అనసూయ మాస్‌ సాంగ్‌​.. దుమ్ములేపేసింది! | Anasuya Special Song In Chaavu Kaburu Challaga Promo Out | Sakshi
Sakshi News home page

అనసూయ మాస్‌ సాంగ్‌​.. ఇరగదీసింది!

Published Sat, Feb 27 2021 5:28 PM | Last Updated on Sat, Feb 27 2021 8:24 PM

Anasuya Special Song In Chaavu Kaburu Challaga Promo Out - Sakshi

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే(ఆర్ఎక్స్ 100) యూత్‌ను అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ఎంఎల్, హిప్పీ లాంటి డిఫరెంట్ సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అనంతరం నాని నటించిన ‘గ్యాంగ్‌ లీడర్‌’లో విలన్‌గా నటించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ‘చావుకబురు చల్లగా’ అనే సరికొత్త  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా.. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో అలరించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. పైనపటారం..ఈడ లోన లొటారం..విను బాసు చెబతాను లోకం వయ్యారం’ అంటూ సాగే ఈ సాంగ్‌లో అనసూయ ఫుల్‌ అవుడ్ అండ్ అవుట్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ఇక ఈ సినిమాను మార్చి19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు పాత్రలో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్‌ పోస్టర్ల‌కు విశేష స్పందన లభించింది.

చదవండి:

ఓ మై గాడ్‌! ఇది మీకెక్కడ దొరికింది?: అనసూయ

క్రేజీ ఆఫర్‌: స్టార్‌ హీరోతో అనసూయ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement