నేరస్థుల పనిబట్టే 'సీఎస్‌ఐ సనాతన్'.. ఆసక్తికరంగా గ్లింప్స్ | Adhi Sai Kumar Latest Movie CSI Sanatan Glimps Released | Sakshi
Sakshi News home page

Adhi CSI Sanatan Movie: క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ అధికారిగా ఆది.. గ్లింప్స్‌ అదుర్స్

Published Tue, Sep 27 2022 9:36 PM | Last Updated on Tue, Sep 27 2022 9:40 PM

Adhi Sai Kumar Latest Movie CSI Sanatan Glimps Released - Sakshi

ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సీఎస్ఐ సనాతన్'. ఈ సినిమాలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సీయ‌స్ఐ) ఆఫీస‌ర్‌గా ఆది ఒక కొత్త రోల్‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. చాగంటి ప్రొడ‌క్ష‌న్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ బ్యాక్ డ్రాప్‌లో  గ్రిప్పింగ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ మూవీలో మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప, మ‌ధు సూద‌న్, వసంతి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

(చదవండి: హీరోగా దగ్గుబాటి అభిరామ్‌ ఎంట్రీ.. 'అహింస' గ్లింప్స్‌ చూశారా?)

ఈ గ్లింప్స్ ఆద్యంత ఆసక్తికరంగా ఉంది. హత్య కేసును చేధించేందుకు రంగంలోకి దిగిన క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా హీరో కనిపించారు. ఎలాంటి నేరమైనా చేధించే ఆది పాత్రను రూపొందించారు. పక్కా ఆధారాలతో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడనే ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. సరికొత్త థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హత్య కేసు విచారణ ఆద్యంతం ఆసక్తిని పంచనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా నవంబర్ రెండో వారం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement