క్షమించండి, మరో చాన్స్‌ ఇవ్వండి: కార్తికేయ | Hero Kartikeya Asks Audiences For Give Me Another Chance | Sakshi
Sakshi News home page

డిజాస్టర్‌గా చావు కబురు చల్లగా: క్షమించండన్న హీరో!

Published Mon, Mar 29 2021 5:22 PM | Last Updated on Mon, Mar 29 2021 5:34 PM

Hero Kartikeya Asks Audiences For Give Me Another Chance - Sakshi

ప్రేమతో మీ కార్తీక్‌ సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టాడు యంగ్‌ హీరో కార్తికేయ. కానీ ఈ సినిమా ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. తర్వాత చేసిన ఆర్‌ఎక్స్‌100 సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో చిన్నపాటి స్టార్‌ అయిపోయాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ అవన్నీ డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే ఈసారి గీతా ఆర్ట్స్‌ అనే పెద్ద బ్యానర్‌లో సినిమా చేస్తుండటంతో హిట్టు పడటం ఖాయం అని అంతా ఫిక్సయ్యారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ చావు కబురు చల్లగా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడింది.

ఎన్నో ఆశలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు తీరా సినిమా చూశాక ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నాడు. వారి నిరుత్సాహాన్ని పసిగట్టిన కార్తికేయ అభిమానులను క్షమించమని కోరుతూ ట్వీట్‌ చేశాడు. "చావు కబురు చల్లగా సినిమా నాలో కొత్త నటుడిని పరిచయం చేసింది. బస్తీ బాలరాజుగా ఎన్నో హృదయాలకు నన్ను దగ్గర చేసింది. ఈ సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించేసి ఇంకో అవకాశం ఇవ్వండి. తప్పకుండా దాన్ని సరిదిద్దుకుని మళ్లీ పుంజుకుంటా"నని కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. దీనిపై ఆయన అభిమానులు స్పందిస్తూ కెరీర్‌లో ఇలాంటి ఒడిదుడుకులు సాధారణమేనని, త్వరలో తప్పకుండా హిట్‌ కొడుతావ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: 'సరిగ్గా నడిపితే ఎలాంటి కబుర్లు వినాల్సిన పని లేదు'

శ్రేయా ఘోషల్ బేబీ బంప్‌ ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement