మురళీకృష్ణ(ఫైల్)
హైదరాబాద్: పీఆర్సీ సిఫార్సులపై ఏపీ ఉద్యోగ సంఘాల అసంతృప్తి వ్యక్తం చేశాయి. రెండు రోజుల్లో పూర్తిస్థాయి పీఆర్సీ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశాయి. పీఆర్సీపై మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల నాయకులు సోమవారం చర్చలు జరిపారు.
పీఆర్సీ నివేదిక అశాస్త్రీయంగా ఉందని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ విమర్శించారు. తమకిచ్చిన నివేదికలో కేవలం ఫిట్మెంట్ అంశం మాత్రమే ఉందని, ఇంకా చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. కుటుంబానికి ముగ్గురిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం పీఆర్సీలోని అశాస్త్రీయతకు నిదర్శనమన్నారు. కనీసం నలుగురు సభ్యులను కుటుంబంగా పరిగణించి ఇతర ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వానికి కోరినట్టు చెప్పారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత సంక్రాంతిలోపు చర్చలకు ఆహ్వానిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారని తెలిపారు.