Anchor Anasuya Mass Song in Chaavu Kaburu Challaga Movie, Lavanya Tripathi, Kartikeya - Sakshi
Sakshi News home page

అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!

Feb 15 2021 6:31 PM | Updated on Feb 15 2021 9:48 PM

Anasuya Bharadwaj Special Song In Chaavu Kaburu Challaga Movie - Sakshi

రంగమ్మత్తగా అందరిని మెప్పించి.. వరస సినిమా ఆఫర్లు కొట్టేస్తోంది. రంగమ్మత్త వంటి పాత్రలు పోషిస్తూనే అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్‌తో అందాలు ఆరబోస్తోంది అనసూయ.

అనసూయ భరద్వాజ్‌.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తనదైన శైలిలో యాంకరింగ్‌ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ముఖ్యంగా సుకుమార్‌, రాంచరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్తగా అందరిని మెప్పించింది. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. రంగమ్మత్త వంటి పాత్రలు పోషిస్తూనే అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్‌తో అందాలు ఆరబోస్తోంది అనసూయ. ఇప్పటికే మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ విన్నర్‌లో సూయ సూయ అంటూ తన పేరుతో సాగే ఐటెం సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ‘సోగ్గాడు చిన్నినాయన’ మూవీలో కూడా టైటిల్‌ సాంగ్‌లో టాలీవుడ్‌ ‘మన్మథుడు’ నాగార్జు అక్కినేనితో చిందులేసింది. తాజాగా ‘చావురు కబురు చల్లగా’ మూవీలో కూడా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు సిద్ధమైంది ఈ రంగమ్మత్త. 

మాస్‌ నేపథ్యంలో సాగే ఈ పాటలో అనసూయ హీరో కార్తికేయతో కలిసి డ్యాన్స్‌ చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే సోమవారం ప్రకటించింది. దీనికి ‘అవసమరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు’ అనే క్యాప్షన్‌తో ట్వీట్‌ చేస్తూ కమ్మింగ్‌ సూన్‌ అంటూ ఈ పాటలో తన లుక్‌ను షేర్‌ చేసింది. అలాగే ‘మీ ప్రజేన్స్‌తో మా సినిమాను మరింత ప్రత్యేకం చేసినందుకు ధన్యవాదాలు అనసూయ గారు.. ఈ స్పెషల్‌ సాంగ్‌ చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడండి’ అంటూ​ హీరో కార్తికేయ కూడా ట్వీట్‌ చేశాడు. కాగా కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ గీతాఆర్ట్స్-2 బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ  చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘చావు కబురు చల్లగా’ టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. 

(చదవండి: అరుదైన గౌరవం..మురిసిపోతున్న అనసూయ)
      (నోరుపారేసుకున్న నెటిజన్‌.. అనసూయ గట్టి కౌంటర్‌)
      (మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement