ప్రేమలో పడిపోయారు!
ప్రేమలో పడిపోయారు!
Published Sun, Apr 6 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM
ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. మంచి కథాంశంతో తెరకెక్కిస్తే విజయం ఖాయం. ఆ నమ్మకంతోనే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 13న పాటలను, 25న సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీ తీద్దామనుకుంటున్న సమయంలో రవి చావలి ఈ కథ చెప్పారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే కథతో ఈ చిత్రం చేశాం. ఇప్పటివరకు ఆది నటించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి అనూప్ అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు. ఇదొక మంచి మ్యూజికల్ లవ్‌స్టోరీగా నిలుస్తుందనే నమ్మకం ఉందని, చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. కుమార్ తెలిపారు.
Advertisement
Advertisement