
ఈ వారం పలు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో ఓ తెలుగు మూవీ 'టుక్ టుక్'. ముగ్గురు పిల్లలు - ఓ స్కూటర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో నవ్వించేలా ఉన్న ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?
(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)
రీసెంట్ గా 'కోర్ట్' మూవీతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, 'కుడుంబస్థాన్' ఫేమ్ శాన్వి మేఘన తదితరులు నటించిన మూవీ 'టుక్ టుక్'. ఓ పల్లెటూరికి చెందిన ముగ్గురు టీనేజీ కుర్రాళ్లు.. మూలనపడున్న స్కూటర్ తో చిన్న పాటి ఆటో లాంటిదాన్ని తయారు చేస్తారు. దానితో జ్యోతిష్యాలు చెబుతూ డబ్బులు సంపాదిస్తారు.
కానీ కొన్నాళ్లకు తాము తయారు చేసిన 'టుక్ టుక్'లో ఉందని దెయ్యం ఉందని తెలుస్తుంది. చివరకు ఏమైందనేదే స్టోరీలో అనిపిస్తుంది. మార్చి 21న థియేటర్లలోకి రానుంది. మన దగ్గర ఆటో అంటారు. దీన్నే శ్రీలంకలో 'టుక్ టుక్' అంటారు.
(ఇదీ చదవండి: గత సినిమాలు డిజాస్టర్స్.. అయినా పూరీకి మరో ఛాన్స్?)
Comments
Please login to add a commentAdd a comment