Actress Aamani Shocking Comments About Lip Lock Scene With Naresh - Sakshi
Sakshi News home page

Aamani: నరేష్‌తో లిప్‌లాక్‌పై కామెంట్‌

Published Thu, Mar 18 2021 11:39 AM | Last Updated on Thu, Mar 18 2021 2:49 PM

Aamani Comments About Lip Lock And Bold Scenes - Sakshi

నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్‌ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్‌ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని.. ఇప్పుడు మళ్లీ వరస సినిమాలు చేస్తు‍న్నారు. ఇటీవల శ్రీకారం సినిమాలో శర్వానంద్‌ తల్లిగా నటించారు. అఖిల్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌లోనూ నటిస్తున్నారు. అలాగే అల్లు శిరీష్‌, నవీన్‌ చంద్రకు మదర్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు.‍ ప్రస్తుతం ఆమని చావు కబురు చల్లగా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

యంగ్‌ హీరో‌ కార్తీకేయ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమని హీరో తల్లిగా కనిపించనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముదుకు రానుంది. ఈ క్రమంలో ఆమని ఇటీవల ఓ మీడియాతో ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె లిప్ లాక్స్, బోల్డ్ సీన్స్, సినిమాల్లో తల్లి పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.  చందమామ కథలు సినిమాలో నటుడు నరేష్‌తో ఆమె చేసిన ఓ బోల్డ్ సీన్ గురించి చర్చించారు. చిత్రంలో సన్నివేశం డిమాండ్‌ చేసినప్పుడు బోల్డ్ సన్నివేశాల్లో నటించడం తప్పేం కాదన్నారు. ‘నేను నా వృత్తిలో భాగంగా చేశాను. నరేష్ గారు సీనియర్ నటుడు,  ధైర్యంగా సన్నివేశాన్ని చేయటానికి అంగీకరించి ఆయన తన గౌరవాన్ని చాటుకున్నారు.’ అని పేర్కొన్నారు. కాగా చందమామ కథలు చిత్రంలో ఆమని.. నరేష్‌తో లిప్ లాక్ సీన్ లో నటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. 

చదవండి: 
జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు
వరుణ్‌ పెళ్లిపై నాగబాబు కామెంట్‌.. ఆ అమ్మాయి అయినా ఓకేనట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement