు డీఏను మంజూరు చేసే విధానాన్ని కొనసాగించాలి. 2018 జూలై 1 నాటికి ఉన్న డీఏను కనీస వేతనంలో కలిపేస్తున్న నేపథ్యంలో 2019 జనవరి 1 నుంచి డీఏను 0.910 కన్వర్షన్ ఫ్యాక్టర్ ఆధారంగా మంజూరు చేయాలి. ఈ లెక్కన 2019 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 1 శాతం డీఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 0.910 శాతం పెరుగుతుంది. గత పీఆర్సీ సిఫారసు చేసిన డీఏ కన్వర్షన్ ఫ్యాక్టర్ 0.524 % మాత్రమే. బుధవారం బీఆర్కేఆర్ భవన్ ముందు ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలు హెచ్ఆర్ఏ రేటులో కోత వేసినా.. 7వ కేంద్ర వేతనాల కమిషన్ (సీపీసీ) హెచ్ఆర్ఏ శ్లాబు రేట్లను 30 శాతం, 20 శాతం, 10 శాతం నుంచి వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతానికి తగ్గిస్తూ సిఫారసులు చేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ శ్లాబ్ రేట్లను సైతం తగ్గించాలి. వారి మూల వేతనంపై 30, 20, 14.5, 12 శాతాల నుంచి వరుసగా 24, 17, 13, 11 శాతాలకు తగ్గించాలి. కనీస వేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.18 వేల మాత్రమే ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.19 వేలు సిఫారసు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో హెచ్ఆర్ఏ ఖరారు చేసే అంశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్పంగా లబ్ధి చేకూరుతుంది. దీనికి తోడు మూలవేతనానికి డీఏను కలపడంతో పాటు 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను జత చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న దాని కన్నా అధికంగా హెచ్ఆర్ఏ పొందుతారు. మూల వేతనంతో పోల్చితే కరువు భత్యం 50 శాతానికి మించిన సందర్భాల్లో హెచ్ఆర్ఏ శ్లాబు రేట్లను వరుసగా 27, 18.5, 14, 11.5 శాతాలకు పెంచాలి. హెచ్ఆర్ఏ చెల్లింపులకు నగరాల వర్గీకరణ 2011 జనాభా లెక్కలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ ప్రాంతాల ఆధారంగా హెచ్ఆర్ఏ చెల్లింపులకు సంబంధించిన నగరాల వర్గీకరణను పీఆర్సీ నవీకరించింది. వివరాలు.. – 50 లక్షలు ఆపై జనాభా కలిగిన జీహెచ్ఎంసీ పరిధిలో మూల వేతనంపై హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించాలి. – 2 లక్షలకు పైగా జనాభా కలిగిన కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్ నగరాల్లో 20 శాతం నుంచి 17 శాతానికి తగ్గించాలి. – 50 వేల నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలతో పాటు 50 వేలకు లోపల జనాభా కలిగిన జిల్లా కేంద్రాల్లో 14.5 శాతం నుంచి 13 శాతానికి తగ్గించాలి. – ఇతర ప్రాంతాల్లో 12 శాతం నుంచి 11 శాతానికి తగ్గించాలి. ఒంటరి తండ్రులకు చైల్డ్ కేర్ లీవ్ వర్తింపు సాధారణ పిల్లల విషయంలో చైల్డ్ కేర్ లీవ్‌ను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలి. దివ్యాంగ పిల్లలు కలిగి ఉంటేనే చైల్డ్ కేర్ లీవ్‌ను 90 రోజుల నుంచి రెండేళ్లకు పెంచాలి. తొలి 365 రోజుల పాటు 100 శాతం జీతంతో, మిగిలిన 365 రోజులు 80 శాతం వేతనంతో ఈ సెలవులు ఇవ్వాలి. అవివాహిత, విడాకులు పొందిన, భార్య మరణించిన పురుష ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్‌ను వర్తింపజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. ప్రస్తుతం వీరికి వేతనం లేని 120 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఇలా.. ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం, మూల పెన్షన్ నుంచి 1 శాతాన్ని మినహాయించుకుని ‘ఆరోగ్య భద్రత’ఖాతాలో నిల్వ ఉంచడం ద్వారా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కింద క్యాష్‌లెస్ వైద్య సదుపాయం కల్పించాలి. తొలుత వైద్య ఖర్చులను ఈ ఖాతా నుంచి చెల్లించాలి. బిల్లులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ద్వారా తిరిగి ఈ ఖాతాలో డబ్బులు జమ చేయాలి. పదవీ విరమణ సమయంలో ఒక నెల పెన్షన్‌కు సమానమైన డబ్బులను లేదా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులను ఏకమొత్తంగా తీసుకున్న సీపీఎస్ ఉద్యోగులకు సైతం ఈహెచ్ఎస్ వర్తింపజేయాలి. సర్వీసు పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల వైద్య భత్యాన్ని నెలకు రూ.350 నుంచి రూ.600కు పెంచాలి. పరిమితులు లేకుండా ఎల్టీసీ ప్రస్తుత లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) పథకానికి బదులు దేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు వీలుగా కొత్త పథకాన్ని అమలు చేయాలి. నాలుగు ఏళ్లకు ఒకసారి చొప్పున మొత్తం సర్వీసు కాలంలో గరిష్టంగా 4 పర్యాయాలు ఎల్టీసీ సదుపాయాన్ని కల్పించాలి. దూరం, డబ్బుల విషయంలో పరిమితులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. సర్కారీ బడుల్లో చదివిస్తేనే ఫీజులు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువులకు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లల ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించే ఉద్యోగుల పిల్లల ఫీజులను ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఇద్దరు పిల్లలకు చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అంత్యక్రియల వ్యయం రూ.30 వేలు ఉద్యోగుల అంత్యక్రియల వ్యయాన్ని రూ.30 వేలకు పెంచాలి. షెడ్యూల్డ్ ఏరియాల్లో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్‌లను నెలకు 30 శాతం వరకు గరిష్టంగా రూ.1,660కు మించకుండా పెంచాలి. అంధ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు చెల్లించే రీడర్స్ అలవెన్సును గరిష్టంగా రూ.2,500కు మించకుండా 30 శాతానికి పెంచాలి. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పని చేసే ఉద్యోగులకు మూల వేతనంపై 20 శాతం వరకు ఢిల్లీ అలవెన్సు/ప్రత్యేక అలవెన్సును రూ.5,500 కు మించకుండా పెంచాలి. అంధ, బధిర, శారీరక వికలాంగ ఉద్యోగుల కన్వేయన్స్ అలవెన్సును రూ.3 వేలకు మించకుండా మూత వేతనంపై 10 శాతానికి పెంచాలి. సీపీఎస్‌లో సర్కారు వాటా పెంపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)లో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మూలవేతనం+డీఏపై 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలి. సీపీఎస్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇన్వాలిడేషన్ పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్ సదుపాయాన్ని కల్పించాలి. పాత పెన్షన్ పథకం పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు సమానంగా సీపీఎస్ పెన్షనర్లకు సైతం డెత్ రిలీఫ్ చార్జీలను వర్తింపజేయాలి. -
పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. పీఆర్సీ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నివేదికకు వ్యతిరేకంగా బీఆర్కే భవన్ ఎదుట ఉద్యోగ సంఘాల ధర్నాకు దిగడమేకాక పీఆర్సీ ప్రతులను చించేశాయి. ఇక ధర్నా నేపథ్యంలో పోలీసులకు, ఉద్యోగ సంఘాలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దాంతో పోలీసులు పలువురు ఉద్యోగ సంఘం నేతలను అరెస్ట్ చేశారు. ఇక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు బుధవారం విడుదలైంది. ఆ రిపోర్టులో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సూచించింది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు ఉండాలని, గరిష్ట వేతనం 1,62,070 వరకు ఉండొచ్చని సిఫారసు చేసింది. గ్రాట్యుటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు.. శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంచింది. ( బంగారు తెలంగాణకు బలమైన పునాదులు ) సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. 2018 జులై 1వ తేదీ నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సాయంత్రం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపనుంది. ఈ మేరకు తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు ఆహ్వానం పంపింది. -
పీఆర్సీ నివేదిక సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరిస్తూ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) తన నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పీఆర్సీ నివేదికను 12 రోజుల్లో సమర్పించాలన్న సీఎం ఆదేశాల మేరకు నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై ఓ నిర్ధారణకు వస్తూ కమిషన్ వర్గాలు నివేదికను సిద్ధం చేశాయి. ఈనెల 22 నాటికే సీఎం విధించిన గడువు పూర్తికావడంతో ఈ మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం నివేదికను రూపొందించారు. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నివేదిక సమర్పణకు పిలుపు రావాల్సి ఉందని, ఆ పిలుపు వచ్చిన వెంటనే నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న లేదా 27న పీఆర్సీ నివేదికను సీఎంకు సమర్పించే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. -
ఫిబ్రవరి నెలాఖరులో పీఆర్సీ నివేదిక!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికను ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్ గత నెల రోజులుగా పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ప్రధాన సంఘాలైన టీఎన్జీవో, టీజీవో తదితర ఉద్యోగ సంఘాలతో గురువారం పీఆర్సీ చైర్మన్ సీఆర్ బీస్వాల్, సభ్యులు మహ్మద్ రఫత్‌అలీ, ఉమా మహేశ్వర్‌రావు సమావేశమై చర్చించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ఫిట్మెంట్, కనీస మూల వేతనం, ఇంటి అద్దె అలవెన్సులపై చర్చించారు. ఉద్యోగ సంఘాలు భారీ మొత్తంలో ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నా దానికి సంబంధించిన ప్రతిపాదన పీఆర్సీ నివేదికలో ఉండే అవకాశం కన్పించట్లేదు. సాధారణంగా వేతన స్కేళ్లు, విభాగాల వారీగా ఉద్యోగులు, వారి వేతనాలు, వారు చేస్తున్న పని, వారికి ఇవ్వాల్సిన విభాగాల వారీ వేతనాలే పీఆర్సీ నివేదికలో పొందుపరుస్తారు. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే ఫిట్మెంట్ నిర్ణయించి దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రస్తుత కమిషన్ కూడా అదే బాటలో కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా, కేడర్ వారీగా కనీస మూల వేతనం, గరిష్ట వేతనాలను, అలవెన్సులను పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతులన్నింటినీ క్రోఢీకరించి, నివేదిక సిద్ధం చేసి ఫిబ్రవరి నెలాఖరులో ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం 43 శాతం మధ్యంతర భృతి (ఐఆర్), 63 శాతం ఫిట్మెంట్, రూ.24 వేల కనీస మూల వేతనాన్ని సిఫారసు చేయాలని కోరుతున్నాయి. తెలంగాణ మొదటి పీఆర్సీలో ఉద్యోగులకు ఫిట్మెంట్ 63 శాతం ఇవ్వాలని పీఆర్సీకి టీఎన్జీవో, టీజీవోలు విజ్ఞప్తి చేశాయి. సమావేశంలో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, సత్యనారాయణ, ఎ.జగన్మోహన్రావు పాల్గొన్నారు. ఇవీ ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు.. ఉద్యోగుల కనీస మూల వేతనాన్ని రూ.24 వేలుగా, గరిష్ట మూల వేతనం రూ. 2.19 లక్షలుగా నిర్ణయించాలి. మొదటి పీఆర్సీలో 43 శాతం ఐఆర్ మంజూరు చేసి, 63 శాతం ఫిట్మెంట్ ఇచ్చేలా సిఫారసు చేయాలి. పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలి. ఇంటి అద్దె అలవెన్సులు హైదరాబాద్‌లో 30 శాతం, జిల్లా కేంద్రంలో 25 శాతం, మండల/మున్సిపల్ కేంద్రాల్లో 20 శాతం, గ్రామాల్లో 15 శాతం సిఫారసు చేయాలి. రవాణా అలవెన్సులు, ఉచిత బస్‌పాస్ సదుపాయం కల్పించాలి. ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి స్పెషల్ గ్రేడ్ మంజూరు చేయాలి. వార్షిక ఇంక్రిమెంట్ మూల వేతనంపై 3 శాతం చెల్లించాలి. పెన్షనర్లకు కనీస పెన్షన్ నెలకు రూ.12 వేలు ఉండాలి. గ్రాట్యుటీ రూ.12 లక్షలు చేయాలి. కమ్యుటేషన్ పీరియడ్‌ను 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలి. కమ్యుటేషన్ శాతాన్ని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. కుటుంబ పెన్షన్‌ను 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. 20 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి చివరగా పొందిన వేతనంలో 50 శాతాన్ని పెన్షన్‌గా ఇవ్వాలి. అడ్వాన్స్‌లు రెట్టింపు చేయాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆ కేడర్‌లో ఉద్యోగులతో సమానంగా వేతనం, అలవెన్సులు చెల్లించాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచాలి. -
వేతన యాతన!
సాక్షి, అమరావతి: ఒకవైపు పదో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. జూలై 1వతేదీ నుంచి కొత్త (11వ) పీఆర్సీ అమల్లోకి రావాలి. వచ్చే నెల నుంచి సవరించిన వేతనాలు దీని ప్రకారం అమలు కావాలి. ఇందుకు సరిగ్గా వారమే గడువు మిగిలినా రాష్ట్ర ప్రభుత్వం తాపీగా వ్యవహరిస్తూ చైర్మన్‌ను నియమించకుండా నూతన పీఆర్సీపై కేవలం ఉత్తర్వుల జారీతోనే సరిపెట్టడం గమనార్హం. ఉత్తర్వులిచ్చి నెలైనా చైర్మన్ ఏరి? రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18వ తేదీన 11వ వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో నంబరు 72 జారీ చేసింది. కమిషన్ ఛైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఏడాదిలోగా ఉద్యోగ సంఘాల నేతలు, విభాగాధిపతులు, ఆర్థిక శాఖ అధికారులు, నిపుణులతో చర్చించి సమగ్రమైన సిఫార్సులతో ప్రభుత్వానికి అందజేయాలని జీవోలో పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు ఇచ్చి నెల దాటినా ఇప్పటి వరకూ పీఆర్సీ ఛైర్మన్‌ను నియమించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పీఆర్సీ చైర్మన్‌ను నియమించటంతోపాటు రికార్డు సమయంలో 3 నెలల్లోగా నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించటం గమనార్హం. చైర్మన్ లేరంటే... ఉన్నా లేనట్లే! ‘వాస్తవంగా వేతన సవరణ కమిషన్ అంటే ఛైర్మనే. ఆయన్ను నియమిస్తేనే గత పీఆర్సీ నివేదికపై అధ్యయనం, ఉద్యోగ సంఘాలు, అధికారులతో సంప్రదింపులు లాంటి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అసలు ఛైర్మన్నే నియమించలేదంటే 11వ వేతన సవరణ కమిషన్ ఉన్నా లేనట్లే’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మరో ఏడాది ఎదురు చూపులేనా? ‘గడువు ముగియకముందే పీఆర్సీని నియమించి సకాలంలో నివేదిక తెప్పించుకుని కొత్త వేతనాలు అమలు చేయాలి. చంద్రబాబు సర్కారు ఇందుకు భిన్నంగా గడువు ముగుస్తున్నా పీఆర్సీ ఛైర్మన్నే నియమించలేదు. పైగా జీవోలో ఏడాదిలోగా సిఫార్సులు సమర్పించాలని పేర్కొంది. అంటే కొత్త పీఆర్సీ కోసం మరో ఏడాదిపైగా ఎదురు చూడాల్సిందేనా?’ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రూ. 5,000 కోట్ల బకాయిల ఎగవేత పదో పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.5,000 కోట్ల వేతన బకాయిలను చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టింది. ఇది చాలదన్నట్లు మిగిలిన రూ.4,600 కోట్ల వేతన బకాయిలను విడుదల చేయకుండా నాన్చుతోంది. బకాయిలు చెల్లించాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేయటంతో సమావేశాలు అంటూ కాలయాపన చేస్తోందే కానీ నయాపైసా కూడా విదల్చలేదు. ఇదేనా ఉద్యోగుల సంక్షేమం? ‘నాలుగేళ్లు సర్కారు ఏం చేసింది? అసలు మా వేతన బకాయిలు ఇవ్వాలని ఉందా.. లేదా? మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఏం చేసినట్లు? ఉద్యోగుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటల పరమార్థం ఇదేనా?’ అంటూ ఉద్యోగులు, పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు భత్యమూ కరువేనా? ఉద్యోగులకు ఇప్పటికే రెండు కరువు భత్యాలు (డీఏ) పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి డీఏలను పెండింగ్‌లో పెట్టారు. 2017 జూలై ఒకటో తేదీ నుంచి ఒకటి, ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మరొక డీఏ పెండింగ్‌లో ఉంది. ఈ రెండు డీఏలను బకాయిలతో సహా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇక జూలై 1వ తేదీనుంచి ఉద్యోగులకు మూడో డీఏ వర్తింప జేయాల్సి ఉంది. మరోవైపు పెన్షనర్లకు కూడా కరువు భృతి రిలీఫ్ (డీఆర్)లు రెండు పెండింగ్‌లో ఉన్నాయి. తక్షణమే రెండు డీఆర్ బకాయిలను విడుదల చేయాలని పెన్షనర్లు కోరుతున్నారు. తక్షణమే ఛైర్మన్‌ను నియమించాలి ‘తక్షణమే పీఆర్సీ ఛైర్మన్‌ను నియమించాలి. అన్ని అంశాలూ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నందున గతంలో మాదిరిగా పీఆర్సీ సిఫార్సుల సమర్పణకు ఎక్కువ సమయం తీసుకోకుండా తెలంగాణ తరహాలో మూడు నెలల్లో నివేదికకు ఆదేశించాలి. ప్రభుత్వం దాన్ని తక్షణమే పరిశీలించి రికార్డు సమయంలో 11వ పీఆర్సీని అమలు చేయాలి’ – బొప్పరాజు వెంకటేశ్వర్లు (అమరావతి జేఏసీ ఛైర్మన్). ఫిట్‌మెంట్‌పైనా ఫిట్టింగ్ నిబంధనల ప్రకారం పదో పీఆర్సీ 2013 జూలై 1 నుంచి అమల్లోకి రావాలి. అంటే ఆ రోజు నుంచి పదో పీఆర్సీ ప్రకారం అంతకు ముందు ఉన్న వేతనంపై 43% ఫిట్మెంట్ ఇవ్వాలి. అయితే టీడీపీ సర్కారు 2014 జూన్ 2 నుంచే పదో పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించింది. ఫలితంగా 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 1 వరకూ 11 నెలల పాటు ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన రూ.5,000 కోట్లకు పైగా పదో పీఆర్సీ బకాయిలకు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. పోనీ 2014 జూన్ 1 నుంచి అయినా పదో పీఆర్సీని సక్రమంగా అమలు చేసిందా అంటే అదీ లేదు. పదో పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలను 2015 ఏప్రిల్ నుంచి చెల్లించింది. 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 వరకూ అంటే పది నెలల పాటు ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.4,600 కోట్ల బకాయిలను ఇప్పటికీ చెల్లించలేదు. -
పీఆర్సీపై రేపటి నుంచే చర్చలు
* నాలుగు సమావేశాల్లోనే అన్ని సంఘాలతో భేటీలు * వచ్చే నెల 9తో సమావేశాలు పూర్తి * అత్యవసర సమావేశంలో హైపవర్ కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ అమలు జాప్యం అవుతుందేమోనన్న ప్రభుత్వోద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో నాలుగు సమావేశాల్లోనే చర్చలు పూర్తి చేయాలని ఈ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నిర్ణయానికి వచ్చింది. బృందాల వారీగా మూడు రోజులకో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మంగళవారం అత్యవసరంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ నెల 27న ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదికను అందజేసి, వాటిల్లోని వివిధ అంశాలపై ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కమిటీ మొదట్లో భావించినా, ఇప్పటికే నివేదిక అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో 29వ తేదీ నుంచే సమావేశాలు నిర్వహించాలని కొన్ని సంఘాలు హైపవర్ కమిటీని కోరినట్లు తెలిసింది. దీంతో ఈనెల 29న తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ), తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, రెవెన్యూ సర్వీసెస్, క్లాస్-4, డ్రైవర్స్ తదితర సంఘాలతో చర్చలు జరిపేందుకు కమిటీ సిద్ధమైంది. ఫిబ్రవరి 3న సచివాలయ ఉద్యోగుల సంఘంతో, 6న ఉపాధ్యాయ, లెక్చరర్ల సంఘాలతో, 9న పెన్షనర్ల సంఘాలతో ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. పీఆర్సీ నివేదికను కూడా మంగళవారం ఆర్థిక శాఖ వెబ్సైట్ (http://finance.telangana.gov. in)లో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం హైపవర్ కమిటీని కలిశాయి. కాగా, హైపవర్ కమిటీ చర్చలకు చర్యలు చేపట్టినా పీఆర్సీ అమలు జాప్యం అనుమానాలు మాత్రం ఉద్యోగ సంఘాల నేతల్లో తగ్గట్లేదు. చర్చలు, ఆ తరువాత పీఆర్సీలోని ప్రధాన అంశాలు, ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను క్రోడీకరించి ఫిబ్రవరి చివరి నాటికి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే పరిస్థితి ఉంటుందన్న భావన వారిలో నెలకొంది. ఆ తరువాత నివేదికను ప్రభుత్వం మరోసారి పరిశీలించాక ముఖ్యమంత్రి కేసీఆర్ వీలును బట్టి కమిటీ తమ సిఫారసులను నివేదించనుంది. ఆ తరువాత వాటిని సీఎం పరిశీలించి, మరోసారి ఆయన ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కనీస మూల వేతనం పెంపు, ఫిట్మెంట్, నగదు రూపంలో పీఆర్సీ వర్తింపు తేదీ తదితర ప్రధాన అంశాలపై హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకోవడం కుదరదని, ముఖ్యమంత్రే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేందుకు మార్చి నెలాఖరు అవుతుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. సమావేశాలకు ముందే సీఎం ప్రకటన? ఓవైపు ఉద్యోగ సంఘాలతో సమావేశాల నిర్వహణకు హైపవర్ కమిటీ కసరత్తు చేస్తుండగా, మరోవైపు త్వరలోనే పీఆర్సీ ప్రధాన డిమాండ్లపై సీఎం ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు మంగళవారం ఉద్యోగ సంఘాల్లో గుప్పుమన్నాయి. సంఘాలతో సమావేశాలు ఓవైపు నడుస్తుండగా, మరోవైపు సీఎంతో ప్రధాన అంశాలపై ప్రకటన చేయించాలని కొన్ని సంఘాల నేతలు పట్టుదలతో ఉన్నారు. తద్వారా ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను కొంత తగ్గించవచ్చన్న భావన వారిలో నెలకొంది. అదే జరిగితే హైపవర్ కమిటీ శాఖల వారీగా మిగతా సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందన్న వాదన నెలకొంది. -
'సంక్రాంతిలోపు చర్చలకు ఆహ్వానిస్తామన్నారు'
హైదరాబాద్: పీఆర్సీ సిఫార్సులపై ఏపీ ఉద్యోగ సంఘాల అసంతృప్తి వ్యక్తం చేశాయి. రెండు రోజుల్లో పూర్తిస్థాయి పీఆర్సీ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశాయి. పీఆర్సీపై మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల నాయకులు సోమవారం చర్చలు జరిపారు. పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా ఉందని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ విమర్శించారు. తమకిచ్చిన నివేదికలో కేవలం ఫిట్మెంట్ అంశం మాత్రమే ఉందని, ఇంకా చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. కుటుంబానికి ముగ్గురిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం పీఆర్సీలోని అశాస్త్రీయతకు నిదర్శనమన్నారు. కనీసం నలుగురు సభ్యులను కుటుంబంగా పరిగణించి ఇతర ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వానికి కోరినట్టు చెప్పారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత సంక్రాంతిలోపు చర్చలకు ఆహ్వానిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారని తెలిపారు. -
అక్టోబర్ 31 నాటికి పీఆర్సీ నివేదిక పూర్తికి హామీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఎదురుచూస్తున్న పదో పీఆర్సీ నివేదికను వచ్చే నెల 31 నాటికి పూర్తి చేస్తామని పీఆర్సీ చైర్మన్ అగర్వాల్ హామీ ఇచ్చినట్టు పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి నేతృత్వంలో అగర్వాల్‌ను కలిసినట్లు వారు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించి అభిప్రాయాలు సేకరించడం, నివేదిక పూర్తి చేయడం ఈ నెలలో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నట్లు వారు వెల్లడించారు. అయితే వచ్చేనెల 31 నాటికి నివేదిక పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. మరోవైపు 50 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వాలని రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించనున్నట్లు వారు తెలిపారు.