Adhi
-
నేరస్థుల పనిబట్టే 'సీఎస్ఐ సనాతన్'.. ఆసక్తికరంగా గ్లింప్స్
ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సీఎస్ఐ సనాతన్'. ఈ సినిమాలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సీయస్ఐ) ఆఫీసర్‌గా ఆది ఒక కొత్త రోల్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. చాగంటి ప్రొడక్షన్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ బ్యాక్ డ్రాప్లో గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ మూవీలో మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప, మధు సూదన్, వసంతి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. (చదవండి: హీరోగా దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. 'అహింస' గ్లింప్స్ చూశారా?) ఈ గ్లింప్స్ ఆద్యంత ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా హీరో కనిపించారు. ఎలాంటి నేరమైనా చేధించే ఆది పాత్రను రూపొందించారు. పక్కా ఆధారాలతో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడనే ఇంట్రెస్టింగ్గా ఉండనుంది. సరికొత్త థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హత్య కేసు విచారణ ఆద్యంతం ఆసక్తిని పంచనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబర్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Tees Maar Khan: ఓటీటీలో ‘తీస్మార్ఖాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆది సాయికుమార్ కథానాయకుడిగా విజన్ సినిమాస్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తీస్మార్ఖాన్’. అతనికి జోడిగా పాయల్ రాజ్‌పూత్ నటించింది. ఈ సినిమాలో సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. కల్యాణ్ జి.గోగణ దర్శకత్వం వహించగా.. ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. (చదవండి: Tees Maar Khan Teaser: రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి.. ఆసక్తిగా టీజర్) లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో ఆది తీస్ మార్ ఖాన్ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించాడు. ఇందులో అనూప్ సింగ్ ఠాకూర్ విలన్‌గా మెప్పించాడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కల్యాణ్ జి. గొగణ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. -
ఒక లోకం... రెండు కోట్లు
‘‘పోలీస్ స్టోరీ’ సినిమా 25 సంవత్సరాల వేడుకకి వెళ్లినప్పుడు బెంగళూరులో ‘శశి’ చిత్రంలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటని కన్నడలో తర్జుమా చేసి, వింటున్నారు. తమిళనాడులో కూడా ఈ పాటకు స్పందన చాలా బాగుంది. ఆది కెరీర్లో బెస్ట్ సాంగ్ ఇది. ఈ పాటలాగే ‘శశి’ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. ఆది సాయికుమార్ హీరోగా, సురభి హీరోయిన్గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించారు. అరుణ్ సంగీతం అందించారు. చంద్రబోస్ రాసిన ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాట రెండు కోట్లకు పైగా వ్యూస్ దాటింది. ఈ సందర్భంగా ‘ఒకే ఒక లోకం..’ పాట సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆది సాయికుమార్ మాట్లాడుతూ– ‘‘పాటను ఇంతలా ఆదరించినవారికి థ్యాంక్స్. మా నిర్మాతలు చాలా ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ నాయుడు నందికట్ల. ‘‘2021లో ‘ఒకే ఒక లోకం నువ్వే..’ పాట అందరి మనసుల్ని గెలిచి రంజింపజేస్తో్తంది’’ అన్నారు పాటల రచయిత చంద్రబోస్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు అరుణ్, కెమెరామేన్ అమర్నాథ్ బొమ్మిరెడ్డి, మాటల రచయిత రవి, స్క్రీన్ ప్లే రైటర్ మణి, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, నిర్మాత ఆర్.పి. వర్మ, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
డైలాగ్స్ టు డైరెక్షన్
రచయితల నుంచి దర్శకులుగా మారిన లిస్ట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి.. ఇలా చాలామందే ఉన్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి రైటర్ డైమండ్ రత్నబాబు కూడా చేరిపోయారు. ‘సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం’ వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు. ఆది సాయికుమార్ హీరోగా రత్నబాబు ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉండబోతోందని సమాచారం. -
సంసారం.. సేమియా ఉప్మా
‘‘యామిరిక్క భయమేన్’ తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని రెండేళ్ల క్రితం నా మనసులో అనుకున్నా. రీమేక్ హక్కులు ‘బన్నీ’ వాసుగారి వద్ద ఉన్నాయని తెలిసి, నేను కామ్ అయిపోయా. అయితే, ఆ సినిమా చివరకు నా దగ్గరకే వచ్చింది’’ అని హీరో ఆది అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆది పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► గతేడాది ప్రభాకర్గారిని కలిస్తే ఇరవై నిమిషాలు ‘నెక్ట్స్ నువ్వే’ కథ చెప్పారు. ‘యామిరిక్క భయమేన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడంతో బాగా నచ్చింది. ప్రభాకర్‌గారు ఏంటో నాకు తెలుసు. బాగా డైరెక్ట్ చేస్తారని సినిమా చేయడానికి అంగీకరించా. ► గీతా ఆర్ట్స్ బేనర్ ఈ సినిమా నిర్మిస్తుందని ప్రభాకర్‌గారు చెప్పగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అంతా ఓకే అని ‘బన్నీ’ వాసుగారితో మాట్లాడిన తర్వాత జ్ఞానవేల్‌రాజాగారు, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. క్యారెక్టరైజేషన్స్, కథ, మంచి నిర్మాతలు ఉండటంతో మరో ఆలోచనకు అవకాశం కూడా ఇవ్వలేదు. సింగిల్ షెడ్యూల్లో.. 36 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ► సినిమాలో నా పాత్ర పేరు కిరణ్. సీరియల్స్ తీస్తుంటాను. రాజమౌళి అంత పేరు తెచ్చుకోవాలనే కోరిక. ‘సంసారం.. సేమియా ఉప్మా’ అనే సీరియల్ తీస్తుంటాడు. నిర్మాతగా ఓ సీరియల్ తీసి, అప్పుల పాలవుతాడు. ఆ అప్పుల నుంచి తప్పించుకోవడానికి రిసార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ హాస్యంతో సాగే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. ► ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో బ్రహ్మాజీగారి పాత్ర చూసి, నేనూ ఈయనతో ఓ సినిమా చేస్తే బావుంటుందనుకున్నా. ‘నెక్ట్స్ నువ్వే’తో లక్కీగా ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది. ► జ్ఞానవేల్ రాజాగారి స్టూడియో గ్రీన్ బ్యానర్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న మూడు సినిమాలు చేయబోతున్నా. అలాగే, జ్ఞానవేల్ రాజాగారు తెలుగులో చేసే స్ట్రయిట్ మూవీలో కూడా నటిస్తున్నా. -
ఆయన 60 ఏళ్ల టీనేజర్!
‘‘కొత్త వారికి చాన్స్ ఇచ్చేందుకే వి4 బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. పెద్ద బ్యానర్స్‌లో కొత్త డైరెక్టర్స్‌తో వెంటనే రిస్క్ చేయలేం. టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఛాన్స్ ఇచ్చి, వారు వి4 బ్యానర్లో ప్రూవ్ చేసుకుంటే బిగ్ బ్యానర్లో చాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. రైటర్స్‌ని, మ్యూజిక్ డైరెక్టర్స్‌ని అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఆది, వైభవీ శాండిల్యా, రష్మీ గౌతమ్ ముఖ్య తారలుగా ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. ‘బన్నీ’ వాసు చెప్పిన విశేషాలు... ∙ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడుతున్నారు. కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్ మీద నమ్మకంతోనే ఈ సినిమా నిర్మించా. ఆది చాలా ప్రొఫెషనల్. ఒక మంచి సక్సెస్ వస్తే స్టార్హీరో అవుతాడు. ఆ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్‌లో మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని నమ్మి, మారుతి బ్యానర్లో రికమండ్ చేశాను. ప్రభాకర్ «థర్డ్ మూవీ కూడా లైన్లో ఉంది. నా పార్టనర్స్ కూడా ఓకే అంటే వి4 బ్యానర్లోనే ఆ సినిమా ఉంటుంది. నెక్ట్స్ సినిమాకి ముగ్గరు కుర్రాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ∙అల్లు అరవింద్‌గారు 60 ఏళ్ల వయసున్న టీనేజర్. ‘టు బి విత్ యంగ్ పీపుల్’ అనేదే అరవింద్‌గారి బిజినెస్ సీక్రెట్ అనుకుంటున్నా. నాకు, వంశీ (వి4లో మరో నిర్మాత)కి ఆయన గురువులాంటి వారు. ∙పవన్ కల్యాణ్‌గారి ఫ్యాన్‌ని. ఆయనతో వర్క్ చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దానయ్యగారు ఒక్క మాట చెప్పి ఉండాల్సింది ‘‘అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను ఏప్రిల్ 27నే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మహేశ్‌బాబు సినిమాను అదే రోజు విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. మేమే ఫస్ట్ ఏప్రిల్ 27 అని డేట్ చెప్పాం. దానయ్య (మహేశ్ సినిమా నిర్మాత) గారు ఒక్క మాట ముందుగా చెబితే మేమిద్దరం కలసి వేరేలా ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఆయన చెప్పకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బాధ అనిపించింది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఇప్పుడు దానయ్యగారు మీకు చెబితే డేట్ మార్చుకుంటారా? అనడగితే.. ‘‘నేనే కాదు... ఇద్దరూ చొరవ తీసుకోవాలి. అది సమ్మర్ సీజన్. హిట్ సినిమాలు ఆడతాయి. నేను, లగడపాటి శ్రీధర్ (‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రనిర్మాత) గారితో మాట్లాడి ఇంకో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఐదు నిమిషాల పని. ఏప్రిల్ 27న ‘ఖుషీ’ సినిమా రిలీజైంది. ఏప్రిల్ 8న బన్నీగారి బర్త్‌డే. 7న మేం రిలీజ్ చేయొచ్చు కానీ, రామ్‌చరణ్ గారి సినిమా సమ్మర్లో వస్తుందేమోనని ఏప్రిల్ 27న అని అనౌన్స్ చేశాం. ఇప్పుడు మేం భయపడి వెళ్లినట్లు ఉండకూడదు. బేసిక్‌గా నాకది ఇష్టం లేదు. అవసరం లేదు కూడా. పెద్దలు ఉన్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో? ‘ఈగ’, ‘జులాయి’ చిత్రాల రిలీజ్ అప్పుడు రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలని మేం పోస్ట్‌పోన్ చేసుకున్నాం. అప్పుడు దానయ్యగారే ఒప్పుకున్నారు. అలా ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం ఉండాలి. కానీ, ‘నా పేరు సూర్య...’ డేట్ ఆల్రెడీ మేం అనౌన్స్ చేశాం. ఒక్క మాట కూడా చెప్పకుండా దానయ్యగారు అలా చేయడం అన్నది కరెక్ట్ కాదనిపించింది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు. -
ఆ విషయంలో రాజీపడను!
‘‘ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మూవీస్‌నే ఎందుకు చేస్తున్నారని కొందరు అడుగుతున్నారు. మహేశ్, ప్రభాస్ ఇలా ఇండస్ట్రీలోని స్టార్ట్స్ అందరితో నటించాలని నాకు ఉంది. కానీ, పర్టిక్యులర్ రోల్స్ కావాలని నేనెవర్నీ అప్రోచ్ కాలేదు. నాకు వచ్చిన చాన్సుల్లో నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాను. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలన్నదే నా కోరిక’’ అన్నారు రష్మీ గౌతమ్. ఆది, వైభవీ శాండిల్య, బ్రహ్మజీ, రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. రష్మీ గౌతమ్ చెప్పిన విశేషాలు.. ► మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇందులో గ్లామరస్ రోల్ చేశాను. ఈ సినిమా అంతా నేను శారీస్‌లోనే కనిపిస్తాను. నా రోల్ ఫస్ట్ హీరోయిన్నా? లేక సెకండ్ హీరోయిన్నా? అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. క్యారెక్టర్ నాకు నచ్చింది. నైట్ షూట్స్ బోర్ కొట్టేశాయి. అందుకే, ఇకపై హర్రర్ మూవీస్‌లో నటించకూడదనుకుంటున్నా. ► దర్శకుడు ప్రభాకర్ ముందు నటుడు కాబట్టి సెట్లో మా పని ఈజీ అయ్యింది. ఆయన నటించి చూపించేవారు. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే అది సినిమాలోని క్యారెక్టర్స్ పరంగానే ఉంటాయి. అయినా డైరెక్టర్స్ విజన్‌ని మనం నమ్మాలి. అల్లు అరవింద్‌గారు, ‘బన్నీ’ వాసు వంటి నిర్మాతల విజన్‌ను రెస్పెక్ట్ చేయాలి. ► డైరెక్టర్స్ నాకు కథ చెప్పినప్పుడు క్యారెక్టరైజేషన్ మాత్రమే ఆలోచిస్తాను. కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కాను. కంఫర్ట్‌గా ఉంటేనే వేసుకుంటాను. కాస్ట్యూమ్స్ సరిగా లేవని ఓ ఐటమ్ సాంగ్ వద్దనుకున్నాను. ► ప్రేక్షకులు చుస్తున్నారు కాబట్టే గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అయినా నాకు గ్లామర్ ఉంది... చూపిస్తున్నాను. నాకు తెలిసి నేనిప్పటి వరకు 30 పర్సెంట్‌కు మించి స్కిన్ షో చేయలేదు. ఈ రోజుల్లో బికినీ అనేది కామన్ అయిపోయింది. కొన్ని వెబ్‌సైట్స్‌లో నా గురించి ఏవేవో వార్తలు రాశారు. వారి దగ్గర ప్రూఫ్ ఉండదు. అవి పుకార్లని నాకు తెలుసు కాబట్టి, సైలెంట్‌గా ఉంటాను. ► సినిమాలు చేస్తున్నాను. టీవీ షోస్‌లోనూ కంటిన్యూ అవుతాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. -
రెండు రోజుల్లో 8 సార్లు ‘లగాన్’ చూశా
‘‘నెక్ట్స్ నువ్వే’ నా 60వ సినిమా. ‘పైసా’ సినిమా నాకు పర్ఫెక్ట్ బ్రేక్ ఇస్తే, ‘పటాస్’ కమర్షియల్ హిట్ ఇచ్చింది. నేను కమర్షియల్ మ్యూజిక్ పక్కాగా చేస్తానని ‘రాజా ది గ్రేట్’ నిరూపిస్తుంది. దాని తర్వాతి స్థానంలో ‘నెక్ట్స్ నువ్వే’ నిలుస్తుంది’’ అని సంగీత దర్శకుడు సాయికార్తీక్ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదలవుతోంది. సాయికార్తీక్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు సినిమాకి వెళ్లినప్పుడు పాటల గురించి కాకుండా నేపథ్య సంగీతం ఎలా ఉందని చూసేవాణ్ణి. ఆర్ఆర్ మీద నాకెంత ఆసక్తి అంటే ‘లగాన్’ చిత్రాన్ని రెండు రోజుల్లో 8 సార్లు కంటిన్యూస్‌గా చూశా. మొదటి నుంచీ ప్రభాకర్‌గారు అన్ని శాఖల్లో ఉండటంతో కొత్త డైరెక్టర్ అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు. కథని బట్టే సంగీతం వస్తుంది. ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో ఐడెంటిటీ ఉంటుంది’’ అన్నారు. -
నవ్వుల రారాజు ఆది
మాటల్లో గోదావరి వెటకారం.. డైలాగుల్లో టైమింగ్ మిస్సవని స్పీడ్.. కడుపు చెక్కలయ్యేలా నవ్వుకునే హాస్యం.. మొత్తం కలిపితే అది ‘హైపర్ ఆది’. బుల్లితెరపై అరగంట పాటు ఉన్నా ఫటాఫట్ మంటూ పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయిస్తాడు. సిల్కు చొక్కా, సిల్కు లుంగీ ఆహార్యంలో తనదైన మేనరిజంతో దూసుకుపోతున్నాడు. అతను నోరు తెరిస్తే పవర్.. పంచ్ వేస్తే హైపవర్ అనిపించుకుంటున్నాడు. అందుకే అతడి మేనరిజానికి నవ్వులలోకం జీహుజూర్ అంటోంది.. సోషల్ మీడియాలో అతడిని 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ నవ్వుల నటరాజు తను అనుభవాలను, అనుభూతులను ‘సాక్షి’తో పంచుకున్నాడు. – సాక్షి, హైదరాబాద్ పాతికేళ్ల వయసున్న ఆది తక్కువ కాలంలోనే నవ్వల వేదికపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఆక్రమించాడు.. స్టేజీపై కొద్దిసేపే ఉన్నా అందరి మనస్సుల్లో సంతోషాన్ని నింపుతాడు. అతని పంచ్ డైలాగులకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బ్రహ్మానందం నుంచి ప్రశంసలు సైతం పొందాడు. ఇక ఆయన చేసే కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా ఉండేవారి సంగతి చెప్పనక్కర్లేదు.. ఆది వస్తే వేదికపై జడ్జిలు కూడా అతడి పంచ్‌ల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. ప్రయాణం అలా మొదలైంది.. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లి గ్రామం మాది. మా నాన్న కోట నర్సింగరావు, అమ్మ సుబ్బులు ఇద్దరు రైతులే. బీటెక్ చదివి ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేశాను. కానీ మనసంతా నటనపైనే. ఆ కోరిక వెండి తెరవైపు మళ్లించింది. ప్రయత్నాలు చేసినా అవకాశాలు లభించలేదు. అయితే, అప్పటికే పాపులర్ అయిన ఓ టీవీ కామెడీ షోలో కనిపించాలని ఉబలాటపడ్డాను. ఆ చాన్సు కోసం అన్నపూర్ణ స్టూడియో గేటు వద్ద మకాం వేయడం ప్రారంభించాను. లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే సెక్యూరిటీ గార్డులు మెడపట్టి గెంటేశారు. ఇప్పుడు ఆ గార్డులే ఆదితో సెల్ఫీలు దిగుతుండడం ఆనందంగా ఉంది. చాన్సు కోసం ప్రయత్నిస్తుండగా ‘అభి’ నాకు అవకాశం కల్పించాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఓ చిన్న పాత్రతో అందరిని ఆకట్టుకోగలిగాను. ఇక రోజా, నాగబాబు సహకారం మరువలేనిది. పంచ్‌లు నా నైజం.. చిన్నప్పటి నుంచి పంచ్‌లు వేయడం అలవాటు. స్నేహితులతో కలిసి తిరిగేటప్పుడు ఎదుటి వారు ఎదైనా మాట్లాడితే సందర్భానుసారంగా వెంటనే తిరిగి పంచ్ వేసేవాణ్ని. అదే అలవాటు ఇప్పుడు నన్ను ఇలా మీ ముందు కూర్చొనేలా చేసింది. నలుగురిలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా ఉండటం, సమాజాన్ని చదవడం వల్ల మనం చేయాలనుకొనే కార్యక్రమానికి మాటలను వేదికగా మలుచుకుంటాను. ఇందుకోసం ఓ రోజంతా కష్టపడతాను. నాకు సంబంధించిన డైలాగ్‌లు నేను రాసుకుంటాను. ఒక్కోసారి స్కిట్లో సందర్భానుసారంగా అప్పటికప్పుడు మాటలను పేలుస్తుంటాను. ఇవి ఒక్కోసారి మిస్‌ఫైర్ కూడా అవుతుంటాయి. అందువల్ల కొంతమంది బాధపడుతుంటారు. కానీ కాసేపటి తరువాత వారే హాస్యం కోసమని అర్థం చేసుకొని నవ్వుకుంటారు. మహిళలంటే గౌరవం.. ‘నా నవ్వుకు ఎంతమంది చనిపోతారో తెలుసా’.. అంటూ ఓ యాంకర్ అంటే.. వీలుచూసుకొని ఓసారి మా ఇంటికి రామ్మ,. మా ఇంట్లో చాలా ఎలుకలున్నాయంటూ’ డైలాగ్ పేల్చినా.. ఏంటి నోరు లేస్తుంది అంటే.. ‘నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్ డ్యాం లేస్తుందా’ అంటూ పంచ్ విసిరినా.. నలుగురు ఆడాళ్లు ఉంటే శ్రీమంతం ఎలా అవుతుంది చీటి పాటవుతుందంటూ పెళ్లాంపై ఎన్ని జోకులు వేసినా మహిళలంటే నాకు ఎంతో గౌరవం. కేవలం హాస్యం కోసం ఇదంతా చేస్తుంటాను. నవ్వుల ముద్రనే.. నా పంచ్ డైలాగ్‌లకు ఇప్పుడు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. వెండితెరపైకి వెళ్లాలని అనుకుంటున్నాను. బ్రహ్మానందం నాకు ఆరాధ్యం. నా జీవితంలో రోజా, నాగబాబు, త్రివిక్రమ్, బ్రహ్మానందం, చిరంజీవి అమ్మగారు ఇచ్చిన కితాబులను ఎప్పటికీ మరిచిపోలేను. ప్రభుత్వ పాఠశాలలో మొదలైన నా ప్రస్థానం పాఠశాలలో, కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిపింది. ఇప్పుడు ఈ నవ్వుల లోకంలో కూడా వెలిగిపోవాలనేదే నా కోరిక.. అంటూ ముగించాడు హైపర్ ఆది. -
ప్యార్ మే పడిపోయానె
‘లవ్లీ’ చిత్రంతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆది, శాన్వీ మరోసారి జత కడుతున్నారు. ఈ ఇద్దరూ జంటగా ‘ప్యార్ మే పడిపోయానె’ అనే యూత్‌ఫుల్ టైటిల్‌తో ఓ చిత్రం ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవి చావలి దర్శకత్వంలో కేకే రాధామోహన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. విజయ దశమి పర్వదినాన ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలో సంపత్ నంది, మల్టీ డైమన్షన్ రామ్మోహన్, వాసు, సాయికుమార్ తదితరులు పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ -‘‘రవి చావలి చెప్పిన కథ చాలా ఆసక్తికరంగా ఉంది. యూత్‌ని ఆకట్టుకునే విధంగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నవంబర్ రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి. రమణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్.