సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఎదురుచూస్తున్న పదో పీఆర్‌సీ నివేదికను వచ్చే నెల 31 నాటికి పూర్తి చేస్తామని పీఆర్‌సీ చైర్మన్ అగర్వాల్ హామీ ఇచ్చినట్టు పీఆర్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి నేతృత్వంలో అగర్వాల్‌ను కలిసినట్లు వారు వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించి అభిప్రాయాలు సేకరించడం, నివేదిక పూర్తి చేయడం ఈ నెలలో సాధ్యం కాదని ఆయన పేర్కొన్నట్లు వారు వెల్లడించారు. అయితే వచ్చేనెల 31 నాటికి నివేదిక పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. మరోవైపు 50 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ఇవ్వాలని రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విన్నవించనున్నట్లు వారు తెలిపారు.
అక్టోబర్ 31 నాటికి పీఆర్‌సీ నివేదిక పూర్తికి హామీ
Published Wed, Sep 18 2013 12:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement