‘ప్యార్...’ ఆదికి సరికొత్త మలుపు! | Pyar Mein Padipoya Audio Launched | Sakshi
Sakshi News home page

‘ప్యార్...’ ఆదికి సరికొత్త మలుపు!

Published Tue, Apr 15 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM

‘ప్యార్...’ ఆదికి సరికొత్త మలుపు!

‘ప్యార్...’ ఆదికి సరికొత్త మలుపు!

 ‘‘ ‘లవ్‌లీ’ తర్వాత నేను చేసిన పూర్తి స్థాయి ప్రేమకథ ఇది. అనూప్ సంగీతం ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది. అతనితో నాకిది నాలుగో సినిమా’’ అని ఆది చెప్పారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ఆవిష్కరించిన అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ -‘‘నా ‘పోటుగాడు’లోని పాట ఈ సినిమాకు టైటిల్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు సాయికుమార్‌గారు చాలా స్పెషల్. ఈ సినిమా ఆదికి పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.
 
 సాయికుమార్ మాట్లాడుతూ -‘‘రవి చావలి దర్శకత్వంలో నాకు నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. అటువంటి దర్శకునితో ఆది పని చేస్తున్నందుకు చాలా హ్యాపీ. ఈ సినిమా ఆదికి మంచి మలుపు అవుతుంది’’ అని పేర్కొన్నారు. తాను పని చేసిన నిర్మాతల్లో రాధామోహన్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని అనూప్ రూబెన్స్ తెలిపారు. ఈ సినిమా ‘లవ్‌లీ’ కంటే పెద్ద హిట్ కావాలని బి. జయ ఆకాంక్షించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమనేని, అచ్చిరెడ్డి, సందీప్ కిషన్, కేవీవీ సత్యనారాయణ, దశరథ్, వరుణ్ సందేశ్, నాని, సంపత్ నంది, మల్టీ డెమైన్షన్ వాసు, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement