Aadi Tees Maar Khan Movie Released In OTT, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Tees Maar Khan In OTT: ఓటీటీలో వచ్చేసిన ‘తీస్‌మార్‌ఖాన్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published Sat, Sep 17 2022 3:51 PM | Last Updated on Sat, Sep 17 2022 4:25 PM

Adhi Movie Tees Maar Khan  Released In OTT On Amazon Prime - Sakshi

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా విజన్‌ సినిమాస్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘తీస్‌మార్‌ఖాన్‌’. అతనికి జోడిగా పాయల్‌ రాజ్‌పూత్‌ నటించింది. ఈ సినిమాలో సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వం వహించగా.. ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి వచ్చింది.

(చదవండి: Tees Maar Khan Teaser: రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి.. ఆసక్తిగా టీజర్)

లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో ఆది తీస్‌ మార్‌ ఖాన్‌ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించాడు. ఇందులో అనూప్ సింగ్‌ ఠాకూర్‌ విలన్‌గా మెప్పించాడు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కల్యాణ్‌ జి. గొగణ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీని మిస్‌ అయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement