ప్యార్ మే పడిపోయానె
ప్యార్ మే పడిపోయానె
Published Thu, Oct 17 2013 12:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
‘లవ్లీ’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆది, శాన్వీ మరోసారి జత కడుతున్నారు. ఈ ఇద్దరూ జంటగా ‘ప్యార్ మే పడిపోయానె’ అనే యూత్‌ఫుల్ టైటిల్‌తో ఓ చిత్రం ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవి చావలి దర్శకత్వంలో కేకే రాధామోహన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. విజయ దశమి పర్వదినాన ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.
ఈ వేడుకలో సంపత్ నంది, మల్టీ డైమన్షన్ రామ్మోహన్, వాసు, సాయికుమార్ తదితరులు పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘రవి చావలి చెప్పిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది.
యూత్‌ని ఆకట్టుకునే విధంగా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. నవంబర్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి. రమణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్.
Advertisement
Advertisement