Shanvi
-
శ్రీమన్నారాయణ అందరికీ కనెక్ట్ అవుతాడు
‘‘ప్రాంతీయ భాషా చిత్రాలు దేశవ్యాప్తంగా ఆడుతున్నాయి. అదే ఫ్యూచర్ అవుతుంది అనుకుంటున్నాను. అప్పట్లో ‘రోజా’ దేశవ్యాప్తంగా హిట్ అయింది. తెలుగు నుంచి ‘బాహుబలి’ ప్రభంజనం సృష్టించింది. మా కన్నడం నుంచి ‘కేజీఎఫ్’ వచ్చింది. మా ‘అతడే శ్రీమన్నారాయణ’ కూడా అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను’’ అన్నారు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. సచిన్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, శాన్వీ జంటగా నటించిన కన్నడ చిత్రం ‘అవనే శ్రీమన్నారాయణ’. పుష్కర్ మల్లిఖార్జున, హెచ్.కె. ప్రకాశ్ నిర్మించారు. తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’గా విడుదలవుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నాని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రక్షిత్ శెట్టి మాట్లాడుతూ – ‘‘దక్షిణ భారతదేశంలో లేని ఒక ఫిక్షన్లో ప్లేస్‌లో (ఊహాజనిత ప్రదేశం) జరిగే కథ ఇది. అన్ని ప్రాంతాల వారికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. శ్రీమన్నారాయణ అందరికీ కనెక్ట్ అవుతాడు. 8 కోట్ల బడ్జెట్‌తో మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని సుమారు 30 కోట్లతో నిర్మించాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాను 90శాతం సెట్స్‌లోనే చిత్రీకరించాం. సుమారు 19 సెట్లు నిర్మించాం. ఇందులో లవ్, యాక్షన్, సాహసాలు అన్నీ ఉంటాయి’’ అన్నారు నిర్మాత పుష్కర్. ‘‘మూడేళ్ల పాటు చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు సచిన్. ‘‘ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించడం హ్యాపీ. ఇందులో నాది మంచి పాత్ర’’ అన్నారు ‘లవ్లీ’ ఫేమ్ శాన్వీ. -
రఘునందన్‌కు 23న మరణశిక్ష!
వాషింగ్టన్: అమెరికాలో పది నెలల చిన్నారి శాన్వీతో పాటు ఆమె నాయనమ్మ సత్యవతి(61)ని 2012లో అతి కిరాతకంగా హత్యచేసిన కేసులో భారత సంతతి అమెరికన్ రఘునందన్ యండమూరి(32)కి ఫిబ్రవరి 23న మరణశిక్ష అమలుచేయనున్నట్లు స్థానిక జైలు అధికారులు తెలిపారు. ఈ కేసులో రఘునందన్ డబ్బుకోసమే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు కోర్టుకు చెప్పారు. తొలుత ఈ హత్యలు చేసింది తానేనని అంగీకరించిన రఘునందన్ తర్వాత మాట మార్చాడు. తాను కేవలం దొంగతనానికి మాత్రమే పాల్పడ్డాననీ, ఈ హత్యలకు తనకూ ఎలాంటి సంబంధం లేదని వాదించాడు. ఈ హత్యల్ని ఇద్దరు అమెరికన్లు చేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో కేసు విచారణ ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ నుంచి ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదిలీ అయింది. ఇరుపక్షాల వాదనలు విన్న పెన్సిల్వేనియా కోర్టు చివరికి 2014, అక్టోబర్ 14న రఘునందన్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వుల్ఫ్ 2015లో విధించిన మారిటోరియం కారణంగా ఈ శిక్ష అమలు వాయిదా పడే అవకాశముందని జైలు అధికారులు వెల్లడించారు. ఒకవేళ గవర్నర్ శిక్ష అమలు కోసం నిర్ణీత గడువులోగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుంటే జైళ్లశాఖ కార్యదర్శి 30 రోజుల్లోగా దోషికి విషపూరిత ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష విధించాలని ఆదేశాలు జారీచేయవచ్చని అన్నారు. ప్రస్తుతం రఘునందన్‌కు శిక్ష అమలు విషయమై పెన్సిల్వేనియా టాస్క్ ఫోర్స్, సలహా కమిటీల నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తాజా ఘటనతో అమెరికాలో మరణదండన ఎదుర్కొంటున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా రఘునందన్ నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రఘునందన్ హెచ్1బీ వీసాతో అమెరికాకు వెళ్లాడు. శాన్వీతో పాటు ఆమె నాయనమ్మను హత్యచేసిన ఇతను విచారణ సందర్భంగా తన లాయర్లు హిల్లెస్, హెక్మన్ల వ్యవహారశైలిపై అసహనం వ్యక్తం చేశాడు. ఫోన్లు చేసినప్పటికీ, లేఖలు రాసినప్పటికీ స్పందించడం లేదన్నాడు. మళ్లీ విచారణ కోరడానికి బదులుగా తనకు విధించిన మరణశిక్షను వెంటనే అమలు చేయాలని పలుమార్లు కోర్టు హాల్లోనే డిమాండ్ చేశాడు. -
మిషన్ మోడ్..!
బోరుబావిలో పడి మృతిచెందిన రెండేళ్ల చిన్నారి శాన్వి ఘటనతో జిల్లా యంత్రాంగం మేల్కొంది. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనపై కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించో...వైద్య సహాయం అందకపోతేనో లేదా ఏదైన జబ్బు సోకి మృతిచెందిన సంఘటన వంటది కాదని...కేవలం మానవ నిర్లక్ష్యం కారణంగానే శాన్వి మృతిచెందిందన్నారు. మృతి చెందిన శాన్విని తిరిగి తీసుకరాలేకపోయినా మరోసారి ఇలాంటి దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాల్టా చట్టాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరుబావుల గురించి ‘మిషన్మోడ్’లో చర్యలు చేపట్టేందుకు రూపొందించిన కార్యచరణ ప్రణాళిక గురించి వివరించారు. మిషన్ మోడ్ షురూ...జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరుబావుల గురించి ఇప్పటికే ఓ నివేదిక తెప్పించామన్నారు. కానీ అట్టి వివరాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. వల్లాల ఘటన నేపథ్యంలో మళ్లీ జిల్లా వ్యాప్తంగా బోరుబావుల గురించి సమగ్ర సర్వే చేసేందుకు ‘మిషన్ మోడ్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీంట్లో వీఆర్వో, వీఆర్ఏ, జనమైత్రి పోలీస్, గ్రామజ్యోతి కమిటీలు భాగస్వాములను చేస్తూ అన్ని గ్రామాలు, ఆవాసా ప్రాంతాల నుంచి బోరుబావుల లెక్కలు తెప్పిస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న , అనుమతి లేకుండా వేసిన బోరుబావులను తక్షణమే మూసివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. వల్లాల ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సైతం తీవ్రంగా పరిగణించారని...ప్రభుత్వం ఆదేశాల మేరకు వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అంచనాలు తారుమారు.... శాన్వి బోరుబావిలో పడిందన్న వార్త తెలియగానే జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టిందన్నారు. అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు సోమవారం రాత్రి 8.48 నిమిషాల వరకు పాపను బోరుబావి నుంచి సురక్షితంగానే బయటకు తీసుకొస్తామని తనకు చెప్పారన్నారు. కానీ అధికారుల అంచనాలు తారుమరై పాపను కాపాడేందుకు తవ్వుతున్న ప్రదేశంలో రాక్‌షీట్ (బండరాయి) తగలడంతో పాటు, మట్టిపెల్లలు జారీ పడటంతో చేపట్టిన చర్యలు విఫలమయ్యాయన్నారు. రాత్రి 11 గంటలకు అహర్నిశలు శ్రమించినా శాన్విని కాపాపడలేకపోయామని చెప్పారు. అనుమతి ఉంటేనే... బోరుబావులు తవ్వేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నప్పుడు మాత్రమే ఏదైన ఘటన జరిగినప్పుడు వారిని బాధ్యుల్లి చేయకలుగుతామన్నారు. అధికారుల అనుమతి లేకుండా తవ్వుతున్న బోరుబావుల విషయంలో భూ యజమానులపై మాత్రమే కేసులు నమోదు చేస్తామన్నారు. దీనికి సంబంధించి బోరు డ్రిల్లింగ్ అసోసియేషన్లు, వ్యక్తిగత బోరు వాహనాలు కలిగిన వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. అధికారుల నుంచి అనుమతి పొందిన బోరుబావులకు మాత్రమే రిగ్గు యజ మానులు బోర్లు తవ్వాలని అలాకాకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఏజే సీ వెంకట్రావు, డీఆర్వో రవినాయక్, జెడ్పీ సీఈ వో రావుల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
గర్భశోకమే.. మిగిలింది
శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో బోరుబావి ఘటన విషాదంతమైంది. చిన్నారి శాన్వి (2) కాపాడేందుకు సుమారు 12 గంటల పాటు రెవెన్యూ, పోలీస్, ఫైర్, వైద్యాధికారులు తమ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టినా కాపాడలేక పోయారు. తెల్లవారుజామున బయటకు తీసిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు 4.30 గంటలకు శాన్వి ఇక లేదంటూ అధికారులు ధ్రవీకరించారు. ఈ ఘటన మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది. బోరుబావులు వేసే విషయంలో చట్టాల అమలులో అధికారుల నిర్లక్ష్యమో.. పాలకుల ఉదాసీనతో.. లేక రైతుల అలసత్వమో గానీ.. ఎంతో విలువైన, బంగారు భవిష్యత్ కలిగిన చిన్నారుల జీవితాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి బాధ్యులెవరైనా.. బలైపోయేది మాత్రం అభం శుభం తెలియని చిన్నారులే.. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘోర సంఘటనలు నిత్యకృత్యంగా జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అందుకు వల్లాల గ్రామంలో జరిగిన చిన్నారి శాన్వి ఘటనే ఉదహారణ. బతుకు దెరువు కోసం వచ్చి...బోరుబావిలో పడిన చిన్నారి శాన్వి తల్లిదండ్రులగు వరికుప్పల స్వామి, సుస్మితల స్వగ్రామం నల్లగొండ మండలం దీపకుంట గ్రామం. వడ్డెర కులానికి చెందిన వారు వృత్తిరీత్యా వ్యవసాయ బావుల తవ్వకం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగానే కరువు పరిస్థితుల నేపథ్యంలో బతుకుదెరువు కోసం స్వామి తన భార్య, కుమార్తెతో అత్తగారి గ్రామమైన వల్లాల గ్రామానికి రెండు వారాల క్రితం వలస వచ్చాడు. బావమరిది బొంత వెంకన్న వద్ద ఉంటూ ఇదే గ్రామానికి చెందిన కట్టగూరి అంజయ్య అనే రైతు భూమిలో బావిని తీసేపనులను నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం పనులకు వెళ్లిన వారు తమ కుమార్తె శాన్విని వెంట తీసుకెళ్లారు. 12 గంటలు బోరుబావిలోనే..అప్పటి వరకుతల్లితో పాటే ఉన్న శాన్వి నిమ్మతోటలో ప్రమాదవశాత్తు వేసిన బోరుగుంతలో పడింది. వెంటనే గమనించిన శాన్వి తల్లిదండ్రులు లబోదిబోమనడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీసులకు, అధికారులకు, గ్రామస్తులకు సమాచారమందించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 3.35 గంటలకు బోరుబావిలో చిన్నారి పడిపోగా 4.30 గంటలకు సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. చిన్నారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. చివరకు 3.10 గంటలకు చిన్నారి శాన్విని బోరుబావిలోంచి బయటకు తీసి అర్ధగంటలో నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బండరాళ్లతో అంతరాయం.. బోరుబావిలో చిన్నారిని కాపాడేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా రెండు భారీ పొక్లెయిన్లతో బావిని తవ్వారు. 150 అడుగుల లోతున్న బోరుబావిలో 25 అడుగుల లోతులో చిన్నారి శాన్వి చిక్కినట్లు అధికారులు గుర్తించారు. అందుకోసం 25 అడుగుల లోతు బావిని తవ్వారు. కానీ సమాంతర బావి అడుగు భాగంలో బండరాళ్లు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. వారిని అనుమతించి ఉంటే.. సంఘటన విషయం తెలుసుకుని బోరుబావిలో పడిన చిన్నారులను ప్రత్యేకంగా తయారు చేసుకున్న పనిముట్లతో సురక్షితంగా బయటకు తీసే పనిలో నైపుణ్యత కలిగిన జిల్లాలోని మార్గులపల్లి, కోదాడ, తిప్పర్తి మండలాల చెందిన పలువురు సోమవారం రాత్రి సంఘటన స్థలానికి తరలివచ్చారు. చిన్నారిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అక్కడ సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వారిని అందుకు అనుమతించలేదు. దీంతో వారు ఏమీ చేయలేకపోయారు. ఒకవేళ వారిని అనుమతించి ఉంటే చిన్నారిని బయటకు తీసి ఉండేవారేమోనని, చిన్నారి ప్రాణాలతో బయటపడేదని పలువురు ఆవేదనవ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారుల వైఖరిని తప్పుపట్టడంతో పాటు నిర్లక్ష్యవైఖరే శాన్వి ప్రాణాలు తీసిందంటూ దుయ్యబట్టారు. బావితవ్వకానికి 12 గంటల సమయం బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు బోరుబావికి సమాంతరంగా తీసిన 25 అడుగుల బావితవ్వకానికి 12 గంటల సమయం పట్టింది. వల్లాల గ్రామంలోనే రోడ్డు విస్తరణ పనుల్లో ఉన్న రెండు భారీ పొక్లెయిన్లు మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పనులు చేపట్టినా సరైన సమయంలో సరైన సలహాలు అధికారుల నుంచి అందకపోవడం కూడా ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు. బోరు ఫెయిల్ కావడంతోనే..వల్లాల గ్రామానికి చెందిన రైతు కట్టగూరి అంజయ్య తనకున్న నిమ్మతోటలో ఓ వ్యవసాయ బావి తవ్వాడు. కానీ ఆ బావిలో నీరు సరిపడా పడకపోవడంతో పక్కనే వారంరోజుల క్రితం బోరు వేశాడు. కానీ వేసిన బోరు ఫెయిలయ్యింది. దీంతో ఉన్న వ్యవసాయ బావినే మరింత లోతు తవ్వించేందుకు పనులు చేపట్టాడు. అందులో భాగంగానే వ్యవసాయ బావి తవ్వకం పనులను చిన్నారి శాన్వి తండ్రి వరికుప్పల స్వామి కుదుర్చుకున్నాడు. ఒకవేళ ఆ రైతు వేసిన బోరు పడిఉంటే వ్యవసాయ బావిని మరింత లోతుకు తవ్వేవాడు కాదు.. అతను బావిని తవ్వకుంటే స్వామి వల్లాలకు వలస వచ్చేవాడు కాదు.. స్వామి వల్లాలకు వలస రాకుంటే శాన్వి బతికి ఉండేదని పలువురు వాపోయారు. ఆ బోరు ఫెయిల్ కావడమే దీనంతటికీ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. -
‘ప్యార్...’ ఆదికి సరికొత్త మలుపు!
‘‘ ‘లవ్లీ’ తర్వాత నేను చేసిన పూర్తి స్థాయి ప్రేమకథ ఇది. అనూప్ సంగీతం ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది. అతనితో నాకిది నాలుగో సినిమా’’ అని ఆది చెప్పారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ‘ప్యార్ మే పడిపోయానే’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ఆవిష్కరించిన అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ -‘‘నా ‘పోటుగాడు’లోని పాట ఈ సినిమాకు టైటిల్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు సాయికుమార్‌గారు చాలా స్పెషల్. ఈ సినిమా ఆదికి పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ -‘‘రవి చావలి దర్శకత్వంలో నాకు నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. అటువంటి దర్శకునితో ఆది పని చేస్తున్నందుకు చాలా హ్యాపీ. ఈ సినిమా ఆదికి మంచి మలుపు అవుతుంది’’ అని పేర్కొన్నారు. తాను పని చేసిన నిర్మాతల్లో రాధామోహన్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని అనూప్ రూబెన్స్ తెలిపారు. ఈ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద హిట్ కావాలని బి. జయ ఆకాంక్షించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమనేని, అచ్చిరెడ్డి, సందీప్ కిషన్, కేవీవీ సత్యనారాయణ, దశరథ్, వరుణ్ సందేశ్, నాని, సంపత్ నంది, మల్టీ డెమైన్షన్ వాసు, రకుల్ ప్రీత్‌సింగ్ తదితరులు మాట్లాడారు. -
ప్రేమలో పడిపోయారు!
ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు. మంచి కథాంశంతో తెరకెక్కిస్తే విజయం ఖాయం. ఆ నమ్మకంతోనే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆది, శాన్వి జంటగా రవి చావలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ నెల 13న పాటలను, 25న సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ క్యూట్ లవ్‌స్టోరీ తీద్దామనుకుంటున్న సమయంలో రవి చావలి ఈ కథ చెప్పారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే కథతో ఈ చిత్రం చేశాం. ఇప్పటివరకు ఆది నటించిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి అనూప్ అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు. ఇదొక మంచి మ్యూజికల్ లవ్‌స్టోరీగా నిలుస్తుందనే నమ్మకం ఉందని, చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. కుమార్ తెలిపారు. -
ఐమాక్స్ ప్రీమియార్ షో లో రౌడీ టీమ్ సందడి
-
ఊహించని ఛాన్స్‌లు కొట్టెస్తున్న శాన్వి
-
ప్యార్ మే పడిపోయానె
‘లవ్లీ’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆది, శాన్వీ మరోసారి జత కడుతున్నారు. ఈ ఇద్దరూ జంటగా ‘ప్యార్ మే పడిపోయానె’ అనే యూత్‌ఫుల్ టైటిల్‌తో ఓ చిత్రం ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవి చావలి దర్శకత్వంలో కేకే రాధామోహన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. విజయ దశమి పర్వదినాన ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలో సంపత్ నంది, మల్టీ డైమన్షన్ రామ్మోహన్, వాసు, సాయికుమార్ తదితరులు పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘రవి చావలి చెప్పిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. యూత్‌ని ఆకట్టుకునే విధంగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నవంబర్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి. రమణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్.