ఆ యాడ్‌తో టుక్‌ టుక్‌ ఆలోచన వచ్చింది: డైరెక్టర్‌ సి.సుప్రీత్‌ కృష్ణ | Supreeth C Krishna Talks About Tuk Tuk Movie | Sakshi
Sakshi News home page

‘టుక్‌టుక్‌’పై ‘కోర్ట్‌’ ప్రభావం చూపుతుంది: డైరెక్టర్‌ సి.సుప్రీత్‌ కృష్ణ

Published Tue, Mar 18 2025 2:03 PM | Last Updated on Tue, Mar 18 2025 3:20 PM

Supreeth C Krishna Talks About Tuk Tuk Movie

‘‘ఓ వాహనానికి జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో ‘టుక్‌ టుక్‌’ సినిమా చేశాను. మ్యాజికల్‌ పవర్స్‌ ఉన్న ‘టుక్‌ టుక్‌’ అనే వెహికల్‌ హర్ష రోషన్‌, కార్తికేయ దేవ్, స్టీవెన్‌  మధుల దగ్గరకు ఎలా వచ్చింది?. ఆ వాహనం వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అనేది ఈ చిత్ర కథ’’ అని డైరెక్టర్‌ సి.సుప్రీత్‌ కృష్ణ చెప్పారు. హర్ష రోషన్‌ , కార్తికేయ దేవ్, స్టీవెన్‌  మధు, సాన్వీ మేఘన, నిహాల్‌ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టుక్‌ టుక్‌’. 

ఆర్‌వైజీ సినిమాస్‌ పతాకంపై రాహుల్‌ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా సుప్రీత్‌ కృష్ణ మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం చిత్తూరు. పూరి జగన్నాథ్‌గారి దగ్గర రచయితగా చేశాను. ఆ తర్వాత ‘అలనాటి సిత్రాలు’ అనే ఓటీటీ ప్రాజెక్ట్‌ చేశాను. ‘టుక్‌ టుక్‌’ నా తొలి ఫీచర్‌ ఫిల్మ్‌. క్రికెట్‌ యాడ్‌లో ఓ వాహనాన్ని చూసినప్పుడు ఈ సినిమా ఆలోచన వచ్చింది. ‘టుక్‌ టుక్‌’ వెనకాల ఉన్నది దెయ్యమా? దేవుడా? అనే పాయింట్‌ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. వెహికల్‌ కాకుండా ఈ చిత్రంలో చాలా లేయర్స్‌ ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్‌ అయితే ‘టుక్‌ టుక్‌’ ఫ్రాంచైజీ  ప్లాన్‌  ఉంది’’ అన్నారు. 

టుక్‌ టుక్‌పై ‘కోర్ట్‌’ ప్రభావం చూపుతుంది
ఇక ప్రీరిలీజ్‌ వేడుకల్లో సుప్రీత్‌ మాట్లాడుతూ.. 'టీజర్‌కు, ట్రైలర్‌కు, ఏఐ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మార్చి 21న అందరూ ఓ కొత్త తెలుగు సినిమా చూడబోతున్నారు. ఓ కమర్షియల్‌ ప్యాకేజీలో ఇలాంటి సినిమా చేయడం గొప్పగా అనిపించింది.రోషన్‌ నటించిన కోర్టు మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా రోషన్‌ ఓ మంచి పాత్రను చేశాడు. తప్పకుండా కోర్టు సక్సెస్‌ మా సినిమాపై కూడా రిఫ్లెక్ట్‌ అవుతుంది ' అన్నారు.

శాన్వీ మేఘన మాట్లాడుతూ '' రీసెంట్‌గా కుడుంబస్తాన్‌ అనే తమిళ సినిమా చేశాను. ఆ సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. అందరూ మంచి ప్రేమ ఇచ్చారు. ఓటీటీలో కూడా తెలుగులో ఆ సినిమా విడుదలైంది. తెలుగు వాళ్లకు కూడా ఆ సినిమా నచ్చింది. కుడుంబస్తాన్‌ను ఆదరించినట్లే తెలుగు ప్రేక్షకులు మా టుక్‌టుక్‌ను ఆదిరించి, ఈ తెలుగమ్మాయికి ఆశ్వీరదిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాను దర్శకుడు ఎంత అందంగా నేరేట్‌ చేశాడో, సినిమాను కూడా అంతే అందంగా తెరకెక్కించాడు. ఈ ఫాంటసీ సినిమాను అందరూ ఫ్యామిలీతో థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మా టీమ్‌ అందరికి మంచి విజయం అందిస్తుందనే హోప్‌ ఉంది ' అన్నారు.ఈ వేడుకలో వాణిశాలిని, మధు, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement