ప్యార్ మే పడిపోయానే...
ప్యార్ మే పడిపోయానే...
Published Thu, Jan 16 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
‘లవ్‌లీ’ పెయిర్ ఆది, శాన్వీ జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్యార్ మే పడిపోయానే’. రవి చావలి దర్శకుడు. కె.కె.రాధామోహన్ నిర్మాత. ఈ సినిమా 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు, పాటలకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే మిగిలివున్నాయని, ఈ నెల చివరి వారంలో మొదలయ్యే మూడో షెడ్యూల్‌లో వాటిని పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. భిన్నమైన ఈ ప్రేమకథను రవి చావలి అద్భుతంగా డీల్ చేస్తున్నారని, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని ఆది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, కళ: కె.వి.రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్.
Advertisement
Advertisement