ప్యూర్‌ లవ్‌స్టోరీ మొదలు | Aadi New Movie Launch by Vamshi Paidipally | Sakshi
Sakshi News home page

ప్యూర్‌ లవ్‌స్టోరీ మొదలు

Published Tue, May 29 2018 1:36 AM | Last Updated on Tue, May 29 2018 1:36 AM

Aadi New Movie Launch by Vamshi Paidipally  - Sakshi

ఆది, వంశీ పైడిపల్లి

ఆది కథానాయకుడిగా శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డీఆర్‌పీ వర్మ సమర్పణలో శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వంశీపైడిపల్లి క్లాప్‌ ఇచ్చారు. హీరో ఆది మాట్లాడుతూ–‘‘కథ గురించి డైరెక్టర్‌ నాకు మూడు గంటల నరేషన్‌ ఇచ్చారు.

ప్యూర్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రెండు షెడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాను. హీరోయిన్‌ పేరును త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా చేయడానికి మాకు సహకరిస్తోన్న సాయికుమార్‌గారికి, హీరో ఆదిగారికి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు. ‘‘సీమశాస్త్రి’ సినిమా తర్వాత మేము చేస్తోన్న చిత్రమిది. దర్శకుడు మంచి కథ చెప్పారు. సినిమా హిట్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చావలి రామాంజనేయులు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, నాగశౌర్య, నిర్మాత భరత్‌ చౌదరి పాల్గొన్నారు. రాజీవ్‌ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: అరుణ్‌ చిలువేరు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement