ఎస్‌ఐ యుగంధర్‌ ఆరంభం | Aadi Saikumar starrer SI Yugandhar launched | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ యుగంధర్‌ ఆరంభం

Published Sun, Nov 17 2024 12:06 AM | Last Updated on Sun, Nov 17 2024 12:06 AM

Aadi Saikumar starrer SI Yugandhar launched

ఆది సాయికుమార్‌ హీరోగా ‘ఎస్‌ఐ యుగంధర్‌’ సినిమా ఆరంభమైంది. యశ్వంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా మేఘలేఖ, విలన్‌గా రాకేందు మౌళి నటిస్తున్నారు. శ్రీ పినాక మోషన్‌ పిక్చర్స్‌ పై ప్రదీప్‌ జూలూరు నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశానికి హీరో సందీప్‌ కిషన్‌ క్లాప్‌ ఇవ్వగా, నటుడు సాయికుమార్‌ స్క్రిప్ట్‌ అందించారు.

ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ– ‘‘కథని నమ్మి ‘ఎస్‌ఐ యుగంధర్‌’ చేస్తున్నాం. ప్రదీప్‌గారు చాలా ప్యాషనేట్‌ ప్రోడ్యూసర్‌. ఈ నెల 18న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. ‘‘2025లో విడుదలయ్యే ‘ఎస్‌ఐ యుగంధర్‌’ ఆదికి, టీమ్‌కి మంచి సక్సెస్‌ ఇవ్వాలి’’ అన్నారు సాయికుమార్‌. ‘‘క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది’’ అని యశ్వంత్‌ తెలిపారు. ‘‘వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు ప్రదీప్‌ జూలూరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement