Tuk Tuk Movie
-
Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ
మన తెలుగమ్మాయి శాన్వి మేఘన, ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి.. ముఖ్య పాత్రల్లో ఈ టుక్ టుక్ సినిమా తెరకెక్కింది. మూడు చక్రాల బండిని టుక్ టుక్ అంటాం. మరి ఈ సినిమాలో టుక్ టుక్ చేసిన విన్యాసాలు ఏంటి అనేది రివ్యూలో(Tuk Tuk Telugu Movie Review) చూద్దాం. కథేంటంటే..ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెహికల్ దానంతట అదే ఆపరేట్ అవ్వడం, భయపెట్టడం, నవ్వించడం గతంలో తెలుగులో బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా, మెకానిక్ మామయ్య లాంటి పలు సినిమాల్లో చూసాం. ఈ టుక్ టుక్ కూడా అలాంటిదే. మూడు చక్రాల బండిలో ఆత్మ ఉంటే అది ఎలాంటి విన్యాసాలు చేసింది అని సరదాగా చూపించారు. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ఓ బండి తయారు చేయడం, ఆ బండిలో దేవుడు ఉన్నాడు అని దాంతో డబ్బులు సంపాదించడం సీన్స్ అన్ని కాస్త నవ్విస్తూనే ఆసక్తిగా ఉంటాయి.ఆ బండిలో ఆత్మ ఉందని తెలిసాక వాళ్ళు భయపడటం, అది వీళ్ళను పరిగెత్తించడం బానే నవ్విస్తాయి. స్కూటర్ మాట్లాడలేదు కానీ అది పిల్లలు అడిగే ప్రశ్నలకు ఇండికేషన్స్ ఇస్తూ సమాధానాలు చెప్పడం కొత్తగా ఉంటుంది. అయితే ఆ ఆత్మ కథేంటి అని ఫ్లాష్ బ్యాక్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ ఆత్మ అందులోకి ఎలా వచ్చింది అనేది మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. లవ్ స్టోరీ కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను బాగా రాసుకున్నారు. అలాగే సినిమాలో ఓ మెసేజ్ చెప్పడానికి కూడా ప్రయత్నించారు. సినిమాకు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.ఎవరెలా చేశారంటే..మన తెలుగమ్మాయి శాన్వి మేఘన తన క్యూట్ అందంతో మెప్పిస్తునే ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళ పాత్రల్లో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ఫుల్ ఎనర్జీతో నవ్విస్తూనే బాగా నటించారు. నిహాల్ కోదాటి పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పచ్చని లొకేషన్స్ ని సినిమాటోగ్రఫీ విజువల్స్ తో మరింత అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. టుక్ టుక్ బండిని బాగా డిజైన్ చేసారు. దర్శకుడు ఓ కొత్త పాయింట్ ని టుక్ టుక్ (Tuk Tuk Movie Review)బండితో నవ్విస్తూ చెప్పాడు. నిర్మాణవిలువలు చిన్న సినిమా అయినా ఉన్నతంగా ఉన్నాయి.నటీనటులు: హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి.. తదితరులునిర్మాత: రాహుల్ రెడ్డి దర్శకత్వం: సి.సుప్రీత్ కృష్ణసంగీతం: సంతు ఓంకార్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్ ఎడిటర్: అశ్వత్ శివకుమార్ విడుదల తేది: మార్చి 21, 2025 -
ఆ యాడ్‌తో టుక్ టుక్ ఆలోచన వచ్చింది: డైరెక్టర్ సి.సుప్రీత్ కృష్ణ
‘‘ఓ వాహనానికి జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో ‘టుక్ టుక్’ సినిమా చేశాను. మ్యాజికల్ పవర్స్ ఉన్న ‘టుక్ టుక్’ అనే వెహికల్ హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధుల దగ్గరకు ఎలా వచ్చింది?. ఆ వాహనం వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అనేది ఈ చిత్ర కథ’’ అని డైరెక్టర్ సి.సుప్రీత్ కృష్ణ చెప్పారు. హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టుక్ టుక్’. ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం చిత్తూరు. పూరి జగన్నాథ్‌గారి దగ్గర రచయితగా చేశాను. ఆ తర్వాత ‘అలనాటి సిత్రాలు’ అనే ఓటీటీ ప్రాజెక్ట్ చేశాను. ‘టుక్ టుక్’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. క్రికెట్ యాడ్‌లో ఓ వాహనాన్ని చూసినప్పుడు ఈ సినిమా ఆలోచన వచ్చింది. ‘టుక్ టుక్’ వెనకాల ఉన్నది దెయ్యమా? దేవుడా? అనే పాయింట్ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. వెహికల్ కాకుండా ఈ చిత్రంలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ‘టుక్ టుక్’ ఫ్రాంచైజీ ప్లాన్ ఉంది’’ అన్నారు. టుక్ టుక్‌పై ‘కోర్ట్’ ప్రభావం చూపుతుందిఇక ప్రీరిలీజ్ వేడుకల్లో సుప్రీత్ మాట్లాడుతూ.. 'టీజర్‌కు, ట్రైలర్‌కు, ఏఐ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మార్చి 21న అందరూ ఓ కొత్త తెలుగు సినిమా చూడబోతున్నారు. ఓ కమర్షియల్ ప్యాకేజీలో ఇలాంటి సినిమా చేయడం గొప్పగా అనిపించింది.రోషన్ నటించిన కోర్టు మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా రోషన్ ఓ మంచి పాత్రను చేశాడు. తప్పకుండా కోర్టు సక్సెస్ మా సినిమాపై కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ' అన్నారు.శాన్వీ మేఘన మాట్లాడుతూ '' రీసెంట్గా కుడుంబస్తాన్ అనే తమిళ సినిమా చేశాను. ఆ సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. అందరూ మంచి ప్రేమ ఇచ్చారు. ఓటీటీలో కూడా తెలుగులో ఆ సినిమా విడుదలైంది. తెలుగు వాళ్లకు కూడా ఆ సినిమా నచ్చింది. కుడుంబస్తాన్ను ఆదరించినట్లే తెలుగు ప్రేక్షకులు మా టుక్‌టుక్‌ను ఆదిరించి, ఈ తెలుగమ్మాయికి ఆశ్వీరదిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాను దర్శకుడు ఎంత అందంగా నేరేట్ చేశాడో, సినిమాను కూడా అంతే అందంగా తెరకెక్కించాడు. ఈ ఫాంటసీ సినిమాను అందరూ ఫ్యామిలీతో థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మా టీమ్ అందరికి మంచి విజయం అందిస్తుందనే హోప్ ఉంది ' అన్నారు.ఈ వేడుకలో వాణిశాలిని, మధు, మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
‘టుక్ టుక్’ ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన నటి శాన్వి మేఘన (ఫొటోలు)
-
‘టుక్ టుక్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆ యాడ్‌తో టుక్ టుక్ ఆలోచన వచ్చింది: సి.సుప్రీత్ కృష్ణ
‘‘ఓ వాహనానికి జీవితం ఉంటే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో ‘టుక్ టుక్’ సినిమా చేశాను. మ్యాజికల్ పవర్స్ ఉన్న ‘టుక్ టుక్’ అనే వెహికల్ హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్ మధుల దగ్గరకు ఎలా వచ్చింది?. ఆ వాహనం వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అనేది ఈ చిత్ర కథ’’ అని డైరెక్టర్ సి.సుప్రీత్ కృష్ణ(Supreet Krishna) చెప్పారు.హర్ష రోషన్ , కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ముఖ్య పాత్రల్లో సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘టుక్ టుక్’. ఆర్‌వైజీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీ రాములరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ–‘‘మా స్వస్థలం చిత్తూరు.పూరి జగన్నాథ్‌గారి దగ్గర రచయితగా చేశాను. ఆ తర్వాత ‘అలనాటి సిత్రాలు’ అనే ఓటీటీప్రాజెక్ట్ చేశాను. ‘టుక్ టుక్’ నా తొలి ఫీచర్ ఫిల్మ్. క్రికెట్ యాడ్‌లో ఓ వాహనాన్ని చూసినప్పుడు ఈ సినిమా ఆలోచన వచ్చింది. ‘టుక్ టుక్’ వెనకాల ఉన్నది దెయ్యమా? దేవుడా? అనే పాయింట్ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. వెహికల్ కాకుండా ఈ చిత్రంలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ‘టుక్ టుక్’ ఫ్రాంచైజీ ప్లాన్ ఉంది’’ అన్నారు. -
స్కూటర్ కి దెయ్యం పడితే.. ఫన్నీగా 'టుక్ టుక్' ట్రైలర్
ఈ వారం పలు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో ఓ తెలుగు మూవీ 'టుక్ టుక్'. ముగ్గురు పిల్లలు - ఓ స్కూటర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో నవ్వించేలా ఉన్న ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)రీసెంట్ గా 'కోర్ట్' మూవీతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, 'కుడుంబస్థాన్' ఫేమ్ శాన్వి మేఘన తదితరులు నటించిన మూవీ 'టుక్ టుక్'. ఓ పల్లెటూరికి చెందిన ముగ్గురు టీనేజీ కుర్రాళ్లు.. మూలనపడున్న స్కూటర్ తో చిన్న పాటి ఆటో లాంటిదాన్ని తయారు చేస్తారు. దానితో జ్యోతిష్యాలు చెబుతూ డబ్బులు సంపాదిస్తారు.కానీ కొన్నాళ్లకు తాము తయారు చేసిన 'టుక్ టుక్'లో ఉందని దెయ్యం ఉందని తెలుస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలో అనిపిస్తుంది. మార్చి 21న థియేటర్లలోకి రానుంది. మన దగ్గర ఆటో అంటారు. దీన్నే శ్రీలంకలో 'టుక్ టుక్' అంటారు.(ఇదీ చదవండి: గత సినిమాలు డిజాస్టర్స్.. అయినా పూరీకి మరో ఛాన్స్?) -
మ్యాజికల్ ఎంటర్టైనర్గా 'టుక్ టుక్'
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘టుక్ టుక్’. సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని . చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. మంగళవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా శాన్వీ మేఘన మాట్లాడుతూ '' పుష్పక విమానం తరువాత నేను చేసిన ఆటో ఎంటర్టైనర్ టుక్ టుక్. టీజర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో సూపర్ నేచురల్, మ్యాజికల్ పవర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న చాలా సర్‌ఫ్రైజెస్ ఎంజాయ్ చేయడానికి అందరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలి'' అన్నారు. రోషన్ మాట్లాడుతూ ''టీజర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ముగ్గురు యువకుల ప్రయాణం. వాళ్ల జీవితంలో వచ్చిన మ్యాజికల్ ఎలిమెంట్స్‌ను ఎలా ఫేస్ చేశాడో ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. తప్పకుండా ఈ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుందనే నమ్మకం ఉంది' అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ '' చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. అందరూ సినిమాను ఎంజాయ్ చేస్తారు. మంచి కిక్ ఇస్తుంది' అన్నారు. దర్శకుడు సుప్రీత్ కృష్ణ మాట్లాడుతూ '' థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. త్వరలో ఈ సినిమా గురించి ఓ బిగ్గెస్ట్ సర్ఫ్రైజ్ రాబోతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నిహాల్ కోదాటి మాట్లాడుతూ '' ఈ సినిమా చాలా అందంగా డిజైన్ చేశాం. ఫస్ట్ హాఫ్ ముగ్గురు యువకుల ఎంటర్టైన్ ఉంటే సెకండాఫ్‌లో బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఉంటుంది. సాధారణంగా పెద్ద సినిమాల్లో ఫాంటసీ అంశాలు ఉంటాయి. ఈ సినిమాలో ఫాంటసీ, లవ్, ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. మార్చి 21న అందరూ థియేటర్లో ఎంటర్టైన్ అవ్వొచ్చు. టైమ్‌కు, మనీకి వాల్యూ ఇచ్చే సినిమా ఇది' అన్నారు.